చూడండి! ఆరంభముననే తనకు దగినపచును బెండ్లాడి రోడ్డు రిపేరు చేయుచున్న యుప్పరివాడు పగలెల్ల మట్టిపని చేయుచున్నాడు. సంజకడ ఉడుకు నీరు కాచి, యిల్లాలు వీఁ పు దోమి స్నానము చేయించగా భర్త సుఖస్నాతుఁ డై భార్యతో గంజి యన్నము, ఉప్పు, పచ్చిమిరప కాయ నంజుకొనుచు కడుపార నారగించి, తమకు గలిగిన చిన్న బిడ్డ నక్కడి చెట్టుకొమ్మకు వ్రేల గట్టిన చీరయుయ్యేలలో నూగించి, చల్ల గాలిలో నా బిడ్డ సుఖనిద్ర పడయగాఁ జెట్టు క్రింద సుఖశ యితు లగుట చూచుచుంటిమి గదా! వారి దాంపత్యమున హృద్యత గోచరించుట లేదా?
ఏకైక వ్యక్తి గా మిరుమిగిలిన మికుటుంబమున నన్నుఁ బెండ్లాడుటచే వంశవృద్ది గలిగి మృ సుఖించుచుండుట గుర్తునకు వచ్చట లేదా? నే నుండుటచే గదా మికిట్టి సుఖభోజనము దొరకుట? వంట వానిని గుదుర్చుకొని వాణివంటతో భోజనము జరపుకోనుటలోని యిక్కట్టులను గుర్తించుచునే యుంటిమి గదా? మికు ఆరోగ్యకరములు, ప్రియములు నయినకూరగాయలను నేను దెప్పించి మీకు ప్రియ మయిన తీరున వంట చేయించు చుండుటచేతఁ గాదా మి యారోగ్యము ససిగా నుండుట, ప్రియముగా భోజనము సాగుత. ఇంటికి వచ్చిన మీకు కోర్టులోని పరిశ్రమపుఁ బరిహారము మావినోదముతో జరుగుట యగుచున్నది గదా! ఇంతేల? ఈ యెండ యుమ్మదములో చెమటలు దిగజారు చుండఁ గా నే నుండి విసనకఱతో విసరుచుండుట చేఁ గాదా శ్రమ మెఱుఁగకుండ మీరు హాయిగా నారగింపఁగల్గుట? నేఁ టియీ వంటకములు వంటాతఁ డే చేసినను నేను దగ్గర నుండి మీకు ప్రియమయిన కూరలు తెప్పించి తఱిగి యిచ్చి మికు నచ్చినవిధానమున మి కెంత కావలెనో అంతగా ఉప్పుకారములు వేయిచి వండించుట చేతఁ గాదా యవి యాస్వాద్యములుగా మికుండుట!
మన శాస్త్రులుగా రిక్కడ నున్నప్పుడు గొంత కొంత సంస్కృతాంధ్యముల పరిచితి హెచ్చి తఱచుగా భారతాదులు చదువుచుండుటచే నందలి పద్యము లివి నా నోటికి వచ్చియున్నవి చిత్తగించండి!
అధికదుఃఖరో గార్తున కౌషధంబ
సురుచిరంబుగ భార్యయ చూవె యెందు
నొనరు భార్యాసమేతుఁడై యున్నవాని
కెంత లయ్యును నాపద లెఱుక పడవు
అలసి నెడ డస్సి నెడ నా
కలి తృష్ణయు నైన యెడలఁ గడుకొని ధరణీ
తలనాధ! పురుషునకు ని
మ్ముల భార్యయ పాచుఁ జిత్తమున దుఃఖంబుల్.
(నన్నయ నలోపాఖ్యానము.)
పార్వతమ్మగా రింత పలుకగా, నాకు ముద్ద మ్రింగుడు పడసాగగా సూర్యనారాయణ రావుగారు నిరుత్తరు లయిరి. నన్నుఁ జూచి ' శ్రీ ఘ్రముగా నింటికి బోయి వివాహ మాడుదు వులే! నీవాలకము చూడఁ గా పెండ్లి ప్రయత్నమున చేయింటికి వెళ్లుటగా నున్నట్టున్నది. శుభమస్తు'అనిరి.
