Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 25

 

    ఆ రోజు మధ్యాహ్నం బ్యాంకు దగ్గర కేనటిక్ హొండా ఆపింది. ఆ ఆంగ్లో- ఇండియన్ లేడి.

 


                                                               * * *


    "థాంక్యూ మేడమ్" అన్నాడు గరుడాచలం.


    "యా.....నైస్ జెంటిల్ మేన్" అంది గరుడాచలం బుగ్గమీద గిల్లుతూ ఆవిడ.


    మెలికలు తిరిగిపోయాడు ఆ వయసులో కూడా గరుడాచలం.


    "ఎంత హేండ్ సమ్ గా ఉన్నారు. ఆహా.....వాటే పెర్సనాల్టి. మీ వయసెంత వుంటుంది మ్యాన్. ఐ థింక్ ఫార్టి" అంది ఆవిడ.


    వెంటనే గొంతులో పచ్చి వెలక్కాయపడ్డ ఫీలింగ్ కలిగింది.


    "కాదు.....అరవై" అంటే నొచ్చుకుంటుందేమో.


    "వాట్ మ్యాన్ నిన్ను చూస్తుంటే నాకు మా అయన గుర్తొస్తున్నాడు" అంది.


    గరుడాచలం ఛాతి నాలుగైదు అంగుళాలు పెరిగిపోయింది.


    "మీవారు లేరా మేడమ్?" చాలా పోలయిట్ గా అడిగారు గరుడాచలం.


    "లేరు పోయారు"


    "పోయారా? ఎలా?"


    "ఓరోజు చికెన్ కర్రీ వండమన్నాను. నేను ఆలూకర్రినే వండుతానన్నాడు. నాకోపం వచ్చి అలారం పీస్ విసిరేసాను."


    "పాపం.....అది తగిలి చనిపోయారా?"


    "ఉహూ..... ఆ అలారం పీస్ కిందపడి అద్దం పగిలిపోయింది. నేనెక్కడ తిడతానోనని భయపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. హూ....టెన్ ఇయర్స్ అయింది" అంది నిట్టూరుస్తూ.


    "అంత చిన్న కారణానికి ఇల్లు వదిలిపోయాడా? పూర్ ఫెలో" అనుకున్నాడు గరుడాచలం.


    ఆ క్షణమే అతనికి ఆంగ్లో- ఇండియన్ లేడి నచ్చింది.


    "ఓకె. బై....హ్యాండ్ సమ్ మ్యాన్" అంటూ అతని చేతిని నొక్కి వదిలింది అతడికి నరాలు జివ్వుమన్నాయి.


    ఆ క్షణమే 'ఎటో వెళ్ళిపోయింది మనసు" అని పాడాలని అనిపించింది. రోడ్డు మీద పాడితే జనాలు తనని పిచ్చివాడని అనుకుంటారని ఆగిపోయాడు.


    అలా మొదలైంది అతనిలో జివ్వుమనే ఫీలింగ్.


    
                                                        * * *


    మెల్లిగా పడగ్గదిలో వచ్చి అటు వైపు తిరిగి పడుకున్న భార్యను ఇటు వైపు తిప్పాడు గరుడాచలం.


    భార్యలో అతనికి ఆంగ్లో- ఇండియన్ లేడినే కనిపిస్తోంది.


    "కసిగా వుంది.....కసి కసిగా ఉంది" అని పాడాలని అనుకున్నాడు భార్య వైపు చూస్తూ గరుడాచలం.


    "ఏంటో.....పదిహేనేళ్ళ క్రితం రావాల్సిన ఫీలింగ్స్ ఇప్పుడొస్తున్నాయి అనుకున్నాడు. అయినా అతనికి ఇంకా జివ్వు......జివ్వుమనే నరాల ఫీలింగ్ పోలేదు.


    మెల్లగా భార్య భుజం మీద చేయేసాడు.


    సరిగ్గా అప్పుడే అతడి భార్యకు ఓ భయంకరమైన కలోచ్చింది. ఓ ఎలుగుబంటి తనని తరుముతున్నట్లు. తను అడవిలో పరుగెడుతూన్నట్లు, అది తనని గట్టిగా పట్టుకుని కౌగిలించుకుని.....


    
    కెవ్వున కేకేసి చేతుల్ని విదిల్చికొట్టింది. వెంటనే ఆ పరిణామం ఉహించలేదు. గరుడాచలం ఆమె విసురుకు మంచమ్మిద నుంచి కింద పడిపోయాడు ధబ్ మంటూ.


    
    "అమ్మా...." అంటూ నడుం పట్టుకున్నాడు.


    అతని భార్య లేచి భయంతో "ఎలుగుబంటి.....ఎలుగుబంటి" అని అరచి స్విచాన్ చేసింది.


    చుట్టూ చూస్తే ఎక్కడా ఎలుగుబంటి కనిపించలేదు గానీ నడుం పట్టుకున్న భర్త కనిపించాడు.


    "మీరెప్పుడు తగ్లబడ్డారు నా గదిలోకి "అడిగింది అనుమానంగా ఆవిడ.


    ఏదో చెప్పబోయి నడుం కలుక్కుమనడంతో "అబ్బా" అన్నాడు.


    సరిగ్గా అదే సమయంలో.....


    శ్రీచంద్ర జామ చెట్టు కింద హాయిగా నిద్రపోతున్నాడు. పెద్ద వెలుగు పరుచుకుంది ఆ ప్రదేశాన్ని.


    యమధర్మరాజు ప్రత్యక్షమై తన యమపాశాన్ని శ్రీచంద్ర విసిరాడు.


    మీసం మీద చెయ్యేసి పాశాన్ని వెనక్కి లాగాడు.


    పాశంతో పాటు శ్రీచంద్ర ప్రాణం రాలేదు. శ్రీచంద్ర హయిగా నిద్రపోతున్నాడు.


    
    యమధర్మరాజు కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. అతని కోపం చూసి ఆకాశం వణికిపోయింది. వరుణదేవుడు బిత్తరపోయాడు.


    యమధర్మరాజు మరోసారి తన చేతిలోని యమపాశాన్ని శ్రీచంద్ర పైకి విసిరాడు.


    శ్రీచంద్ర ఉలిక్కిపడి కొద్దిసేపు గిలగిల్లాడిపోయాడు. అంతలోనే సర్దుకుని అటు తిరిగి పడుకున్నాడు.


    యమపాశం యమధర్మరాజుని వెక్కిరిస్తూ తిరిగొచ్చేసింది.


    యమధర్మరాజు అక్కడి నుంచి మాయమయ్యాడు.

 

                                                        * * *


    "అవమానం....గోరావమానం....సకల చరాచర సృష్టిని నా యమపాశం చేత వణికింపజేయగల నేను ఈరోజు ఒక మానవుడి ప్రాణం హరించలేకపోయాను. హూ! ఎంతటి అవమానం? నా యమపాశం మహత్యమేమైనది? నా మయరాజసం ఏమైనది?" అటూ ఇటూ తిరుగుతూ వాపోతున్నాడు యమధర్మరాజు.


    "నారాయణ.....నారాయణ.....ఈ మాత్రానికే ఇంతటి పరుషమైన పదములేల సమవర్తి. అవేశమున అసలు వాస్తవమును గుర్తించకుంటివి?" అన్నాడు యమధర్మరాజుని శాంతపరుస్తూ నారదుడు.


    
    "అసలు వాస్తవమా? అది ఏమి?"


    "మీరు ఆ మానవుడి ప్రాణములను హరించ యత్నించిరి. అది బ్రహ్మరాత. అతని ఆయుష్షు తిరకున్నచో మీరెలా ప్రాణములు హరించేదరు?"


    "అనిన.....ప్రాణములు తీయు శక్తి ఈ యమపాశామునకు లేదా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS