Previous Page Next Page 
పంచభూతాలు పేజి 23

 ప్రకాశవతి విరక్తిభావంతో అన్నది : "మీరు మీ గ్రీకు శిలా విగ్రహాల విషయం దూరంగా వుంచండి. వాటిని గురించి చాలా చాలా విన్నాను. బతికివుంటే యింకా చాలా వింటాను. మంచి వస్తువలలో కూడా దోషం వుంటుంది. సకలవేళలా భూమిమీద కళ్లయెదుట కనిపించేవాటికి పరదా వుండదు. సిగ్గు వుండదు. ఎవరూ ఆవిష్కరించనక్కరలేదు. అర్దం చేసుకోవటం కష్టం కాదు. వీటిని చూడడానికి కళ్లు పెద్దవి చేసుకోనక్కరలేదు. వాటిని గురించి ఒకటి రెండు గీతాలు మాటి మాటికీ పాడితే చాలు, వింటే చాలు, సూర్యుడు అపుడపుడు మేఘాల చాటున మరుగయి వుండడం బాగుంటుంది. లేకపోతే మేఘరహిత సూర్యుని ప్రబావం తెలిసిరాదు. ఈ భూమిమీద గొప్పవారి గౌరవ రక్షణకు అపుడపుడు వారు అవమానం మరుగున పడిపోవడం మంచిది. అపుడపుడు గ్రీకు శిలావిగ్రహాల అవమానజాలం చిక్కుకోవాలి. కాళిదాసు కంటె చాణుక్యుడు మంచి కవి అని రుజువు కావడం మంచిదే. కాని మన ప్రసంగానికి సంభించని విషయం యిది. తరచుగా భావ అభావమును, ఆచార బర్బరతను సరళమని చెప్పడం జరుగుతూంటుంది. ఇలా చెప్పి మనం పెద్ద పొరపాటు చేస్తున్నాం. అనేక సమయాలలో వ్యక్తీకరించే యోగ్యతా లోపమును భావాధికతా కల్పన కింద లెక్కిస్తాం. ఈ విషయం జ్ఞప్తిలో వుంచుకోవడం మంచిది."
     దానిమీద నేను అన్నాను : "కళావిద్యలోని సరళత వుత్తమ శ్రేణి మానసికోన్నతికి సహచరి. బర్బరతలో ఆడంబరం, హడావిడి అధికం.  బహుళ అలంకారం మనోవినోద దృష్టిలో మంచిదే. కాని మనసును వుదాసీనం చేస్తుంది. మన భాషలో సకల స్థానాలలో సరళత, ఉన్మాదహీనత లోపించినట్లు కనిపిస్తుంది. మనం గొప్పవారమై పంచమ స్వరంలో యింకా నృత్యం చేస్తూ పసందుగా వుందంటాం. ఏ ఆడంబరమూ లేకుండా సత్య విషయం విశుద్ద శబ్దాలలో ప్రకటించడం మనకు సరిపడదు. సత్యం ప్రాంజలి భాషలో మనముందు ప్రత్యక్షమయినపుడు  దాని గంబీరత మరుగున పడిపోతుంది. మనం దానిని చూడలేం. భావ సౌందర్యం కృత్రిమ భూషణాలతో,  రకరకాల అలంకారాలతో భారం కానంతవరకు మనం దానిని ఆదరించం"
      అపుడు పవన్ దేవ్ అందుకుని, "సంయయము సౌష్టవతకు ముఖ్య లక్షణం భద్రజనులు ఏదోవిధంగా గొప్ప వారయి తమ అస్తిత్వమును ప్రచారం చేసుకోరు. పదిమంది దృష్టిలో పడడానికి యత్నించరు. నమ్రతతో వారు తమ మర్యాదను రక్షించుకుంటారు. అనేక సమయాలలో సకల జనుల ముందు సంయత నమ్రభావాలకంటే ఆడంబర,  కృత్రిమాలంకారం యెక్కువ ఆదరణ పొందుతాయి. అవి వారిని ముందుగానే ఆకర్షిస్తాయి. కాని అది సభ్యతా దురదృష్టం కాదు .సకల జనుల దురదృష్టం. సాహిత్య ఆచార వ్యవహారాలకు సంయమోన్నతి  ముఖ్య లక్షణం. అతిశయ ఆడంబరాల దృష్టి ద్వారా ఆకర్శించే చేష్టబర్బరత," అని చెప్పాడు.
    "ఒకటి రెండు ఆంగ్ల విషయాలు చెప్పదలచాను. క్షమించండి. భద్రజనులలోలాగానే సభ్యాసాహిత్యంలో కూడా పిచ్చి అలవాట్లు లేవు. మంచి సాహిత్యంలో విశిష్టమయిన ఆకృతీ, ప్రకృతులు వున్నాయి. నిజమే, కాని అందులో వుండే సౌందర్యం ఆకృతీ, ప్రకృతుల విశేషత కారణాన దృష్టిపధంలో  పడదు. దానిలో భావం, నిగూఢ ప్రభావం వుంటాయి. కాని ఏ అపూర్వభావ భంగిమా వుండదు. తరంగభగ్నత లేకపోవడం వల్ల తరచుగా పరిపూర్ణత కూడా మరుగుపడిపోతుందతి. పరిపూర్ణత మరుగున పడకపోయినపుడు తరంగాలు కూడా జనులను విచలీతులను చేస్తాయి. పరిపూర్ణ ప్రాంజలత సహజమయిందని, అసంపూర్ణతా వైభవం దుర్ఘటమని ఎవరూ పొరపడరు" అని నేను అన్నాను.
     నిర్ఘరిణివేపు తిరిగి నేను, "ఉన్నత సరళ సాహిత్యం తెలుసుకోవడం తరచు కష్టం. మనస్సు దానిని తెలుసు కుంటుంది గాని తనంతట తానుగా అది మనకు తెలియజేసుకోదు.' అని అన్నాను.
     అపుడు, ప్రకాశవతి, "జైహింద్! ఇవాళ నేను ఎంతో నేర్చుకున్నాను. ఇక యెప్పుడూ, ఏ మహా పండుతుని ముందూ ఉత్తమ తరగతికి చెందిన సాహిత్యం మీద అభిప్రాయం వెల్లడించి బర్బరతను ప్రకటించను' అని అన్నది.
    నిర్ఘరిణి ఆ ఆంగ్లకవి పేరు చెప్పి, మీ రెంత చర్చించి తుఫాను రేపినా, యెంతగా నిందించినా ఆ కవి రచన నాకేమాత్రం నచ్చదు" అని అన్నది.

                                    కౌతుక హాస్యం

     శీతాకాలం, వేకువజాము, వీధులవెంట తిరిగి అమ్ముకొను అబ్బి, 'ఖర్జూరరసం' అంటూ కేకలు వేస్తూ వెళుతున్నాడు. పొగమంచు మసక ఇంకా వీడిపోలేదు. బాల సూర్యకిరణాలు నీలి ఆకాశం నుంచి తొంగి చూస్తున్నాయి. పవన్ దేవ్ తేనీరు తాగుతున్నాడు. పృద్వీరాజ్ పత్రిక చదువుతున్నాడు. గగన్ దేవ్ బహురంగుల మఫ్లరు మెడకు చుట్టుకుని గట్టి మోటు లాఠీ పుచ్చుకుని అపుడే హాజరయాడు.
    సమీప ద్వారంలో నిలబడి నిర్ఘరిణి, ప్రకాశవతి ఒకరికొకరు గదివేపు చేతితో చూపిస్తూ ఏదో విషయం మీద విరగబడి నవ్వుతున్నారు.నీలి దుప్పటిచాటున గగన్ దేవ్ ఈ పక పక నవ్వులకు మూల కారాణమని పృద్వీరాజ్, పవన్ దేవ్ గ్రహించారు.
     ఇంతలో గగన్ దేవ్ ధ్యాసకూడా ఆ  పక పక నవ్వులవేపుకు మళ్లింది. కుర్చీ మా వైపుకు తిప్పుకుని; "ఇద్దరు స్నేహితురాండ్రు  యెగతాళి చేస్తూంటారు. కాని నిజానికి అదంతా మాయయిని అన్నీతెలిసినవారు కూడా బ్రమపడుతుంటారు. బ్రహ్మ పక్షపాత బుద్దితో పురుష జాతికి మినహా హస్య ప్రసంగానికి నవ్వే తాహతు ప్రసాదించలేదు. కాని స్త్రీలకు కూడా అటువంటి తాహతు వుంది. వారే నవ్వగలరు.  అందువల్ల నవ్వుతారు. ఈ విషయం విధాతకు కూడా తెలియదు. మానవబాష ఆయనకు మాయమయిపోయింది. చెకిముకి రాయిలో ప్రాకృతి కాగ్ని కణం కూడా వుండదు. కాని దానిని జోరుగా ఒరిపిడి పెడితే మంట బయలుదేరుతుంది. కాని మాణిక్యం ముక్క తనకు తానే ప్రకాశిస్తుంది. స్త్రీలకు మామూలు మాటలకే నవ్వడం తెలుసు. అంతేగాదు, అకారణంగా ఏడిపిస్తారు. కారణం లేకుండా కార్యం వుండదు. ఈ కఠిన నియమం కేవలం పురుషులకే "అన్వయిస్తుంది" అని అన్నాడు.
     పవన్ దేవ్ టీ కప్పు నింపుకుంటూ "స్త్రీల విషయమే కాదు. హాస్యరసం అసంగతమని ప్రతీత. దుఃఖంలో యేడుస్తారు, సుఖంలో నవ్వుతారు. ఇది నాకు బాగా తెలిసిన విషయం .కాని ఎగతాళికి మనమెందుకు నవ్వుతామో అర్దం కావడం లేదు. ఇది నిజానికి సుఖం కాదు. మోటు శరీరం గల మనిషి చిన్ రాతిపలక తగిలిపడితే మనకేం సుఖం కలగదు. కాని ఆ  సంఘటనకు మనం నవ్వకుండా వుండలేము. ఇదంతా ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది" అని అన్నాడు.
     అపుడు పృద్వీరాజ్ అన్నాడు : "నీ ఆలోచన దూరంగా వుంచుదూ! ఆలోచన లేకుండా ఆశ్చర్యం గొలిపే విషయాలు ఈ ప్రపంచంలో చాలా వున్నాయి. వాటిని గురించి ముందుగా ఆశ్చర్యపడితే ఆ వెనుక ఆలోచించి ఆశ్చర్యపడతాం. ఇంటిలో తివాసీ శుభ్రం చేయడానికి యెంత పిచ్చివాడయినా ముందుగా వూడుస్తాడా! ఉందులో అతనికి సంతోషం  కలగకపోతే పారతో గీకుతాడు. నేలను గీకితే  ధూళి ఆకాశంలోకి యెగిరిపోతుంది. శుబ్రమయిన తివాసీ లభిస్తుందని అతని భావం -  అతని కష్టమంతా నిరర్దక మవుతుందని వేరే చెప్పాలా? భాయీ! పవన్  దేవ్! ఆశ్చర్యం మీది బాగమును తుడిచివేస్తే చివరకు ఆలోచించి ఆశ్చర్యపడడం ప్రారంభిస్తే నా మిత్రమండలి వదిలిపెట్టడం మంచిది."
     పవన్ దేవ్ నవ్వుతూ, "భాయీ పృద్వీరాజ్! నా కంటె నువు ఎక్కువగా ఆలోచిస్తావు. కాని బాగా ఆలోచించి చూస్తే నువ్వే ప్రపంచంలో ఆశ్చర్యకరమయిన వస్తువులా వున్నావు. నువ్వు  అధికంగా ఆలోచించకపోతే ఆ తివాసీ శుభ్రం చేసే వ్యక్తి ఆదర్శంగా తీసుకుని నన్ను వానితో పోల్చడానికి దిగేవాడవే కావు" అని అన్నాడు.
    పృద్వీరాజ్ "క్షమించు నువునా చిరకాలమిత్రుడివి. అందుకని నా మనసులో యింత  సందేహం కలిగింది. ఎగతాళికి మనం యింతగా నవ్వుతా మెందుకు, అనేదే ప్రశ్న.  మంచి విషయమేమీ నా ముందుకు రాలేదు. ఆ సమయంలో నా గొంతులో నుంచి విచిత్ర శబ్దం బయటకు వస్తే నా దంతాలు విచ్చుకుంటాయి. మనుష్యునితో సమానమైన సభ్య జీవికి అటువంటి అసంగత  అసంయుత ముఖాకృతి తక్కువ ఆశ్చర్యం గొలుపుతుందా? అవమాన విషయం కాదా? సప్తసముద్రాలు దాటడానికి జనులు భయ, దుఃఖ చిహ్నాలు ప్రకటిస్తే సిగ్గు చెందాలి. మన ప్రాచ్యజాతియొక్క సబ్య సమాజం కూడా యిలా లజ్జపడుతుంది," అని అన్నాడు.
     పవన్ దేవ్ మధ్యలోనే పృద్వీరాజ్ ప్రసంగాన్ని ఖండించడానికి, "మన మతానుసారం కౌతుకానికి మనో వినోదం తెలియడం అసంగతం, భ్రాంతి మూలకం కావడమే దీనికి కారణం. ఇది పిల్లలకు శోభ చేకూరుస్తుంది. అందువల్ల కౌతుక పరిమాణాన్ని మన దేశ మహా  పండితులు పసితనమని  ఏవగించుకుంటారు. కృష్ణుడు నిద్రలేచి చేతిలో హుక్కా పట్టుకుని రాధ గుడిసెకు నిప్పుకోసం వెళ్లాడని ఏదో గీతలో విన్నాను. ఆ మాటలు విని శ్రోతలు విరగబడి నవ్వారు. కాని యెవరికీ ఆనందం చేకూరలేదు. అయినా మేము అపుడు నవ్వాము. ఇంతలో ఆనందం లబించిన మా  ఆ ఆచరణ హాస్యయోగ్యం అకారణం అయితేనేం? అందువల్ల మన పండితలోకం ఈ విధమైన చపలతను ఆమోదించదు. కౌతుక హాస్యం ఒక విధమైన శారీరక ఆచరణ. ఇది మానవ కండరాలను ఉత్తేజ పరిచేది మాత్రమే. దానితో మన సౌందర్య పరిజ్ఞానానికి సంబంధ మేమీలేదు. అందుకని వ్యర్దమయిన మామూలు కారణాలను తీసుకొని కొద్దిసేపు బుద్దిని గూటిలో పెట్టడం దండోపాయం పరిత్యజించడం పండితులకు నిస్సందేహంగా సిగ్గుచేటు" అని అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS