Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 29

                                            26. చిన్నపనికే అలసిపోతే ఏంచేయాలి? 
   
    "నేను త్వరగా అలసి పోతున్నాను. ఏ పనీ చేయలేక పోతున్నాను. మంచి టానిక్ రాసి ఇవ్వండి." అంటూ చాలా మండి డాక్టర్లనీ అడుగుతూ వుంటారు. వీళ్ళందరూ నిజంగానే పగలు_ రాత్రి ఎదఎరపి అడుగుతూ అలసిపోతూన్నారా అంటే అదీ వుండదు.

    శారీరకంగా ఎక్కువ పనిచేసినా, మానసికంగా ఎక్కువ ఆలోచచించినా, శరీరంలోని కండరాలు, మెదడులోని టిష్యూలు అలసిపోవడం సహజం తగిన విశ్రాంతి తీసుకోగానేతిరిగి అవి కోలుకోవడం కూడా సహజమే. కొందరికీపనివల్ల లేదా శారీరిక అనారోగ్యంవల్ల నిద్రపోవడానికి వీలులేక అలసిపోతే, మరికొందరు మానసిక ఆలోచనలు, అందోళనల వల్ల నిద్రపట్టక అలసిపోతారు.

    యుక్తవయస్సువచ్చిన అబ్బాయిలు అమ్మాయిలుకూడా చాలా త్వరగా అలసిపోతారు. ఫలితంగా వాళ్ళు సరిగా చదవలేరు. పని చేయలేరు. యుక్తవయస్సులో వున్న అబ్బాయిలు, అమ్మాయిలు శారీరకంగా త్వర త్వరగా ఎదుగుతూ వుంటారు. అ ఏడుగుదలకు కావలసిన శక్తి నిచ్చే ఆహారం అమ్మడుబాటలో లేనప్పుడు వరుమామూలుగా తినే కాస్త ఆహారం ఏడుగుదలకి మాత్రమె ఉపయోగపడుతుంది గాని, శారీరకంగా గని, మ్నసికంగా కాని పనిచేయడానికి సరిపోదు. పైగా యుక్తవయస్సు వచ్చిన పిల్లలు పడి రకాల పనులలో తలదూరుస్తూ వుంటారు. ఆ పనిలన్నింతీనీ నిర్వహించటానికి శక్తి చాలక త్వరగా అలసిపోతూ వుంటారు. అమ్స్డువల్లవీరికి శక్తినిచ్చే ఆహారాన్ని అదనంగా అండజేయాలి.

    గర్బిణీలు కూడా మొదటి మూడు మాసాల్లో చాలా త్వరగా అలసిపోతున్నట్లు, శక్తిలేనట్లు డీలా పడిపోతుంటారు. డనికి కారణం వీరి గర్భంలోని పిండమే!

    శరీరంలోని గ్రంధులు పిండం ఏర్పడటానికి కావలసిన అధిక శక్తిని ఖర్చు చేస్తాయి. దీనికి తోడు వేవిళ్ళ కరణంగా ఆహారం తగినంత తీసుకోకలేకపోతే ఇక వారి నీరసం గురించి వేరే చెప్పనక్కర్లేదు.

    ధైరాయిడ్ గ్రంధి సరిగ్గా పనిచేయక పోవడంతో మేటబాలిజంలో లోపం ఏర్పడి కొద్ది పనికే అలసట అనిపిస్తుంది. అలాగే రక్తహీనతవల్ల ఎర్రరక్తకణాలు తగినంత ప్రాణవాయువుని టిష్యూలకి అమర్చలేకపోయినా అలసట కలుగుతుంది.ఈ రకం అలసటలను గుర్తించటం తేలిక.

    కొందరికి ఎటువంటి  శారీరిక అలసట, అనారోగ్యం, గ్రంధుల లోపం లేకపోయినా అతిత్వరగా అలసిపోతున్నట్లు బాధపడుతూ వుంటారు. 'అలసటభావం' కేవలం మనసికమైనదే అలాంటివారు తమకి ఇష్టమైన పనిలో నిమగ్నమయిపోతే  అలసట అనేదే గుర్తుకురాదు.

    మానసికంగా అలసట భావం పొందేవారికీ అలసటతోపాటు తరచూ తలనొప్పిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకొందరిలో నిద్రలెమి, నడుము నొప్పి ఛాతిలోనొప్పి, అజీర్ణలాంటివి ఉంటాయి. ఇట్లే అలసిపోతున్నా మానుకునేవారు అలసటకి కారణం ఏమిటో గుర్తించాలి. పని ఎక్కువ ఉండేవారు తగ్గించుకోవాలి. గృహిణులు పని విషయంలో ఇబ్బంది పడకుండా తేలికగా పని అయ్యే పద్దతులు అవలంభించి చికాకు కలగాకుండా చూసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి. సమయానికి భోజనం చేసి నిద్రపోవాలి ఉదయం పూట కడుపునిండా తీఫిను గాని, భోజనంగాని చేయాలి. వీటన్నింటికీ తోడు ప్రశాంతంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు చిన్న పనిచేసినా అలసిపోతున్నామనే భావంపోయి మనం శక్తివంతంగా పని చేయగలుగుతాం!   

                                       ****


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS