ఫిజో మీదికి రెండు వందల కిలోల బరువు విసురుగా విసిరేసినట్లు అనిపించింది. అతడు తూలి పడిపోయినాడు. తిరిగి తన మీదికి వస్తున్న మానవాకృతి భీకరంగా కన్పించింది. ఆ ఆకారాన్ని చూచి ఫిజోకి మతిపోయినంత పని అయింది.
మిను మిక్కిలి దృఢంగా ఉన్న ఆ శరీరం రోమాలతో నిండిపోయి వుంది. కాళ్ళు చేతులు కండలు తిరిగిపోయి వున్నాయి. వక్షస్థలం అత్యంత విశాలంగా ఉంది నుదురు ఎత్తుగా విశాలంగా ఉంది. ముక్కుపుటాలు నొక్కుకుపోయి వున్నాయి.
కనుబొమ్మలు ఒత్తుగా పెరిగి ఉన్నాయి. కళ్ళు చింత నిప్పుల్లాగ మండుతున్నాయి. అతడు తనవిరోధిగా భావించిన తనవంటి మరొక ప్రాణివంక విచిత్రంగా చూస్తున్నాడు.
తన మీద అంతటి బలాన్ని ప్రయోగించి దూరంగా విసరిన ఆ ప్రాణి మృగం కాదని మనిషేనని గ్రహించేందుకు రెండు నిమిషాలు పట్టింది ఫిజోకి. ఆ మనిషి నాగరిక ప్రపంచపు వాసనలు తెలియని వాడని తెలుస్తూనే ఉంది.
శరీరంమీద నామమాత్రపు ఆచ్చాదనలు మాత్రమే ఉన్నాయి. అవివున్నా తొలగిపోయినా అతడంతగా పట్టించుకునేలా అనిపించలేదు. తనను నిరోధిగా ఎందుకు భావించాడో అర్ధం కాలేదు. పరిస్థితిని అర్ధం చేసుకునేలోపుగానే అర్ధ మానవుడు మరొకమారు విసురుగా ఫిజోమీద దాడిచేశాడు. రెండు చేతులమీద ఎత్తి అతడిని దూరంగా విసిరివేశాడు. తల మీది చర్మం చిట్లిపోయి రక్తం కారసాగింది. శరీరం బాధతో మొద్దుబారినట్లు అనిపించింది. కళ్ళు తిరిగి ప్రపంచమంతా తల క్రిందులయినట్లు అన్పించింది.
పరిస్థితిని అర్ధం చేసుకునేలోపుగానే తనకు తుదిఘడియలు సమీపిస్తాయని అనుమానించాడు ఫిజో ఆత్మరక్షణకు మార్గాంతం మేమిటో అతనికి రవంత అయినా అర్ధంకాలేదు. చీకటిలో మాలతిని ఎత్తుకుపోతూ తనకుకన్పించిన ఆకృతియిదే నని పోల్చుకున్నాడు.
అతని బలాన్ని ఊహిస్తే గుండె దిగజారిపోతోంది. ఈ రాక్షస బలం కలిగిన అనాగరికత ప్రాణి చేతికి చిక్కిపోయిన కెప్టెన్ మాలతి ఏమయివుంటుంది? అనుకోగానే అతని మనసమతా చీకటినిండిపోయింది. ఈరాకాసిమనిషి కెప్టెన్ మాలతిని చంపి సునాయాసంగా తినేసి ఉంటాడు. ఒకసారి మనిషి మాంసం రుచిమరిగినవాడు కావటంనించి తిరిగి అదే ప్రయత్నం ప్రారంభించాడు.
ఇంత బలశాలి అయిన ఇతని బారినుండి తప్పుకోవటం ఎలా? ఫిజో శక్తినంతటిని కూడదీసుకుని పరుగెత్తటం ప్ర్రారంభించాడు. ఎదుటఎత్తుగా పైకిపోయిన కొండచరియ. అతి ప్రయాసతో ప్రాణాలకు తెగించి ఆ పైకి పాకటం ప్ర్రారంభించాడు. ఆవిచిత్ర మానవుడు అతని ప్రయత్నాలు చూస్తూ కాసేపు ఊరకుండిపోయినాడు.
ఫిజోచేస్తున్న ప్రయత్నాలు అతనికి అల్పాతిఅల్పంగా ఆటకాయితనంగా అన్పించాయి. అదే చోటున అతనికన్నా పదిరెట్లు వేగంగా తాను ప్రయాణం చేయగలడు. అతని కన్నా వంద మీటర్ల ఎత్తున ఉన్న కొండ చరియను సునాయాసంగా ఎక్కేయగలడు.
అటువంటి స్థితిలో అతడు దానిని ఎక్కేందుకు పారిపోయేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావటం అతనికి క్రీడా వినోదంగా కన్పిస్తున్నాయి.
అలా కొంతసేపు ఫిజో విఫల ప్రయత్నాలను చూచి ఆ పైన అడుగు కదిల్చాడు ప్రిమెటివ్ మాన్. కేవలం రెండు నిమిషాల్లో అతనిని చేరుకొని చాల తేలికగా చేతులమీదికి ఎత్తేశాడు. చేతులమీదనే గిరగిరా త్రిప్పేసి విసిరి లోయలోకి విసిరికొట్టాడు.
లోయలోపరుచుకు పోయిన బలమయిన బండరాళ్ళు న్నాయి. వాటిమధ్య పడితే ఫిజోశరీరం తుంపులుగా మారిపో అతని తల ప్రయ్యలు అవుతుంది. మరింక శరీరంలో మిగిలేది ఏమీ ఉండదు.
ఫిజో శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్న జీవుడు విముక్తుడై ఊర్ధ్వ లోకాలకు వెళ్ళి ఉండవలసిందే:
కాని అతడువిసురుగా వచ్చి రెండు వృక్ష శాఖలమధ్య బొమ్మలా యిరుక్కుపోయినాడు చెట్టుకొమ్మలు రాసుకుని శరీరం అక్కడక్కడ చీరుకు పోయింది.
ఆ విచిత్ర అనాగరికమానవుని శారీరకమయిన శక్తి ఎంతటిదో ఫిజోకి బాగా అర్ధమయింది. అంతటిశక్తి కలిగిన అతనినిముఖాముఖి ఎదర్చగలటం నిస్సందేహంగా అసాధ్యమే అని తెలిసిపోయింది.
కాని అదృష్ట వశాత్తూ ఆ వృక్షాలు రెండులోయ అంచులకున్న రాతిపలకల మధ్యనించి పుట్టుకొచ్చాయి. వాటికాండాలు నెర్రల మధ్య ఊగులాడు తున్నాయి తాను వృక్షాల మధ్యకాక ఊయలమీద ఉన్నట్లుగా అనిపించింది ఫిజోకి.
అంతేకాక అతడు పడిపోయిన చోటుని గుర్తించటానికి పొదల మధ్య వెదుకుతున్నాడు అర్ధమానవుడు. అందునించి ఆలోచించి కర్తవ్యాన్ని నిర్ణయించుకునేందుకు రవ్వంత సమయంకూడా దొరికింది.
ఫిజో ప్రాణరక్షణకోసం మార్గాలను ఆలోచించసాగాడు. అతడిని ఎదిర్చి గెలవటం అసాధ్యం. అలాగే అతడి నించిపారిపోవాలని ప్రయత్నించటం కూడా వృధా అనిపించింది ఫిజోకి.
ఎదురునిలిచి పోరాడలేక, పారిపోలేక చేయగలిగింది మరేమిటి; అర్ధమానవుడి చేతులలో దిక్కుమాలిన చావు చావ వలసిందేనా? ఫిజో ఆలోచించసాగాడు.
మొదలే రాతిపలకల మధ్య కనీసపు పట్టు ఆధారంగా వున్నాయేమో వృక్షకాండాలు ఫెళఫెళమంటూ పెకలించుకు వస్తున్నాయి. వృక్షశాఖలమీద బరువు అధికం కావటంతో అవి విరిగిపడేందుకు సన్నద్దమవుతున్నాయి. వ్రేళ్ళు తెగుతున్నాయి.
మరొక నిమిషంలో అవి తెగిపోతాయి. చెట్టుకొమ్మల మధ్య ఉండిపోయిన తాను వాటితో పాటుగా లోయలోకి కూలిపోతాడు. కొమ్మలమీద ఉన్నాడు కాబట్టి అదృష్టమనేది ఉంటే బ్రతికే అవకాశాలున్నాయి.
కాని పెద్ద శబ్దంతో వృక్షాలు కూలిపోతూవుంటే ఆ దృశ్యాన్ని గమనించకుండా ఉంటాడా అర్ధమానవుడు. కనిపెట్టిన మరుక్షణం తనమీదికి దాడిచేయకుండా ఉంటాడా? ఈసారి రెండు విధాలుగా మృత్యువు దగ్గర అవుతోందని గుర్తించాడు ఫిజో:
