23. రాయలసీమ ప్రాంతంలో వచ్చే నారు కురుపు వ్యాధి.
రాయలసీమలో అదొక గ్రామం. ఆ ఊరి అంతటికీ ఒకటే బావి. ప్రతి ఊళ్ళోనూబావులు వుంటాయి. కాని, ఆ ఊరి బావికి మాత్రం ప్రత్యేకత వుంది. మామూలుగా ఇతర బావుల్లోకి చేదవేసి నేరు తోడుకుంటే, ఈ బావిలోకి మాత్రం నీటిదాకా చక్కని మెట్లు వున్నాయి. నీటి వరకు వెళ్ళి బిందేముంచుకోవచ్చు. స్థానం చేయాలని మనసైతే రెండు మూడు మెట్లు డిగి మెట్ల మీదనే జలకాడవచ్చు. కొత్తగా రాయలసీమ వెళ్ళిన రాయప్పకు ఈ అనుభవం అంతులేని ఆనందాన్ని కలిగించింది. రోజూ ఆ దిగుడు బావిలో మొలలోటు నీళ్ళల్లో డిగి కదవతావు నీళ్ళు ముంచుకుని దాన్ని నెత్తిన పెట్టుకుని ఇంటికి వచ్చేవాడు. కాని సంవత్సరం తిరగకముందేరాయప్ప గొప్ప చిక్కుల్లో పడ్డాడు. అతని పాదం దగ్గర చిన్న బొబ్బతేలి పగిలిపోయింది. ఆ పుండు మామూలు సమయంలో ఏమీ అనిపించకపోయినా నీళ్ళల్లోకలసిపోయేది. అసలు విషయం అర్ధం ల్కని రాయప్ప ఓ రోజు అర్ధగంటసేపు నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకుని కూర్చునే ఉన్నప్పటికీ చీకిన ముల్లులా తెల్లగా పుండులో ఏదో కనబడింది.
దాన్ని పట్టుకుని బయటకు లాగితే ట్విన్ దారం మండంలో బ్యతకి వచ్చింది. ఒపికిగా అలా లాగుతూనే ఉంటే, ఆ దారం లాంటిది అలా వస్తూనే ఉంది. చివరకి దాదాపు మూడు అడుగుల పురుగు బయటపడింది.
ఇలాంటి పరిస్థితి రాయలసీమలో నివసించే చాలా మందికి అనుభవమే మనదేశంలో పంజాబ్, రాజస్థాన్, బొంబాయి, మద్రాసుకు సంబంధించిన కొన్ని ప్రాతంల్లోనూకొందరిలో ఇటువంటి కురుపులు కనబడతాయి. ఈ కురుపునే "నరు కురుపులు" అంటారు. ఈ నారు కురుపు ముఖ్యంగాపాదాలమీదమోకాళ్ళమీదే వస్తుంటుంది. ఈ కురుపు రావడానికి "గినీ వారం" క్రిమి కారణం ఈ క్రిములు వుండటానికి కారణం, నరుకురుపులు వున్న వ్యక్తులు ఆ నీళ్ళాల్లోదిగడమే. నరు కురుపు వున్న వ్యక్తులు దిగిన దిగుడు బావులు, చెరువుల్లోని నీళ్ళు ఇంకొకరు త్రాగడంతో వారిలోకి ఈ క్రిములు ప్రవేశించి వారికీ కూడా ఈ వ్యాధి వస్తుంది.
మనిషికి నారు కురుపు రావడంగాని, నరుకురుపునాకు సంభందించిన నరుకురుపు వున్న వ్యక్తి దిగుడు బ్విలోకి గాని, చెరువులోకిగాని దిగగానే ఆ కురుపు లోనుంచి తెల్లటి పదార్ధం వెలువడుతుంది.ఆ వెలువడిన పదార్ధం ఇంకేమి కాదు_ గినీవారం క్రిములే. ఇలా వెలువడిన క్రిములు వెంటనే ఇంకొకరికి వ్యాధిని కలిగించలేవు. చెరువులోను నూతులలోను "సైకోలాఫ్స్ " అనే సూక్ష్మక్రిములు నారు కురుపు నుంచి వెలువడిన క్రిములను మింగివేస్తాయి.
ఇలా సైకోలాఫ్స్ కడుపులోకి ప్రవేశించిన నరుకురుపు క్రిములు వారం_ పదిరోజుల్లో రకరకాల మార్పులు చెందుటాయి. దిగుడు బావులు, చెరువుల్లోని నీరు త్రాగినప్పుడుఆ నీటితోపాటుసూక్ష్మక్రిములైన సైకోలాఫ్స్ మన జీర్ణకోశంలో చేరతాయి. మన జీర్ణకోశంలో ఉన్న ఆమ్లాల వల్ల సైకోలాఫ్స్ నశించిపోయివీటి పావుత్తల్లో నుంచి నరుకురుపులకు సంబంధించిన క్రిములు సురక్షితంగాబయటపడత్యి. ఈ క్రిములు జీర్ణకోశం పేగులను చేధించుకుని కడుపు వెనుక భాగంలోకి చేరతాయి. అక్కడ అవి పెరుగుటాయి. వీటిల్లో అడవి కొన్ని, మగవి కొన్ని ఉంటాయి.
ఆరు నెలలు పెరిగిన తరువాత మగపురుగుఅడపురుగుతో సంయోగంచెంది మరణిస్తుంది. అడపురుగు మాత్రం మరో నాలుగైదు నెలలకు, శరీరానికి తరచూ నీళ్ళు తగిలే ప్రదేశానికి పయనిస్తుంది.అలా ఎక్కువ నీళ్ళు తగిలేని కల్లు పాదాలే కానుక అక్కడకి చేరి ఆ పురుగు ముందు తన తల ఉన్న భాగంలో ఒక రకమైనా విషపదార్ధాన్ని విడుదులచేసి పుండుపడేలా చేస్తుంది. తలకు కాస్త దిగువ భ్గంలో ఈ క్రిమికి సంభందించిన గర్భాశయం కూడా ఉంటుంది. అందుకుని నీళ్ళల్లో కాలు పేట్టినప్పుడు పుండు భాగంలో నుంచి గర్భాశయం బయటకి ఉబ్బుకుని వచ్చి అందులో వున్న సూక్ష్మక్రిములను విడుదుల చేస్తుంది. ఇలా ఈ వ్యాధి సంక్రమించడం జరుగుటుంది.
విచిత్రం ఏమిటంటే నారు కురుపునకు సంభందించిన పురుగులు మన శరీరంలో ఎదుగుతున్నా ఎటువంటి బాధా అనిపించదు కేవలం అది కురుపుగా తయారయ్యే సమయంలోనే కాస్త వాచీ నొప్పి అనిపిస్తుంది. కొన్ని క్రిములు చర్మంపైదాకా రాకుండానే నశించి పోతూవుంటాయి. మరికొన్ని చర్మం క్రిందికి వచ్చికూడా కురుపును ఏర్పరచలేక చనిపోతాయి. అటువంటప్పుడు చర్మం కింద ముట్టుకుంటే ఈ పురుగులు ఒక తాడులా అనిపిస్తాయి. కొందరిలో ఈ నరు కురుపు వల్ల ఒంటిమీద ఎలర్జీలాగా దద్దుర్లు వస్తుంటాయి.
నారుకురుపు ఏర్పడిన ఐదారు వరాలలో అది మణిపోతుంది. కొందరిలో అది చీముపట్టి ఇబ్బంది కలిగిస్తుంది. నరుకురుపు ఏర్పడినప్పుడు అందులోంచి ఆ పురుగు తల పట్టుకుని జాగ్రత్తగా బయటకి లాగివెయగలిగితే ఆ పుండు త్వరగా మ్నుతుమ్ది. దీనితోపటు యాంటిబయటిక్స్ మందులు వాడి, సరైన డ్రస్సింగ్ చేస్తే త్వరగా పుండు మనుటుంది. నరు కురుపు ఏర్పడుతుందని అనుమానం ఉన్నవరు ఆ పుండు ఉన్నవ్రు ర్గే నీటిలోకి దిగకుండాఉండటం అవసరం. అంటే కాకుండా త్రాగే నీటిని కాచుకుని త్రాగడం మంచిది గొట్టపు భావులు రక్షిత నీటి సరఫరా ఉన్నచోట్ల నరు కురుపు రావటానికి అవకాశం లేదు. ఊరంతటికిఒకే దుగుడు బావి లేదా ఒకే చెరువు ఉండిఅందరూ అందులో దిగుతూఉంటే, అవే నీళ్ళు త్గుతూ వుంటే కురుపులు రాకతప్పవు.
****
