Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 29

 
    
    "ఏమే చాముండీ! మా గోకుల్ ఎల్లుండే వస్తున్నాడు, ఏవో పరీక్ష లున్నాయని ఇన్ని రోజులు రాలేదు. అ పరీక్షలేవో అయిపోయాయట. వాడికి పుదీనా పచ్చడంటే చాలా ఇష్టం, కాబట్టి నీకు తీరికున్నప్పుడు వాటిని రెడీగా వుంచు. మైదా బోండాలంటే వాడి నోట్లో నీళ్ళూరుతాయి. ఆదివారం మధ్యాహ్నం అవి చేద్దాం. వాడికి ఇల్లంతా శుభ్రంగా వుండాలి. కాబట్టి మధ్యాహ్నం నుంచి నువ్వు ఆ మూలనుంచీ నేను ఈ మూల నుంచి బూజు దులుపుదాం" అని రెడ్డిసాని రెండ్రోజుల నుండే ఏర్పాట్లు ప్రారంభించింది.
    
    ఇక పెద్ద రెడ్డి పరిస్థితి కూడా అంతే. "పాలు రెడీగా వుంచండి. ఆ హాస్టల్ లో ఎప్పుడు తలస్నానం చేశాడో ఏమో! ఇక్కడ బాగా తలంటి స్నానం చేయించండి. కోడిని కోద్దామా? లేక టౌన్ నుంచి మటన్ తెప్పించనా" అని నిముష నిముషానికి మా సలహాల కోసం వస్తున్నాడు ఆయన.
    
    ఒక వ్యక్తి కోసం అంత అభిమానం చూపించేవాళ్ళని చూడడం నాకు కొత్త డబ్బున్న ఇళ్ళల్లో ప్రేమాభిమానాలు వుండవంటారు  గానీ అది తప్పు. ఉన్నది అలాంటి కుటుంబాలలోనే, మా ఇళ్ళల్లో ప్రేమాభిమానాలు వుండి ఏం లాభం? అవి చూపించడానికి డబ్బులుండాలి గదా కాళహస్తి పక్కన మా అమ్మా చెల్లెలుండేది, అక్కడికెళ్ళిన ప్రతీసారీ కాళహస్తిలో అరటిపండ్లు తీసుకుని వెళ్ళాలనిపించేది. కానీ డబ్బులుండేవి కావు. నేనూ అమ్మా ఒట్టి చేతులతోనే వెళ్ళేవాళ్ళం. అందుకే మా ఇళ్ళల్లో ఇంటికి చుట్టాలొస్తే ఏం తెచ్చారని పిల్లలు సంచుల మీదకి ఎగబడరు. ఏమీ తెచ్చి వుండరన్న నమ్మకం వల్ల అలా కామ్ గా బయటికి వెళ్ళిపోతారు.
    
    అంత హడావుడి తరువాత ఆదివారం రానేవచ్చింది. తల్లిదండ్రులు అంత ఎక్కువ ఇష్టం చూపుతుండడం వల్ల నాకూ అతని మీద ఇంట్రస్టు పెరిగింది. వాళ్ళతో కలిసి నేనూ అతన్ని అపురూపంగా చూడసాగాను.
    
    రెడ్డిసాని రమ్మనడం వల్ల మరీ ఉదయాన్నే వెళ్ళాను. ఇల్లంతా చిమ్మిపాలు పితికాను. రెడ్డిసాని ఇడ్లీ, వడ చేయడంలో బిజీ అయి పోయింది.
    
    అలా మా పనుల్లో మేం వుండగానే గోకుల్ వచ్చాడు. అతను ద్వారం దగ్గర నిలబడి, "అమ్మా" అని పిలిచాడో లేదో మా రెడ్డిసాని కళ్ళలో ఆనందం పత్తికాయల్లా పగిలింది.
    
    ద్వారం మధ్యలో ఫ్రేము కట్టిన చిత్రంలా వున్నాడు గోకుల్. చిన్నికృష్ణుడు యశోదను ఏడిపించడానికి నెమలిపింఛం, పట్టువస్త్రాలూ అలా పడేసి ప్యాంటూ షర్టూ వేసుకొన్నట్లు అంత అందంగా, అంత ముద్దుగా వున్నాడు.
    
    ఇరవై ఏళ్ళుంటాయేమో నాకంటే రెండుమూడు ఏళ్ళే చిన్నవాడైనా మరీ నాజూగ్గా వుండడం వల్ల ఇంకా చిన్నపిల్లవాడిలా కనిపించాడు.
    
    రెండు బుగ్గలూ పట్టుకొని, "నీకోసం ప్రాణాలిచ్చే తల్లిదండ్రుల్ని చూడకుండా మూడునెలలు వుండడమేం" అని అడగాలనిపించింది.
    
    మరో పదినిముషాలకి డ్రస్ విప్పి లుంగీ, చొక్కా వేసుకువచ్చాడు. వంటింట్లో వాళ్ళ అమ్మని నేనెవరో వాకబు చేయడం వినిపించింది.
    
    "చాముండి అని మనింట్లో కొత్తగా సేద్యానికి కుదిరింది. ఇంటి పనులు అన్నీ కూడా చూస్తోంది. వెంకటరమణ అని రాఘవరెడ్డి ట్రాక్టర్ డ్రైవర్ లేడూ వాడి భార్య"
    
    మరో పదినిముషాలకి రెడ్డిసాని నా దగ్గరికి నూనె గిన్నెతో వచ్చి "మావాడికి తలంటి స్నానం చేయించు. కుర్రకుంక- హాస్టల్ లో ఎప్పుడు స్నానం చేశాడో ఏమో" అంది.
    
    గోకుల్ హాల్లో వుంటే పిలిచాను. "రా! తలస్నానం చేద్దువుగానీ"
    
    అతను కాస్తంత సిగ్గుపడ్డాడు. నాకైతే ఎలాంటి భావనలూ లేవు. నాకతను చిన్నపిల్లాడిలానే కనిపిస్తున్నాడు.
    
    ఇలాంతప్పుదే మనం తప్పులు చేసేది. మనకున్న ఫీలింగ్సే అవతలి వాళ్ళకి వుంటాయనుకోవడం పొరపాటు కానీ ఇవన్నీ ఆలోచించే స్థితిలో మనముండం.
    
    కొద్దిగా బలవంతం చేసి బాత్రూమ్ లోకి లాక్కొచ్చాను. నూనె రాయడానికి నడుం వంచాను. అతను బెరుకు బెరుగ్గా నా ఎదవైపు చూస్తున్నాడు. వెన్నముద్దల్లాంటి నా పాలిండ్లు అతని వేడిచూపులకు కరుగుతున్నట్లు అనిపించడంతో పైట పూర్తిగా కప్పుకుని బొడ్లో దోపుకున్నాను. అదంతా చిన్నపిల్లాడి చేష్టల్లానే అనిపించింది నాకు.
    
    తలంటాను. లుంగీ విప్పమంటే ససేమిరా వీలుకాదన్నట్లు తల అడ్డంగా వూపాడు. నేనూ బలవంతం చేయలేదు. స్నానం పూర్తయింది. టవల్ తో ఒళ్ళంతా రుద్దాను. ఇంట్లో తమ్ముడికి స్నానం చేయించినట్లు చేయించాను. అతనిలో మాత్రం తెలియని అలజడి. అది ఎందుకోసమో నేను తర్కించుకోలేదు.
    
    మధ్యాహ్నం వాడలూ, పాయసం చేశాం. భోజనాలు పూర్తయ్యేటప్పటికి మూడుగంటలైంది. రెడ్డిసాని నాకు పెట్టిన భోజనాన్ని గిన్నెల్లో ఇంటికి తీసుకొచ్చాను. నేను కొంత తిని మరికొంత నా భర్తకి పెట్టాను.
    
    తిరిగి సాయంకాలం రెడ్డింటికి వెళ్ళాను.
    
    పనులన్నీ పూర్తయ్యేసరికి ఏడుగంటలైంది.
    
    రెడ్డీ, రెడ్డిసానీ ముందు వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
    
    "చాముండీ! వెనక వరండా లైటు వేసిరా" అని రెడ్డిసాని చెప్పడంతో అటు వెళ్ళాను.
    
    వెనకంతా చీకటిగా వుంది. కళ్ళను చిట్లిస్తూ స్విచ్ కోసం చూశాను. స్విచ్ వున్న దగ్గర మంచం అడ్డంగా వుంది. దాన్ని పక్కకి జరిపే ఓపిక లేక దానిమీదకు వంగి స్విచ్ వేయబోయాను. స్విచ్ అందక పోవడంతో పాదాలు మరింత పైకి లేపాను. అప్పుడు తెలిసింది నాకు మంచం మీదెవరో వున్నారని.
    
    "ఎవరూ?" అనడిగాను తొలగిన పైట సర్దుకుంటూ.
    
    "నేను" గోకుల్ ని గుర్తుపట్టాను.
    
    "నువ్వా"
    
    "ఆఁ"
    
    "చీకట్లో ఏం చేస్తున్నావ్?"
    
    "ఊరంతా తిరిగాను. కాళ్ళు నొప్పులుగా వుంటే అలా కళ్ళు మూసుకుని పడుకున్నాను. లైటు వేయాలా?" అంటూ అతను స్విచ్ నొక్కాడు.
    
    నేను తూలిపడడంలో నావక్షస్థలం అతనికి ఎక్కడ తగిలిందో అర్ధమైంది. లైటు వెలుగులో గోకుల్ అదో వ్ధంగా వున్నాడు. ఏదో తెలియని ఆవేశంతో అతని కళ్ళు వణుకుతోంది. ఇంకెప్పుడూ యిలాంటి పొరబాట్లు చేయకూడదని నిర్ణయించుకున్నాను.
    
    రెండు రోజుల తరువాత నాకు జ్వరం వచ్చింది. పని యెక్కువ కావడం వల్ల శరీరం అలిసిపోయింది. రెండు మూడు రోజులు రెస్టు తీసుకుంటే తప్ప కోలుకోలేననిపించి పనికిరావడం లేదని రెడ్డిసానికి కబురుపెట్టి ఇంటిపట్టునే వుండిపోయాను.
    
    రెండురోజులు అటు వెళ్ళలేదు.
    
    జ్వరం తగ్గిందిగానీ నీరసం ఇంకా వదల్లేదు.
    
    అలా ఇంట్లో పడుకుండిపోయాను.
    
    మా వాడలో సాయంకాలం అయిదుగంటల నుంచీ హడావుడి మొదలైంది. మా యింటికి రెండిళ్ళు తరువాత వుండే మంగమ్మ కూతురు శకుంతల రజస్వల అయింది. ఆరోజు ఇంట్లోకి తీసుకువస్తారు.
    
    చిన్నపాటి ఫంక్షన్ తోపాటు మైక్ సెట్ కూడా పెట్టారు. లౌడ్ స్పీకర్ల లోంచి సినిమా పాటలు మొత్తం ఊరినీ, మావాడనీ అదరగొట్టేస్తున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS