Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 24

               21.  విటమిన్ 'డి' లోపిస్తే శరీరం ఎముకుల గూడు అవుతుందా?   
   
    కుటుంబరావుకు, అతని ఏడాది కొడుకుకూ ఒకే విధమైన రుగ్మతలున్నాయి. కుటుంబరావు చిన్నతనంలో బాగానే వుండేవాడు. కాని కొంచెం వయసున్నప్పటినుంచీ ఎప్పుడూ కాళ్ళు, చేతులూ, కీళ్ళు, నొప్పిగా వున్నాయని బాధపడుతూనే ఉన్నాడు. వెన్నులోనూ,ఛాతీలోనూ నిత్యం నొప్పిగా వుంటుంది. శరీరంలోని ఎముకలు మెత్తబడ్డయేమొననే అనుమానం. కాస్త వంకర తిరిగాయేమొన్నే భయం అతన్ని వేధిస్తోంది. వాటికీ తోడు రోజు రోజుకూ నీరసం ఎక్కువవుతోంది. ఎ పని చేయాలన్నా క్షణాల్లో అలసట వచ్చేస్తోంది.
   
    ఇక, అతని కొడుకూ అంటే! ఎప్పుడూ కొద్దో గొప్పో జ్వరం ఉంటోంది.

     చలిగా ఉన్న చెమటలు పోస్తూనే వుంటాయి. ముఖ్యంగా నుదుటి మీద ఎక్కువుగా చమట పడుతోంది. చూడటానికి బొద్దుగా కనబడతారు. ముద్దుపెట్టుకుందామనిఎత్తుకోబోతే కండరాల నోప్పితో కుయ్యోమంటారు. సంవత్సరం నిండినా ఒక్క పన్నుకూడా రాలేదు. తల చూడటానికి ఎక్కినా పిల్లల్లకంటేపెద్దదిగా కనబడుతుంది. గాని, ఎత్తుగానూ, రెక్కబాగం చంకల కిందగా గుంటగానూ తయారైంది. పొట్టకూడా ఉబ్బినట్లు కణబడుతోంది. ఇంకా నడక కూడా రాలేదు. నిలబడితే కాళ్ళు డోడ్డికళ్ళలా వంకరగా కనబడడుతున్నాయి.

    కుటుంబరావులోగాని, అతని కొడుకులోగాని అటువంటి పరిస్థితి ఏర్పడటానికి వారి ఆహారంలో విటమిన్ "డి" లోపించడమే కారణం. నెయ్యి, పలు, మాంసాహారం, ఎ మాత్రం వడకుండా కేవలం ఆకూకూరలు కయగూరలు వాడేవారిలో విటమిన్ "డి" లోపంవల్ల రుగ్మతలు కలుగుటాయి. పోషకహారం లోపంఉన్న చంటిబిడ్డలా ఈ విటమిన్ లోపంవల్ల నడుము నొప్పి, ఒళ్ళంతా నొప్పులు వుండడం సర్వసాధారణ విషయం.

    విటమిన్ "డి" ముఖ్యంగా లివర్ లోను, కోడిగుడ్లలోను, వెన్నలోను, చేపనూనేలోను ఎక్కువుగా వుంటుంది. పాలల్లో తక్కువుగా వుంటుంది.

    పప్పునూనెల్లో "డి"విటమిన్ చక్కగా లభ్యం అవుతుంది.

    మన శరీరం కూడా తనంత తాను విటమిన్ "డి" ని తాయారుచేసుకుని శరీరాన్ని రక్షించు కుంటుంది. ఇందుకు సూర్యరశ్మి దోహదం చేస్తుంది. సూర్యరశ్మిలోని అల్ట్రావైలట్ కిరన్లు కొవ్వుపదార్ధాలు చైతన్య  వంతమై విటమిన్ "డి" ని తయారుచేస్తాయి. ఒంటికి నూనె రాసుకుని ఎండలో నిలబడే పద్దతి శరీరానికి ఆరోగ్యకరమని అందుకే అంటారు. చిన్నపిల్లల్ని ఉదయం, సాయంత్రం రెండు పూటలా లేత ఎండలో కొద్ది సేపు తిప్పటం మంచిది.

    సూర్యరశ్మి సోకకుండా నెలల తరబడి గదుల్లో పెరిగే బిడ్డలలో విటమిన్ "డి" లోపంవల్ల వ్యాధులు వస్తాయి నీగ్రాల మాదిరిగా చర్మం నల్లగా ఉండేవారిలో విటమిన్ "డి" లోపం ఎక్కువ కనబడుటుంది దానికి కారణం నల్ల చర్మం దాదాపు 95 శాతం సూర్యరశ్మిని శరీరంలోకి ప్రవేశించకుండా నిరాధిస్తుంది. అలాగే ఎల్లప్పుడూ దళసరిదుస్తులు ధరిస్తూ ఎండ తగలడానికి వీలు లేకుండా వస్రధారణ చేసేవారి లోనూ, విటమిన్ "డి" లోపంవల్ల వ్యాధులు రావాడానికి వేలు వుందని వైద్య శాశ్రజ్ఞలు వివరించారు.

    కాల్షియం బిళ్ళలు రుచిగా వున్నాయని చప్పరించినా, కాల్షియంవున్న ఆహార పదార్ధాలు ఎక్కువుగా తిన్నా అవి ప్రేగుల్లోనుంచి పీల్చుకోబడి శరీరానికి అందజేయబడాలంటే ఎముకలకి చేరాలంటే విటమిన్ "డి" అవసరం కాల్షియం లాగానే ఫాస్ఫరస్ కూడా శరీరానికి అందచేయదానికి విటమిన్ "డి" అవసరం.

    విటమిన్ "డి"లోపంవల్ల చిన్నపిల్లల్లో "రికెట్స్" వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి రావడంతో వారిలో ఎముకులు గట్టిపడవు. మెత్తగా ఉండడంతో ఎముకుల ఎదుగుదలలోరకరకాల అప లక్షణాలు ఏర్పడతాయి. పళ్ళుకూడా చాల ఆలస్యంగా వస్తాయి. పెద్దవాళ్ళలో విటమిన్ "డి" లోపంవల్ల "ఆస్టియో మలేసియా" అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధివల్ల ఎముకులు శక్తిని కోల్పోయి, తెలికిగా విరిగిపోతాయి. అందువలన మన ఆస్తిపంజరం అస్తిత్వానికి వితంమిన్ "డి" చలఅవసరం.

    శరీరానికి సూర్యరశ్మి సోకే విధంగా చూసుకోవడం, చేపనూనె, కోడిగుద్దు. లివర్, మాసం, పలు, పప్పునూనెలు వాడటం, ద్వారా "డి" విటమిన్ లోపం రాకుండా చేసుకోవచ్చు. చంటిపిల్లలకు "డి"విటమిన్ ఉండే చుక్కలమండులు, వయస్సు ను బట్టి ఆహారమూ ఇవ్వడం అవసరం.  

               ****


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS