Previous Page
పంచభూతాలు పేజి 30

     "పరలోకంలోనే వాస్తవ ప్రేమకు స్థానం వుందని మన ప్రాచీన వైరాగ్య ధర్మాలు బోధిస్తాయి. నవ్యసాహిత్యం, సుందర కల్పనలు 'ఈ ప్రపంచంలోనే దానికి స్థానం కల్పిస్తాం' అని చెపుతున్నాయి.
     పృద్వీరాజ్ "యీ ప్రసంగంలో ఒక అపూర్వ రామాయణ విషయం చెప్పి సభను విసర్జించాలని అభిలషిస్తున్నాను.
     "శ్రీరామచంద్రుడు సీతను రాక్షసుల చేతులలో నుంచి విడిపించి అయోధ్యా పట్టణానికి తీసుకువచ్చాడు. ఆనందంతో రోజులకు రోజులు గడిపాడు. ఇంతలో ధర్మశాస్త్రాలు కలిసి ప్రేమ పేరుకు కళంకం ఆపాదించినాయి. 'ఈమె అనిత్య పదార్దంతో నివసించింది. ఈమెను పరిత్యజించు' అని తేల్చినవి. నిజానికి అనిత్య గృహంలో బంధించి వుంచినా యీ రాజకుమారికి కళంకం అంటలేదు. దీనికి నిదర్శమేమిటి? అగ్ని పరీక్షతో నిదర్శనం రుజువవుతుంది. అంతటితో వ్యవహారం ముగుస్తుంది. దానితో ఇంకా వెలుగుకు వస్తుంది. అయినా శాస్త్రకారణంగా చివరకు సీతను మృత్యు తమసా నదీతీరాన నివసించడానికి పంపించి వేశాడు. ఆ తరువాత యీ అనాధకు లవకుశులు, కావ్య లలితకళ నామక పుత్రులిద్దరు జన్మించారు. యీ యిద్దరు కుమారులు తమ గురువువద్ద రాగాలు నేర్చుకుని రాజసభలో తమ పరిత్యక్తమాత యశోగానం చేయడానికి వెళ్లారు. యీ నూతన గాయకుల గానం విని విరహియైన రాజు మనసు కరిగింది. కన్నీరు క్రమ్మింది. ఇంతటితో ఉత్తరకాండ పూర్తికాలేదు. త్యాగ ప్రచారక వైరాగ్య ధర్మానిదా విజయం, లేక ప్రేమ మంగళ గాయక అమర బాలద్వయానిదా?"

                               వైజ్ఞానిక కౌతూహలం

విజ్ఞానోత్పత్తి చరమలక్ష్యం గురించి గగన్ దేవికీ, పృద్వీరాజ్ కు వాదోపవాదాలు చెలరేగాయి. యీ వివాద క్రమంలో గగన్ అన్నాడు:
    "మన కౌతూహలం సరిహద్దు నుంచి విజ్ఞానోత్పత్తి జరిగినా, మన కౌతూహలం విజ్ఞానాన్వేషణ కోసం పుట్టలేదని నా పూర్తి నమ్మకం.  దాని ఆకాంక్ష కేవలం అవైజ్ఞానికం. అది స్వర్ణమణికోసం అన్వేషిస్తుంది. కానీ ప్రాచీన జీవనాంగుళీయం బయటకు తీస్తుంది. అల్లావుద్దీన్ అధ్బుతదీపం కావాలని కోరుతుంది. కాని అగ్గిపెట్టె దొరుకుతుంది. సువర్ణ యోగం సంపాదించటం దాని ఉద్దేశ్యం. రసాయనిక శాస్త్రం బయట పడింది. జ్యోతిషశాస్త్రం కొరకు ఆకాశం పరిశీలిస్తుంది. కాని జర్మన్ ఖగోళశాస్త్రం లబించింది. అది నియమాన్ని అన్వేషించదు. కార్యకారణ శృంఖలానికి నూతన అంగుళీయకం చేయించాలని అభిలషించదు. నియమ విచ్చేదనాన్ని వెతుకుతుంది. కార్య కారణాలకు అనంత పునరుక్తి లేని చోటుకు చేరాలని కోరుకుంటుంది. అధ్బుత నూతనత్వాన్ని కోరుతుంది. కాని వృద్ది విజ్ఞానం అరుదెంచి దాని నూతనత్వాన్ని జర్ఘరితం చేస్తుంది.
     "ధూళి కణంలోని నియమమే ఈ అనంత ఆకాసంలో అనంత కాలంలో పనిజేస్తూంటుంది. దీని ఆవిష్కరణ క్రమంలో మనం ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని ప్రకటిస్తాం.  అలా ప్రకటించటం మానవ స్వాభావిక ఆవేసం కాదు. అది అనంతాకాశం మీదికి అనుసంధాన దూతను పంపినపుడు, పూర్ణ ఆశతో వుంటుంది. జ్యోతిర్మయి అంధకారమయ గృహంలో ధూళికణంలో నియమంలేని ప్రదేశాన్ని పొందాలని ఆశిస్తుంది. కాని సూర్య చంద్రులు, నక్షత్రాలు, సప్తర్షి మండలాది మన ధూళి కణంలో అక్కా చెల్లెళ్లని గోచరిస్తుంది. యీ నూతన కథను తీసుకుని  మనం ప్రకటించే ఉత్సాహం ఇపుడు నూతన కృత్రిమ అభ్యాసంగా తయారయింది. ఇది మన ఆదిమ ప్రకృతిలో లేదు" అని అన్నాడు.
     పవన్  అన్నాడు: "అది పూర్తిగా అబద్దం కాదు. స్పర్శమణి, అల్లావుద్దీన్ లాంతరువేపు ప్రకృతిలో నివసించే మానవ మాత్రులే ఆకర్షితులవుతారు. చిన్నప్పుడు ఒక కథ చదివాను. ఒకానొక రైతు మరణ కాలంలో తన బిడ్డలను పిలిచి ఫలానా పొలంలో గుప్తంగా  ధనం పూడ్చిపెట్టానని చెప్పాడు. అతని కూమారులు ఎంత వెదకినా ఆ గుప్త ధనం దొరకలేదు కాని పొలం తవ్వినందువల్ల ధాన్యం  ఎక్కువగా పండింది. వారి కష్టాలన్నీ దూరమయినాయి. బాలక స్వభావంగల జనులు యీ కల్పనను చదివి దుఃఖిస్తారు పొలం నుంచి సమస్త ప్రంపంచానికీ ధాన్యం పండుతుంది; కాని గుప్తధనం గుప్తంగానే వుంటుంది. అందువల్ల అది ఎవరికీ లభ్యం కాదు. యీ విశ్వస్థాయి నియమ వ్యతిరిక్తం, నియమోల్లఘనం. అందువల్లనే మనుషులు స్వభావసిద్దంగా దాని కోసం ఉబలాట పడుతుంటారు. కథల పుస్తకంలో ఏమి చెప్పివున్నా రైతుబిడ్డ తమ తండ్రి యెడల ఎన్నడూ కృతజ్ఞుడు కాలేడు. వైజ్ఞానిక నియమం యెడల మానవుడు ఎంత అవజ్ఞ ప్రకటిస్తుంటాడో చెప్పనవసరంలేదు"
    అపుడు నేను అన్నాను: "నియమం అనంతకాలం అనంత దేశాలలో పెంపొందినప్పటికీ అది సీమాబద్దమైనది. అది తన హద్దు నుంచి ఏ మాత్రం అటూ ఇటూ కదలలేదు. శాస్త్రసంగత చికిత్సమీద మనం ఆశ యెక్కువగా పెట్టుకోము. కాని 'భాగ్య' మనే పేరు గల రహస్యమయ వస్తువునకు యిపుడు సరైన హద్దు లేదు. అందువల్ల అది మన ఆశకు కల్పనకు ఎక్కడా అఘాతం కలిగించలేదు.'
    దానిమీద గగన్ అన్నాడు: "కాని ఆ భక్తి యదార్ద భక్తికాదు. అది కార్యసాఫల్యం కోసరమైన భక్తి.  ప్రపంచ కార్యకలాపం అపరివర్తనీయ నియమబద్ద మయినపుడు వివశయై ప్రాణభయంతో దాని ఎదుట తలవంచుతామని రూఢి అయింది. విజ్ఞానం కొరకు అనిశ్చయ హస్తంతో  ఆత్మార్పణ చేయడానికి సాహసం వుండదు. మాగ్నెటిజం, హిప్నాటిజం మొదలయినవి విజ్ఞానం బలాన్ని చూసి యంత్రబంధనంలో చిక్కుకునే లాలసను నిరోధిస్తాడు. జనులు ఈ నియమాని కంటే ఆ నియమాన్నే యెక్కువగా ప్రేమిస్తారు. మనం మనలో ఒకానొకచోట నియమమును  ఉల్లంఘించటమే దీనికి కారణం. మన మనసు నియమ పరిధికి బయట వుంటుంది. దాని మీద యెవరి అంకుశమూలేదు. కొద్దోగొప్పో  ఇది మనకు అనుభవం అవుతూనే వుంటుంది.  మన యీ స్వాదీనతా బాహ్య ప్రకృతిలో ఉపలబ్ది కోసం ప్రమాదితులమవుతాం.  ఇచ్చవల్ల లభించిన దానం మనకు ప్రియతమమవుతుంది.  సంయోగంలేని  సేవ ప్రీతికరం కాదు.  ఇంద్రుడు మన కోసం వర్షం  కురిపిస్తాడని, మనుత్తులు గాలిని చేకూరుస్తారని, అగ్ని ప్రకాశం ప్రసాదిస్తాడని తెలుసుకున్నప్పుడు  ఆ జ్ఞానపరిధిలో  మనకు అంతరిక తృప్తి కలిగేది. వర్ష ధూపవాయువులకు ఇచ్చా శక్తి యే మాత్రం లేదని మనం యిపుడు తెలుసుకున్నాం. అవి ప్రియ, అప్రియ యోగ్య అయోగ్య విచక్షణ చేయకుండా నిర్వికార భావంతో నియమానుసారం పనిచేస్తుంటాయి. ఆకాశంలో నీటి ఆవిరి చేరి శీతల వాయు సంయోగం వల్ల జలకణాలుగా పరిణమించి సాధువుల  లలాటం మీద కూడా వర్షంగా వచ్చిపడి ఆప్యాయత కలిగిస్తాయనే విజ్ఞానాన్ని ఆలోచించి, ఆలోచించి క్రమక్రమంగా అప్రియ విషయాలను  సహింపగలుగుతున్నాం. కాని నిజం చెప్పాలంటే ఇది మనకు నచ్చడం లేదు.
      నేను,"ఇపుడు నా అనుమానం రహితమయింది. మనం స్వాధీనేచ్చ శాసనస్థానంలో నియమాంధ శాసనం చేస్తున్నాం. విమర్శనా దృష్టితో చూస్తే ప్రపంచం ఇచ్చా సంపర్క విహీనమని తోస్తుంది. కాని మన హృదయంలో ఆనందం, ఇచ్చామని వున్నంతవరకు మనం యీ ప్రపంచంలో కూడా దీనిని అనుభవిస్తుంటాం. కల్పన చేసుకున్న చోట కాకపోయినా మన ప్రకృతి అంతరత ఈ స్థానంలో ప్రతిష్టితమవుతుంది. మనలో సంపూర్ణ నియమ  వ్యతిరిక్తత గోచరిస్తే  ప్రపంచంలో దాని మూలధర్మమే నశిస్తుంది. ఈ విషయంతో ఏకీభవించటానికి మన అంతరాత్మ సంసిద్దం కాదు. ఈ ప్రకారంగా మన ప్రేమకు కూడా విశ్వ ప్రేమ యొక్క విశేషావసరం వుండదు" అని అన్నాను.
     దానిమీద పవన్, "జడ ప్రకృతి నియమకుడ్యం దృఢమైనది. ప్రశస్తమైనది, ఆకాసాన్నంటేది. మానవ ప్రకృతిలో చిన్న రంధ్రం పడింది. దానిమీదనే దృష్టి కేంద్రీకరించి మనం ఆశ్చర్యజనకమైన దానిని దర్శించాం.  కుడ్యానికి అవతలి వైపున ఒక అనంత  విస్తృత క్షేత్రం వుంది. దాని చిన్న రంధ్రం ద్వారా నాకు దానితో సంబంధం ఏర్పడింది. స్వాధీనత, సౌందర్యం, ప్రేమ, ఆనందం దాని గుండా ప్రవహిస్తుంటాయి. అందువల్ల సౌందర్యాన్ని ఈ ప్రేమను బంధించి వుంచే విధానం పండితులు యింతవరకు ఆవిష్కరించలేదు."
     ఈ సమయంలో నిర్ఘరిణి పవన్ ను, "ఆ రోజున మీరు ప్రకాశవతికి పియానో సర్వప్రతికోసం వెదికారు. దొరకలేదా?" దాని సంగతే మయినా తెలిసిందా?" అని అడిగింది.
     "ఉహు -" అన్నాడు పవన్.
     పవన్ అన్నాడు:  ఆ ఎలుక బహుశా తన కులంలో గొప్ప విజ్ఞానవంతురాలయి వుంటుంది. చిరకాలానుభవం తరువాత అది విద్యాయంత్రంతో యీ వాద్య పుస్తక సంబంధం వుందని అనుమానించి వుంటుంది. రాత్రంతా అది పరీక్ష సాగించింది. అక్లాంత యత్నంచేసి వుంటుంది. దంతాగ్ర భాగం ద్వారా యీ విద్యా గ్రంధం క్రమగతి విశ్లేషణ చేసింది. పియోనో తీగలతో దానిని సంలగ్నం చేయాలని  చూసింది. అపుడు అది వాద్య గ్రంథం కొరికింది. తిరిగి పియానో తీగలను కొరికింది. ఆఖరికి వాద్యయంత్రం లక్కను ఛేదించి అందులోని రహస్యం గ్రహించటానికి తన ముక్కను విచిత్ర కౌతూహలంతో ప్రవేశపెట్టింది. ఫల స్వరూప సంగీతం కూడా రహస్యమయమయినది. నా మనసులో తర్కం చెలరేగింది. యీ మూషిక కులతిలకం పన్నిన ఉపాయం వల్ల తీగ, కాగితాల ఉపాదానం గురించి ఏదయినా నూతన తత్వం ఆవిష్కృత మవుతుందా? తీగకూ, కాగితానికి గల సంబంధం వేయేండ్లు పరిశ్రమించినా విశదం కాదు. చివరకు సంశయ పరాయణ నూతన మూషికం మనసులో కాగితం కేవలం కాగితమే.  దీనికి తీగకు సంబంధమేమీ లేదని బావిస్తుందా లేదా? జ్ఞాన జీవుల ప్రయాసవల్ల కాగితంలో, తీగలో ఆనందజనక  ఉద్దేశ్యం బంధితమైంది.  అది ప్రాచీన  హిందువుల యుక్తి హీన  సంస్కారం. ఆ సంస్కార సఫలతవల్ల  అనుసంధానలో లీనమయినపుడు తీగ, కాగితం - ఏది ప్రధానమయిందనే కఠిన విషయం ఎంతో పరీక్ష జరిగింది.
     "కాని ఏదో ఒక రోజున రంద్రం చేయడంలో దంతాలు ఉపయోగించేటప్పుడు మధ్య మధ్య సంగీత ధ్వని చెవులలో ప్రవేశిస్తుంది. హృదయంలో క్షణకాలం మోహజాలం వ్యాపిస్తుంది. దీనికి కారణమేమిటి?"
    "వాస్తవానికి ఇదొక రహస్య విషయం. కాని ఆ రహస్యం కాగితము తీగను అనుసంధానం చేసే సమయంలో తనకు తాను వందల కొలది రంధ్రాల రూపాలలో బయటపడుతుంది"  

                            -: సమాప్తం :- 


 Previous Page

WRITERS
PUBLICATIONS