10
రిక్షావాడిని చూడగానే కంచిపట్టు చీర గుర్తుకు వచ్చి కళ్యాణి గబగబ నడచి వెళ్ళి రిక్షా లో కూర్చుంది. భర్త కూడా కూర్చున్న తరువాత 'ఇంకా చూడవలసిన వేమి ఉన్నాయ్?" అనడిగింది.
'మనం వెళ్ళే తోవలోనే బట్టల దుకాణాలున్నాయండి. అక్కడ మీరు చీర కొనుక్కున్న తరువాత కంచి కామకోటి శంకారాచార్యుల వారి మఠం దగ్గరకు తీసుకు పోతాను.' అన్నాడతను.
బట్టల దుకాణాల దగ్గరకు వచ్చేక రిక్షా ఆగింది. వాళ్ళు దుకాణం లోకి ప్రవేశించగానే దుకాణం యజమాని , "రండి . రండి. కూర్చోండి.' అంటూ మర్యాదగా స్వచ్చమైన తెలుగులో స్వాగతం పలికెడు.
కళ్యాణి, కాంతారావు కూర్చున్నదే తడవుగా పిల్లలిద్దరూ వాళ్ళ చేతుల్లో నుండి తప్పించుకుని ఆ దుకాణం లోని బట్టలన్నీ సర్ధసాగేరు. చీరల బేరం కొచ్చిన వాళ్ళ పిల్లలను యేమీ అనకూడదు కనుక మంచి మాటలతో వాళ్ళకు నచ్చ చెప్పటానికి విఫల ప్రయత్నాలు చేసేడు షాపులో పనిచేసే కుర్రావాడు. కళ్యాణి ముందు చీరలు కుప్పగా పోసి వో కంట పిల్లల వైపు కోర చూపులు విసుర్తూ రెండో వైపు కల్యాణి తో పళ్ళికిలించి మాట్లాడుతున్నాడు దుకాణం యజమాని.
కళ్యాణి చీరలన్నీ చూసి చివరకు జరీ అంచుగల ఎర్ర చీరను ఎన్నుకుంది. 'దీని ఖరీదెంత? అనడిగేడు కాంతారావు.
'ఎనబై రెండు రూపాయల తొంబై తొమ్మిది పైసలు.' అన్నాడు షాపు యజమాని.
'ఇంకా అ ఒక్క పైసా కూడా తక్కువ ఎందుకు పెట్టేడు? ఎనభై మూడే అనవచ్చు కదా' అనుకుంది కళ్యాణి మనసులో.
ఐతే లౌక్యం తెలిసిన కాంతారావు మాత్రం 'వెధవ, చూడు... తొంబై తొమ్మిది పైసలు పెట్టినా రూపాయలు ఎనభై రెండే అనుకుంటారు కాని, కస్టమర్స్ ఎవరూ ఎనభై మూడు రూపాయలు అనుకోరు. ఇదంతా బిజినెస్ టక్నిక్స్ ' అనుకున్నాడు కసిగా.
'ఇచ్చే బేరం చెప్పండి.' అంది కళ్యాణి అరింద లా.
"మనదే వూరండి?' అనడిగేడు దుకాణం అతను.
'హైద్రాబాదు' అని సమాధాన మిచ్చేడు కాంతారావు.
'హైదరాబాదు లో యీ చీరను నూట ముప్పై ఐదు రూపాయలకు తక్కువ ఎవరైనా మీకిస్తే నేను నా చెవి కోసిస్తాను. మీకు, ఇక్కడ మేము స్వయంగా నేస్తాం కనుక, సరసమైన ధరలకు అమ్ముకుంటున్నాం. మా దగ్గర హోల్ సెల్ గా కొని రెట్టింపు లాభం పొందుతారు మిగతావాళ్ళు.' అంటూ యీ భారతదేశంలో తనంత నిజాయితీ పరుడైన బట్టల వ్యాపారస్తుడు మరొకడు లేడు అన్న అర్ధం స్పురించేట్టుగా ఒక అరగంట మాట్లాడి, చివరకు బేరం చేయిటం అయినాక డెబ్బై ఏడు రూపాయల తొంబై నాలుగు పైసలకు ఆ చీరను కళ్యాణి కిచ్చేడు.
'మరో చీర కొనరూ?' అన్నాడు వాళ్ళు లేస్తుంటే.
'అబ్బే! ఇప్పటికిది చాలులెండి.... అంటూ నసిగేడు కాంతారావు.
దుకాణం అతను వెంటనే అందుకుని 'నాకు తెలుసండీ! మీరు యాత్ర లో ఉన్నారు. తగినంత డబ్బు మీ దగ్గర ఉండక పోవచ్చు. అందుకే మీ వంటి యాత్రికుల కోసం ఒక చక్కని మార్గాన్ని కనిపెట్టేం మేము, మీరు కనుక పది రూపాయలు ఎడ్వాన్సు గా యిచ్చి మీ అడ్రెస్ వ్రాసి చ్చేరంటే మీ యింటికి రిజిస్టర్ పార్సెలు చేసి పంపిస్తాం చీరల్ని' అన్నాడు.
కళ్యాణి , కాంతారావు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. 'అబ్బ ఇంత నిజాయితీ గల వ్యాపారస్తులు కూడా ఉంటారా!" అన్నట్లు.
కాంతారావు మాత్రం 'వద్దులెండి. అంత అవసరమైతే మీకు ఉత్తరం వ్రాసి తెప్పించుకుంటాం లెండి యింటికి వెళ్ళిన తరువాత.' అన్నాడు.
వాళ్ళు బయటకు వచ్చేక రిక్షా అతను దుకాణదారునికి నవ్వుతూ నమస్కారం చేసి, రిక్షా వైపుకు నడిచేడు. మళ్ళీ రిక్షా కదిలింది.
ఎక్కడా ఆగకుండా సరాసరి శంకరా చార్యుల వారి మఠం దగ్గరకు వెళ్ళి ఆగింది. ఆ సమయంలో శంకరాచార్యుల వారు 'టూర్ ' లో ఉండటం వల్ల ఆయనను సందర్శించే అవకాశం లభించలేదు వాళ్ళకు. అయన శిష్య గణాలలో ఒకరిద్ద్రినీ చూసి, 'వీళ్ళు మాములు మనుషుల కంటే, భిన్నంగా ఏమీ కనపడటం లేదే!' అనుకుంది కళ్యాణి.
ఆ తరువాత తాము బస చేసిన హోటలుకు తీసుకు వెళ్ళింది రిక్షా.
రిక్షా దిగేక కాంతారావు రిక్షా అతని చేతిలో పది రూపాయల నోటు పెట్టేడు.
'అయ్యో! అంతేనా సార్! ఊరంతా చూపించేను. ఇంత కష్టపడితే మీరు యిచ్చేది పది రూపాయలా?' అన్నాడు. కాంతారావు దిక్కు తోచలేదు. ఎంత చూసినా రిక్షాకు పది రూపాయల కంటే ఎక్కువ యివ్వవలసిన అవసరం ఏ మాత్రం కనపడలేదు అతనికి. ఐనా అలా అనటానికి 'డిగ్నిటీ' అడ్డు రావటం వల్ల మారు మాట్లాడకుండా మరో ఐదు రూపాయలు తీసి అతనికిచ్చేడు.
రిక్షావాడు ఆ పదిహేను రూపాయలూ అందుకుని నమస్కారం పెట్టి వెళ్లిపోయేడు.
వాళ్ళు కాళ్ళీడ్చుకుంటూ రూములోకి వెళ్ళి బట్టలు మార్చుకుని , భోజనం చేసి, కాసేపు విశ్రమించి మళ్ళీ ఆ సాయంత్రానికి గది ఖాళీ చేసి బస్సులో మద్రాసు ప్రయాణమయ్యారు.
* * * *
వాళ్ళు మద్రాసు చేరుకునేసరికి రాత్రి ఎనిమిది గంటలు కావస్తోంది. ఆ పగలంతా కంచిలో తిరిగి, వెంటనే ప్రయాణం చెయ్యటం వల్ల అందరూ అపాటికీ అలసి పోయేరు.
సిటీలో బస్టాపు కు దగ్గర్లో ఉన్న హోటల్లో దిగి స్నానాలు కూడా చెయ్యకుండానే భోజనాలు ముగించేడు. ఆ వెంటనే పిల్లలు నిద్రమత్తులో ప్రక్క మీద వాలిపోయేను.
'నాకైతే వళ్ళంతా చీదరగా ఉంది. స్నానం చెయ్యందే నిద్రపట్టదు' అన్నది కళ్యాణి.
'ఐతే త్వరగా చేసిరా!' అన్నాడు కాంతారావు ఆవలిస్తూ.
'అబ్బో. నన్ను చెయ్యమని మీరు తప్పించుకుందా మనుకుంటున్నారేమో ! ఆ అటలెం సాగవు. వెళ్ళి ముందు మీరు స్నానం చేసి రండి. మీ వళ్ళంతా దుమ్ము కొట్టుకుని ఉంది.' అన్నది కళ్యాణి.
.jpg)
గత్యంతరం లేక కాంతారావు బాత్ రూము లోకి వెళ్ళి ఐదు నిమిషాల్లో స్నానం ముగించుకుని, ఇస్త్రీ లుంగీ కట్టుకుని వచ్చేడు.
'అతను రాగానే కళ్యాణి బాత్ రూములోకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే కాంతారావు పెద్ద లైటు తీసి బెడ్ లైట్ వేసి, అలసటగా పక్క మీద వాలెడు.
అతని కనురెప్పలు బరువుగా వాలిపోతుంటే బద్దకంగా పక్కకు ఒత్తిగిలి చిన్న కునుకు తీసేడు.
అలా ఎన్ని నిమిషాలు గడచిందీ అతనికి తెలియకముందే ఎందుకో హటాత్తుగా కళ్ళు తెరచి చూసేసరికి కళ్యాణి అప్పుడే స్నానం చేసి, వంటికి ముదురు నీలం రంగు టర్కీ టవలు చుట్టుకుని వచ్చింది.
ఆమె శరీరం నుండి వస్తున్న పియర్స్ సోపు వాసన అతని నిద్రమత్తు ను కాస్తా చెదర గొట్టేసింది.
'ఏమిటలా చూస్తారు? అప్పుడే నిద్ర పట్టేసిందేమిటి? ఏదీ మీరు కొంచెం అవతలకు జరగండి. అక్కడున్న చీరా, జాకేట్టూ తీసుకోవాలి.' అంటూ అతని మీదుగా వంగి సూట్ కేసు మీద చెయ్యి వేసింది కళ్యాణి.
ఆ భంగిమ లో కళ్యాణి రూపం పిచ్చేత్తించింది కాంతారావు ని- ఆమె తప్పించుకోవడానికి అవకాశం లేకపోయింది.
కళ్యాణి కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లవారు ఝామున నాలుగు గంటలు కావస్తోంది. అనాచ్చాదంగా ఉన్న తన శరీరాన్ని చూసి సిగ్గుపడి , లేచి కూర్చుంది. వెంటనే పక్కనే ఉన్న కాంతారావు నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని లేచింది.
కొన్ని గంటల క్రితం అనుభవించిన మధురావేశాల తాలూకూ చాయలింకా ఆమె శరీరాన్నావరించి ఉండటం వల్ల ఆమెకేదో మత్తుగా, నిస్సత్తువగా ఉన్నట్లయి అరమోడ్పు కండ్లతో తూలుతూ మంచం దగ్గరకు వచ్చి భర్త పక్కనే కూర్చుంది మంచం మీద.
అప్పుడే కళ్ళు తెరిచి చూసేడు కాంతారావు . ఎదురుగా పల్చని నైలాన్ చీర మడతల మధ్య పొంగి పోరలుతున్న యౌవనం లో మత్తుగా, కూర్చున్న కళ్యాణి ని చూస్తుంటే అతని శరీరం లోని రక్తం మళ్ళీ వేడెక్కింది. 'కళ్యాణి! ఏమిటివాళ యింత అందంగా ఉన్నావు? నువ్వు నా కళ్యాణి వేనా? లేదా యీ భూలోకంలోకి నాకోసం వచ్చిన అప్సరసవా?' అంటూ ఆమెను తన మీదకు లాక్కున్నాడు. నిద్రమత్తులో. కళ్యాణి నరాలు వశం తప్పి, అతనిని లతలా అల్లుకు పోయింది. కళ్యాణి! మనం యీ ప్రయాణం చేయటం ఎంత మంచిదయిందో తెలుసా? నీలో రోజు కోక కొత్త అందాన్ని చూస్తున్నాను.... నిన్నే భంగిమ లో చూసిన సమ్మోహితుడినై పోతున్నాను. మన పెళ్ళి కాకముందు కూడా నేను నిన్నింతగా ప్రేమించ లేదేమో! మానసికంగా , శారీరకంగా కూడా నీ మీద నాకు క్షణక్షణానికి కోరిక పెరుగుతోంది.' అంటూ ఉద్రేకంగా యేమేమో మాట్లాడుతుంటే ఏదో కలలో లా ఆ అనుభవాన్ని ఆనందించి, సొమ్మసిల్లి, మరల నిద్రలోకి ఒరిగి పోయింది కళ్యాణి.
మళ్ళీ యిద్దరికీ మెలకువ వచ్చేసరికి బాగా తెల్లవారిపోయింది.
రాత్రి కలిగిన మధురాను భవాల తీవ్రత, యింకా వారి శరీరాలను విడవనంటుంటే ఒకరినొకరు హత్తుకుని, ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ పడుకున్నారు కాసేపు. విడివడిన తన వెంట్రుకలను సర్దుతున్న అతని చేతి వ్రేళ్ళ స్పర్శ లోని ఆనందాన్ని అనుభవిస్తూ 'ఏమిటి, మీరు రోజు రోజుకీ మరీ కుర్రవాడిలా తయారవుతున్నారు? రాత్రి మీ ప్రవర్తన గుర్తుకొస్తే మీ ముఖం చూట్టానికే నాకు సిగ్గు వేస్తోంది.' అంటూ తన ముఖాన్ని అతని గుండెల్లో దాచేసుకుంది కళ్యాణి.
"ఈ క్షణాలు కదలకుండా శాశ్వతంగా యిలాగే ఉండిపోతే, ఎంత బాగుండును కళ్యాణి!' అన్నాడు కాంతారావు.' మరి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా మత్తుగా కదలి నయ్, హటాత్తుగా కేవ్వుమన్న పాప ఏడుపు విని భర్త కౌగిలి నుండి యివతలకు వచ్చింది కళ్యాణి. పాప ఏడుపుకు బాబిగాడు కూడా లేచి, 'అమ్మా' అంటూ పిలిచేడు. తమ మధుర క్షణాలకు భంగం కలిగించిన ఆ యిద్దరూ తమ కడుపున పుట్టిన పిల్లలు కాబట్టి సరిపోయింది కాని మరేవరయినా అయినట్లయితే నిలువునా చంపేసేవాడు కాంతారావు.
కళ్యాణి పిల్లలను ఎత్తుకుని లేచి, కాలక్రుత్యాలన్నీ ముగించేసింది. అందరూ తయారై ఎనిమిది గంటల కల్లా ఫలహారం ముగించి, టాక్సీ లో మద్రాసు నగరాన్నంతటినీ వోసారి కలియజూసేరు. మ్యూజియం , జు, పార్కులన్నీ చూసేరు. మధ్యాహ్నం వరకు. మ్యూజియం, జు రెండు కూడా హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియం జూలాజికల్ పార్కుల కంటే యేమంత గొప్పగా లేవని భార్యాభర్తలిద్దరూ ఏకగ్రీవంగా తీర్మానించేరు మ్యూజియంలో కొన్ని పేంటింగ్స్ మాత్రం బాగున్నాయంది కళ్యాణి. అక్కడి మెట్లన్నీ ఎక్కి దిగి వచ్చేసరికి కళ్యాణి కాళ్ళు పీకుతున్నాయంటూ గోల పెట్టింది.
'మనం పొందిన ఆనందాన్ని గుర్తుకు తెచ్చుకుని , ఈ కాళ్ళ నొప్పులు మర్చిపోవటానికి ప్రయత్నించు' అంటూ భర్త వోదార్చేడు.
అప్పటికి భోజనం టైము అవటం వల్ల అక్కడే ఉన్న టూరిస్టు బస్సు గైడును దగ్గరలో మంచి హోటలేముంది? అని అడిగేడు కాంతారావు.
'అశోకా హోటల్' అని సమాధానమిచ్చేడు గైడు. పది నిమిషాల్లో కరకర లాడే కడుపులతో హోటల్లో కి వెళ్ళి కూలబడ్డారు. ఎయిర్ కండిషన్డ్ రూములు, ఖరీదైన ఫర్నిచర్ తో ఉన్న అ హోటల్లో కి ఎండకి మాడిపోయి, వాడిపోయిన వదనాలతో నీరసంగా ప్రవేశించి భోజనానికి అర్దరిచ్చేరు.
