అతను త్వరత్వరగా అడుగులేస్తూ కాంతమ్మ ఇంటికి చేరుకున్నాడు.
అటూ ఇటూ చూసి తననెవరూ గుర్తించడం లేదని అనుకున్నాక లోపలికి దూరాడు.
డైరెక్ట్ గా వంటింట్లోకి వెళ్ళాడు.
బియ్యం కడుగుతున్న సుమతి అతన్ని చూసి ఠక్కున పైకి లేచింది.
"ఇక్కడున్నావా?" అన్నాడు ఏం మాట్లాడాలో తెలియక.
"ఇక్కడ గాక మీ ఇంట్లో వుంటాననుకున్నావా?" ఆమె అందంగా నవ్వుతూ చూసింది.
"మీ అమ్మ వుందా?"
"లేదని తెలిసే నువ్వొచ్చావని తెలుసు"
ఇక ఏమీ అభ్యంతరం కనిపించలేదు అతనికి. ఆమెను పొదవి పట్టుకున్నాడు.
"ఏయ్!ఏమిటిది?" అంటూ వుందేగాని అతన్నుంచి విడిపించుకోవడానికి ఆమె ఏ ప్రయత్నమూ చేయడం లేదు.
అతని ముఖం ఆమె ముఖాన్ని రాసి, మరింత కిందకు దిగి ఆమె గుండెల్లో కూరుకుపోతూ వుంది.
అతనికి తొందరెక్కువైంది. అందుకే ఏదో చేయబోయాడు. అందులోను అనుభవం లేనివాడు.
అతను ఏం చేయబోయేది ఆమె వూహించింది. కానీ అప్పుడే అంత దూరం వెళ్ళకు అని ఎలా చెప్పాలో తెలియక మౌనంగా వుండిపోయింది.
అతను మరింత ముందుకు ప్రొసీడ్ అయిపోతున్నాడు.
అందుకే అతన్ని నిలువరించాలని "షేక్ వెల్ బిఫోర్ యూజ్" అంది.
అతను ఆగాడు. మందు సీసాల మీద అలా వుండడం అతనికి గుర్తొచ్చింది. ఇప్పుడామె అలా అనడంలో అర్ధం ఏమిటో కూడా తెలిసింది. అందుకే ముందుకు దూసుకెళుతున్న అతను వెనక్కి తగ్గాడు.
"డైరెక్ట్ ఫర్ యూజ్" అని అతని రెండు చేతుల్నీ తన భుజాల మీద వేసుకుని పెదవుల్ని ముందుకు తోసింది.
అతను తన పెదవులతో వాటిని అద్దాడు.
ఆమె ఇక ఓపలేక తల మీద రెండు చేతుల్ని ఆన్చి కిందకు నెట్టింది.
ఇప్పుడు అతని ముఖం ఆమె గుండెల మధ్య వుంది. ముక్కుతో అటూ ఇటూ రాశాడు.
"ఇన్ గ్రెడియంట్స్" అని నవ్వింది.
అతను మాత్రం తన ముఖాన్ని అక్కన్నుంచి కదిలించలేక పోయాడు.
"నడుం" అంది ఇన్ గ్రేడియంట్స్ లిస్ట్ చదువుతున్నట్టు.
అతను మరింత కిందకి దిగాడు.
అనుభవాలను తనలో దాచుకోవడంతో ముడతలు ఏది కనిపిస్తున్నా ఆ భాగంలో అతని వేళ్ళు సాగుతున్నాయి.
"బొడ్డు" అంది మరికాసేపాగి.
అతని వేళ్ళు అక్కడి వరకు పాకి, ఆగిపోయాయి.
మరొకటి ఏదో చెప్పాలనిపించింది. సిగ్గు అడ్డం రావడంతో ఆమె నోరు పెగలలేదు.
అతనికి ఆమె ఏం చెప్పబోయి ఆగిపోయిందో తెలిసి, ఒక్కసారిగా పైకెగబాకి చెవిలో చెప్పాడు.
ఆమె ఒక్కసారిగా సిగ్గుపూలు పూసే చెట్టులా అయిపోయి, తన పూల బరువుకి తనే వాలిపోయినట్టు ముఖం దించుకుంది.
అతను ఆమెను గాఢంగా హత్తుకోవడంతో లోపలున్న కోరిక ఒక్కసారిగా చిట్లినట్లయి ఆమె మునికాళ్ళ మీద పైకి లేచింది.
ఇప్పుడతనికి తనకేం కావాలో అర్జెంట్ గా తెలిసి దాన్నందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
ఆమె పరిస్థితీ అంతే. అందుకే ఆమె అతన్ని మరింత గట్టిగా కౌగిలించుకుంది.
ఏదో కొత్తది అతనిలో వున్నట్టు ఫీలయింది.
అందుకే ఆమె అతని శరీరాన్ని తడుముతున్నదల్లా ఆగిపోయింది.
"కీప్ ఇన్ కూల్ ప్లేస్" అంది చివరి మాటన్నట్లు.
ఓ మందుసీసా పైనున్నవన్నీ బట్టీయం పెట్టినట్టు చెబుతున్న ఆమె వంక నవ్వుతూ చూసి ఆమె చెప్పినట్టే చేశాడు.
కాలానికి వాళ్ళిద్దరూ తాళం కప్పలై వేలాడుతున్నారు.
అప్పట్నుంచీ మొదలు. వీలు దొరికినప్పుడంతా నారాయణ, సుమతి ఇంట్లోకి దూరేవారు. పేకాట పిచ్చితో సుబ్బరామయ్య ఎప్పుడూ ఇంటి పట్టున వుండేవాడు కాదు. ఇక కాంతమ్మ పనిపాట కోసం వెళ్ళినప్పుడో, విస్తర్లను అమ్ముకోవడానికి టౌన్ వెళ్ళినప్పుడో వాళ్ళిద్దరికీ సమయం చిక్కేది. ఇంట్లోనే భాగోతం నడిపిస్తున్నారు కాబట్టి మూడో కంటికి తెలియదు. చివరికి కాంతమ్మ కూడా వ్యవహారం ఇంతదూరం వచ్చిందని పసిగట్టలేక పోయింది.
ఇలా జాగ్రత్తగా లాక్కొస్తున్న వాళ్ళిద్దరి కొత్త సంబంధానికి సడెన్ గా బ్రేక్ పడింది.
ఓరోజు సాయంకాలం సుమతి మంచినీళ్ళ కోసం బావికి వెళ్ళింది. ఒక్క బిందె కోసం చాంతాడు తీసుకెళ్ళడం ఎందుకులే అనుకుని కేవలం బిందె మాత్రం పట్టుకెళ్ళింది.
కానీ దురదృష్టం కొద్దీ బావి దగ్గర ఎవరూ లేరు. కొంతసేపు చూసింది గానీ ఎవరూ రాలేదు. దీంతో చాంతాడు కోసం పక్కనే వున్న రామచంద్రయ్య ఇంటికెళ్ళింది.
ఆ సమయంలో రామచంద్రయ్య భార్య పార్వతమ్మ ఇంటిముంచు కూర్చుని పూసలు కుట్టుకుంటోంది.
"ఏమిటే కోడలు పిల్లా! ఇటొచ్చావ్?" అని పలకరించింది. ఆమె పురుళ్ళు పోసే మంత్రసాని ఇప్పుడు చాలామంది స్త్రీలు హాస్పిటల్స్ కి పోతున్నా మరీ పూటకు గడవని వాళ్ళు ఇప్పటికీ పార్వతమ్మ దగ్గరే పురుడు పోసుకుంటున్నారు.
"ఏం లేదత్తా చేంతాడు కావాలి. ఓ బిందె చేదుకుని ఇచ్చేస్తాను"
"దానికి అడగాలంటే ఆ మూల వుంది తీసుకో"
సుమతికి అక్కడికి వెళ్ళగానే కళ్ళు తిరిగినట్టనిపించింది. వాంతులు వస్తున్న ఫీలింగ్. కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమై భళ్ళున వాంతి చేసుకుంది.
పార్వతమ్మ కంగారుగా ఆమె దగ్గరికి పరిగెత్తి కణతల దగ్గర చేతులుంచింది.
మరో అయిదు నిమిషాలకి తెప్పరిల్లింది సుమతి.
"ఏమిటే?" అని అడిగింది పార్వతమ్మ అనుమానంగా.
ఆమె అనుమానం ఏమిటో అర్ధమైంది సుమతికి. తనకీ అదే అనుమానం వస్తోంది.
