"మరో టార్గెట్ కోసం వెదుక్కుంటాడు" అర్దోక్తిగా నవ్విందామె. "సినిమా రంగానికి సంబంధించి షూటింగ్ అనే పదం ఎలా వచ్చిందో యిప్పుడు అర్ధమైంది శెట్టిగారూ! ప్రతివాడూ యిక్కడ మాటనే గురి తెలిస్తే రామన్ అవుతాడు. టార్గెట్ లా గాయపడితే రాజ్యాలుగా మంచం పడతారు. మోస్ట్ రెడిక్యులస్ ఇండస్ట్రీ."
ఆవేశంగా లిక్కర్ బాటిల్ అందుకుంది. షివాస్ రీడిల్! సినిమా రంగంలో చాలా ఖరీదైన వ్యక్తులు తప్ప తాగలేని ఖరీదైన విస్కీ!
"నీకు అలవాటుందా?" అడిగాడు శెట్టి.
"ఇప్పుడిప్పుడే అలవాటు అవుతూంది" గ్లాసులో పోసి ఫ్రిజ్ నుంచి ఐస్ క్యూబ్స్ తెచ్చి రెండు గ్లాసుల్లోనూ నింపింది.
"అప్పుడేనా?" అడిగాడు టైం చూసుకుంటూ. రామన్ వెళ్ళాక అని యిందాక అతడన్న మాటలు ఆమె మరిచిపోలేదు.
"భిక్షగాడిలా మీ దగ్గరకు వస్తున్న వాడి కోసం మీరంతగా ఆలోచించాల్సిన అగత్యం లేదుగా?"
ఉద్విగ్నంగా గ్లాసు అందుకుని రెండు గుక్కలు తాగాడు.
"దట్స్ ఫైన్...." తనూ సిప్ చేసింది. గొంతు మండింది. కానీ రామన్ ఆలోచనలు ఆమె బాధను డామినేట్ చేశాయి. "రండి...."
అతడ్ని నేలపైకి లాగేసింది.
"అదికాదు...." తటపటాయించాడు.
"ఓహ్" మగతగా చూసింది. "మీకు నేలమీద ఇబ్బందిగా వుందేమో కదూ!"
అతడిలోని మగతనాన్ని సవాల్ చేసే ప్రశ్న అది!
ఉక్రోషంగా గ్లాసు ఖాళీ చేశాడు.
"గూడ్" అభినందనగా చూసింది. మరుక్షణం అతడు వేసుకున్న పేంటుని లాగేసింది. రోషం, ఉక్రోషం, ప్రపంచంమీద కసి అన్నీ కలిపి ఆమెను ఎంత ఆవేశపరిచాయీ అంటే అరనిమిషం వ్యవధిలో అతని నగ్నంగా మార్చింది. "ఇప్పుడు మీరు నేనీ గ్లాసులోని మందు తాగేలోగానే నా ఒంటిమీద ఒక్క నూలుపోగైనా లేకుండా పీకేయాలి ఇట్ ఈజ్ ది ఫస్ట్ టెస్ట్ ఫర్యూ.... యస్."
అంతే..... హిప్నటైజ్ చేయబడిన వ్యక్తిలా తనను తను మర్చిపోయిన శెట్టి ఆ తర్వాత తన శక్తిని, ఒడుపుని వుపయోగించి ఆమె ఒంటిపై బట్టల్ని వూడబెరికేస్తున్నాడు.
అది శృంగారంలా లేదు. అలా అనుకునే స్థితి కాదామెది. ఒక భిన్నమైన అనుభూతిని అతడికి అందించడమే తన ధ్యేయమనే ఆలోచన అతడికి సహకరిస్తూంది.
అప్పటికి ఆమె గ్లాసు యింకా పూర్తికాలేదు. కానీ నగ్నంగా మారిపోయింది. అప్పుడు చూశాడామె సౌందర్యాన్ని.
అది అందం కాదు. ఏటమిక్ క్రిమెటోరియం. అంతరంగ మంత్ర నగర ద్వారాన్ని తెరిచి కళ్ళకు గుచ్చుకుంటున్నట్టు శిలే ఉలితో శిల్పిని చెక్కుతున్న ఆ సదృశ్య స్వప్న పారావతి.
పైకి లంఘించాడు పులిలా.
నేలపై గ్లాసు భళ్ళున పగిలిన చప్పుడు.
గాలి గడ్డ కట్టుకుపోయింది.
గదిలోని విద్యుద్దీపం వెన్నెలగా మారి వృద్దాప్యపు బిందువును సింధువుగా మార్చింది.
మీదకి జరిగాడు. అరక్షణంలో ఆమెను ఆక్రమించుకోబోయి శక్తి సహకరించక కలవరపడిపోతున్నాడు. అది ఓటమి కాదు. గెలుపుకోసం పడే తొందరపాటు.
ఆమె కళ్ళు మూసుకుంది. మనసెప్పుడో సమస్యల నక్షత్రాలతో చచ్చిపోయాక యిప్పుడు శరీరానికి గాయమైతేనేం అని సమాధిలోకి జారినట్టు నిషాలో అతడి ఒంటిని స్పృశిస్తూ ఎగిరెగిరిపడుతూంది.
అతడు చెమటతో తడిసిపోతున్నాడు.
తనకు వయసు ఉడిగిందని తెలిసిపోతున్నట్టు ఆందోళనపడుతూ అలసిపోతున్నాడు.
అదిగో....
సరిగ్గా అప్పుడు కాలింగ్ బెల్ మోగింది.
ముందు వినిపించలేదు శెట్టికి. మరోసారికి స్పష్టంగా అర్ధమైంది. రామన్ వచ్చినట్టున్నాడు.
అదే మాట అనేవాడే....
అతడికి అవకాశం యివ్వకుండా సుకృతి పైకి లేచింది.
రెప్పపాటులో అతడ్ని నేలపైకి నెట్టింది.
ఆ తర్వాత జరిగిందేమిటో అతడికి గుర్తులేదు.
అసలు గుర్తు చేసుకునే స్థితి కాదది. భయం, అనుభవాల మధ్య చిత్రమైన రాపిడి.... నిశ్శబ్దం, కోలాహలం...జడులై కురిసిన విద్యుత్ స్నానం ఓ తిరుగులేని జ్వాలాహలం. ఆచ్చాదన కలిగిన అనుభూతి అందించే సంగీతరవం.
