Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 26

 

    "నేను పోటీ చేయటం లేదన్నయ్యా!" అన్నాడు సర్వోత్తమరావు"

    "నువ్వు చేస్తావని కాదు, ఏదో ముందు జాగ్రత్తగా చెపుతున్నాను. ఆ కరణం కూడా నత్తజిత్తులవాడు, వాడిని ఓ కంట కనిపెట్టి వుండు. వాడి మాటలు పూర్తిగా నమ్మకు." అన్నాడు రామశేషు.

    "నీది ఉత్త చాదస్తం అన్నయ్యా! పాపం కరణం అలాంటివాడు కాడు. వాడు మన మనిషే. ప్రెసిడెంటు మనిషి కాదు" అన్నాడు సర్వోత్తమరావు ధీమాగా.

    "అదే వద్దంటుంది, ఆ నమ్మకమే వద్దు....ఎవర్ని గుడ్డిగా నమ్మకు చివరికి నన్ను, నీ తమ్ముళ్ళను కూడా, నువ్వు ఉత్త అమాయకుడివి" అన్నాడు రామశేషు.

    సర్వోత్తమరావు అన్నగారి మాటలకి నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు.

    "ఏమండీ! ఇదిగో తాంబూలం వేసుకుంటారా?' అంటూ కస్తూరి అందించింది.

    "ఎందుకులేవే ఇప్పుడు" అన్నాడు సర్వోత్తమరావు .

    "తీసుకోండి, పెళ్ళికి తెచ్చిన తమలపాకులు ఇంకా మిగిలాయి అందుకే ఇస్తున్నాను" అంది కస్తూరి నవ్వుతూ.

    "ఏమ్మా కస్తూరి! పాపం సొంతకుతురిలా భావించి నువ్వూ మావాడు మా అమ్మాయి పెళ్ళి ఎంత శ్రమపడి చేశారు. చాలా కృతజ్ఞాతలమ్మా!" అన్నాడు రామశేషు.

    "అయ్యో! అదేంటి బావగారూ ! అలా మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడూ గిరిజవేరు, జయంతి వేరు అని అనుకోలేదు. మనింట్లో ఏ శుభకార్యం జరిగినా అందరూ భాద్యత తీసుకుంటారు" అంది కస్తూరి.

    "చాలా సంతోషం తల్లీ! మన కుటుంబం ఎల్లకాలం ఇలాగే ఉండాలి" అన్నాడు రామశేషు.

    "ఉంటుంది బావగారూ! మీరెందుకు అనవసరంగా ఆలోచిస్తున్నారు" అంది కస్తూరి నవ్వుతూ.

    "నరుడి చూపుకి నాపరాయయినా పగులుతుందంటారు తల్లీ! మన జాగ్రత్తలో మనం వుండాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి" అన్నాడు రామశేషు.

    "పిన్ని! అత్తయ్య పిలుస్తోంది" అంటూ వచ్చింది గిరిజ చెల్లెలు వనజ.

    "వస్తున్నా" అంటూ లోపలికి వెళ్ళింది కస్తూరి.
                                             *    *    *    *

    అయ్యగారికి ఇన్నాళ్ళకు గుర్తోచ్చామా?" అంది బుంగమూతి పెట్టి వరాలు.

    "అలా అనకే. నీకు తెలియందేముంది? పెళ్ళి పనుల్లో పడి ఈ నెల రోజులు ఉపిరి సలుపుకోలేదంటే నమ్ము" అన్నాడు

    "సొంత కుతురికంటే ఎక్కువ శ్రమపదినట్లున్నావ్. నా దగ్గరికి వారంలో రెండు సార్లయినా వచ్చేవారు. నెల రోజులనించి నా ముఖం చూడలేదంటే నా అందం తగ్గిందా? మీకు వయసైపోయిందా? అనే అనుమానం కల్గుతుంది" అంది వరాలు.

    "రెండూ కాదు, నీ అందం రోజురోజుకి రెట్టింపవుతుంది. నాకు మాత్రం నీ దగ్గరకు రావాలని వుండదా? ప్రతిరోజూ గుర్తొస్తావు కానీ ఏమి చేయను చెప్పు, పనుల వత్తిడి" అన్నాడు.

    "అబ్బో, అన్నీ గాలికబుర్లు....నామీద మోజు తిరిపోయి వుంటుంది ఇంకే టక్కుటమారి వల్లోనో చిక్కి వుంటావు" అంది వరాలు పైట జారుస్తూ.

    "అబ్బా వరాలు! మాటల్తో చంపకే, ఏది గ్లాసు తీసుకురా" అంటూ జేబులో నుంచి బ్రాందీ సీసా తీశాడు.

    "నాకు లేచే ఓపిక లేదు, నువ్వే వెళ్ళి తెచ్చుకో!" అంది వారలు కోపంగా.

    "నీ పంతం నీదేగానీ నా వైపు నుంచి ఆలోచించవుకదా!" అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి ఓ గ్లాసు తెచ్చుకుని టేబుల్ మిద పెట్టాడు బ్రాందీ సీసా తీసి కాస్త గ్లాసులో వంపుకుని నీళ్ళు కలుపుకుని రెండు గుక్కలు తాగాడు.

    "అబ్బా నెల రోజులైందే వరాలు! నరాలు జివ్వుమని లాగుతున్నాయి" అన్నాడు.

    "మందు కోసమా? నా కోసమా? అంది గారంగా.

    "రెంటి కోసం....మందుకి, నీకు అవినాభావ సంబంధం వుందే, మందు లేకుండా నీ దగ్గరకు రాలేను, నిన్ను చూశాక మందు కొట్టకుండా క్షణం వుండలేను" అన్నాడు మరో రెండు గుక్కలు తాగి.

    "అన్నీ గాలికబుర్లే. నిజంగా నా మీద ప్రేమ వుంటే కూతురి పెళ్ళి అంత ఘనంగా చేశారట కదా.....మరి ఆ పెళ్ళి సందర్భంగా నాకేదయినా బహుమానం తెచ్చేవారేగా" అంది బుంగమూతి పెట్టి వరాలు.

    "ఓసోస్ అదా నీ అలకకు కారణం" అంటూ జేబులో చేయి పెట్టాడు, వరాలు ఆశగా చూస్తోంది.

    ప్యాంటు జేబులోనుంచి అగ్గిపెట్టె తీసి, పై జేబులో వున్న సిగిరెట్ ప్యాకెట్ తీసి ఓ సిగిరెట్ నోట్లో పెట్టుకుని అగ్గిపెట్టె తీసి వెలిగించాడు. గట్టిగా రెండు దమ్ములు లాగాడు. అగ్గిపెట్టె కోసం జేబులో చెయ్యి పెట్టాడని చూసి మళ్ళి మూతి ముడుచుకు కూర్చుంది వరాలు.

    "అబ్బ! కోపంలో నువ్వెంత అందంగా వుంటావ్" అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఆమె భుజం పైన చేయి వేశాడు.   

   ఆ చేతిని విసిరికొట్టింది.

    "తస్సాదియ్యా నీ పంతం నీదే గానీ నా మాట వినిపించుకోవుకదా. నీకు బహుమానం కావాలి అంతేగా. మరి నాకేమిస్తావ్?' అంటూ ఆమెను చూశాడు.

    "ముందు మీ మాట నిలబెట్టుకోండి....తరువాత నా మాట నిలబెట్టుకుంటాను" అంది నవ్వుతూ వరాలు!

    "సరే" అంటూ కుడిచేతి ప్యాంట్ జేబులో చేయి పెట్టాడు. వరాలు ఆశగా చూసింది. ఇదేమి గమనించకుండానే అతను జేబులో చేయి పెట్టి నెక్లెస్ తీశాడు. దాన్ని చూడగానే ఆమె కళ్ళు తళుక్కున మెరిశాయి.

    "చూడవే, నీ మీద ప్రేమ లేదన్నవుగా, చూడు ఏం తెచ్చానో" అన్నాడు.

    "నా బంగారు మావ....నీ మనసు నాకు తెలిదెంటి!" అంటూ టక్కున తీసుకుని అద్దం ముందు నిలబడి అలంకరించుకుంది. తృప్తిగా అద్దంలో చూసుకుని "ఎలా వుంది?" అంది ఆతని దగ్గరకు వచ్చి.

    "రంభలగున్నావే" అంటూ ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు వరాలు కిలకిలా నవ్వింది.

    "అగు, నీకు మందు అయిపోయింది. గ్లాసులో పోసి ఇస్తా అంటూ గ్లాసులో కాస్త వంపి నీళ్ళు కలిపింది.

    "ఆమ్లెట్ వేసుకుని వస్తాను. రెండు నిమిషాల్లో ఈలోపు సిగిరెట్ కాల్చుకో మావా" అంటూ లోపలికి పోబోయింది.

    "ఉండవే, ఎదురుగా నువ్వుంటే ఇంకా నాకు ఆమ్లెట్ ఎందుకు కోడికూర కూడా నీ కళ్ళముందు బలాదూర్. అలా నిన్ను చూస్తూ ఉంటే చాలు....నిన్ను నంజుకుంటూ బాటిల్ మొత్తం ఖా...ళీ....చేస్తా అన్నాడు ముద్దుగా మాటలు తడబడుతూ.

    "అబ్బో, కాదులే మీ ఆవిడకంటే బావుంటానా?' అంది వరాలు.

    "ఛస్....భార్య పేరు ఎత్తొద్దు అని నీకు లక్షసార్లు చెప్పను, అది దేవత" అన్నాడు.

    "అబ్బో మరి నేను దేయ్యన్నా?" అంది కోపంగా.

    "అని నేను అన్లేదే" అన్నాడు సీరియస్ గా.

    "సర్లే ఇంకెప్పుడూ అనన్లె. భోజనం తయారుచేయని నన్ను. చాల రోజుల తరువాత వచ్చారు ఆకలితో పంపటం నాకిష్టం లేదు" అంటూ లేవబోయింది.

    సిగరెట్ ఆఖరి దమ్ము లాగి యాష్ ట్రే లో కుక్కి.

    "చూడు వరాలూ! నేను అమ్లేట్ల కోసం, నీ భోజనం కోసం రాలేదు. నేను వచ్చేది....నాకు కావలసింది...నువ్వు ఇవ్వవలసింది వేరే వుంది అని ఆమెను గట్టిగా వాటేసుకుని మంచంపైన వాలిపోయాడు సో....మ...సుం...ద...రం...సర్వోత్తమరావు చిన్న తమ్ముడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS