Previous Page Next Page 
ప్రజ్ఞా ప్రభాకరము పేజి 27

                                            ౧౧
 
                                            వివాహము

    ఇర్వది రెండవ యేట నాకు పెండ్లి జరిగినది. మాయూరి కాఱుమైళ్ళ దూరమున నున్న గంటసాల నా యత్తవారి యూరు. ఆ యూరే నా మేనమామగారి యూరును. తొంబది యేండ్లకు పైబడిన వయస్సువారు, మా మేనమామగారు శ్రీ పిసిపాటి వేంకటాద్రిగా రిప్పటికి నారోగ్యముతో నున్నారు. వారికి నేడ్గురుపుత్రులే కలిగిరి కని పుత్రికాతానము లేదయ్యేను. మాతోడి సంబంధము తర్వాత లేకపోవు నన్న కొఱఁతతో వారి జ్ఞాతులగు మా మామగారిని నాకు పిల్ల నిమ్మని వారు కోరిరి. వారికుమారుఁ. డప్పటికి రెండేండ్లకుముందు స్వర్గస్థుఁ డయిన వాఁ డు, శ్రీసోమనాధశాస్త్రులుగారి కడను, శ్రీ వెంకటశాస్త్రిగారి కడను నాతో సహాధ్యాయుఁ డుగా నున్నవాఁ డు, వెంకటరామశాస్త్రి జీవించుచుండుటచేతను, మా మేనమామగారి  కోరిక  చేతను, భువసతి లేదన్న కొఱఁతను దలఁ చి  సందేహించుచున్నను మా సంబంధమున కెట్ట కేలకు మామామగా రంగీకరించిరి. వారు ప్రశాంత చిత్తులు. సద్వర్తనులు. అమాయకులు. మా తండ్రిగారి లెనే కడిపెడు బిడ్డలు గలవారు.

        వివాహమయినది. మామాతృశ్రీగారిమిఁదిభక్తిచేతను, వారిపుట్టినయూరని, వారియింటి పేరి వారని   నేనెంతో తనివితో నీ సంబంధమును ప్రేమించితిని, వివాహ మయినతోడ్తో మద్రాసు వచ్చి వేసితిని. అప్పుడు నానివాసము మైలాపూరులో. తిరివల్లి క్కేణి హైస్కూలుకు ప్రతిదినము రాకపోకలు. తొమ్మిది గంటలకు హోటలులో భోజనము చేసి తిర్వలిక్కేణికి నడచి వెళ్ళి సాయంకాలము తిరిగి నడచి వచ్చి రాత్రి భిజనము చేయుట. దీనిచే నాహారము చాలక కాఁబోలును నీరసముగానే ఉండెడివాడను. నీరసమే తప్ప వ్యాధి యేదియును లేదు. అప్పుడప్పుడు కృష్ణా మండలమందలి స్వగ్రామమునకు వెళ్ళి అక్కడ కమ్మని నెయ్యి పెరుగులతోడి భోజనము చేసినప్పుడు శరీరమునకు మంచి బలోత్సాహములు లభించుచుండెడివి! సంవత్సరమున కొకతూరి తప్పకుండ నింటికి వెళ్లుచు నట్టిబలోత్సాహముల నార్జించుకొని వచ్చి వానినిమద్రాసులో వ్యయించుచుండినట్టు తోచుచుండెడిది. ఏఅ ప్రయోజనముకై వివాహానంతరాము వేసంగిలో నేనింటికి వెళ్ళితిని.

                                       ౧౨

                                               బండిపాటు

    మాయూరి కాఱుమైళ్ళు దూరమున అవనిగడ్డయని గ్రామము గలదు. అది తాలుకా ప్రధాన స్ధానము. మాయన్నగా రక్కడ పోస్టుమాస్టరు. వారి కుటుంబమును జుచుటకై నే నాయూరికి వెళ్ళి తిరిగి వచ్చుచుంటిని. మాయూరివారే, మహనీయులు, గొప్ప వేదవేదాంగ వేత్తలు, నాపై నమితవాత్సల్యము గలవారు,వృద్ధులు యత్త గారితో బండిమిఁ ద అవనిగడ్డ నుండి యే మాయూరికి విచ్చేయుచు నన్నుఁ గూడ బండిలోఁ గూర్చుండ నిర్భంధించిరి. నేనేవేవో మద్రాసు పుస్తకసాలలోని గ్రంధములఁ గూర్చి ముచ్చటించుచు వారిని వినోదపఱచుచుంటిని. బండి యొకటిన్నర మైలు సాగి వచ్చెను.

    అవనిగడ్డకు మాయూరికి నడుమ కృష్ణానది కలదు. అది వేసగి కనుక పాటిఱేవు గలదే. బండి దానిలో నుండి సాగి పోవచ్చును. కాని గట్టుననుండి యేటిలోనికి కొన్ని నిలువుల లోతు దిగవలెను. బండి యట్లు దిగుచుండెను. బండి తోలుచున్న రైతు  (మాయూరివాఁ డే ) చుట్ట  కాల్చు  కొనుట  కంతకు  ముందే  బండి  దిగెను. గట్టున నుండి పల్లమునాకు బండి గాడిలోనుండి వడిగా దిగజాఱు నాసమయమునకు సరిగా నాతఁ డు ముత్రోత్సర్గమునకుఁ బోయి వెనుక బడెను. బండిచక్ర మొకటి బండి గాడిపల్ల పుజాలులో నుండఁ గా మఱొక చక్రము గట్టుమిఁ ది కెక్కెను. ఉపక్రమమున నా యెగుడుదిగుడు కొంచెముగానే యుండెను. కాని రెండు మూఁ డు గజములు సాగునప్పటి కొడ్డగెడవుగా నయ్యెను. ఎడ్లు వడిగా దిగిపోవుచుండెను. బండి కడయంచున నేను గూర్చుంటిని. ఇఁ క నొక క్షణములో నా జీవిత మటో యిటో ఏదో ఆగుదశ దాపు రించినది సుమా యనుకొనుట నే నెఱుఁగుదును. ఈ యెఱుక బండితుదిపట్టున నుండి యెడ్లదిగుడు దూకుడును, చక్రముల యొడ్డగెడవును - వెలుపలికి చూడ్కి పాఱుచున్నది గాన- నేను గుర్తించితిని గాని బండి లోతట్టున గూడులో నొదిగి యున్న యాయిర్వురు నంతగా గిర్తింప రయిరి. ఇహలోక ప్రజ్ఞ యీ శరీరమున నుండుటో, ఊడుటో - ఈ లోకముతో సంబంధము తీరనున్న దేమో అన్న తలఁపు నాలో కలిగినక్షణమే యెఱుఁ గుదును గాని తర్వాత నన్నెఱుఁ గను. నా యునికి నెఱుఁ  గను.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS