Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 26

     

                                            -: చతురహస్త లక్షణము :-

   శ్లో!!    తర్జన్యాద్యాసమీకృత్య, కనిష్టాంచ సమున్నయేత్ !
    చతుర్కోనామికామూలే, తత్కోంష్టం నివేశయేత్ !
    మిశ్రజాతిః శ్చిత్రవర్ణః, కశ్యపాజ్జనిరీశ్వరః !
    ఖగేశ్వరో వాలఖిల్యఋషిః కృత్యం నిగధ్యతే !

    తర్జని మొదలు మూడువ్రేళ్ళను, కలిపి పట్టి  కనిష్ణికను  ఎడముగ చేసి బొటనవ్రేలు అనామిక మొదటచేర్చిన, చతురహస్తమగును. ఇది మిశ్రజాతి, చిత్రవర్ణము, కశ్యపుని వల్ల పుట్టినది. అధిదేవత  గరుత్మంతుడు, ఋషి వాలఖీల్యుడు.

    వినియోగములు :-

    నుదురు, చెక్కిలి, చిన్నపిల్ల, నేర్పరితనము, చూపు, (దృక్), అద్దము, నెయ్యి, నీలము మొదలగు రంగులు, రత్నములు, తేనె, నూనె, కస్తూరి, బురద, పంచదార, పదునారేండ్ల స్త్రీం ముఖము, చెవికమ్మ, మర్మము గల మాటలు, కొంచెమను అర్ధము, బంగారము, ఇంద్రనీలమణి  వీనియందు ఈ హస్తము వినియోగించును.        

                              -: అల పల్లవహస్త లక్షణము :-

   శ్లో!!     కనిష్టాద్యాః క్రమాద్వృత్తా విరాళాశ్ఛాల పల్లవే,
    ఋషిర్వసంతో  గంధర్వజాతి ర్విష్ణోర్జనీరవిః
    ఈశో వర్ణోమేచకశ్ఛ. వినియోగోనికధ్యతే !!

    చిటికెనవ్రేళ్ళు  మొదలగు  వ్రేళ్ళన్నియు, ఎడమెడముగా  వుంచి వర్తులముగా  పట్టిన, అలపల్లవహస్తము వచ్చును. వసంతుడు ఋషి, గంధర్వజాతి, దైవము సూర్యుడు. విష్ణువు నుండి పుట్టినది. శ్యామల వర్ణము.

    వినియోగములు :-
   
    వస్త్రము, సొమ్ములు, మాధుర్యము, వెన్న, శిరస్సు, వికసించిన కమలము, సాధువాక్యము, దుర్గ(పార్వతి) అందము, మేడ, పట్టణము, విరహము, తాళఫలము, కిరీటము, వృక్షము, ధనము, స్తసములు, జడ,(కొప్పు), ప్రాంతనృత్యము, చాళీయనాట్యము, సూర్యకాంతమణి  వీనియందు ఈ అలపల్లహస్తము వినియోగించునని  భరతాదుల అభిమతములు.
   
                            -: హంసాశ్యహస్త లక్షణము :-

   శ్లో!!    అంగుష్ట తర్జనీ శ్లేషాది  తరేషాంప్రసారణాత్
    విరాళానాం కుంచిఠానా మీషద్ధం సముఖోభవేత్ !
    ఋషిశ్శుకఃపితాశూలీ వర్ణ శ్వేత్కోధిదేవతా.
    బ్రహ్మ బ్రాహ్మణజాతశ్చ వినియోగ్కోస్యకధ్యతే !!

    బొటనవ్రేలు చూపుడువ్రేలు  కూర్చి బట్టి మిగిలినవ్రేళ్ళు కొంచెము యెడముగా వంచి చాచి పట్టిన హంసాశ్య హస్తమగును. (బొటనవ్రేలు, చూపుడువ్రేలు, మధ్యవ్రేళ్ళు సమాయోగము హంసాశ్యమని  గ్రంధాంతరముల కగుపడుచున్నవి, ఆపాఠములు కూమ లోకప్రసిద్ధములుగానున్నవి.) శుకుడు ఋషి, శివునివల్ల పుట్టినది. వర్ణము తెలుపు. బ్రహ్మ అధిదేవత. బ్రాహ్మణ జాతి.

    వినియోగములు :-

    అదియేనేను అనుభావము, శోధించుట, మాలిక ధరించుట, గీతలు, లేదను అర్ధము, ఒరిపిడి, చిత్రలేఖనము ,సంగీతము  లాస్యము, కాటుక, అలచందధాన్యము, సత్యము,చేయుట, అర్ధము చెప్పుట లక్ష్యము, నఖము, నఖక్షతము, చిరునవ్వు, దంతక్షతము, విషము, ముత్యము జలఖిందువు, నల్లి, దోమ, చలి, ఈగ, నూగారు, తుమ్ములు, క్షణకము, త్రాసు, జందెము, గగుర్పాటు, సన్నని వస్తువు, గొడుగు, కదులుట, అరవిరిమొగ్గ, వేదిక, భస్మము, సంస్కారముం నిర్జనస్థలము, కొంచెమను అర్ధము, గురిగింజ, ఆకారము, వేషము, వంగుట, తీగె, వెండి, గుళిక, వీనియందు ఈహస్తము వినియోగించును.

                             -: భ్రమరహస్త లక్షణము :-

   శ్లో!!    మధ్యమానామికేశ్లిష్ట్కేశ్రితేపాణితలేయది.
    శేషాఃప్రసారితాః ప్రోక్తో భ్రమరో భరతాగమే.
    అంగుష్ట మధ్యమేశిష్టే తర్జని కుంచితేతరే
    విరళే ప్రశృతే  యత్రకధ్యతే భ్రమరః కరః !!
    కశ్యపోజనకోవర్ణోఅశిత ఈశోఖగేశ్వరః !!
    ఋషిశ్చ కపిలాచార్యో వినియోగ్కోస్యకధ్యతే !!

    మధ్యమానామికలు  అరచేతివరకు వంచి మిగిలిన వ్రేళ్ళు చాచిపట్టిన భ్రమరహస్తమగునని  భరతసమ్మతము, మరియు నడిమివ్రేలు  బొటనవ్రేలు  కలిపి చూపుడువ్రేలు  ముడిచి తక్కినవ్రేళ్ళు  ఎడముగా చాచిపట్టిన భ్రమరహస్తమగును. ఇది కశ్యపుని  వల్లపుట్టినది. వర్ణము నలుపు, గరుత్మంతుడు అధిదేవత. ఋషీ  కపిలాచార్యుడు. (ఇందు జాతి నిశ్చయము లేదు. గ్రంధాంతరములో గంధర్వ జాతి.)


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS