Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 28

    "ఉండవమ్మా. నువ్వింట్లోనే ఉంటావ్ కాబట్టి మరెప్పుడైనా రాధ పొట్ట నిమరొచ్చు. మేమేగా బయట్నుంచ వచ్చింది?" అంది కామాక్షమ్మ.
    కామాక్షమ్మకి ఏమీ చెప్పలేని సరస్వతి నోట్లో చీరకొంగు దోపుకుని "ఉహూ - ఉహూ" అని బాధపడింది.
    అన్నపూర్ణకి ఏం చేయాలో తోగలేదు.
    హఠాత్తుగా ఆమె కళ్ళకి గోపి కనిపించాడు. బాబు గోపి అంటూ పరుగున వెళ్ళి గోపిని లపక్కున కౌగిలించుకుంది.
    "వహ్హిదినా బేర్ ర్" అన్నాడు గోపి అన్నపూర్ణ చుట్టూ చేతులు వేసి ఆమెకు బల్లిలా అతుక్కుపోతూ.
    "ఎందుకు బాబూ దుఃఖం? నేను వచ్చేశాగా?ఊర్కో బాబూ - ఊర్కో"
    అంది అన్నపూర్ణ గోపి వీపు నిమురుతూ.
    "అదిగాడు వదినా మరేమో బేర్ ర్."
    "ఊర్కో బాబూ. ఊర్కో" అంది అన్నపూర్ణ. తన కౌగిలిని బిగించింది.
    గోపికి ఊపిరాడక దగ్గొచ్చేసింది.
    "ఖళ్... ఖళ్."
    ఆ దగ్గువిని కామాక్షమ్మ కన్ ఫ్యూజ్ అయిపోతూ తన గొంతుమీద చెయ్యేసి తడుముకుంది.
    "హర్రే.... నేను దగ్గకుండానే దగ్గినట్టు సౌండ్ వస్తుందే!" ఆశ్చర్యంగా అంది కామాక్షమ్మ.
    అన్నపూర్ణ కిలకిలా నవ్వింది.
    "అది నీ దగ్గు కాదులేమ్మా. నా కౌగిట్లో నలిగిపోయి ఊపిరాడక గోపి దగ్గుతున్నాడు హి...హిహి."
    "ఏవమ్మోవ్... చూస్తుంటే నా అల్లుడ్ని చంపేసి నా కూతురు బ్రతుకు బడలు చేసేలా ఉన్నావే. అల్లుడ్నిగారి వదిలి ఇలారా...నేను రాధ పొట్ట నిమరడం అయిపోయిందిలే" అంది కామాక్షమ్మ అన్నపూర్ణ వంక చురచురా చూస్తూ.
    అన్నపూర్ణ గోపిని వదిలి రాధ ముందుకు చెంగున దూకి మోకాళ్ళ మీద కూర్చుని రాధ పొట్ట నిమరడం మొదలుపెట్టింది.
    రాధ "హక్కాయ్" అంటూ ఘొల్లుమంది.
    రాధ పరిస్థితి చూసి సరస్వతి నొసలుమీద ఫటఫటా కొట్టుకుంటూ నేలమీద పది పొర్లుతూ 'కేర్ బేర్' అంది.
    సుబ్మణ్యం జరుగుతున్న తతంగాన్నంత మైమరచిపోయి చూస్తూ "ఆహా- ఈ సృష్టి ఎంత విచిత్రమైనదో కదా? స్త్రీ అంతకంటే విచిత్రమైనది! ! సృష్టికి ప్రతి సృష్టి చేస్తుంది!" అన్నాడు.
    దీప గోపి పపంట్లాం పట్టి లాగేస్తూ "బాబాయ్... బాబాయ్... పిన్నికి పాపో, బాబో పుడితే నన్ను మర్చిపోతావా? నన్ను ముద్ద్దు చెయ్యవా బాబాయ్" అని అడిగింది.
    "హమ్మా దీపా!" గోపి కసిగా జుట్టు పీక్కుంటూ బావురుమన్నాడు.
    శంకరం మెల్లగా అన్నపూర్ణ వెనకాల చేరాడు.
    "పూర్ణా... ఇంక నువ్ లేస్తావా? మరదల్ని ఓసారి అప్యాయంగా కౌగిలించుకుని నేను కూడా పొట్ట నిమరాలి!" అన్నాడు భార్యతో.
    అన్నపూర్ణ శంకరంమీద మండిపడింది.
    "ఏంటీ? మీరుకూడా ఆడంగిలాగా పొట్ట నిముర్తారా? నోరుమూసుకుని ఓ ప్రక్కన నిలబడండి."
    "ఓసేవ్ రాధా! నీకు పాప పుడితే నా పేరు ఖళ్..." అంది కామాక్షమ్మ.
    "ఆ..... ఆపని చెయ్యమ్మా బాగుంటుంది" అన్నాడు నారాయణరావు.
    "నీకు శ్రీమంతం మా ఇంట్లో చేస్తాం చెల్లెమ్మా!" అంది అన్నపూర్ణమ్మ రాధతో.
    "హక్కాయ్-" రాధ ఘొల్లుమంటూ నేలమీద కుప్పకూలిపోయింది.
    "హబ్బా...! మీరింక మీ గోల అప్పుతారా అసలేం జరిగిందో నన్ను చెప్పనిస్తారా లేదా?" అంటూ గోపి గావుకేక పెట్టాడు.
    ఆ దెబ్బకి అందరూ సైలెంట్ అయిపోయారు.
    "ఏంటి ఖళ్ బాబూ! ఏం జరిగింది ఖళ్?" అడిగింది కామాక్షమ్మ రెండుక్షణాల తర్వాత.
    గోపి ఓసారి దీర్ఘంగా శ్వాస పీల్చి మెడ పైకెత్తి సీలింగ్ వైపు చూసి తర్వాత జుట్టు పీక్కుని అన్నాడు.
    "హత్తయ్యా! అది భగవంతుడు మాకు విధించిన శిక్ష అత్తయ్యా."
    "అసలేమైంది ఖళ్! త్వరగాచెప్పు ఖళ్ బాబూ!"
    గోపి మరోసారి బాధగా జుట్టు పీక్కుని రాయుడు రాధని రేప్ చెయ్యాలని ప్రయత్నించడం, రాధకి అబార్షన్ అవడం అంతా చెప్పాడు.
    అది విని అందరూ ఎంతగానో బాధపడ్డారు.
    కాస్సేపయిన తర్వాత గోపి అన్నపూర్ణతో అన్నాడు. "అందరూ వచ్చారుగానీ.... నాన్నగారు రాలేదేమిటి వదినా? ఎలాగయినా ఆయనకు నేనంటే చిన్నచూపే కదు వదినా?"
      "కదు బాబూ కాదు!" ముక్కు పొంగిస్తూ అంది అన్నపూర్ణ. "ఆయన అలాంటివారు కాదు బాబూ! ఆయన  అలాంటివారు కాదు బాబూ! ఆయన దేవుడు బాబూ - దేవుడు!"
    "అవును వదినా దేవుడే!గుళ్ళో ఉండేది దేవుడే.... రాతిదేవుడు! నాన్నారు కూడా రాతి దేవుడే! అందుకే మా ఇంటికి రాలేదు!" చొక్కా కాలరు నలిపేసుకుంటూ అన్నాడు అతను.
    "లేదు బాబూ! ఆయన వచ్చారు!ఇంట్లోకి రావడానికి ఆయనకు మొహం చెల్లలేదు బాబూ! అందుకే బయటే నిల్చుండిపోయారు" అంది అన్నపూర్ణ.
    ఆ వార్త వినగానే గోపి, రాధ, అన్నపూర్ణల హృదయాల్లో కొన్ని సితార్లు, మరికొన్ని వీణలు యడాపెడా మోగాయ్.
    "ఆ.... నాన్నగారు వచ్చారా? ఏరీ.... ఎక్కడా?" అంటూ బయటికి పరుగుతీశాడు.
    "మామయ్యా!" అంటూ రాధ కూడా బయటికి పరుగుతీసింది.
    "ఏవండీ!" అంటూ సరస్వతి నిండుగా పైట కప్పుకుంటూ బయటికి పరుగుతీసింది.
    వాళ్ళ ముగ్గురి వెనుకా మిగతా అందరూ పరుగుతీశారు.
    బయట పరంధామయ్య మొహంమీద గుడ్డ కప్పుకుని నిల్చున్నాడు.
    "నాన్నా! ఎందుకు నాన్నా మొహంమీద ఇలా గుడ్డకప్పుకుని నిల్చున్నావ్! ఎండగా వుందనా?" అదిగాడు గోపి.
    "కాదు బాబు కాదు! నీకు నా మొహం చూపించలేక ఇలా మొహంమీద కప్పుకున్నా" అన్నాడు పరంధామయ్య.
    అతను పరంధామయ్య మొహంమీద గుడ్డ లాగేసి ఆయన్ని గట్టిగా కౌగిలించుకుని "నహాన్నా" అంటూ బేర్ ర్ మన్నాడు.
    "ఊర్కో బాబూ ఊర్కో! కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా?" అన్నాడు పరంధామయ్య అతని చొక్కా చిరిగిపోయేలా వీపు నిమురుతూ.
    "నాన్నా:" ఇంకా గట్టిగా బేర్ మన్నాడు.
    "బాధపడకు బాబూ! కష్టాలు మనుషులకు కాక...." ఇంకా అనబోతున్నాడు పరంధామయ్య కానీ అతను వెంటనే పరంధామయ్య మాటలకు  అడ్డు తగిలాడు.
    "నాన్నా! నేను రెండోసారి బేర్ మన్నది అందుకు కాదు నాన్నా! మరీ నా వీపు మంటెక్కేలా నిమురుతున్నావ్ నాన్నా! ఇంక నీ వీపునిమురుడు చాలు నాన్నా!"
    పరంధామయ్య సిగ్గుపడుతూ గోపిని వదిలిపెట్టాడు.
    ఇంతలో అందరూ ఉలిక్కిపడేలా పెద్ద శబ్దం!
    "ఢమ ఢమ ఢమ..."
    అందరూ తలలు తిప్పి చూశారు.
    ఆ గూడెంవాళ్ళంతా పెద్ద గుంపుగా అక్కడికి వచ్చారు. మగవాళ్లందరి చేతుల్లో డప్పులు ఉన్నాయి. ఆడవాళ్ళూ రెండువరుసలుగా ఎదురెదురుగా నిల్చున్నారు. ఆ రెండు వరుసల మధ్యలో ఒక జంట నిలబడి ఉంది. ఆ జంటలో మగాడి చేతిలో మరీ పెద్ద డప్పు ఉంది.
    అతను ఒక్కసారిగా గొంతెత్తి   
    "ఓయ్... ఒలె ఒలె.... ఒలియా..." అన్నాడు.
    తర్వాత డప్పు ఢమ ఢమా వాయించాడు.
    మిగతా వాళ్ళంతా కూడా "ఓయ్.... ఒలెఒలెఒలే...ఒలియా" అని డప్పు ఢమఢమ వాయించారు.
    ఆడాళ్ళంతా నడ్డి వయ్యారంగా ఊపుతూ "ఒలియ ఒలియ ఒలియా.... ఒలియా"అన్నారు.
    అంతే....
    మధ్యనున్న జంట ఒక్క గెంతు గెంతి పాట అందుకుంది.
    "గోడమీద ఉందిలే నల్లా పిల్లా-
    అనుకున్నది జరిగిందిలే మల్లీమల్లీ
    మా రాధమ్మా అవుతుందిలే బిడ్డకు తల్లీ!"
    వెంటనే కోరస్ గా అందుకున్నారు మిగతావాళ్ళు.
    "బిడ్డకు తల్లీ! రాధమ్మ సెల్లీ!"
    "ఆపండి - ఆపండెహే"జుట్టు పీక్కుంటూ అరిచాడు గోపి.
    గూడెం వాళ్ళు పాటా, డప్పుల మోతా ఆపేసి అతనివంక బిత్తరపోయి చూశారు.    "ఉండవమ్మా. నువ్వింట్లోనే ఉంటావ్ కాబట్టి మరెప్పుడైనా రాధ పొట్ట నిమరొచ్చు. మేమేగా బయట్నుంచ వచ్చింది?" అంది కామాక్షమ్మ.

    గూడెం వాళ్ళు పాటా, డప్పుల మోతా ఆపేసి అతనివంక బిత్తరపోయి చూశారు.

 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS