Previous Page Next Page 
వంశాంకురం పేజి 24


    "ఈ పిల్లాడెవరురా? వాళ్ళ నాయనమ్మ అందరితో చెప్పుకుని మురిసి పోతుంది. మీరు ఎంతో ఇదిగా అడిగారట. నాకు తెలుసులే. ఈ ఇంట్లో పిన్ని పెత్తనము. అందుకే ఇలా అయింది."
    "అమ్మ ఏం జేసింది? మాకేమయింది అన్నయ్యా?"
    "ఇంకేం కావాలిరా? ప్రతివారికి పది మంది పిల్లలున్నారు. మీ వదిన కుటుంబము లో వారి చెల్లెలిని చేసుకోమంటే కట్నము తక్కువని వద్దన్నది. ఇప్పుడు వంశీకులను వదిలి మంది పిల్లలను పెంచుతుంది."
    "మందియెలా అవుతారు? ఈ పిల్లాడు అమ్మకు దగ్గరివాడు. నీ కొడుకు నాన్నకు దగ్గరి వాడు. దూర మెక్కడ?"
    "ఒరేయ్ ఆనంద్! కావాలంటే పండితులను పిలిచి అడగరా. ఎవరు మోక్షమైనవారో?"
    "రామూ! అపరా. మోక్షమనేది ఉందొ లేదో గాని బంధువులంతా మోక్షానికి దారి చూపుతున్నారు. మేము ఎవరిని పెంచుకోము. అలాంటి ఉద్దేశము కల్గిననాడు , అనాధ శరణాలయాలు బోలెడున్నాయి. ఎవరినో తెచ్చి పెంచుకుంటాం. తెల్సిందా?' కోపంగా అరిచాడు.
    "ఎవరొద్దన్నారు . మన వారనే అభిమానముందనుకున్నాను." చివ్వున లేచి వెళ్ళిపోయాడు.
    "మన మానానమనల్ని శాంతిగా బ్రతుక నివ్వరెందుకో," బాధగా నిట్టూర్చాడు రంగారావు. దూరంగా నిలబడి విచారంగా, చీకటిని చూచే కోడలు కనిపించింది.
    "అరుణా!" అయన కంఠం ఆర్ద్రంగా ఉంది. "ఇలా రామ్మా. వాడి మాటలు మనసులో పెట్టుకోకు. ఆత్రపు మనిషి." అనునయించాడు. అతను ఎవరో బంధువుల వద్ద ఉండి తన చేతి సంచి తెప్పించుకున్నాడు. అతనన్న మాటలు సరస్వతమ్మ కు చెప్పలేదు. అప్పుడప్పుడే కాస్త కుడుతపడే ఆనంద్ మనసు మళ్ళీ అల్లకల్లోలంగా అయింది. అమ్మా! ఓ వారం రోజులు ఎటన్నా తిరిగి రావాలని ఉంది. కాశ్మీరు చూచి వస్తాను."
    "వెళ్ళిరా నాయనా. ఇంకో రెండు నెలలు పోయాక అయితే అరుణ కూడా వచ్చేది. పోనీలే మరోసారి ఇద్దరు వెళ్దురు గాని." భార్యను తీసు కెళ్తనని కొడుకు ఎక్కడ అంటాడో నని ఆమె ముందే బంధం వేసింది. అతను ఒంటి గానే ప్రయాణమై వెళ్ళిపోయాడు.
    అరుణకేం తోచక తోటలో మొక్కలకు పాదులు చేస్తూ కూర్చుంది. టాక్సీ ఆగింది. అందులో నుండి మారుటి అక్క వనజ దిగింది. ఆనందంగా యేదురేగింది.
    'ఆపరేషన్ తరువాత రావటమే పడలేదు. ఇప్పుడెలా ఉందే?' ప్రేమగా బుగ్గలు పుణికింది.
    "అసలు నొప్పి పూర్తిగా తగ్గింది అక్కా, డాక్టరు చెప్పాడు కదా అని జాగ్రత్తలు తీసుకుంటున్నాను, బాచీ, పాపా, చిన్నా యేరి?"
    "వాళ్ళు అమ్మ దగ్గరున్నారు. అందరము రావాలను కున్నాము. నాన్నగారి స్నేహితులెవరో వచ్చారు. నేను చూసి వెళ్దామని వచ్చాను. మా యింటికి వెళ్ళితే తీరికేది?" ఇరువురూ ఇంట్లోకి వచ్చారు.
    "వనజా , రామ్మా. అంతా కులసేనా?" సరస్వతమ్మ ఆప్యాయంగా పలుకరించింది. కబుర్లు చెప్పుకుంటుండగా వనజ అడిగింది.
    "ఆనంద్ త్వరగా ఆఫీస్ కు వెళ్లినట్టున్నాడే?"
    "వారు కాశ్మీరు వెళ్ళారక్కయ్యా, వదినా పిల్లలు బావున్నారా?"
    "వారికేమే. అంతా బావున్నారు. "భోజనాల తరువాత, సరస్వతమ్మ అలసి అలా తివాచి పైనే నిదురబోయింది. సత్తి పిల్లవాడిని అడిస్తున్నాడు. రంగారావు బయటకు వెళ్ళాడు. వనజా, అరుణా పడుకుని మాటల్లో కి దిగారు.
    "అప్పుడే ఏం ముంచుకు పోయిందని ఆ పిల్లాడిని పెంచు కుంటున్నారే?"
    "పెంచు కుంటామని యెవరన్నారక్కా. అత్తయ్య సరదాకు ఉంచుకుంది."
    "మీ పెద్దత్తగారు బంధువు లందరితో పెంచుకుంటున్నారనే చెబుతుంది. శ్రావణము లో దత్తత చేసుకుంటారట."
    "నేను వినలేదు. మరి అత్తయ్య అన్నారో ఏమో."
    "అంటే పట్టనట్టు అత్తయ్య అన్నారో ఏమో అంటావేమే. నీ ఇల్లు నీ మాట చెల్లదా? మాటమాత్రమైనా నిన్ను అడగవద్దా?"
    "అంత ధైర్యమేది? ఒకందుకు సంతోషించాలక్కా. నా దురదృష్టాన్ని వారికి అంటగట్టానని దూషించరు."
    "బావుందే వరస. అలా అని వారు చెప్పినట్టల్లా వింటావా? అంతగా పెంచుకోవాలనుకుంటే నీకు దగ్గరి వారిని తీసుకో."
    'దగ్గరివారో, దూరము వారో , యెవరు మాత్రమూ ఏం చేస్తారక్కయ్యా , అదో తృప్తి తప్ప."
    "ఆ తృప్తి అయినా ఉండవద్దా? నీ రక్తము కలిసిన వారినైతే కొట్టొచ్చు, తిట్టవచ్చు ఎవరో మంది పిల్లలను ఊ అనే అధికారముంటుందా?"
    "అంతదూరము  నేను ఆలోచించలేదు. ఆ ప్రసక్తి దేనికి? రోజూ యింటికి వచ్చిన ప్రతి వారూ అదేమాట. ఏదో సానుభూతి చూపుతారు భరించలేక పోతున్నాను. మరేమైనా చెప్పు వింటాను."
    'అంత విసుగు దేనికి. అత్త యెంతయినా పరాయిది. నీ క్షేమము కోరి చెబుతున్నాను. ఆలోచించు."
    'అత్త పరాయిదా? పొరపడుతున్నావక్కా మరోకరయితే . అజాగ్రత్తగా ఉంచి చావని. తను పీడా వదులుతుంది. కొడుక్కి మరో వివాహము చేస్తామని సంతోషించేవారు. అత్తయ్య అమృత మూర్తి. కలలో కూడా నన్ను అజాగ్రత్త చేయదు. నిందించదు."
    "వేర్రిదానా. అదంతా ప్రణాళీకలేవే. తన పనులకు నీవు అడ్డు చెప్పకూడదని ఎత్తు."
    "వారికా యెత్తులు , జిత్తులు ఏం తెలియవు."
    "నిశ్చయంగా నీకేదో మందు పెట్టారే , అమ్మ అంటే ఏమో అనుకున్నాను."
    "రేడియో లో పాటలు వస్తాయి." ఆ సంభాషణ మార్చాలని హాల్లోకి వచ్చింది. సరస్వతమ్మ తల క్రింద చెయి పెట్టుకుని పడుకుంది. ఆమె కంటి నుండి నీరు జారి కొంగులు తడుపు తుంది. ఒకరినొకరు చూచుకుని అత్తా కోడళ్ళు ఇద్దరూ ఉలికిపడ్డారు. అత్తగారు నిదురబోయిందని అరుణ అనుకుంది. కోడలు బయటికి వస్తుందని అత్తగారాశించలేదు? రేడియో అన్ చేసి పెద్దగా తిప్పింది.
    "అత్తయ్యా కాళ్ళు నొప్పిగా వున్నాయా?"
    "లేవు" కోడలికి కళ్ళు కనిపించరాదనీ చెయ్యి పెట్టుకుంది."
    'అత్తయ్యా! నన్ను క్షమించండి? నాకే దురేద్దేశ్యము లేదు. అక్కయేదో అన్నది."
    "పిచ్చి తల్లి" ఆమె చెయ్యి చాపి కోడలు చేయి పట్టుకుని దగ్గరకు రమ్మన్నట్టు సైగ చేసింది. అరుణ దగ్గరగా జరిగింది.
    "నీకు, నాకు దురేద్దేశము లేకపోయినా, మన చుట్టున్న వారికీ ఉందమ్మా. మనకీ మాత్రము శాంతి కూడా కరువు చేయాలనీ వారి తాపత్రయము. నువ్వేం బాధపడకు? రోజూ జరుగుతున్నా భాగతమేగా."
    "అరుణా" వనజ కేక వినిపించింది.
    "వచ్చే."
    "వెళ్ళమ్మా , కొంతలో కొంత పుణ్యము చేసుకున్నాము. మనలో మనకు బెధాభిప్రాయాలు లేవు," నిట్టుర్పు విడిచిందావిడ.
    "లేచి మంచం పై పడుకోరాదత్తయ్యా"
    "ఉండనియ్యమ్మా నిదుర వస్తుందా పాడా" అరుణ అత్తగారిని వదిలి వెళ్ళిపోయింది."
    "ఏం చేస్తున్నావే?"    
    "క్రింద పడుకున్నారు అత్తయ్య. మంచము పైన పడుకోమన్నాను."
    "ఊ. మా అత్తగారి ఊరికి పది మైళ్ళ దూరములో ఓ సాధువు వున్నాడే. అతనిని చూడడానికి దూర దూర దేశాల నుండి వస్తారు జనము. మహత్యము కూడా ఘనంగా చెప్పుకుంటారు. అతను యేది చెప్పినా నిజమై తీరుతుంది . నువ్వు ఆనంద్ వీలు చూసుకొని రాకూడదూ?"
    "అలాగే. ఇంకా కొన్నాళ్ళు ప్రయాణాలు పనులు కూడదన్నారు డాక్టరు."
    "కారుండనే వుంది. అలసిపోవాల్సిన దేముంది?" అరుణకు తెలుసు. అక్కగారి ఆహ్వానము లోని అసలు ఉద్దీశము. అక్కడ తన పిల్లలను చూపి ప్రలోభ పెట్టవచ్చని. అందరికీ, ఆపరేషన్ అయిన నాడే తెలుసు తనకు ఇక జన్మ లో బిడ్డలు కారని. తన బాధను వ్యక్తము చేయక తనలాంటి వారు కొండరీ ప్రపంచం లో ఉన్నారని , మనసును అదుపులో పెట్టుకుని నిబ్బరంగా తిరుగుతుంది. అది కూడా చూడలేరు బంధు జనము. అలాగే పడుకుని కళ్ళు మూసుకుని నిదుర నటించసాగింది . రెండవ రోజు తగు జాగ్రత్త లు చెప్పి వెళ్ళిపోయింది వనజ.
    ప్లీడరు వేంకటరత్నము భార్యను ఆస్పత్రి లో చేర్చారు. సరస్వతమ్మ రంగారావు సాయము వెళ్ళారు. సాయంత్రం అతన్ని చూద్దామని ఆనంద్ బయలుదేరాడు.
    "నేను వస్తానండి విసుగ్గా వుంది." అరుణ ప్రయాణమై పిల్లవాడికి దుస్తు లేసింది.
    "వాదినేక్కడికి అరుణా. అంటూ రోగిష్టి వారుండే చోటు. సత్తి దగ్గరుంటాడు."
    "వారిద్దరే ఇంట్లో దేనికి? కార్లో కూర్చుంటారు."
    "కారు ఆస్పత్రి కాంపౌండు లోనెగా పార్క్ చేయాల్సింది. పసిబిడ్డలకు త్వరగా అంటూ వ్యాధులు సోకుతాయి. " అరుణ పిల్లావాడికి బిస్కెట్లు, చాక్ లెట్లు పెట్టి సత్తికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది. పిల్లవాడిని వదిలి వచ్చారు. తొందరగా వెళ్ళమని సరస్వతమ్మ వెంటనే పంపించి వేసింది. దంపతులు ఇల్లు చేరేసరికి సత్తి బిక్క మోహము వేసుకుని నిల్చున్నాడు.
    "బాబెడిరా?' ఆత్రంగా అడిగింది అరుణ.
    "మీరటు వెళ్ళగానే బాబు వాళ్ళ నాన్న వచ్చారమ్మా. మీరంతా యేరని అడిగారు. బయటకు వెళ్ళారని చెప్పాను. చాలా కోపము వచ్చింది. యేమేమో అన్నారు. బాబును తీసు కేళ్తున్నాను ఆ మాట మీ వారితో చెప్పు. అనేసి వెళ్ళాడమ్మా
    "బావగారు వచ్చారటండీ."
    "వింటున్నాను." ఆనంద్ బొమ్మలు ముడుచు కున్నాయి. సిగరెట్ వెలిగించాడు.
    'ఇంకా బండికి టైం వుంది. బస్ స్టాండు లో చూచి వెళ్దామండి."
    "పద. ' ఇరువురూ బస్సు స్టాండంతా గాలించారు. తరువాత స్టేషన్ కు వెళ్ళారు. స్టేషన్ అంతా కలియ చూచారు. అతని జాడ ఎక్కడా కనిపించలేదు. రెస్టారెంటు లో కనుపించాడతను భార్యాభర్తలు వెళ్ళారు.
    "ఏమిటన్నయ్యా? అంత తొందర! మేము వచ్చే వరకుండా లేకపోయావా?"
    "ఉండి ఏం చేయాలి? మీ అసలు స్వరూపాలు చూచాను.
    "ఏం చూచారేం?' ఆనంద్ కోపంగా అడిగాడు.
    "అది చెప్పాలా? మీకు బిద్దలంటే ప్రీతి లేదు. అందుకే భగవంతుడు చిన్న చూపు చూచాడు. అటు ముసలి జంట, ఇటు వయసు జంట షికార్ల కు బయలుదేరి మా పిల్లాడి ని వదిలివేస్తారా ?"
    "ఏమన్నావ్?' కోపంగా లేచాడు. అతని చెయ్యి పట్టుకుని ఆపింది అరుణ.
    "ఉన్నమాటంటే అంత ఉలుకు దేనికి> నీ బిడ్డడే అయితే అలా పనివాడిని వదులుతావా?"
    "ఎప్పుడూ వదలలేదండీ. ఈరోజు ఆస్పత్రికి వెళ్లామని, వదిలాము. అక్కడ రోగాలు రొష్టు........" అరుణ నచ్చ చెప్పబోయింది.
    "మీ ఇంట్లో ఏం తక్కువ ఉన్నాయి రోగాలు, రొప్పులు. చాలించండి సమర్ధింపులు. రామారావు చెప్పాడు. వారికి బంధు ప్రేమా, అభిమానము లేవోయ్. నీ బిడ్డడని అలా సరాదా కు తీసుకున్నారు. దత్తత కావాలంటే , అనాధ శరణాలయం నుండి తెచ్చుకుంటారుట అనాధలను ఏం చేసినా అడిగేవారు లేరు. అని నేను అమ్మ మాటలు విని మోసపోయాను.
    "మీరు కాదు మోసపోయింది. అమ్మ మా అమ్మ మీ అసలు స్వరూపాలు తెలుసుకోలేక పోయింది. అందుకే అభిమానంగా పిల్లాడిని ఉంచుకుంది. మరో విషయమేమిటంటే నిష్టూర పడినా ఒకటిక సత్యము. తెలిసింది. మంది పిల్లలకు పెట్టవల్సిన వారమే గాని స్వతంత్యంగా వారినేం అనలేము. మంచిది. మీ పిల్లవాడిని తీసుకెళ్ళండి. అనాదులనే తెచ్చుకుంటాము."
    "ఏమండీ. ఎందుకా అరుపులు చుట్టూ జనము చేరినారు." అరుణ సిగ్గుపడింది. బజారు మనుష్యుల్లా! రోడ్డు మీద , రెస్టారెంట్ లోనా పోట్లాట.
    "పద" ఆనంద్ వెనక్కు తిరిగాడు. ఒక్కసారి అబ్బాయి వంక చూచి అతన్ని అనుసరించింది అరుణ. ఆనంద్ కోపంగా ఉన్నాడని అతన్ని మాట్లాడించ లేదు. ఇంటికి వస్తూనే ఆతడు న్యూస్ పేపరు పట్టుకుని కూర్చున్నాడు. సన్నగా రేడియో తిప్పి దాని ముందు కూర్చుంది అరుణ.
    "బాబు అన్నము తిన్నాడా అరుణా బయటి నుండి అడిగింది సరస్వతమ్మ. యెన్నడు తల్లి ముందు గట్టిగా అరవని ఆనంద్ ఆరోజు విచక్షణ కోల్పోయాడు.
    "బాబు .......బాబూ యెవరి బాబమ్మా! ఊరందరూ మనవాళ్ళే ననుకుంటావు వారేమో మనము పిల్లలకు మోహము వాచీ ఉన్నట్లు ప్రవర్తించి అవమానిస్తారు."
    "ఏమైందిరా?" ఆశ్చర్యంగా అడిగింది.
    "అరగంట అబ్బాయిని వంటిగా వదలి వెళ్ళితే వాడు అరిగి పోయాడట. మీ అక్కగారి కుమారుడు వచ్చి చెప్పకుండా పిల్చుకు పోయాడు. అరిచినట్టే చెప్పాడు. ఆమె కోడలు వంక చూచింది. అరుణ నెమ్మదిగా జరిగిన విషయము చెప్పింది.
    "వాడంత మూర్ఖంగా ప్రవర్తించాడా?"
    "మన అమాయకత్వమూ, అసహాయతనూ ఆధారంగా చేసుకుని, వారిష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తారు. అమ్మా! నేను చెప్తున్నాను. ఇక నుండి ఈ పిల్లల ప్రసక్తీ వద్దు మనలాంటి వారు ప్రపంచములో కోకొల్లలు. ఉన్నన్ని రోజులు నిశ్చింతగా తిని చచ్చేరోజు ఏ శరణాలయాలకో రాసి పోదాము." అమెకొడుకు మాటలకు దోషిలా తలవంచుకుని వెళ్ళింది. నాల్గురోజులు ఇంటిలో మౌనము రాజ్యము చేసింది. యెవరితో యెవరు మాట్లాడితే ప్రమాదమో అన్నట్టు ప్రవర్తించారు.
    ఆనంద్ ఈ మౌనాన్ని భరించలేక పోయాడు. సాయంత్రము తండ్రి రేడియో ముందు కూర్చున్నాడు. తల్లి కోసము చూచాడు. ఇంటి వెనుక వైపు వరండా లో నడుము వాల్చిందామె . దగ్గరే కూర్చుని అరుణ మల్లెలు మాల కడుతుంది. సత్తి పూలు కోసి పోస్తున్నాడు.
    "అమ్మా? తప్పు చేసిన కుర్రవాడి వలె తల్లి ముందుకు వచ్చాడు.
    "రా నాయనా" వెళ్ళి ఆమె దగ్గర కూర్చున్నాడు. "కోపము వస్తే కేకలేయాలి గాని మౌనంగా ఉండి నన్ను బాధించాలా"
    "నీ మీద కోపము దేనికిరా వెర్రి తండ్రి, మనసు బాగా లేక మౌనంగా ఉన్నాను."
    "వెంకటరత్నం మామయ్య భార్య కేలా ఉంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS