Previous Page Next Page 
పంచభూతాలు పేజి 24

    అపుడు పృద్వీరాజ్ "ఆ మాట నిజం! ఒకానొక ప్రఖ్యాతకవి కవిత బహుశా మీరు వినే వుంటారు -" అంధ గురువు; చెవిటి శిశ్యుడు. కొనిన బెల్లం - ఏరిన పేలాలు!
     "దప్పికగొన్న మనిషి మంచినీళ్లు అడిగినపుడు అతని ముందు గిన్నెడు నెయ్యి పెడితే యితరులకు నవ్వు రావడానికి యుక్తి యుక్త కారణం కనిపించదు. దప్పికగొన్నవారి కోరిక ప్రకారం అతనిముందు గ్లాసుతో మంచినీళ్లు పెడితే నవ్వడం .యుక్తి యుక్తంగా వుంటుంది. మనం ఆనందం అనుభవించగలం. కాని వెంటనే నేతిగిన్నె అతనిముందు తెచ్చి  పెడితే  నవ్వెందుకు వస్తుందో నాకు అర్దం కావడంలేదు. ఈ సుఖం,  ఆ కౌతుకం మధ్య యెంతో భేదం వుంది. ఈ రెంటినీ వేరు వేరు రూపాలుగా విభాగించుకోవాలి. అవసరాన్ని బట్టి ఖర్చు యెక్కువవుతూంది, అవసరం కూడా పూర్తిగా తీరకపోవచ్చు. ఇదీ ప్రకృతి విధానం. నవ్వుతో ఆనందం, కౌతుకం అనే రెండు కావ్యాలు నెరవేర్చుకోవడం ఉచితం కాదు" అని అన్నాడు.
     అపుడు గగన్ అన్నాడు: "ప్రకృతి శిరంమీద వ్యర్దదోష మోపుతున్నావు. ఆనందంలో మనం స్మిత హాసం చేస్తాం. కౌతుకంలో అట్ట హాసం చేస్తాం. భౌతిక జగత్తు, మెరపులతో వీటిని పోల్చవచ్చు. ఒకటి ఆందోళన జనితం, స్థాయీ, రెండవది సంఘర్షణ జనితం, ఆకస్మికం.  అటువంటి సిద్దాంతాన్ని వేరువేరు కారణాల ద్వారా ప్రకటిస్తారు. ఈ సిద్దాంతాన్ని మనదిగా చేసుకోవడం కోసం మనం సుఖకౌతుక హాస్యాలను కారణంగా తీసుకుంటాం."
     పవన్ దేవ్, గగన్ అధ్బుత కల్పన మీద ధ్యానం వుంచకుండా, "మనోరంజనం, కౌతుకం వాస్తవిక సుఖాలు కావు. అని నిమ్నతరగతి సుఖాలు. కొద్ది పరిమాణంలో దుఃఖం, పీడన మనచే తనమీద స్థానం కల్పించుకుంటే వాటివల్ల మనకు ఆనందం చేకూరుతుంది. ప్రతిదినం కష్టం లేకుండా మనం వంటవాడు వండిన బోజనం తింటున్నాం దానిని మనం మనోరంజనం అనము. కాని వనభోజనం చేసేరోజున మనం  నియమం వదిలిపెట్టి కష్టాన్ని సహించి ఆసమయంలో యోగ్యంగాని భోజనం చేస్తాం. దానిని మనోరజనం అంటాం. ఆనందం అంటాం. ఆనందంకోసం ఎంత కష్ట పడతామో  మన చేతనాశక్తి అంత తేజోవంతమౌతుంది. కౌతుకం కూడా ఆ శ్రేణికి మనోరంజన దుఃఖం, శ్రీకృష్ణుని గురించి  పూర్వం నా హృదయంలో గూడుకట్టుకున్న భావానికి విరుద్దంగా, కృష్ణుడు హుక్కాపట్టుకుని రాధ గుడిసెకు నిప్పుకోసం వెళ్లాడనే కల్పన నా పూర్వ భావనము గాయపర్చింది. ఆ అఘాతంవల్ల కొద్ది పీడ కలిగింది. కాని ఆ పీడ ఫలితం స్థిమితమవుతుంది. దీని పరిణామంగా మనకు దుఃఖం కలుగుతుంది మన చేతనకు హఠాత్తుగా చంచలం కావడం వల్ల దానికంటె అధిక సుఖం కలుగుతుంది. ఆ హద్దుకు కొద్దిగా నయినా దాటడం తెలిసిన మీదట కౌతుకం యదార్దపీడా రూపంగా పరిణమిస్తుంది. కాని వాస్తవిక భక్తికి కీర్తనకు అవసరం మీదట ఉద్దత విలాస ప్రియుడయిన బాలకుడు కృష్ణభగవానుని కాల్పనిక కృత్రిమ పిపాసను గానం చేస్తే దానివల్ల  నవ్వురాదు. ఆ క్షణం ఆ గాయం ఎంతో తీవ్రమవుతుంది శీఘ్రంగా అది క్రోధాన్ని, ఉత్తేజాన్ని రూపొందిచడానికి ఈ విలాసప్రియ బాలకుని వీవువేపు ప్రతిఘాతం సంకల్పంతో పరుగెత్తుతుంది. అందువల్ల చేతన, కౌతుకాల పీడనవల్ల నిజమయిన ఆనందం బహిర్గత మవుతుంది. ఉచ్చహాస్యంలో ఒక వస్తువున్నది. దాని పేరే ఆనందం. స్మితహాస్యం, ఆనందం కౌతుకాల చిహ్నం.
     ఈ హాస్యం హఠాత్తుగా గాయపు పీడతో శబ్దం చేస్తూ విరతి చెందుతుంది" అని అన్నాడు.      పృధ్వీరాజ్, "మనసుకు నచ్చే సిద్దాంతంతో పాటు, మనసుకు నచ్చే ఉపమానంకూడా యిచ్చినపుడు ఆ సంతోషంలో మనకు సత్యసత్యాల జ్ఞానం వుండదు. కౌతుక సమయంలో మనం కేవలం ఉత్తమ హాస్యం చేయమని అందరికీ తెలిసిందే. కాని స్మితహాస్యం కూడా చేస్తాం. అపుడపుడు మనసులోనే నవ్వుకుంటాం.  ఈ విషయం ముఖ్యంకాదు. కౌతుకం  మన  మనసులో ఉత్తేజం జనింపచేస్తుంది. చిత్త స్వల్ప ఉత్తేజం మనకు సుఖకారణమవుతుంది. మనలోపలా బయటా ఒక సుయుక్తి  యుక్తనియమం, శృంఖలాధికారం వున్నాయి. సమస్త వ్యాపారమూ చిరఅభ్యస్తమవుతుంది. ఈ అనుపమ నియత అంతర్గత మనసు నిస్సంకోచంగా తన కార్యకలాపం సాగిస్తుంటే దాని అస్తిత్వాన్ని మనం అనుభవిస్తాం కాని ఆ నియమిత  వ్యాపారంలో ఏదయినా నవీనతను సృష్టిస్తే మన చిత్త ప్రవాహం హఠాత్తుగా స్తంబించి దుర్నివార సౌందర్యం కోసం కాదు. స్వల్ప దుఃఖం కూడా కాదు. దీనికి కారణం కౌతుక విరుద్ద ఉత్తేజన మనల ఆనందదాయిని అనిపేరు పడడమే" అని అన్నాడు.
     అపుడు నేను అన్నాను: "కేవలం అనుభవంవల్లనే సుఖం లభిస్తుంది. కాని అందులో గురుతర స్వార్దహీనత లభించదు. భయభీతులు తెలుసుకోవడంలో కూడా సుఖం వుంది. కాని దాంతోపాటు వాస్తవిక భయానికి కారణం లభించదు. పిల్లలు భూతప్రేతకథలు శ్రద్దగా వింటారు. హృదయ కల్పనతో మనకు లబించే ఉత్తేజంవల్ల  మనచిత్తం చంచల మవడమే యిందుకు కారణం. ఆ చంచలత కూడా ఆనందదాయిని. సీతా వియోగంలో భగవాన్ రామచంద్రుని దుఃఖం  వల్ల మనకు  దుఃఖం  తెలిసివస్తుంది. తన కుమర్తెల కృతఘ్నతవల్ల గాయపడిన లీరు మహారాజు  కష్టం చూస్తూంటే మనం కూడా క్షోభించిపోతాం. కాని వారి కష్టాలవల్ల మన హృదయాలలో  దుఃఖం కలగకపోతే ఆ కావ్యాలు తుచ్చమయినవని ప్రతీతి వచ్చేదే. విషాదాంత కావ్యాలనే సుఖాంత కావ్యాల కంటే ఎక్కువగా ఆదరిస్తాం. ఎందుకంటే, దుఃఖానుభవంవల్ల మన చిత్రం ఆనందిస్తుంది. కౌతుకం మనసులో హఠాత్తుగా గాయంచేసిన  మన మామూలు అనుభవక్రియను జాగృతం చేస్తుంది. అందువల్ల రసజ్ఞులు మానవశరీర  ఆకస్మిక గాయాన్ని పరిహాసం అంటారు. బెంగాలీ స్త్రీలు వివాహాలలో కులదేవతా పూజా సమయంలో పెండ్లికొడుకు  చెవి పిండుతారు. ఆ   విధంగా పీడించడంలో మహదానందం వుంది. దీనికే హాస్యరసం అని పేరు పెట్టారు. హఠాత్తుగా బాంబు శంఖనాదం వినిపిస్తే  మన దేశంలో ఉత్సవంలో ఒక భాగం తెలుస్తుంది. దీనిని మనం భక్తిరసావతరణ అంటాం."
    పృధ్వీరాజ్, "ఆగు మిత్రమా! ఆగు! విషయం ఒక విధంగా సమాప్తమయింది. పీడనలో సుఖానుభూతి వున్నంతసేపు నువు దాని సరిహద్దును దాటడానికి వెళ్లావు. ఈ సమయంలో కష్టపడ్డావు.  మహబాగా అర్దమయింది - సుఖాంత హాసానికి, దుఃఖాంత అంశువులకు తారతమ్యం యెక్కువ" అని అన్నాడు.
     "మంచుగడ్డమీద మున్ముందుగా సూర్యకాంతి పడినపుడు అది తళ తళా మెరుస్తుంది. ఎంత తీవ్రంగా కాసేటపుడు అది కరిగిపోతుంది. కాదా మరి? సరే, ఒకటి రెండు హాస్యరస నాటకాలు, ఒకటి రెండు కరుణ రస నాటకాల పేర్లు తీసుకో - నాకు వాటిలో కూడా పోలికలు వెదకి వెలికి తీస్తాను   అన అన్నాడు గగన్ దేవ్.
     ఇంతలో ప్రకాశవతి, నిర్ఘరిణి నవ్వుతూ అక్కడికి చేరుకున్నారు. ప్రకాశవతి, "మీరు రుజువు చేయడానికి నడుం కట్టారెందుకు?" అని అడిగింది.
     దానిమీద పృద్వీరాజ్, "మీరిద్దరూ అకారణంగా విరగబడి నవ్వసాగారు. అందుకని రుజువు చేయడానికి సిద్దపడ్డాం" అని అన్నాడు.
     ఇది విని ప్రకాశవతి, నిర్ఘరిణి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. తిరిగి యిద్దరూ పక పకా నవ్వసాగారు.
     అపుడు గగన్ దేవ్,   "మనం 'సుఖాంతం' లో ఇతరుల అల్పపీడను చూసి నవ్వుతాం. "దుఃఖాంతం" లో  యితరుల అధికతర పీడను చూసి దుఃఖిస్తాం. అని రుజువు చేస్తున్నాను" అని అన్నాడు.
     ప్రకాశవతి, నిర్ఘరిణుల మధురహాసంతో గది తిరిగి ప్రతిధ్వనించింది. వ్యర్దంగా నవ్వుపొంగి పొరలుతూండడం మూలంగా వారిద్దరూ ఒకరినొకరు అదిలించుకుంటూ గది బయటకు వెళ్లారు.   

WRITERS
PUBLICATIONS