Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 23

       

                                               -: శుకతుండ హస్త లక్షణము :-

  శ్లో!!    అరాళే నామికావక్రాశుకతుండో  భవేద్యది !
    దుర్గాయాజనిరరుణోవర్ణో  మహేశ్వరకులంచర్షిః !
    దుర్వాశాశ్చమరీచిర్దైవం  వినియోగఉచ్యతేచాస్య !!

    తా: అరాళ హస్తమందలి  అనామికను వంచినచో శుకతుండమగును. ఇది దుర్గవల్ల  పుట్టినది. ఎరుపు వర్ణము, మహేశ్వర కులము, మరీచి దైవము, దుర్వాసుడు ఋషి.

    వినియోగములు :-
   
    తొందరమాటలు, ఈటె, చిలుక, మర్మముగా  మాట్లాడుట.ఖడ్గము, ఎరుపురంగు, మౌనము, బ్రహ్మాస్త్రము, కాంతి, బాణము, ధ్యానము, పక్షి, తిరస్కారము, భూమి, సంభోగము, గోరువంక పిట్ట, మేఘము, భయము తీర్చుట, కోపగించుట, నీవు, నేను యని యనుట, తాబేలు, ముఖస్తుతి, ఆత్మస్తుతి, మధ్యమ, ఉత్తమ, అధములమాటలు, జూదము, పాచికలు ఆడుట, కోరిక, తపస్సుచేయుట, భయము, వంశము, దేవజాల, రౌద్రరసము, తామరతూడు, భవిష్యధర్ధము, ఆలోచన, పూలుకోయుట, వ్యాళీ నాట్యము (నాట్యభేదము), ప్రారంభించుట. నాట్యము ముగించుట, పంచమ స్వరము, పాంచాల పురుషుడను  శృంగారనాయకుడు, బాణప్రయోగమునందు కుంతాయుధము, మర్మ ప్రసంగము. ఉగ్రము ఈ హస్తము వినియోగించును.

                                           -: ముష్టిహస్త లక్షణము :-

   శ్లో!!    అంగుష్టాధఃకరే కుంచితాంగుళిర్ముష్టిరుచ్యతే !
    ఋషిరుగ్రోజనిర్విష్ణుర్వీరభద్రోధిదేవతా !
    వర్ణోనీలశ్శూద్రజాతిర్వినియోగస్య కధ్యతే !!

    తా: బొటనవ్రేలి  క్రిందికి మిగిలిన వ్రేళ్ళన్నియు  ముడిచిపట్టిన ముష్టిహస్తమగును. దీనికి ఋషి ఉగ్రుడు. విష్ణువువల్ల  పుట్టినది. అధిదేవత వీరభద్రుడు. వర్ణము నీలము. శూద్రజాతి.

    వినియోగములు :-
   
    స్థిరత్వము, స్థైర్యము, మల్ల యుద్ధము, ఘంటను  పట్టుకొనుట, శీఘ్ర గమనము, తొడలు పిసుకుట, తేలిక (అవమానము), ఆకర్షించుట, డాలు, ఖడ్గము, కుంతము  మొదలగు ఆయుధములు ధరించుట. భద్రుడను శృంగార నాయకుడు, నడుము, క్రోధము, చిహ్నము, త్రాసు, మూర్ఖుడు, మూర్ఖనమస్కారము, లోహము, గడ్డము, పూలగుత్తి, కచగ్రహణము, తాండాళకాదినాట్యము వీనియందు ఈ హస్తము చెల్లును.

                              -: శిఖరహస్త  లక్షణమ్ :-

   శ్లో!!    ముష్టిశ్చేదున్నతాంగుష్టశ్శిఖరః పరికీర్తితః !
    శివార్జనిరుచిర్లీలో  మన్మధోదై వమర్జునః !
    ఋషిర్ జాతి స్తుంగాంధర్వో వినియోగస్య ఉచ్యతే !!

    తా: ముష్టి హస్తమందలి  బొటనవ్రేలిని  ఊర్ధ్వముఖముగా  చాచి పట్టిన శిఖరహస్త మగును. ఇది శివునివల్ల పుట్టినది. నీలవర్ణము. మన్మధుడు దైవము. అర్జునుడు ఋషి. గాంధర్వజాతి.
   
    వినియోగములు :-

    తాను, నిశ్చయము, కాదనుట, స్తంభము, ఘంట, మన్మధుడు, ధనస్సు, స్థిరత్వము, శిఖరము, అర్ధచంద్రుడు, బొట్టు, దత్తుడను  శృంగార నాయకుడు. వినాయకుడు, ముని, ఈశ్వరుడు, యముడు, బోయవాడు, ధ్వజము, గంభీరము, నాట్యారంభము, సుందరి, మంచిమాటలు, విలాసములుగల స్త్రీ (వేశ్య), సిగ్గు, సంతోషము, దుఃఖము, గుఱ్ఱపు కళ్ళెము, గృహము, శాఖము, ఇంద్రుడు ,రాయి, భల్లము, గుద్దలి, శక్త్యాయుధము, సరసము, నిశ్చలము, ఓడ, మృధుత్వము, పితృతర్పణము, మొక్కపోవుట. నాల్గు యను  సంఖ్య, కపటము, కృశించుట, ఇష్టము, గౌరీ, కుటుంబ పోషణము, ఆప్తుడు, ఏమి : అనుట. కొంచెమనుట, పగడము, వృక్షభజాతి, బృహస్పతి. గురువారము వీనియందు ఈ హస్తము వినియోగించునని  భరతులు చెప్పియుండిరి.

                            -: కపిద్ధ హస్తము లక్షణము :-
   
   శ్లో!!    అంగుష్టే త్రిశ్రితావక్రాకపిద్ధస్తర్జవీ భవేత్ !
    కులమార్షంజనిశ్శౌరేర్గౌరోవర్ణో అధిదేవతా !
    విరించిర్నారదఋషిః వినియోగోఅస్య కధ్యతే !!

    తా: శిఖర హస్తము యొక్క  బొటనవ్రేలియందు  చూపుడు వ్రేలును వంచిపట్టిన  కపిద్ధహస్తమగును. ఇది ఋషిజాతి. విష్ణువు నుండి పుట్టినది. గౌరవర్ణము. బ్రహ్మ అధిదేవత. నారదుడు ఋషి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS