Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 24

 

    "ఏంటి....." అంటూ విసురుగా వచ్చింది.


    "ఈ చోద్యం విన్నావా తల్లి. నేను టాంక్ బండ్ దగ్గర మొక్కజొన్న పొత్తులు అమ్మానట.....ఛ...ఛ.... తెలిసినవాళ్ళు ఎవరైనా చూసారో ఏమో...భలే చిత్రంగా వుంది కదూ" అన్నాడు కూతురితో త్రిలోకం.


    "అవునవును. మికిలాంటి దిక్కుమాలిన ఆలోచనలే వస్తాయి. అవి నా చావుకొస్తాయి" అంది కోపంగా.


    "అదేమిటమ్మా అంత మాటన్నావు?"


    "మరి లేకపోతే ఏంటి నాన్నా. ఆ మొక్కజొన్న పొత్తులు మా దగ్గరికి తెచ్చి అమ్ముతానన్నావు" ఇంకా కోపంగా అంది.


    "అయ్యయ్యో! అలా అన్నానా? పోనీలే? నీకే అమ్ముతానన్నాగా....పర్లేదు"


    "శ్రీచంద్ర కూడా అక్కడే వున్నాడు!"


    "వాడు ఉన్నాడా? పర్లేదులే మనవాడేగా...."


    "వాడి ఫ్రెండ్ పోట్టిలాగు సత్తిపండు కూడా ఉన్నాడు" త్రిలోకం బుర్ర తిరిగిపోయింది.


    ఈలోగా త్రిలోకం భార్య భువన పూజ గదిలోంచి వచ్చింది.


    ఒక్కసారిగా ఫినాయిల్ వాసన గుప్పుమని కంపుకొట్టినట్టు అనిపించింది.


    "హేమండి....." ఆనందంగా అంది మొగుడి వంక చూస్తూ.


    త్రిలోకం మనసేదో కీడు శంకించింది.


    "ఏంటి.....అంతిదిగా.....అంత ఎమోషనల్ గా అరిచావ్. ఏమైనా విశేషమా?"


    "అవునండి. మీరెక్కడ ఇవ్వాళ నాకు చిక్కకుండా పోతారేమోనని బెంగపడ్డాను. ఆ దేవుడు వున్నాడండి. నా పాతివ్రత్య ప్రభావం పన్జేస్తుందండి" అంది బేసిన్ తో అతని దగ్గరికి వచ్చి.


    సమీరకు కొంత అర్ధమై మరికొంత అర్ధమవలేదు. భువన త్రిలోకం దగ్గరకు వచ్చి నేలమీద బేసిన్ పెట్టి--

    
    "ఏవండి......ఈ వారం ఫినాయిల్ తో పాదపూజ చేస్తున్నాను. మీ పాదాలు ఫినాయిల్ తో కడిగి నా పాతివ్రత్య ఫలాన్ని దక్కించుకుని వచ్చే జన్మలో మంచి మొగుడ్ని సంపాదించుకుంటాను. నన్ను ఆశీర్వదించండి" అంటూ ఫినాయిల్ వున్న ఆ బేసిన్ లోకి త్రిలోకం పాదాలు పట్టి లాగి అందులో ముంచేసింది.


    "చీ....చీ...." అంటూ ముక్కు మూసుకున్నాడు. అయినా లాభం లేకపోయింది.


    
    అతని పాదాలు ఫినాయిల్ లో మునిగిపోయాయి. భువన ఆనందంతో రెండు కన్నీటి బొట్లు రాల్చి.....


    "హేవండి.....నా ఫినాయిల్ పూజతో మీ పాదాలు పూనితమయ్యాయి" అంది.


    "పునీతం కాదే దరిద్రపు మొహమా! పచ్చిపుళ్ళు అయ్యాయి. ఇలాగే జరిగితే ఏదో ఓ రోజు నా పాదాలు కనిపించకుండా పోతాయి." మొత్తుకున్నాడు త్రిలోకం.


    "అంత మాటనకండి. పైన తధాస్తు దేవతలు తధాస్తు అంటారు" అంది మెడలో వున్న మంగళసూత్రాలు తీసి కళ్ళకు అద్దుకుంటూ భువన.


    "ఈ ఒక్క విషయంలో నీ పతి భక్తీ భేషుగ్గా వుంది. నన్ను కుండివాడిగా చుడ్లేవా భువనా!" అప్పటివరకూ జరిగినవన్నీ మరచిపోయి ప్రేమగా అడిగాడు త్రిలోకం.


    "అవునండి. మీరు కుంటివాళ్ళయితే నేనెలా పాద పూజ చేయాలి? మంచి మొగుడ్ని వచ్చే జన్మలో ఎలా సంపాదించుకోవాలి?" అంది ఫినాయిల్ నీళ్ళని నెత్తిమీద జల్లుకుంటూ.


    అంతే! వెనక్కి విరుచుకుపడ్డాడు త్రిలోకం ఆమె పాతివ్రత్యం రియాక్షన్ స్వయంగా చూసాక.

 

                                                           * * *


    గరుడాచలానికి నిద్రరావడం లేదు.


    అతని కళ్ళ ముందు మధ్యాహ్నం తనను కేనటిక్ హొండా మీద లిప్ట్ ఇచ్చిన ఆంగ్లో ఇండియన్ లేడినే గుర్తొస్తోంది.


    "ఆహా.....ఎంతందం.....ఎంతందం, ఎంత మెత్తగా పరుపులా వుంది" అనుకున్నాడు వొళ్ళు జివ్వుమనిపిస్తుండగా, "ఇదేంటి ఈ వయసులో నాకు వళ్ళు జివ్వుమనిపిస్తోంది" అని కూడా అనుకున్నాడు.


    గరుడాచలం ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు.


    ఆంగ్లో- ఇండియన్ లేడి తన కౌగిట్లోకి వచ్చింది "గరుడా! ఐ లవ్ యూ" అంది.


    "ఐ టూ" అన్నాడు తను.


    "ఐ త్రీ" అంది ఆంగ్లో- ఇండియన్.


    "ఐ ఫోర్" అన్నాడు గరుడాచలం.


    అలా అతను ఆ ఒక్క క్షణమే చిన్నపాటి ఉహని కలగా కనేసాడు.

 

                                                                * * *


    "ఏంటో ......నిలబడే నిద్రపోయే మనుషులు కూడా ఉన్నారీ ఇంట్లో" నిలబడే కన్నులు మూసుకున్న గరుడాచలం వంక చూసి అంది అతని భార్య.


    కళ్ళు తెరచి ఎదురుగా వున్న భార్య వైపు చూసాడు. అతని కళ్ళ ముందు ఆంగ్లో-ఇండియన్ రూపమే కనిపిస్తోంది.


    ఆంగ్లో- ఇండియన్ లేడి గెటప్ లో తన భార్య వుంటే ఎలా వుంటుందో ఒక్క క్షణం ఆలోచించాడు.


    మరుక్షణమే అతని ఉహాకు లెక్కలోచ్చాయి. తన భార్య ఆంగ్లో- ఇండియన్ లా ప్యాంటూ, షర్ట్ వేసుకున్నట్లు కనిపించింది.


    "హబ్బ........ప్యాంటూ, షర్ట్ లో ఎంత ముద్దోస్తున్నవే.....ఇంగ్లీషు దొరసానిలా డబ్బపండులా ముడోచ్చేలా ఉన్నావే పెళ్ళామా" అన్నాడు అసంకల్పితంగా మొగుడివంక విచిత్రంగా , భయంగా చూసింది.


    "ఏంటి మీగ్గాని పిచ్చిగానీ పట్టిందా?" అంది కోపంగా భర్త భుజాలని కుదుపుతూ.


    ఉహాలోంచి వాస్తవంలోకి వచ్చాడు అంటే.....ఇది కేవలం తన ఊహాన్నమాట.


    గరుడాచలం భార్య భర్త వాలకం చూసి కోపంగా బామ్మ దగ్గరకి వెళ్ళి--


    "నీ కొడుకుని ఏ ముహూర్తంలో కన్నావో గానీ పిచ్చి బాగా ముదిరింది. పాతిక నిమ్మకాయలతో తలంటు....." అంది కోపంతో బామ్మతో.


    "ఇదేంటే కోడలు పిల్లా, దానికి నాదే తప్పా! అ పనేదో నువ్వే చేయమ్మా అసలు నన్నడిగితే ఈ ఇంట్లో అందరూ రోజు పొద్దున్నే పాతికేసి నిమ్మకాయల రసం పిండుకుని తలమీద పోసుకుని స్నానం చేయాలి. అందరూ ఒక్కో టైప్" అంది ఇంగ్లిష్ నవల చదువుకుంటూనే.

 

                                                                * * *


    ఆ ఇంట్లో జరిగిన విచిత్రాలు చూసి బామ్మ హాశ్చర్యపోయింది. ముఖ్యంగా తెలుగు, తమిళ, మళయాళ, కన్నభాషల్లో లేని తిట్లు కూడా సేకరించి తిట్టగల తన పుత్రరత్నం, అతని పుత్రరత్నం అయిన శ్రీచంద్రని ఒక్కసారి కూడా తిట్టలేదు. అసలు తిట్ల ఊసేలేదు.


    
    పైగా ఏదో ఆలోచిస్తూ వుండిపోయాడు. ఏంటో......సాయంత్రం నుంచి ఈ మార్పులు అనుకుంది.


    
                                                        * * *


    గరుడాచలం హాలులో నుంచి పడగ్గదిలోకి తొంగిచూసాడు. అతని భార్య పక్కకు తిరిగి పడుకుని వుంది.


    చాలా రోజులుగా ఆరుబయతో, హాలులోనో పడుకుంటున్నాడు గరుడాచలం. మధ్యాహ్నం ఆంగ్లో- ఇండియన్ లేడి కనిపించాక అతనిలో మార్పొచ్చింది.


    పాతికేళ్ళ యువకుడే అయిపోయాడు.


    ఆంగ్లో- ఇండియన్ తనని స్టేషన్ దగ్గర వున్న బ్యాంకు దగ్గర డ్రాప్ చేస్తూ అన్న మాటలు చెవ్వుల్లో గింగురుమని, అక్కడి సంఘటన కళ్ళముందు దృశ్యంలా కనిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS