"ఇదిగో నిన్నే.....బాత్రూంలో ఆరగతీసిన సబ్బు చాల్లేగానీ తొందరగా బయటకు రాలే. ఇరవై రూపాయలు పెట్టికొన్న సబ్బు....
మొత్తం అరగతీసిన సబ్బు చాల్లేగానీ తొందరగా బయటకు రాలే. ఇరవై రూపాయలు పెట్టి కొన్న సబ్బు...
మొత్తం ఆరగదీయకు, నా మొహానికి క్కాస్త ఉంచు "బాత్రూంకు ఇటువైపు నుంచి గట్టిగా కేకేసి చెప్పాడు శ్రీచరణ్.
ప్రనూష ఉదయమే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేస్తోంది శ్రీచరణ్ కంగారుగా లేచి, ఆఫీసుకు టైమయిందన్న విషయం గుర్తొచ్చి అరిచేసాడలా.
బాత్రూం లోపల స్నానంచేస్తోన్న ప్రనూషకు వళ్ళు మండింది. స్నానం ఎట్లీస్ట్ అరగంటయిన చేయకపోతే చేసినట్టుండదు తనకి. ఇలా శ్రీచరణ్ బయట్నుంచి కేకేస్తోంటే వళ్ళు వుండి, కసిగా ఆ కోపాన్ని సబ్బు మీద చూపించింది బండకేసి బరబరా సబ్బును చివరికంటా ఆరగదీసింది.
"దీంతో తిక్కకుదుర్తుంది ఆ మనిషికి అనుకుంది. నీళ్ళ ధార ఆమె శరీరం నుంచి కారుతూ, తెల్లటి ఆమె శరీరానికి అద్భుతమైన ఆకృతిని కలుగజేస్తోంది. నాసికపై భాగం నుంచి జాలువారిన నీటి చుక్కలు, పలుచటి ఆమె పెదాలను చేరి, అక్కడినుంచి కంఠం దగ్గరికి వచ్చి, ఎత్తయిన ఆమెవక్షసంపద మధ్య ఉక్కిరిబిక్కిరై ఆ సౌందర్యాన్ని చూస్తే మాటరాక, మౌనంగా ఆమె నాభిని చేరి, అలా....గే....కిందికి జారి నేలపై రాలిపడుతున్నాయి నీటి చుక్కలు...
తలుపు విసురుగా తీసుకొని బయటకు వచ్చింది. అర్ధగంట తర్వాత వంటికి టర్కీ టవల్ గుండెల మీదుగా వుంది. మోకాలి కింద భాగం నున్నగా మెరుస్తూ కనిపిస్తోంది.
ఒక్క క్షణం శ్రీచరణ్ అలాగే ఆమె అర్ధనగ్న సౌందర్యాన్ని చూస్తూండిపోయాడు.
"ఛీ....ఛీ...ఆడాళ్ళు స్నానం చేసి వస్తే, చొంగ కార్చుకుని చూసే మనుష్యులంటే నాకు పరమ రోత...." అంది ఈసడింపుగా.
"అబ్బా....మరి తగుదునమ్మా అంటూ నేప్ కిన్ లాంటి టర్కీ టవల్ ముక్క వంటికి చుట్టుకున్నప్పుడు ఏమైందో ఆ రోత? అయినా ఆ ఎగ్జిబిషనెందుకో ఇంతోటీ సెక్సీ లెగ్స్ ఇంకెవరికీ లేనట్టు...బోల్డు చూసాను..." అన్నాడు కోపంగా తన నెత్తిమీద వెంట్రుకలను చేత్తో చూపిస్తూ!
"మరే....ఆడాళ్ళు ఎప్పుడు కాళ్ళెత్తుతారా? ఎప్పుడు వాళ్ళ కాళ్ళు, పిక్కలు చూద్దామా? అని ఎదుర్చూసే దరిద్రపు జబ్బు కూడా వుందన్నమాట..." అంది విసురుగా.
"అర్రె... ఎంత బాగా కనిపెట్టావు....రోజూ ఉదయమే ఓటర్లలిస్ట్ తయారుచేసే టైప్ లో ఇంటింటికీ వెళ్ళి ఏవీ మీ పెక్సీలెగ్స్ చూపించండి ప్లీజ్..." అని అడుగుతా....నీకు తెలియదా?" అంటూ బాత్రూంలోకి దూరి డోర్ వేసుకున్నాడు శ్రీచరణ్.
వెంటనే బయట్నుంచి బోల్టు వేసేసింది ప్రనూష.
"ఏయ్..ఏం చేస్తున్నావు?" అడిగాడు లోపల్నుంచి శ్రీచరణ్ కంగారుగా.
ణ్ణేఊ బట్టలు మార్చుకోవాలి" అంది ప్రనూష.
"దానికి, డోర్ బోల్ట్ వేయడానికి ఏంటి లింకు?"
"నువ్వసలే కోతివి, కావాలని వచ్చినా అందాలు చూస్తావు" అంది.
"అవునవును...నీ అందాలన్నీ ఫ్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చెక్కిన కళా ఖండాలు..." అన్నాడు లోపల్నుంచి.
ప్రనూష "మాట్లాడకుండా బట్టలు మార్చుకుంటోంది.
"రేపట్నుంచీ తనీ రూమ్ లో బట్టలు మార్చుకోకూడదు....బాత్రూం కూడా ఇది యూజ్ చేయకూడదు." అనుకుంది.
లోపల శ్రీచరణ్ మొహానికి సబ్బు రాసుకోబోయి...షేవ్ షింకయి "మినీసోప్"గా మారిన సబ్బు బిళ్ళ వంక చూసి గుండెలు బాదుకున్నాడు.
కసిగా చుట్టూ చూశాడు. ఓ మూలకు షాంపూ వుంది. అది ప్రనూష పుట్టింటి నుంచి తెచ్చుకున్న షాంపూ.
వెంటనే సగం డబ్బా నెత్తిమీద ఒంపుకొని, తలకు బాగా దట్టించాడు....నురగ మొత్తం తలకు చుట్టుకుంది. మరికొంత షాంపూ వళ్ళుమండి వంటికి కూడా పట్టించాడు.
అరగంట తర్వాత తృప్తిగా బయటకు వచ్చి... అద్దం ముందు నిలబడి చుట్టూ చూశాడు. ప్రనూష లేదు.
"హమ్మయ్య ఈ దెయ్యం లేదు" అనుకుని వంటిమీద వున్న ఒకే ఒక ఆచ్చాదన అయిన టర్కీ టవల్ ని మంచమ్మీద గిరాటేసి అండర్వేర్ వేసుకోబోయాడు.
బీరువాలో మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకొని వెనక్కి తిరిగిన ప్రనూష దృష్టిలో ఆ సీన్ పడింది.
వెంటనే కెవ్వున కేకవేసింది.
శ్రీచరణ్ ఉలిక్కిపడి ఝాడుసుకుని, ప్రనూషవైపు చూసి "ఛీ...ఛీ..." అంటూ కంగారుగా టవల్" అందుకున్నాడు.
ప్రనూష గట్టిగా కళ్ళు మూసుకొని బయటకు నడిచింది.
డ్రెసప్ అయిన శ్రీచరణ్ డైనింగ్ రూమ్ లోకి వచ్చాడు.
ఓ కన్నుమూసి, మరో కంటితో ఓరగా చూసింది ప్రనూష.
శ్రీచరణ్ కోపంగా అది చూసి....ఏంటలా చూస్తావ్ అని అడిగాడు.
వెంటనే ఫక్కున నవ్వి, ఆ వెంటనే చేతిని మూతికి అడ్డుగా పెట్టుకుంది.
"సిగ్గులేకపోతే సరి...కావాలనే బీరువా చాటుకు నక్కి నేను "దిశమొలతో వున్నప్పుడు చూడాలన్న కోరికను తీర్చుకొని ఛీ....యాక్....నన్నడిగితే, రాత్రే చూపించే వాడినిగా..." అన్నాడు కచ్చగా శ్రీచరణ్.
"ఛీ.... యాక్...." అంది ప్రనూష.
మాకూ అనడం వచ్చు అని మరింత గట్టిగా "ఛీ...యాక్..." అన్నాడు.
ఇద్దరూ మొహాలు తిప్పుకున్నారు.
బ్రెడ్ స్లయిస్ తిని లేచాడు శ్రీచరణ్.
ప్రనూష కూడా అవే తింది.
"నేను ఆఫీసుకెళ్ళి తగలడాలి...ఒ'గా తిని... శుభ్రంగా పడుకో...మనకు మరో పనేముంది?" అన్నాడు శ్రీచరణ్.
"ఏం దెప్పక్కర్లేదు. మేమూ చూసుకుంటాం...ఉద్యోగం నువ్వయితే జాగ్రత్తగా వెళ్ళిరా...అన్నట్టు టర్కీ టవల్ కూడా బ్రీఫ్ కేస్ లో పెట్టుకెళ్తున్నారా?"
ఎందుకు? అనుమానంగా అడిగాడు.
"అక్కడ కూడా నీ ఫ్యాంటూ, షర్ట్ విప్పి, మీ మేనేజర్ ముందు నీ టాలెంట్ చూపిస్తారేమోనని..."
ఒళ్ళు మండింది శ్రీచరణ్ కు. అయినా ఆఫీస్ టైమ్ అయిపోవడంతో తమాయించుకుని... బయటకు నడిచాడు.
వెళ్ళేప్పుడు....వెళ్ళొస్తా ప్రనూ..." అని చేయి ఊపి, దగ్గరకు తీసుకొని, ముద్దు పెట్టుకుని 'బై' చెబితే సొమ్మేంపోయిందో అనుకుంది ప్రనూష.
ఆమె వూహల్లో ఆ ఆలోచన ఎప్పుడూ మెదులుతూ వుంటుంది. భర్తకు తను దగ్గరుండి ఎ టు జడ్ చూసుకోవాలి.
ఆఫీసుకెళ్తూ....తననిదగ్గరకు తీసుకోవాలి. తనని విడిచివెళ్ళలేక.... వెళ్ళలేక...వెళ్ళాలి. వెళ్ళే ముందు తన నుదుటి మీద ఓ ముద్దు కూడా పెట్టుకోవాలి...."
అలా ఆమె ఆలోచిస్తూ వుండగానే శ్రీచరణ్ స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.
