వినియోగములు :-
పార్వతి, లక్ష్మీ ,సరస్వతి, ధూప ,దీప, పూజలు, గద, అంకుశము, అస్త్రము, చక్రము, జపమాలిక, వజ్రాయుధధారియగు ఇంద్రుడు. పుచ్చుకొనుట. నిశ్చలముగా నుండుట, కవ్వపుత్రాడు లాగుట, నటుడు, తాళము పట్టుకొనుట, వడవ ఓర్పు, పమిటచెంగు పట్టుకొనుట, మోహము, విసరివేయుట (ఎగురవేయుట), వాసన చూచుట, మునీశ్వరుడు, పుట్టుక, మేఘము, గౌరవర్ణము, సంతాపము వీనియందు ఈ కపిద్ధహస్తము చెల్లును.
-: శూచీముఖ హస్త లక్షణము :-
శ్లో!! కుంచితానామంగుళీనామగ్రేంగుష్టం నివేశయేత్ !
ప్రసారయే త్తర్జనీంచబుధస్సూచీ ముఖః కరః !!
ఋషిస్సూర్యః పితాబ్రహ్మ విశ్వకర్మాఅధిదేవతా !
వర్ణ శ్వేతో దేవజాతిః, వినియోగస్తుకధ్యతే !!
తా: ముడిచినవ్రేళ్ళ చివరి భాగమును బొటనవ్రేలి నుంచి చూపుడువ్రేలు చాచిపట్టిన సూచిముఖ హస్తము వచ్చును. దీనికి ఋషి సూర్యుడు. బ్రహ్మవల్ల పుట్టినది. అధిదేవత విశ్వకర్మ. తెలుపు వర్ణము. దేవజాతి.
వినియోగములు :-
ఏకసంఖ్య, బాణము, సూర్యుడు, పరబ్రహ్మ, బ్రహ్మదేవుడు, పట్టణము, లోకము,
అలాగేయను అర్ధము, ఎదియో అదియను అర్ధము. భయపెట్టుట, దిక్కులు, ఉదయము, అస్తమయము, చక్రము త్రిప్పుట (తిరుగుట), రక్షించుట, సత్యవాక్కు, వెయ్యి (సంఖ్య), విరహము, నూరు (సంఖ్య), కోపము, భూమి, నాశనము, శలాక, వ్రాయుట, సూది, కృశించుట, తామరతూడు, చిత్రము, నూగారు, నిర్ణయము, మనస్సూచిన, నీచులను చూపుట, వినుట, మోసము, లెక్కపెట్టుట, ఒకానొక లోహము, బుద్ధి, గుణము, కనుబొమలు, ఘటిక (ఘడియ), నాభి వీనియందు ఈ శూచిముఖ హస్తము చెల్లును.
-: ఖటకాముఖ హస్త లక్షణమ్ :-
శ్లో!! శ్లిష్టాకపిత్దేంగుష్టాగ్రే తర్జనీఖటకాముఖః !
ఋషిః పార్ధో జనిశ్శుక్రాత్పీతవర్ణోఅధిదేవతా.
రాఘవో మరజాతిశ్ఛ వినియోగో నిగధ్యతే !!
కపిద్ధ హస్తమందలి చూపుడు వ్రేలిని, బొటనవ్రేలి యందు నొక్కిపట్టిన, కటకాముఖ హస్తమగును. దీనికి అర్జనుడు ఋషి, శుక్రుని వల్ల పుట్టినది. బంగారువర్ణము. శ్రీరాముడు అధిదేవత, దేవజాతి. (గ్రందాంతరములందు, అంగుష్టాగ్రమున, తర్జనీమధ్యమాంగుళి సంయోగము కనబడుచున్నది. సంప్రదాయముకూడ నట్లే యున్నది. వినియోగముకూడ సమానముగనే యున్నది. గాన రెండురకముల ముద్రలు చూపవచ్చును.
వినియోగములు :-
గుఱ్ఱపు కళ్ళెము పట్టుకొనుట. పండ్లు తోముకొనుట అభిషేచనము. వింజామరము, విసనికర్ర, గొడుగు, గంధము, హారము, పూలమాల, అద్దము, వీనిని ధరించుట, తాంబూలమిచ్చుట, ఆట, ప్రదేశము_ (క్రీడా విశేషము). నృత్యాంతము, బాణము సంధించుట, ఇంద్రనీలమణి. పూవులు కోయుట, భేరివాయించుట. మర్యాద, వీనియందు ఈ కటకాముఖ హస్తము వినియోగించునని భరితాదుల మతము.
-: బాణహస్త లక్షణము :-
శ్లో!! కుంచితానామంగుళీ నామగ్రేంగుష్టం నివేశయేత్ !
ప్రసారయేత్కనిష్టాంచ బాణేంభరతకోవిదః
స్కంధః పితాచదైవంచ జాతిర్ర్భాహ్మే ఋషిశ్శివః
వర్ణో శితాస్య సంప్రోక్తో వినియోగో నిగధ్యతే !!
చేతి వ్రేళ్ళన్నియు ముడిచి, వానిమీద బొటనవ్రేలుంచి చిటికెనవ్రేలు చాచిపెట్టిన బాణహస్తమగును, ఇది కుమారస్వామి వల్ల పుట్టినది. కుమారస్వామియే దైవము. బ్రహ్మణజాతి శివుడు ఋషి, వర్ణము నలుపు.
వినియోగములు :-
వెంట్రుకలు దిద్దుట, సంధి నృత్తమను నాట్య విశేషము. నాగలి ధరించుట, ఆరు అను సంఖ్య. కొంటెవానితనము, గొడుగు, నఖక్షతము, చెమటతీయుట, పర్వతమెత్తుట, వీనియందు ఈ హస్తము వినియోగించును.
-: సర్పశిరహస్త లక్షణము :-
శ్లో!! పతాకస్సర్ప శీర్షస్స్యాన్ని మ్నేకరతలేయది.
పీతవర్ణోజ నిర్విష్ణోశ్శివో దైవ మృషిర్ప్వషా.
దేవజాతి ప్రయోగోస్యకధ్యతే భినంయోచితః !!
పతాకహస్తము యొక్క అరచేయి నిమ్నముగ చేసిన సర్పశీర్ష హస్తము వచ్చును. ఇది పసుపురంగు, విష్ణువు నుండి పుట్టినది. శివుడు దైవము. దేవజాతి. ఇందృడు ఋషి.
వినియోగములు :-
గంధము, నమస్కారము, పాము, పొట్టివాడు, బురద, కుంకుమము, కుస్తీపట్టుట, మంచిమాటలు, కచ్చతీర్చుకొను మాటలు, నీళ్ళు మొదలగునని త్రాగుట, దేవ_ఋషి_తర్పణములు ఇల్లు. యాచించుట. లాలించుట, కన్నీరు తుడుచుకొనుట, ముఖము కడుగుకొనుట, పసిబిడ్డ, కొంచెము, శిగ్గు, శోషిణము, (వేగించుట)వంగుట, జుట్టు ముడివేయుట, దోషములెన్నుట, గూడార్ధము, అయ్యోయనుట, చిత్రము, అశ్వాదులమీద చేతితో తట్టుట, బొమ్మ, నూగారు, గంధపుపొడి చల్లుట, వీనియందు ఈ సర్పశీర్ష హస్తము వినియోగించబడును.
