Previous Page Next Page 
పంచభూతాలు పేజి 22

  పవన్ నవ్వి "శ్రీమతి, నిర్ఘరిణి మనలను కార్యరసాధికార సీమ నుంచి ఒక్కసారిగా తరిమివేసింది. ఇదంతా వింటే కవి ఏమనుకుంటాడో?" అని అన్నాడు.
     నిర్ఘరిణి సిగ్గుపడి మాట మాటను ఖండించ సాగింది.
     అపుడు నేను అన్నాను: "ఈ విషయంలో నేనేమీ చెప్పలేను. నేను కవిత్వం రాయడానికి కూర్చునప్పుడు ఈ అర్దాలేవీ నా మెదడులో రేకెత్తలేదు నా కలం నిరర్దకం కాలేదని మీ దయవల్ల యిదంతా వింటూంటే రుజువయింది. అర్దకోశంలో దీనికి స్థానం తక్కువనే అనుకుంటాను. కవి రచనా శ్కతి పాఠకుల రచనా శక్తి ఉద్విగ్నం చేస్తుంది. అపుడు ప్రకృతి అనుసారం సౌందర్యాన్ని, నీతిని, తత్వాన్ని సృష్టించడము ప్రారంభమవుతుందనేదే కావ్యగుణం. ఇది అవాయిచువ్వ లాంటిదని ప్రతీతి. కావ్యం దాని  అగ్ని విద్య. మనుషుని మనుసోల రకరకాల అవ్వాయిచువ్వలు వున్నాయి. కొన్ని జ్వలింపజేయగానే విమానంలాగా ఆకాశంలోకి ఎగురుతాయి. కొన్ని చక్రంలాగా చుట్టి తిరగనారంభిస్తాయి. కొన్ని బాంబులాగా  శబ్దం చేస్తాయి. నిర్ఘరిణితో నాకు అభిప్రాయ భేదం లేదని మాత్రం నేను చెప్పగలను. పండుకు గింజ ముఖ్యమని చాలా మంది చెపుతుంటారు. వైజ్ఞానిక తర్కంతో దీనిని రుజువు చేయవచ్చు. అయినప్పటికీ రసజ్ఞులు పండులోని గుజ్జును తిని గింజను పారవేస్తారు.  ఈ విధంగానే కావ్యంలో ఏమయినా విశేష విద్య వుంటుంది. కాని కావ్య రసజ్ఞులు దానిలోని రసపూర్ణ కావ్యాంశాలను మాత్రమే ఆస్వాదిస్తారు. ఇందువల్ల కావ్య వివేచనకు దోషం ఆరోపించలేము. కాని కొన్ని అంశాలను బలవంతాన ఆస్వాదించేవారు కూడా శ్రేష్టులే.  వారి మీద కూడా దోషారోపణ చేయలేము. ఆనందాన్ని బలవంతాన రుద్దలేము. ఆవపూల నుంచి కొందరు రంగులు తీస్తారు, కొందరు నూనె తీస్తారు. మరికొందరు స్తంభించిపోయి దాని శోభను చూస్తారు. కావ్యంలో కొందరు ఇతిహాస తత్వాన్ని వెలికితీస్తారు, కొందరు దర్శన తత్వం వెలికి తీస్తారు,  కొందరు నీతి విద్యను, మరి కొందరు విషయ జ్ఞానాన్ని వెలికి తీస్తారు. కాని యెవరూ కావ్యానికి సంబంధించని అన్య విషయమేదీ వెలికి తీయలేరు. ఎవరికి లభించింది వారు గ్రహించి ఇంటికి తిరిగి వెళతారు ఇందులో పోట్లాడుకోవలసిన అవసరం లేదు; అర్దమూ లేదు'

                        ప్రాంజలి భాష


     నిర్ఘరిణి ఒకానొక సుప్రసిద్ద ఆంగ్ల కవి గురించి మాట్లాడుతూ, "అతని కవిత నాకు నచ్చలేదని యెవరికి తెలుసు?" అని అన్నది.
     శ్రీమతి ప్రకాశవతి గట్టిగా ఆమెను సమర్దించింది. పవన్ దేవ్ సాధారణంగా ఆ స్త్రీల మాటలను ఖండించడానికి పూనుకోడు. అందుకని అతను మందహాసం చేసి అటూ ఇటూ చూసి, "కాని ప్రవీణ సమాలోచకులు అతనికి చాలా వున్నత స్థానం ఇచ్చారు" అని జవాబు చెప్పాడు.
     ప్రకాశవతి, "అగ్నికి భస్మీబూతం చేసే శక్తి వుంది. సకల వస్తువులను అది భస్మం చేయగలదు. ఈ సత్యాన్ని రుజువు చేయడానికి యే విధమయిన సమాలోచనా అవసరం లేదు. ఎడమచేతి చిటికిన వేలు అగ్నిమీద  పెట్టితే చాలు;  దాని శక్తి తెలిసివస్తుంది. గొప్ప రచనలోని గొప్పతనం ఈ విధంగా తెలుసుకోలేనపుడు నేను దానిని అర్దం చేసుకోవడానికి విమర్శనలు చదవవలసిన అవసరమోమిటో నాకు బోధ పడడం లేదు" అని అన్నది.
     అగ్నికి భస్మీభూతం చేసే శక్తి వున్నదనే విషయం పవన్ దేవ్ కు తెలుసు. అందుకని మౌనం వహించాడు. కాని గగన్ దేవ్ కి ఈ విషయములో ఓనమాలే రావు. అందుకని అతను పెద్దగొంతుతో దానిని ఖండిచడానికి ప్రారంబించాడు:
    "మనుష్యుని మనసు అతనిని వదిలి పారిపోయి తిరుగుతూంటుంది. దానిని బంధించి వుంచడం కష్టం."
     పృద్వీరాజ్ అతనికి అడ్డు తగిలి, త్రేతాయిగంలో హనుమంతుడికి నూరు యోజనాల పొడవ తోడ వుండేది. ఆ తోక చివర గద్ద వాలితే దానిని తోలివేయడానికి గుర్రం మీద యెక్కి వెళ్ళవలసి వచ్చేది. మనుష్యుని మనసు ఈ తోక కంటే పెద్దది.
     "అందుకని మనసు అపుడపుడు, సమాలోచక రూపాశ్వంమీద గాక మరే విధంగానూ చేరుకునే మార్గంలేదు. కాబట్టి, యింత దూరం వెళుతుంది. తోకకు, మనసుకు ఎంతో భేధం వుంది. మనసు ముందుకు పరుగెడుతుంది. తోక వెనకపడి వుంటుంది.  అందువల్ల ప్రపంచంలో తోకను హేయంగా చూస్తారు. మనసును ఆదరిస్తారు" అని అన్నాడు.
     పృద్వీరాజ్ మాట్లాడడం ముగియగానే గనగ్  తిరిగి మాట్లాడడం ప్రారంభించాడు.
     "విజ్ఞానం  వుద్దేశ్యం తెలుసుకోవడం, దర్శనాల వుద్దేశ్యం బోధించడం కాని విజ్ఞానం వల్ల తెలుసుకోవడం, దర్శనాలవల్ల బోధపడడం దుర్ఘటమయ్యే పరిస్థితి దాపరించింది. అందుకని యెన్ని మతాలు, ఎన్ని గ్రంధాలు తయారయాయో లెక్కలేదు. సాహిత్యోద్దేశ్యం మనోరంజనం. కాని మనోరంజనం సిద్దించడం కూడా సులభేమేమీ కాదు. అందుకోసం కూడా రకరకాల శిక్షణా సహకారం అవసరం. శిక్షణ లేకుండా తెలుసుకోగలిగింది విజ్ఞానం కాదు. యత్నం లేకుండా బోధపడేది దర్శనం కాదు. సాధన లేకుండా ఆనందాన్ని కలిగించేది సాహిత్యం కాదు - అని కొందరు గర్వంతో చెప్పవచ్చు. అటువంటి పరిస్థితిలో ప్రాచీన వచనాలను, లోకోక్తులను అనుసరిస్తే మనం వెనకబడిపోతాం" అని అన్నాడు.
     "మనుష్యుల సమస్త కార్యాలు మెల్లమెల్లగా కష్టంమీద సాగిపోతుంటాయి. అడవి మనుష్యులు కేకలువేసి వుత్తేజనం పొందుతారు. కాని నాకు అటువంటి దురవస్తే పట్టింది. విశేష అభ్యాస సాధమూ, శిక్షణా సాధ్యమూ అయిన సంగీతం తప్ప మరేదీ నాకు మనోరంజనం కాదు.  సంగీతానికి శిక్షణ ఎంతో ఆవశ్యకం కావడం అన్నింటికంటే గొప్ప విప్త్తు. దాని పరిణామం ఏమంటే; పూర్వం మనమంతా అనుభవిస్తున్నవి యిపుడు పరిశ్రమ, తపస్సు చేసినవారికి మాత్రమే లభిస్తున్నాయి. అందరూ కేక వేయగలరు. కేకవేసి అసభ్య జనులు మనోరంనం పొందుతారు. కాని అందరూ గానం చేయలేరు. అంతేకాదు, గానంవల్ల అందరకూ ఆనందం లభించదు. కాబట్టి సమాజం ప్రగతి పథంలో ముందుకు నడుస్తున్నట్లే అధికారి - అనధికారి, రసికులు - అరసికులు అని రెండు తెగలవారు తయారవుతుంటారు' అని అన్నా డు పవన్ దేవ్.
     అపుడు పృద్వీరాజ్, "నిర్బాగ్య మానవుడు సులభోపాయం చేపట్టినకొద్దీ జటిలబంధనంలో కొట్టుమిట్టాడుతున్నాడు. సరళంగా పని చేసేందుకు యంత్రాలు తయారు చేస్తున్నాడు. కాని యంత్రమే ఒక సంకటం. అతను సహజ ప్రాకృతిక జ్ఞానాన్ని శృంఖలాబద్దం చేసేందుకు విజ్ఞానం సృష్టిస్తున్నాడు. కాని విజ్ఞానం స్వాధీనం కావడం బహు కష్టం.న్యాయం కలుగజేయడానికి సులభోపాయం కనిపెట్టబోయి చట్టాలు తయారుచేశారు. ఆ చట్టాలు సరిగా తెలుసుకోవడానికి దీర్ఘాయుర్దాయంగల మానవుడు  తన జీవితంలో ముప్పాతికవంతు వ్యయపర్చవలసి వుంది. సరళంగా  లావాదేవీలు సాగించడానికి రూపాలను సృష్టించాడు. చివరకు మీసాంస చేయడం బహు కష్టమయేంతగా, జటిలంగా ఆర్దికసమస్య తయారయింది. సర్వమూ సరళంగా తయారు చేయడానికి మనుష్యుడు యత్నిస్తాడు గానితిండీతిప్పలు, ఆ దానప్రదానాలు, ఆమోద ప్రమోదాలు సర్వమూ క్లిష్టంగా తయారయాయి" అని అన్నాడు.
     దానిమీద నిర్ఘరిణి, "యీ విధంగానే కవిత కూడా జటిలంగా తయారయింది. ఈ సమయంలో మానవుడు రెండు శిబిరాలలో విభక్త మయిపోయాడు. ధనికులు కొద్దిమంది, ఎక్కువమంది దరిద్రులు. కొద్ది మందే చదువుకున్నవారు, ఎక్కువమంది చదువు రానివారు. ఈ  కాలంలో కవిత కూడా సర్వజనులకు ఆస్వాద్యంగాలేదు. అది కూడా ప్రత్యేక వ్యక్తులకే నిజసంపత్తిగా  తయారయింది. ఇదంతా నాకు తెలుసు, కాని కవితను గురించి చర్చిస్తున్నాం కాబట్టి చెపుతున్నాను. కవిత ఏ అంశంలోనూ క్లిష్టమయింది కాదు. అందులో మనకు అర్దంకానంత క్లిష్ట మయినదేమీలేదు. అది అతి సరళం. కాని అది మనకు అర్దం కాకపోతే ఆ దోషం మనదే" అని అన్నది.
     ఆ తరవాత పృద్వీరాజ్ పవన్ దేవ్ మౌనం వహించారు. గగన్ దేవ్ నిస్సంకోచంగా మాట్లాడడం మొదలుపెట్టాడు: "సరళమయిందల్లా సహజమయిందని చెప్పలేం. అనేక సమయాల్లో సరళమయిందే క్లిష్టమవుతుంది. అది అందరికీ తెలియడం కోసం ఏ ఉపాయమును ఆశ్రయించదు మౌనంగా  వుండిపోతుంది దానిని సరిగా అర్దం చేసుకోకపోతే "నన్ను అర్దం చేసుకోలేకపోతే తిరిగి రా!" అని పిలవదు. మనసుతో  అత్యంత సన్నిహిత సంబంధమును యేర్పరుస్తుంది. ఇదే ప్రాంజలత  ప్రధాన లక్షణం. మధ్యస్తుల అవసరంలేదు. ఎవరి మనసు మధ్యస్తులు  లేకుండా మనసుగా వుండలేదో వారిని ఆకర్షించడానికి మరిపిస్తుంది. అపుడు ప్రాంజలత అర్దం కాదు. కృష్ణనగరంలో తయారయిన  చర్మ చిత్రాలు రూపంరంగు ఆకార ప్రాకారాలతో మన మనసులోకి శీఘ్రంగా చోటుచేసుకుంటాయి. మనం వాటిని రోజూ చూస్తూనే వున్నాం. వాటి గుణదోషాలు మనకు తెలిసే వున్నాయి. కాని గ్రీసు దేశంలోని శిలా ప్రతిమలకు రంగు, ఆకారాదులేమీ లేవు. వాటిలోనే ప్రాంజలత, ప్రయాసహీనత  కలవు. అయితే  అవి అంత సరళమయినవి కావు. ఏ విధమయిన తుచ్చ బాహ్యనైపుణ్యమూ వాటికి అవసరం లేదు. అందుకని భావసంపదయే వాటికి అధికంగా అవసరం."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS