ఆసక్తిగా వింటుంది కిన్నెర.
"ఓరోజు నేను కారిడార్ లో నడుస్తూ సదరు అమ్మాయి మరో స్నేహితురాలితో అంటుంటే విన్నాను. లైబ్రరీ కెళ్ళి వరూధిని ప్రవరాఖ్యం తెచ్చుకోవాలె అని. వెంటనే నేను ఓ కవరు కొని లోపల 'ఐ లవ్యూ' అని రాసిన ఓ కాగితాన్ని ఉంచాను. వాడి చిరునామా గట్రా కవరు మిద స్పష్టంగా రాసి చాలా వేగంగా లైబ్రరి కి వెళ్ళి ఆ వరుధుని ప్రవరఖ్యం పుస్తకంలో ఉంచాను. ఆ అమ్మాయి ఓ అరగంట తర్వాత మాములుగా వచ్చి పుస్తకం తీసుకుంది. అందులోని కవరును చూసింది. ఆ చిరునామా ప్రకారం హాస్టల్ కి తెచ్చి వాడికి ఆ కవరు అందించింది. అంతే! అలా పరిచయమైపోయిందిద్దరికి. ఇక్కడ నేను చేసిన పొరపాటు ఆ కవరు నేనే ఎడ్రసుతో అంటించి ఆ పుస్తకంలో వుంచానని మావాడికి చెప్పకపోవడం ఆ చిన్న కమ్యూనికేషన్ గేప్ తో తెచ్చిన అనర్ధం వాడు అదే సాయంకాలం ఉడిన ఓ పన్ను కట్టించుకోవటానికి డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళడం.......అంతే గట్టిగా చలించిందా అమ్మాయి."
"సో.....మీకు ఆదినుంచి ఇలా లైబ్రరీ పుస్తకాల్లో లేటర్సుంచడం అలవాటేనన్నమాట.!"
"కాబట్టే ఇందాక నేను చెప్పిన జోక్ లోని చివరి భాగం నాకు జరక్కుండా నిన్న మీనుంచి పారిపోయింది."
పకాల్న నవ్వింది కిన్నెర.
ఆ తర్వాత హటాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది.
చాలా చాలా మాట్లాడాలనుకునే యిద్దరు వ్యక్తులు ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ప్రేమ అలంకరించే ఓ అబ్బాయి అమ్మాయిల మధ్య అనివార్య విరామం.
"ఏమిటి?" మళ్ళీ రాఘవే అన్నాడు. "రుకావట్ కేలియే భేద్ హై లెదూ సారీ ఫర్ ఇంటరప్షన్ టైపులో మౌనంగా వుండిపోయారే!"
"నమ్మలేకపోతున్నాను."
"టి.వి.కార్యక్రమాల్లో ఇంటరప్షనా?"
"కాదు."
"మరి?"
"నేను నేనేనా అని?" నిజాయితీగా అనేయగలిగింది కిన్నెర.
నిజమే కొన్ని రోజుల వ్యవధిలో ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల్లో ఆమెలో చోటుచేసుకున్న మార్పు ఆమె ఉహాకి సైతం అందనిది. తను ఓ అబ్బాయితో యిలా మాట్లాడగలనని యిప్పటిదాకా ఆమెకు తెలిదు.
రాఘవ పరిస్థితి అలాగే వుంది. అసలు కిన్నెరలాంటి ఓ అరుదైన అమ్మాయికి తను చేరువకావటం యిప్పటికి నమ్మ్లేకపోతున్నాడు.
"ఫోన్ పెట్టేయనా?" బడలికగా అన్నాడు.
"లంచ్ టైమ్......బామ్మ ఎదురు చూస్తూ వుంటుంది."
ఇష్టమైన కవిత పూర్తిగా చదవకముందే బలవంతంగా ఎవరో చేతిలో నుంచి లాక్కుంటూన్నట్లనిపించిందమెకు "చివరగా ......"
"చెప్పండి"
"ఓ కవితచేప్పండి."
నిశ్శబ్దం......
"ప్లీజ్!" అభ్యర్ధనలా అంది. పది లిప్తల నిశ్శబ్దం.
"గరికపోచలాంటి బ్రతుకై తేనేం.....ఓ రోజు చిరు
గాలి అలతో స్నేహమెర్పడింది.......పందెం కాస్తే
పాట పాడే గొంతు నిస్తాను అంటే- వద్దమ్మా
స్పందించగల గుండె నివ్వమని నేస్తాన్ని కోరింది
అప్పుడు హృదయం అంది, నిర్జన వనంలో నిటా
రుగా నిలబడి నెచ్చలి కోసం కవితలల్లగల నేర్పూ
అబ్బింది......ఉన్నట్టుండి ఓ రోజు తుఫాను వచ్చింది.
గరికపోచ గుండె భయంతో ములిగింది పై కురికే
ప్రభంజనంలో ఎక్కడమ్మా 'చిలిపి అలా' అంటూ
కలవరపాటుగా పిలిచింది, కనిపిస్తేగా?
అడుకునేప్పుడు తప్ప పోరాడేటప్పుడు నీ ప్రియ
నేస్తాన్ని కానూ అంటూ నిక్కచ్చిగా చెప్పింది. నేల
కోరిగిన గరికపోచను చూసి సుడిగాలితో బాటు-
తనూ నవ్వింది మృతిలా ఆకృతిలేని కృతిలా--"
ఫోన్ క్రెడిల్ చేశాడు.
ఏదో అపశ్రుతిలా కాదు. స్పష్టంగా అర్ధంకాని భావమేదో స్పురిస్తుంటే మొన్నటి కవితలంతా ఆనందాన్ని పొందలేకపోయింది.
మనసేం యిలా అలజడి చెందుతుంది?
ఏమైంది?
మంగ కోసం ఆమె కేక పెట్టలేదు. మంగే పరుగున లోపలికి వచ్చింది.
"ఏమైందే?" అంది మంగ రూపాన్ని చూసిన కిన్నెర కంగారుగా......రోప్పుతుంది, భయంతో గుక్క తిప్పుకోకుండా జరగబోతున్న అనర్ధం గురించి చెప్పింది.
కలవరపాటుగా గొణుగుతూనే ఏదో గుర్తుకొచ్చినట్టు అమాంతం ఫోన్ అందుకుని బ్యాంకుకు ఫోన్ చేసింది.
వింటున్నదేవరో తెలిదు. అంత ఆలోచించే వ్యవధి లేదు. "వద్దు రాఘవా! నువ్వు లంచ్ కు రావద్దు."
"సారీ.....రాఘవ ఇందాకే బయలుదేరిపోయాడు.
అప్రతిభురాలై నిలబడ్డ కిన్నెర కళ్ళ నుంచి అప్పుడు రాలిందో నీటి బొట్టు.
ఇప్పుడెం చేయాలి?
అన్నయ్య ఆపలేడని తెలుసు. నాన్నను ఎదిరించగల సాహసం అన్నయ్యకు లేదు. అయినా కాలేజికి చేసింది. దొరకలేదు. ఎవరికో చెప్పింది అత్యవసర సందేశంలా.
పల్లెలోని జనం ఓ ఘోరానికి ప్రత్యక్షసాక్ష్యల్లా నిలబడి ఉన్న సమయంలో.....
