Previous Page Next Page 
అపశ్రుతులు పేజి 27

 

    అనుకోకుండా వచ్చిన రామకృష్ణను ఆధారంగా, సంతోషంగా చూస్తూ ఎన్నాళ్ళకు చూశాన్రా బాబూ రా! అబ్బ దొరబాబులా గున్నాడే....మా ముసలాళ్ళని చూడాలనిపించ లేదా బాబూ అంటూ రామకృష్ణను దగ్గరకు తీసుకుంది జానకమ్మ.
    ఏరా ఇదేనా రావడం. అమ్మా నాన్నని చూసే వచ్చావా? అడిగారు రంగనాధం.
    ఇలానే వచ్చాను తాతయ్యా ఇంకా ఇంటికి వెళ్ళలేదు. మామయ్యేడీ. మామయ్య కొడుకేడీ శుభలేఖ చూసి నమ్మలేకపోయాను. నిజంగా అత్తయ్యే కన్నదా అబ్బాయిని అంటూ వరండాలో కొచ్చిన శాంతవైపు చూసి నవ్వాడు రామకృష్ణ.
    ఈ అత్తయ్య కాక మామయ్య మరో అత్తయ్యను తెచ్చామనుకున్నావేమిటి? మామయ్యా పొలానికి వెళ్ళారు.రా నిల్చునే ఉండిపోయావ్. కాఫీ తీసుకో అంటూ గబగబ కాఫీ తెచ్చి ఇచ్చింది శాంత.
    బట్టలు మార్చి స్నానం చేసి కూర్చున్న రామకృష్ణను ఇటుపైన ఎక్కడ ఉద్యోగం చేస్తావ్! అంటూ అతని చదువూ, పై దేశంలో అతనెలా ఉండేవాడో, అక్కడి ప్రజలూ, వారి అలవాట్లూ; అక్కడి వాతావరణం ఒక్కొక్కటే ప్రశ్నించి తెలుసుకుని, మీ నాన్న నువ్వు గుమ్మంలో అడుగుపెట్టిన క్షణంలో పెళ్ళి చేస్తాడ్లే అంటూ నవ్వారదోలా రంగనాధం.
    నేను చేసుకుంటేనే కదా! అన్నాడు రామకృష్ణ పేలవంగా నవ్వుతూ.
    చంపేశావ్ రోయ్. నిశ్చయం చేసేవి ఆ అమ్మయికేదో గొలుసు చేయించి పెట్టారట.
    ఆ అమ్మాయి మెళ్ళో తాళికట్టి జీవితాంతం భరించేదెవరు తాతయ్యా? వాళ్ళా? నేనా?....ఎలా నిశ్చయం చేశారు నన్ను సంప్రదించకుండా!.....వారూ, వీళ్ళూ జుత్తులు పట్టుకు తన్నుకోని కందిన మొహంతో రంగనాధంవైపు చురుగ్గా చూస్తూ అన్నాడు రామకృష్ణ.
    రాధ సంగతి చెప్పబోయే రంగనాధం వీధి గుమ్మంలో శ్రీనివాసరావు గొంతు విన్పించి అదిగో మామయ్యా. అమ్మాయి వచ్చినట్టుంది అంటూ లేచి నిల్చున్నారు.
    అమ్మాయి.....అవును మామయ్య ఆ మధ్య ఓ అమ్మాయిని పెంచుకున్నానని వ్రాశాడుగా....సరి ఇంక వీళ్ళు ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకోమని వత్తిడి తెస్తారు కాబోలు. అనుకున్న రామకృష్ణ గుండెలు దడదడ లాడాయి ...... ఛ ఛ రావడం పొరపాటయింది ..... వెధవ వాసు. కొన్ని గంటల ముందీసంగతులు తెలియపరచి ఉంటే నిజానికి మరి స్వదేశానికి రాకపోయేవాడు అనుకుంటూ పరధ్యాసగా మళ్ళీ గతంలోకి జారిపోయిన రామకృష్ణ శ్రీనివాసరావు సందడిగా సంతోషంగా వేస్తూన్న ప్రశ్నలకి పొడిపొడిగా సమాధానం చెప్పాడు.
    పొలం నుంచి వచ్చిన రాధ మొహం కాళ్ళూ చేతులూ కడిగి, బట్టలు మార్చుకుని నుదుటన తిలకం దిద్దుకుంటూ. "ఓ క్రొత్తగొంతు విని ఉలిక్కిపడి చెవులు రిక్కించి, ఎవరిదీ గొంతు......రామకృష్ణ..... అత్తయ్య కొడుకు రామకృష్ణ తన రామకృష్ణా? సంభ్రమాశ్చర్యాలు, సంతోషం, దుఃఖం ఇంకేవో కలవరం. తన్ను తాను నిగ్రహించుకోలేని సంచలనం ఆమె మేను చిన్నగా కంపిస్తూంటే. అలా చతికిలబడింది మంచం పట్టెమీద.
    అత్తయ్య కొడుకు రామకృష్ణకు, తమ భార్య అయింది. హోటలు గదిలో విటుడు తనతండ్రి. విధి ఎంత చిత్రంగా తనను తన వారిని చేర్చింది. భగవంతుడెంత దయామయుడు? భగవాన్. రామకృష్ణను కొన్నిక్షణాల్లో చూడబోతూంది? అతను తన గురించేమిటి విన్నాడు? అతని ఎదుట తానెలా నిలవాలి? హృదయం తీవ్రంగా స్పందిస్తూంటే పెదవులు ఒణుకుతూంటే, నీకు చిమ్ముతుంటే మౌనంగా కూర్చున్న రాధ. ఏదో అడుగుల సవ్వడికి తలెత్తి చూసింది.
    రామకృష్ణ.
    ఆమెకళ్ళు జలపూరితా లయాయి.
    రాధా! అన్నాడు రామకృష్ణ కంపనస్వరంతో.
    రెండంగల్లో అతని దగ్గరచేరి అతని హృదయంపై తల ఆన్చి మాటలు రాని దుఃఖంతో, వ్యధాపూరిత హృదయంతో, వెక్కివెక్కి ఏడుస్తూంది రాధ.
    అతని చేతులు ఆమెను చుట్టుకున్నాయి. ఆమె తలపై గెడ్డం అన్చి కళ్ళు రెండూ మూసుకున్న రామకృష్ణ ఎదలో ఎన్నో ప్రశ్నలు. రాధ మామయ్య. ఇంటి కెలావచ్చింది. ఎవరు రాదను లేవదీసుకొచ్చారు. అస్సలు కథేవిటి?
    ఒకరి నొకరు కలిశామనే తృప్తితో సంతోషంతో, పారవశ్యంతో కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారా ప్రేమికులు.

 

                                   
    అతని భుజం పెట్టి నొక్కుతూ. వెళ్ళాక ఒక్క ఉత్తరమైనా వ్రాయకుండా అస్సలు నా సంగతే విస్మరించి ఇన్నాళ్ళు భార్య వనిపించుకున్న నన్ను వదిలెయ్యడం న్యాయమా కృష్ణా.......దుఃఖంతో చలించే గొంతుతో ప్రశ్నించిందిరాధ.
    విశ్వనాధన్ నీకు నా ఉత్తర మివ్వలేదా? అస్సలు నా సంగతులేమీ చెప్పలేదా?
    మీరు వ్రాశారా?......ఆశ్చర్యంగా అతనివైపు చూసింది రాధ.
    ఎందుకు వ్రాయమా? వ్రాయనని ఎలా అనుకున్నావ్? ఒకటేమిటి? చాలా ఉత్తరాలు వ్రాశాను. మామామయ్య ఇంటికెలా వచ్చావ్?......విశ్వనాధన్ అతని తమ్ముడికి నువ్వెవరితోనో లేచి పోయావని వ్రాశాడు.
    మీరు నమ్మారా.
    అతని ఇంట్లో లేనని తెలిసి ఏమనుకోవాలి? అబ్బా.....హృదయమెలా నలిగిపోయింది ఎంత నరకమనుభవించాను. అస్సలు ఇక్కడి కెలా వచ్చావ్ అన్నాడు రామకృష్ణ. ఆమె కన్నీరొత్తుతూ.
    అతని హృదయంలో తలదూర్చి, రొదన స్వరంతో. శ్రీనివాసయ్యరు.... బాబయ్య పోయాక.....నకా ఇంట్లో క్షణక్షణం కత్తిమీద పాములా దొర్లింది కాలం. రమణిని పురిటి కి పంపించి......నన్ను నాన్నా రోజు...మామూలుగా అతనికి అన్నంపెట్టాను. భోజనం ముగించి లేస్తూ. నావైపు క్రూరంగా చూస్తూ.... నిన్ను అందమైన మొగుడిదగ్గరకు పంపిస్తాను. నేను నచ్చలేదుగా. తయారవ్ అన్నాడు విశ్వనాధన్. వణికిపోయాను .....అంటూ గొంతుపూడిపోయి మౌనంగా ఉండిపోయింది రాధ.
    ఆమె తల హృదయాన్కి హత్తుకుంటూ....తర్వాత....తర్వాత ఏం చేశాడు? ఆవేశపూరిత స్వరంతో ప్రశ్నించాడు రామకృష్ణ.
    నన్నుకొట్టి...... కొట్టి....... హోటలు గదికి......మా నాన్న ఉన్న గదిలోకి నన్ను తోశారు.....మరి మాట్లాడలేను కృష్ణా మరెప్పుడూ నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళిపోకండి మీరు. పొంగిపొరలే దుఃఖంతో అలసిపోయింది రాధ.
    సరే..... మరేం చెప్పొద్దు మామయ్యను కనుక్కుంటాను మామయ్యకు... అంటే? మామయ్య కూతురంటే అతని తొలి భార్యా....రమ కూతురివా నువ్వు!.... నాకేమిటో అంతా అయోమయంగా గందరగోళంగా ఉంది. రాజులా మంచంమీద కూర్చో అంటున్నాడు రామకృష్ణ.
    అంతకు పదినిమిషాల పూర్వమే వారిని కనిపెట్టి గుమ్మంచాటున నిల్చుని చూసే వ్యక్తుల్ని వారు గమనించనేలేదు.
    వారిద్ధరినీ అలా చూసిన శాంత కంగారుగా శ్రీనివాసరావు జబ్బ పట్టుకు తీసుకువచ్చి వారిని చూపించి ఏమిటి సంగతి?..... అన్నట్లు చెయ్యి ఊపి ప్రశ్నించింది.
    నాకూ తెలియదు అన్నట్టు ఆశ్చర్యపోతూ ముసిముసిగా నవ్వుకుంటూ చేతులూపి సౌంజ్ఞ చేశాడు శ్రీనివాసరావు.
    అసలు రాధకూ, రామకృష్ణకూ ఎలాంటి పరిచయమో! ఎలాటి అనుబంధమో తెలుసుకోవాలనే ఆతృత అణచుకోలేని శ్రీనివాసరావు చిన్నగా దగ్గి కృష్ణా! అని పిల్చాడు.
    ఇలారా మామయ్యా.....అన్నాడు రామకృష్ణ.
    తడబాటుగా గది గుమ్మంలో నిల్చుని. రామకృష్ణ చేతుల్లో వాలి ఉన్న రాధను చూసి చప్పున తలవాల్చి చెయ్యి ముందుకి చాపి ఏమిటన్నట్టు ఊపాడు శ్రీనివాసరావు.
    రాధ..... రాధ నా భార్య మామయ్యా...సుమారు రెండేళ్ళక్రితం రాధను పెళ్ళి చేసుకున్నాను.
    దిగ్భ్రాంతుడై ఆనందాశ్చర్యాలతో కొన్ని క్షణాలు రెప్పవాల్చకుండా చూశాడు వారివైపు శ్రీనివాసరావు అంతకన్నా. తాను కలగంటూందో ఇదంతా నిజంగా జరుగుతూందో! తెలియక ఆశ్చర్యంగా చూస్తూంది శాంత.
    ఏమిటలా వణికిపోతున్నావ్?.....అలా కాస్సేపు పడుకుని విశ్రాంతి తీసుకో అంటూ రాధను మంచంవైపు నడిపించాడు రామకృష్ణ.
    అంటే.....అంటే అన్నాడు శ్రీనివాసరావు కొంచెం ఆ అవస్థలోంచి తేరుకుని.
    అవతల మాట్లాడుకుందాం రండి మామయ్యా తాను పట్టి పిరికి గుండెది. అందుకు తగ్గట్టుగానే ఆమె జీవితం గడిచింది. అంటూ ఇవతలి కొచ్చాడు రామకృష్ణ. రామకృష్ణ శ్రీనివాసరావు శాంతా. జానకమ్మా, రంగనాధం, అందరూ సమావేశమై కూర్చుని మరొక కొత్తవింత. ఇంకోరకమైన సంతోషం చవిచూస్తూ సంభాషించుకున్నారు.
    తాను హోటల్లో బసచేసినది మొదలు ఈనాటి వరకూ జరిగింది చెప్పి. రాధతో నీకెన్నాళ్ళయి పరిచయం? అడిగాడు శ్రీనివాసరావు.
    రాధ పధ్నాలుగేళ్ళ అమ్మాయిగా ఉన్నప్పుడు తన హృదయంలో ప్రవేశించి ఎలా తన భార్య ఐనదీ క్లుప్తంగా చెప్పాడు రామకృష్ణ.
    మరి.....మరి.... మీ నాన్న.....అన్నారు రంగనాధం.
    పకపకా నవ్వాడు శ్రీనివాసరావు. అతనితో అందరూ కాస్సేపు నవ్వారు. ఏవేవో చలోక్తులు విసురుతూ.
    ఆ సాయంకాలమే ఆఖరిబస్ లో కూతురింటికి వెళ్ళారు రంగనాధం.
    ఒక్కోమాట ఒక్కోమాట మాట్లాడుతూ రామకృష్ణా రాధా రిజిష్టర్ మేరేజ్ ఎప్పుడో చేసుకున్నారనీ, కావాలంటే ఆ కాయితాలు గట్రా ఆ పెళ్ళి తాలూకివి చూపిస్తానని రామకృష్ణ అంటున్నాడనీ, రామకృష్ణ తన ఇంటికి వచ్చినది మొదలు అన్ని సంగతులూ, అల్లుడూ, కూతురూ వింటూండగా చెప్పారు రంగనాధం.
    సమ్మి నమ్మలేకా కొంతసేపు సతమతమై మర్నాడు రంగనాధంతో ప్రయాణమయ్యారు కామేశ్వరీ మూర్తీ. ముసలాయన్ని నౌకర్ల కప్పగించి.
    రాదని తానెలా తీసుకువచ్చాడో. రామకృష్ణ తన ఇంటికి వచ్చాక ఏం జరిగిందో రామకృష్ణ ఏం చేపపదో అన్నీ మూర్తికి మరోసారి వికటంగా చెప్పి. చూశావా బావా నీకూ నాకూ తెలియకుండా వాళ్లెప్పుడో భార్యాభర్తలైపోయరు. అంతో నవ్వాడు శ్రీనివాసరావు.
    తల అడ్డంగా ఊపి అదెలా కుదురుతుంది? అన్నాడు మూర్తి.
    కుదరకపోతే మానేయ్యండి నాన్నా.....మీ ఆస్తి నాకేం అక్కర్లేదు. మీ గుమ్మం తొక్క వద్దంటారు, మానేస్తాం అంతే కదూ? అన్నాడు రామకృష్ణ.

 

                                   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS