Previous Page Next Page 
అర్పణ పేజి 23

                                     
    కుర్చీలో కూర్చుని అరగంట నుండి ఏదో అడగాలనే గుంజాటన లోనే తపించి పోతుంది పార్వతి. ఎదురుగా చాప మీద సుభద్ర కూర్చుని చేతిలోని భాగవత గ్రంధాన్ని దీక్షగా చదువుతున్నది.
    అలసట వల్ల పార్వతి చెంపలు , కనురెప్పలు తడిశాయే కానీ అడగాలని ప్రయత్నించిన దేదో అడగలేకనే పోయింది.
    ఈ మధ్య సెలవదొరికితే పార్వతి కాలు ఇంట్లో నిలవడం లేదు. ఎప్పుడూ సుభద్ర తోనో, రాధాకృష్ణ తోనో మాట్లాడాలన్న తపనే.
    బరువు బాధ్యతలు నెమ్మది నెమ్మదిగా భుజాల మీదకు పాకుతున్నప్పటి అవిరామ శ్రమ వాళ్ళను ఆత్మీయులుగా మారుస్తూ ఉంది -- పార్వతి అవ్యక్తాంతర్యపు మేరకు.
    అది నుంచి చేస్తున్న ప్రయత్నమంతా అడవి దారి పట్టింది.
    సుభద్ర మెల్లగా రాగ ధోరణి లో పార్వతికి భాగవత పద్యాలు వినిపించడానికి సంసిడ్డు రాలైంది.
    పార్వతి మౌనంగా ఉన్నదనే సంశయం తో "నువ్వెప్పుడైనా భాగవతం చదివావా, పార్వతీ?" అన్నది మెల్లగా ఆవిడ.
    "ఇంకా ఆ జోలికి వెళ్ళలేదండీ , ఎప్పుడూ . జీవితంలోనే నిలవని సౌఖ్యాలు, ఆశలు ఈ పురాణ గ్రంధాల్లోనూ , ఇతి హసాల్లో నూ ఉంటాయంటే నమ్మలేను. ఎందుకంటూన్నానంటే -- ఇంటర్ క్లాసులో ఇప్పుడు మీరు చదువుతున్న గ్రంధం లోని కొన్ని ఘట్టాలు మాకు పాఠ్య భాగాలుగా ఉండేవి. అవి చదివే టప్పుడు ణా కేల్లాంటి ఆనందమూ కలగలేదు. సౌఖ్యాలు అందలేదు. అందరూ అనుకునేవి వట్టి మాటలు అనిపించింది నాకు."
    పార్వతి సామాన్య దృష్టి కి బాధపడినట్లు సుభద్ర ముఖ కవళికలు కొద్దిగా మారాయి. ప్రతివాదన కోసం తాపత్రయం లేకపోయింది. అందుకు కారణం వారిద్దరికీ వయసు భేదం ఎక్కువగానే ఉండటం.
    ఇద్దరి ఇళ్ళకూ రాకపోకల వల్ల పార్వతి స్థితి కొంత అర్ధం చేసుకుంది సుభద్ర. ఆవిడకు తెలివితేటలూ ఉన్నాయి, అనుభవమూ ఉంది.
    "పోరబడుతున్నావు, పార్వతీ! ఏ స్వల్ప వస్తువు నైనా , విషయాన్నయినా బాగా పరిశీలిస్తే కానీ దాని ప్రమాణమూ, లక్ష్యమూ అర్ధం కానట్లు జీవిత పోరాటం లో అలిసి పోయి బాగా గాయపడితే గానీ దైవాన్ని గూర్చి ఆలోచించం. అలా అలోచించనంత వరకూ ఆ జగదీశ్వరుడు అర్ధం కాకపోవడం లో వింత లేదు" అందామె. అనుభవ మూర్తి అయిన స్త్రీ కనక నిశ్చలంగా అంది.
    "అయితే భగవంతుడొకడు తప్పక ఉన్నాడంటారు మీరు? అతన్ని నమ్మి తీరాలంటారు! అంతేకదూ? పోనీ, మీరే చెప్పండి, ఏ దేవుడి గురించయినా, శ్రేణుల ప్రకారం చెప్పుకు రండి. ఏ దేవుడు ఎక్కువ హోదాలో ఉంటె అతగాడ్నే నమ్ముకుంటాను" అంది పార్వతి -- అలక్ష్య మైన పెద్ద నిట్టూర్పుతో , సుభద్ర గారి మీదికే భారమంతా నేట్టుతూ.
    ఆమె మందలించింది. "ఇల్లాంటి పవిత్ర పద్వాక్కులు హాస్యం పట్టించకమ్మా! "పరిత్రాణాయ సాధూనాం , వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్దాయ సంభవామి యుగే యుగే" అన్న వాక్కు ఆధారంగా ఆనాటి నుండి, ఈనాటి వరకూ అందరూ నమ్మే ఉన్నారు. కొట్టి పారెయ్యడం ఎంత కష్టం!"
    "అది కాదండీ, మరి! మీరొక దేవుణ్ణి నమ్మారు కదా! ఎప్పుడూ పూజలు చేస్తున్నారు కదా! ఆ పరమ పురుషుడ్నే నాక్కూడా పరిచయం చెయ్యండి. ణా శక్తి కొలదీ ధ్యానిస్తాను."
    సుభద్రమ్మ కు నవ్వు వచ్చింది. "బలే పిల్లవు! నేను పరిచయం చేసేదేమిటమ్మాయ్, వెర్రి  గానీ? కావలిస్తే ణా దగ్గరున్న పురాణాలు , గ్రంధాలు ఇస్తాను. విశ్వవ్యాప్తి అయిన సర్వేశ్వరుడు ఒక్కడైనా సరే , పదిమంది అయినా సరే నీకు నచ్చిన దివ్య స్వరూపాన్ని నమ్ముకో. అన్నీ అర్పించుకో. ఇంతకంటే భగవానుడి గూర్చి నాకు మాత్రం ఏం తెలుసు? ఏం చెప్పగలను?' అన్నదామె కొసకు నిర్లిప్తంగా.
    పార్వతి ఊరుకోకుండా, "అబ్బే, లాభం లేదత్తయ్యా! తప్పించుకోవాలని చూడకండి. ఉద్దార గుణ సంపన్నులు కాబట్టి మీరు భగవంతుడి కెంతో ప్రియమైన వారని ణా ఉద్దేశం. మీకెంతో పరిచయ మై ఉంటాడు. నాక్కూడా ఆయన్ని పరిచయం చెయ్యండి! తర్వాత ఆ దేవుడి కాళ్ళా వెళ్ళా పడి, 'సుభద్ర గారి మూల కంగానైనా నాతొ మాట్లాడు, స్వామీ' అని ప్రార్ధించు కుంటాను.' అన్నది.
    "ఎదటి వ్యక్తీ భగవంతుని ప్రస్తావన లో తనకు అంత విలువ ఇవ్వగానే సుభద్ర ముఖంలో ఆనంద రేఖలు, వెలుగు రేఖలు కలిసి సౌదామినీ లతలయ్యాయి. సుభద్ర అయినా జీవితంలో సంపూర్ణ ప్రశాంత తను పొందని మనిషే. చరాచరా ఖిల జగత్ర్పాణవిభుణ్ణి , పరిపూర్తిగా విశ్వసించిన స్త్రీ.
    "పోనీ, మీకే దేవుడు ఇష్టమో చెప్పండి-- మిమ్నల్నేక్కువ శ్రమ పెట్టడమెందుకు నేను?"
    "చెప్పనా? ణా ఆరాధ్య దైవం కృష్ణుడు." చెప్పి తృప్తిగా నవ్వింది సుభద్ర.
    "కృష్ణుడా?' పెదాలు చప్పరించింది పార్వతి.
    "ఏం?" సుభద్ర తత్తరపడుతూ నిలవేసింది.
    నవ్వి , "ఏం లేదండీ ! మా కాలేజీ లో ఒకరిద్దరు పురుషోత్తము లుండేవారు పూర్వం. తిరుగులేని ఆ రొమాంటిక్ హీరో లను చూసిన దగ్గర నుంచి కృష్ణ పాత్రలోని ఉదాత్తత ఏమిటో, గంబీరత ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించడం ,మానుకున్నాను. తర్వాత దానికి ప్రాధాన్యం ఇచ్చే ఓపికా, తీరికా నశించాయి లెండి! ఏమైనా సరే, సుభద్రత్తయ్యా! మీరు చెప్పారు. అంతే చాలు. ఇక నుంచి క్రుష్ణుడ్నీ పూజిస్తాను. ఎవరైనా అడిగితె ఆ గోపాల కృష్ణుడు మా సుభద్ర గారి దైవం. అందుకే ణా దైవం కూడా అయ్యాడని చెప్పి తప్పించు కుంటాను" అంది పార్వతి.
    ఈసారి సుభద్ర ముఖంలో ఏ భావాలూ ద్యోతకం కాకపోయినా ధోరణి గంబీరంగా ఉంది. పార్వతి అన్న మొదటి వాక్యాలే పని చేస్తున్నాయి ఆవిడలో.
    "అపార్ధం చేసుకుని అంటున్నావు, పారూ! నీ మాటలు వినదగ్గవి కావు. భగవంతుని సంకల్పసిద్దాంతాలు అర్ధం కానప్పుడు నీచంగా , అనుభవ హీనంగా మాట్లాడటం మనిషికి సహజం. నీలా చదువుకున్న వాళ్ళు నాస్తికులైనా అభ్యంతరం ఉండదు కానీ, హృదయాల్లో నిలుపుకున్న భాగవత్సరూపాన్ని అధః కరించి మాట్లాడటం అసహనీయమైనది."
    ఉద్రిక్త భావ సంచలితంగా సాగిన సుభద్ర అభిప్రాయ విపులీకరణ వింటూ పార్వతి తల వంచుకుంది.
    పశ్చాత్తాప పడుతున్న దనిపించింది సుభద్రకు. అనునయంగా ఆ పిల్ల వైపు చూస్తూ , "ప్రేమ తత్వవేత్త, ప్రేమాదికారి ఐన జగద్విభుడెక్కడ! కామ క్రోదాలకే చలించి లొంగిపోయే సామాన్య మానవు డెక్కడ! పోనీ, పార్వతీ! కృష్ణుడి గురించి నీకేం తెలుసో చెప్పు, చూద్దాం" అన్నది సుభద్ర.
    పార్వతి ఎక్కువ సేపు మౌనం వహించలేదు. ఊహన్వితంగా ఆ అమ్మాయి కళ్ళు సుభద్ర వైపు చూశాయి.
    "అయితే భగవంతు డొకడు ఉన్నాడని తప్పకుండా మనసా, వాచా నమ్ముకుంటూ ఉండాలంటారా?' జీరపోయిన పార్వతి హీన స్వరాన్ని విని సుభద్ర ఆశ్చర్యపడి , చటుక్కున ఆ అమ్మాయి వైపు చూసింది. పార్వతి కనురెప్పలు ఆలోచనా తరంగాల్లో పద్మ దళాల్లా చలిస్తున్నాయి. ఆమెకు తనేమన్నదో తెలియని బాహ్య స్మృతి.
    "అంతా విని మళ్ళీ మొదటి కొచ్చినట్టు ఏమిటి పిచ్చి ప్రశ్న?' అన్నది సుభద్ర.
    పార్వతి తేరుకుంది అసరికి.
    "ఇంతసేపూ నాతొ మాట్లాడిందంతా తమషాకేనా?"
    "ఊ."
    పార్వతి అంగీకార సూచన వినగానే సుభద్ర గారి ముఖ మండలాన తిరిగి గంబీర మేఘాలలుముకున్నాయి.
    "అయితే ఇక నే చెప్పేదేమీ లేదు, పార్వతీ! కానీ, ఒక్కటి నిజం. ఎప్పుడో ఒకనాడు మనిషిలో సంచలనం బయలుదేరుతుంది. రక్త మాంసాల రూపంతో, ఊపిరి అనే ప్రాణంతో జీవిస్తున్న ప్రతి మనిషీ తనను తాను చూచుకునేందుకు అంతర్ముఖుడైనప్పుడు ; అంతే కాకుండా మానవ ప్రాణుల కోసం సర్వాను కూల సంకలితమై ఉన్న ప్రపంచం విచిత్ర పెట్టి , మర్మ వేదనలతో తపించి, నశించి పోయే నిరాశా జీవుల కళ్ళకు తోరణాలై భేద పెట్టినప్పుడు -- అప్పుడే ఆ వ్యక్తీ అంతర్యం తనకు తెలియని శక్తి అన్వేషణ లో నిర్విరామంగా శ్రమిస్తుంది. అలిసిపోతుంది. ఫలితంగా మిగిలిన భక్తీ భావం కరిగిపోని నవనీతం గా హృదయం లో సుస్థిర స్థానం సంపాదించు కుంటుంది."
    సుభద్ర మాటలు పార్వతి ని చలింప జేశాయి. ప్రయత్నపూర్వకంగా నవ్వుతూ, "మీ రలా గంబీరంగా మాట్లాడుతుంటే నాకు కష్టంగా ఉంది, అత్తయ్యా! మీరు చెప్పినట్లు కృష్ణుడ్నీ పూజిస్తానుగా! సరదాగా ఇంకేమైనా కబుర్లు చెప్పుకుందాము " అంది. నల్లని మేఘాల మధ్యకు నిండు చంద్రుడు అకస్మాత్తుగా ప్రవేశించి నట్లు సుభద్ర కూడా చక్కగా నవ్వుతూ------
    "నిన్ను వదిలి పెట్ట నివాళ! కృష్ణుడి గురించి నీకేం తెలుసు? ముందు చెప్పు. అయన కేది అత్యంత ప్రియమైనది?' అంది.
    చివరి వాక్యం లోని ప్రశ్న సులువుగా తోచింది పార్వతికి.
    "రాధ అంటేనే కృష్ణుడి కి అత్యంత ప్రేమ" అంది చటుక్కున.
    "ఉహూ! అంతేకాదు . ఇంకేమైనా ఉంటుంది చూడు."
    "అయితే ......వేణువు."
    "ఇంకా ఆలోచించాలి."
    "ఆ! మరిచిపోయాను. గోపికలు."
    "అంతేనా?' సుభద్ర ప్రశ్న.
    "అంతే మరి! ముఖ్యంగా ఆ మూడింటి లో ఏదో ఒకటి అయ్యుండాలి ." సందేహంతో కూడిన సమాధానం.
    "పిచ్చి పిల్లా! జగత్తు ప్రియమైనది కాదా, ఆ పరమ పురుషుడికి/ అతడు జగన్నాధుడని నీకు తెలియదా?"
    పార్వతి బారెడు నాలుక తీసింది. "నిజమే సుమండీ! ఆ ఊహే తట్టలేదు నాకు. మీలాంటి భక్తులకి తెలిసినట్లు నాలాంటి మూర్ఖ శిఖమణులకేం తెలుస్తాయి, ఈ పరమార్ధాలు? ప్చ్!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS