24
వేసవి సెలవులకు రవి మళ్ళీ గుంటూరు వచ్చాడు.
"ఏం, బావా, ప్రేమాయణం ఎంతవరకు వచ్చింది?" అని అడిగాడు రాజశేఖర మూర్తి.
"పూర్తీ అయినట్టే" అని సమాధానం ఇచ్చాడు రవి.
"పెళ్లి ఎప్పుడు?"
"పెళ్లి కాదు. పెటాకులు. ప్రభావతి మరి ఒక ప్రియుణ్ణి చూసుకున్నది."
"అదేమిటి?"
"అదంతే. నేనేమో వెనకడుతున్నానని ఆమెకు అనుమానం కలిగింది.
"అసలేమైంది?"
"కిందటి వేసవి సెలవులు అయిన తరవాత మద్రాసు చేరి సరాసరి హాస్టలు కే వెళ్లి పోయాను. తరవాత నా ఒంట్లో బాగా లేకపోవటం చేత వారం రోజుల వరకూ రత్న స్వామి గారి ఇంటికి వెళ్ళటం పడలేదు. ఒకనాడు ప్రభావతే కాలేజీ కి టెలిఫోను చేసి రాలేదేమని అడిగింది. పరిస్థితి విశదపరిచి చెప్పాను. ఆరోజు సాయంకాలం వారింటికి రమ్మన్నది .సరే నన్నాను.
"ఇంటికి వెళ్లేసరికి రత్నస్వామి గారు, కాని, అయన భార్య గాని లేరు. ప్రభావతి ఒక్కర్తే ఉన్నది.
"నాన్నగారూ, అమ్మగారూ లేరా?' అన్నాను.
"లేరు. మీకేమైనా భయంగా ఉన్నదా?' అన్నది.
'నాకేం భయం? ఆడదానికి నీకు ఉండాలి గాని' అన్నాను.
"చూద్దాం గా భయం ఎవరికో!' అని సోఫాలో నా పక్కన వచ్చి కూర్చుని నా భుజం మీద చెయ్యి వేసింది.
"నాకేమో గుండె గతుక్కుమన్నది. హద్దులు మీరరాదని నువ్వు చెప్పిన సలహా జ్ఞాపకం వచ్చింది.
"ప్రభా, వివాహానికి ముందు అనుచితంగా ప్రవర్తించటం మంచిది కాదు' అని పక్కకు జరిగాను.
'తెలిసిందా ఇప్పుడు భయం ఎవరికో?' అన్నది.
"నీవన్నది కావచ్చు కాని, నా కన్న నీకే ఎక్కువ భయం ఉండలంటాను. నీకే మాత్రము అనుమానమైన లేకపోవటం ఆశ్చర్యంగానే ఉన్నది.'
'అనుమానం ఎందుకు? నన్ను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చావుగా?"
"నేను మాట ఇస్తే మట్టుకు, నా తల్లి తండ్రులు, నీ తల్లి తండ్రులు ఒప్పుకోవాలి గా?"
"మా అమ్మా, నాన్నా ఒప్పుకుంటారని నాకు నమ్మకమే. నీ తల్లి తండ్రులను గురించి నమ్మకం నీకు లేదన్న మాట. పోనీ, అడిగి రాకపోయావా?"
"మన వివాహానికి ఇంకా టైం ఉన్నది కదా? ఇప్పుడే ఎందుకులే అడగటం అని ఊరుకున్నాను."
'బాగుంది వరస . నాకీ దాగుడు మూతలు నచ్చవు.'
'దాగుడు మూతల కేమున్నది, ప్రభా. నా హృదయం నీది ఏనాడో అయింది. నా మనస్సు కూడా విప్పి చెప్పాను కదా!"
'ఆ తరవాత నిశ్శబ్దం లో కొన్ని క్షణాలు గడిచాయి. ప్రభావతి కళ్ళలో నీరు తిరిగినట్లు ఉన్నది. ఆమె గిర్రున తిరిగి లోనికి పోయింది. అయిదు నిమిషాలు వేచి చూశాను. ఆమె రాలేదు. నేనే లోనికి పోయి 'నా మనస్సు అపార్ధం చేసుకోకు, ప్రభా. నే చెప్పింది నీమంచికే. వస్తాను. రేపు బీచీ లో కనిపిస్తావు గా?' అన్నాను.
"ఆమె మాట్లాడలేదు. నేను వచ్చేశాను. తరవాత నాలుగైదు రోజులు బీచి లో ఆమె కనిపించలేదు. ఒకనాడు బీచి లో తిరుగుతుంటే మరొక యువకుడితో ఆమె కనిపించింది. నేను పలకరిద్దామని ప్రయత్నించాను. ఆమె పలకలేదు. తరవాత తెలిసింది: అతను మెడికల్ స్టూడెంటు ట. పేరు రాజారావు నాయుడు. ఇప్పుడామె నా వైపు చూడదు. నాతొ మట్లాడదు. ఎప్పుడైనా వారింటికి వెళ్ళినా రత్నస్వామిగారితో మాట్లాడి వచ్చేస్తుంటాను." అని ముగించాడు రవి.
"బాగున్నది. నేననుకున్నంతా అయింది. నిలకడ లేని మనుష్యులతో ప్రేమ వ్యవహారాలిలాగే ఉంటాయి. ఆమెలో ప్రేమ కన్నా కామ మోహాలోక పాలేక్కువ కాబోలు. ఈ వ్యవహారం ఇలా అయినందుకు నువ్వు విచారించవలసిన పని ,లేదు, బావా" అన్నాడు రాజశేఖర మూర్తి.
"నాకూ అదే అనిపించింది లే. అనవసరంగా అమ్మను కూడా బాధపెట్టాను కాను."'
మర్కేండేయ శర్మ గారూ, యజ్జేశ్వర శాస్త్రీ సెలవులకు వారి వారి ఊళ్లకు వెళ్ళారు. వారిద్దరికీ పెళ్ళిళ్ళ యి సంసారాలు సాగిస్తున్నారు. మార్కేండేయ శర్మ గారికి ఇద్దరాడపిల్లలు. యజ్ఞేశ్వరశాస్త్రి కి ఒక మగ పిల్లవాడు. గుంటూరు లో రాజశేఖర మూర్తి కి ఇప్పుడు రవి తప్ప వేరు స్నేహితులేవ్వరూ లేరు. సరస్వతి ఉన్నది. కాని, తరచుగా ఆమె ఇంటికి పోవడం బాగుండదు. ఒకనాటి సాయంకాలం రవిని కూడా తీసుకుని సరస్వతి ఇంటికి వెళ్ళాడు రాజశేఖర మూర్తి. కృష్ణయ్య చౌదరి గారు వైద్యశాల కు వెళ్లారట. లేరు. రవి కూడా రాజశేఖర మూర్తి తో ఇంటర్ మీడియట్ చదివిన నాడు కావడం వల్ల సరస్వతి కి పరిచయమే.
"ఇందుమతి ఎలా ఉన్నది?' అని ప్రశ్నించింది సరస్వతి.
"ఇందుమతి కి ఎలా ఉన్నది?" అని ప్రశ్నించింది సరస్వతి.
"ఇక్కడ నుంచి బయలు దేరినప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడూ అలాగే ఉన్నదని ఉత్తరం వచ్చింది. అంతకన్నా నాకు తెలియదు." అన్నాడు రాజాశేఖర మూర్తి.
సర: ఆమెకు రావలసిన జబ్బు కాదిది. ఆమెను మొదట మీ ఇంట్లో చూసినప్పుడే ఎందుకో ఆమె మీద నాకు సోదరీ భావం కలిగింది.
రాజు: మీ హృదయం నవనీతం, సరస్వతీ దేవి. మీరు చేసినసహాయం నేనెన్నటికీ మరిచి పోలేను.
సర: నే చేసినదేమున్నది. మూర్తి గారూ. అవసరమైన చోట నాన్నగారేప్పుడూ సహాయం చేస్తూనే ఉంటారు.
రాజు: జబ్బును గురించి ఏమంటా రాయన?
సర" నాతో ఎప్పుడూ ఆ విషయాలు మాట్లాడరాయన. అడిగినా కసురుతారు. అందుకేనే నెప్పుడూ అడగను. కేసు ఆయనకు అప్పజెప్పిన తరవాత ఆయనను నమ్మి ఆయనకు వదిలి వెయ్యటమే కర్తవ్యమ్ . ఆయనకు చేతనయినాదంతా చేస్తారు. చేతకాకపోతే కాదని చెబుతారు.
రవి: బావకు మా చెల్లెలంటే ప్రాణం, సరస్వతీ దేవి. బావ వ్రాసుకున్న డైరీ చూసే అవకాశం నాకు లభించింది. అదొక కావ్య ఖండం. బావ హృదయాన్ని మొదటిసారిగా కదిలించి వేసిన ప్రణయ స్వరూపిణి ఇందుమతి.
సర: మూర్తి గారు కవి కూడా నని నాకు తెలియదు. మీ రచనలు మీ డైరీ లోనే ఉండి పోవాలా, మూర్తి గారూ? ప్రచిరించ కూడదూ?
"రాజు : ఎవరి నుద్దరించను?
సర: మీ నవ్య సాహిత్య కవులంతా ఎవరి నుద్దరిస్తున్నారు?
రాజు: సాహిత్యాన్ని.
సర: మీరూ ఆ సాహిత్యాన్నే ఉద్దరించండి.
రాజు: నాకా స్థాయి లేదు, సరస్వతీ దేవి.
సర: మిమ్మల్ని మీరెప్పుడూ తక్కువగా ఎంచు కుంటారు. రవిగారూ, మీరు చూశారు కదా/ మీ అభిప్రాయం ఏమిటండి?"
రవి: సాహిత్యాన్ని విమర్శించగల శక్తి ఇంజనీరింగు విద్యార్ధులకు ఉండదు, సరస్వతీ దేవి. అతి సాధారణమైన నా మనస్సు కు మాత్రం గొప్పగా ఉన్నాయి రచనలు.
సర: పోనీ, మూర్తి గారూ, నాకు చూపించ కూడదా? మీకేమైనా అభ్యంతరమా'
? మీకు రవిగారోకటీ నే నోకటీనా?
రాజశేఖర మూర్తి హృదయానికి సూటిగా తగిలిందీ ప్రశ్న. రవి, రాజశేఖర మూర్తి చిన్నతనం నుంచీ కవల పిల్లల్లాగా పెరిగారు. తన మిత్ర మండలి లోనే కాదు, తన బంధు కోటిలో కూడా రవికి ఉన్న స్థానం మరెవ్వరికీ లేదు, ఒక్క ఇందుమతి కి తప్ప. ఈనాడు సరస్వతీ తత్సమాన మయిన స్థానాన్ని కోరుతున్నది. అవును. ఆమె మైత్రి ఉదాత్త మైనది. స్వార్ధ రహితమైనది. అకళంక మైనది.
"కాదు , సరస్వతీ దేవి. మీలాంటి స్నేహితులు ఉండటం నా అదృష్టం. మీకు తప్పక చూపిస్తాను" అన్నాడు రాజశేఖర మూర్తి.
మరునాడు రాజశేఖర మూర్తి తన డైరీ తీసుకుని పోయి సరస్వతీ కి ఇచ్చాడు. ఆ పుస్తకం ఇందుమతి కూడా ఎన్నడూ చూడలేదు. సరస్వతీ తీరికగా పడుకుని రాత్రి చదువుకున్నది. ఒహో, ఏమి ఆ కవితా మాధుర్యం! ఒక్కొక్క పద్యం ఆమెను ఏదో రహస్సీనులకు తీసుకుని పోయింది.
మచ్చుకు ఒకటి :
"నేనె నీకయి విరచించినాను దేవి
వలపు టుయ్యాల నేడు నా వనము నందు
నా హృదయ రక్తనాళము ల్ త్రాళ్ళు పేని
రాగ రస తరుశాఖ నాలంబనముగ.
భాద్రపద మాస బహుళ సుభ్రతతి గ్రమ్మి
చండకిరణు డకసమున జాడ లేడు
శీతలాతి శీతల మీ ప్రభాత వేళ
పై దలీ, రమ్ము డొలలూగేదవు గాని."
ఇందుమతి ధన్యురా లనుకున్నది సరస్వతీ.
