Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 25


    అమ్మమ్మగారు అంగీకరించేసరికి స్వప్న ఆనందానికి హద్దులేకపోయింది. విచారమంతా మరిచిపోయి ఆనందంతో పొంగిపోయింది అమ్మమ్మగారి మెడ వాటేసుకుంది.
    "ఓయస్! ఒక్కటికాదు! వంద తీసుకో అంది.
    "నువ్వు అక్కడ ఎవరింటికి వెళ్ళకూడదు మన పొలాలు చూసి, తోట చూసి ఆ రాత్రి మన తోటలోని బంగళాలోకి వచ్చెయ్యాలి అంతే!"
    "సరే!"
    "ప్రామిస్"
    "ప్రామిస్! అమ్మమ్మ! ఫోన్ చేసి వస్తాను పరిగెత్తింది స్వప్న.
    అలాగే చూస్తూవుండిపోయిందమ్మమ్మగారు.
    
                                                                      17
    
    స్వప్న స్నేహితురాండ్రు కలసి పిక్నిక్ కి వెళ్ళారు.
    స్వప్న వెళ్ళేక అమ్మమ్మగారు ఆలోచనలో పడ్తారు. ఆమెకి స్వప్న గురించే ఆలోచనలు వస్తున్నాయి.
    "అక్కడికి వెళ్ళేక ఎవరేం చెపుతారో! దాని మనసు మార్చేస్తారేమో! తన గురించి కానివన్నీ చెపుతారేమో! ఆసుందరి అసాధ్యురాలు. ఎవరేం చేయబోయినా యిట్టే పసిగట్టేస్తుంది. ఎంత జాణ కాకపోతే శివకాముడిని తనకాలికి కట్టేసుకుంటుంది. వాడు దానికి బానిసైపోయాడు. ఆఖరికి ప్రాణం తీసుకున్నాడు. పిల్లల్ని అనాధల్ని చేసిపోయాడు. అయినా ఆస్తంతా హరించుకపోయి బ్రతకటానికి అతికష్టంగా వున్న ఈరోజుల్లో కూడా దానిటెక్కు తగ్గినట్టు లేదు.
    తన మనవరాలి మనసుని మార్చేస్తుందేమో "ఊహూ ఁ అలా జరగదు. జరిగేందుకు వీల్లేదుకూడా!
    స్వప్న తన మాట జవదాటదు. ఎక్కడికి వెళ్ళదు. ఎవరినీ కలవదు."
    ఆ ఆలోచన వచ్చాక ఆమె మనసు కొద్దిగా శాంతించింది.
    అంతలో ఆమె ఆలోచలనలని భంగం చేస్తూ ఫోన్ మోగింది. చూస్తున్నాపేపరు పక్కన పెట్టేసి, ఫోన్ అందుకుని "హలో" అంది.
    "నమస్కారం అమ్మమ్మగారూ" స్వప్న అమ్మమ్మగారూ అని పిలవటం మన అందరికీ ఆమె అమ్మమ్మ గారే అయింది. ఫోన్ చేసింది వాళ్ళ లాయర్ విశ్వేశ్వర,గారు.
    "హలో విస్సూ! ఏమిటి విశేషాలు?" అమ్మమ్మగారు కులాసాగా వుంటే కులాసాగా వుంటే కులాసాగా చెబుతారు. చికాగ్గావుంటే చిర్రుబుర్రు లాడతారు. దాదాపు తన మనవడి వయస్సు అతనంటే ఆమెకి ప్రేమ గౌరమట కూడాను. "అమ్మమ్మగారూ మీరు పంపించిన కుర్రాడు చాకండి. భలే కుర్రాడు. యెక్కడపట్టేరా? ఆమె గర్వంగా తలూపింది. వెంటనే గంభీరంగా మారిపోయింది. "విశ్వేశ్వరం. రవి ఫర్వాలేదు స్వయంగా మేనేజ్ చేసే శక్తి వుందా?"
    కుతూహలంగా ఆమె ప్రశ్నించేసైర్కి అమ్మమ్మగారూ రవి జెమ్. అతన్ని పి.ఏ.ని చేసి నా దేశ సమస్యలన్నీ క్షణంలో సాల్వ్ చేయగలం శక్తి సామర్ధ్యాలున్నాయ్. ఫరవాలేదు. యుకెన్ రియల్ హిమ్. ఏపని అప్పచెప్పినా సమర్ధవంతంగా చేయగలడు! అన్నాడు.
    "థాంక్స్" క్లుప్తంగా ఠీవిగా అంది అమ్మమ్మగారు.
    అవతల ఫోన్ పెట్టేశాడు విశ్వేశ్వరం. కృష్ణవేణమ్మగారు మనస్సు మళ్ళీ రవిపైకి వెళ్ళింది.
    వెంకట్రామయ్య నమ్మదగిన వ్యక్తి కాడు. విధిలేక ఎవర్నో నమ్మి వాళ్ళకి యీ ఆస్తిని తినే అవకాశం ఇచ్చేందుకంటే తమ వంశంకు దగ్గరబంధువు అయిన ఇతను అంతో యింతో తిన్నా ఫరవాలేదని చేరదీసింది. ఎకవుంట్స్ లో స్వాహా చేసేందుకు వీల్లేదు. ఓచార్లు సంపాదించే చోట మాత్రమే ఏదో తింటున్నట్టు గావుంది. అతనూ ముసలాడు కాబోతున్నాడు. తనకి వయస్సు వచ్చేసింది తను రాక్షసి. మనస్సుని రాయి చేసుకుని శరీరాన్ని రాయి చేసుకుంది. అందుకే డెబ్బయ్యేళ్ళ వయస్సులోనూ రాయిలా వుంది. అప్పుడప్పుడూ అలసటగా అనిపిస్తోన్నా తన ఆరోగ్యం బాగానే వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS