అందుకే వయసు తారతమ్యం ఎక్కువగా వుండే అమ్మాయిని పెళ్ళి చేసుకోకూడదనేది.
ఇందుకోసమే పెద్దలు పెళ్ళంటే ఈడూ జోడూ చూడమనేది.
అతనికి భార్యపై కోరిక పుడుతోంది. మోచేతిని ఆసరాగా చేసుకొని భార్య నిద్రపోయిందా లేదా అని చూశాడు. కళ్ళు మూసుకుని వుంది. ఎల్లో నైటీ ట్రాన్స్ పరెంట్ గా వుంది. అందులోంచి బ్రా ఎర్రటి చెక్కరాలయి మీదకు పెరిగిన తీగలా కనిపిస్తోంది. బ్రా చాలక పొంగిన వక్షం కోరకను కూరినట్టు రెచ్చగొడుతోంది. అతనికి నరాలు పొంగడం ప్రారంభమయ్యింది.
ఆమెలో అందంకన్నా ఆకర్షణే ఎక్కువ. చాయకాస్తంత తక్కువ కావడం ఆమెకు కలిసొచ్చిన విషయం. ఆమె ఫిజిక్ కి ఆ చాయే కరెక్ట్. అందుకే ఆమెను చూస్తూనే కోరిక గుండెల్లో పుట్టి నరాలవరకు పాకుతోంది.
ఆమె కొద్దిగా కదిలింది. నైటీ కాలుపైకి ఎగబాకింది.
నున్నగా రక్తనాళాల్లో రక్తానికి బదులు ఆరోగ్యం ప్రవహిస్తున్నట్లు ఆమె శరీరం మెరుస్తోంది. కాళ్ళ పిక్కల్లో గట్టిపడిన శరీరం కోరికను ఎగదోస్తోంది.
అతను తట్టుకోలేకపోయాడు.
మెల్లగా కాలుమీద చేయివేసి కొద్దిగా కోరికను చిదుముతున్నట్లు నొక్కాడు.
ఆమెలో ఎటువంటి రియాక్షన్ లేదు.
అతను చేతిని తొలగించలేదు. ఆమె కటి భాగం ఎత్తు అతని కళ్ళల్లో పట్టడంలేదు. ఆ ఎత్తుల్ని చూస్తూంటే అతని నరాల కొసలకు నిప్పు అంటుకున్నట్లు శరీరం వెచ్చగా అయిపోయింది. అక్కడ చేయివేయాలన్న బలీయమైన కోరిక అతని రక్తంలో జిలకొట్టింది.
అతను మరోచేయి ఆ భాగంలోవేసి నొక్కాడు. ఆమె ఠక్కున నిద్రలో కదిలినట్టు కదిలి అతడివేపుకు తిరిగింది.
ఆమె ఎద మునుపటికంటే పెరిగినట్టు నైటీలోంచి బయటికి కనిపిస్తున్న భాగం ఎక్కువగా తోస్తోంది. ఆ గుండ్రటితనానికి, ఆ షేప్ కి అతన్లో జలదరింపు ప్రారంభమైంది. అక్కడవరకు వెళ్ళాలనుకున్న చేతిని బలవంతంగా కంట్రోల్ చేసుకున్నాడు.
ఆమె శ్వాస తీసుకోవడంతోపాటు ఆమె ఎద కూడా పైకీ కిందకి కదులుతోంది.
అతను తనచేతిని నెమ్మదిగా కిందకు పోనిచ్చాడు.
పైకెగబాకిన నైటీ అంచును పట్టుకున్నాడు.
కాలు నునుపు చేతివేళ్ళ కొసలకు తెలుస్తోంది.
అతను ఆమె ముఖంలోకి తన చూపును గుచ్చాడు. కనురెప్పలు మూసుకున్నా పెద్దవిగా కనిపిస్తున్న కళ్ళు మధ్యాహ్నం ఎండకు ముడుచుకుపోయిన తామరపువ్వుల్లా వున్నాయి. ప్రఖ్యాత చిత్రకారుడు దగ్గరుండి మనసుపెట్టి గీసినట్టున్న ముక్కు అందంగా వుంది.
లాలిత్వంతో మెరిసే పెదవులు ప్రస్తుతం కోరికతో బిరుసెక్కినట్టు అనిపిస్తున్నాయి. ఇక ఆ తరువాత అతని చూపు కిందకు దిగి నిలబడలేక పోయింది.
ఆమె వక్షస్థలం అంతగా పొంగి, మరింతగా నునుపు దేలింది. ఆ కారణంచేత అతని చూపు కిందకు జారి లోయలా వుండే బొడ్డులో దిగబడిపోయింది.
ఎల్లో నైటీ కింద కనబడుతున్న బొడ్డు జనవరి నెలలో మంచులో తడిసిన పచ్చ గన్నేరులా వుంది.
ఇక ఆపైన కిందకి దిగడానికి అతనికి ధైర్యం లేకపోయింది. ఆమెలోనూ కోరిక ప్రారంభమైందని అతనికి తెలిసింది. ఆ కోరిక సాంద్రతంతా పొంగిన ఆమె ఎద చెబుతున్నట్టు అనిపించింది. అయినా అతను ఆమెను దగ్గరగా లాక్కోలేకపోయాడు.
తనకు మూడ్ లేకపోతే ఆమె విసుక్కుంటూ కసురుకుంటుంది. ఆ విసుగు, ఆ కోపం చూస్తే ఇక జీవితంలో ఆమె దగ్గరకు చేరకూడదనిపిస్తుంది.
ఈసారి నైటీ మరింత పైకి పోయింది.
ఆమె కాళ్ళల్లో కొంత భాగం కనిపిస్తోంది. ఆమె కాళ్ళకు బంగారు పట్టీలు వేసుకుంటే బావుంటుందని అతని ఉద్దేశ్యం. ఒకటి రెండుసార్లు చెప్పాడు కూడా.
"బంగారు పట్టీలా? నాకు ఇష్టమే. వాటిని వేసుకోవడమంటే పాదాలమీద ఏదో డిజైన్ చెక్కించుకున్నట్టు వుంటుంది. కానీ వద్దు" అంది.
"ఇష్టం వుండి వద్దంటావేం?"
"అదంతే-పాపిటిబిళ్ళ, చంద్రవంక-ఇలాంటి ఆభరణాలు బావుంటాయిగానీ ఇప్పుడేసుకుంటే ఆడ్ గా వుంటాయి. అందులోనూ ఒంటిమీద బంగారం ఎంత తక్కువగా ఉంటే అంత బావుంటుంది నాకు. చూశావుగా- ఈ చిన్ని బుట్టకమ్మలు తప్ప నేనేం వేసుకోను.
"ఈ కాలంలో మగాళ్ళూ వేసుకుంటున్నారు."
"అలాంటి మగాళ్ళంటేనే నాకసహ్యం. గేదెల్ని గొలుసులతో కట్టేసినట్టు మెడలో చైన్ లూ, మంచి జరుగుతుందని వేళ్ళమీద నెండ్ర గబ్బల్ని అతికించుకున్నట్టు ఉంగరాలు. ఛీ ఛీ అసహ్యమేస్తుంది. మగాడంటే ఎలా వుండాలి? తన తెలివితేటలతో, తన సేవల్తో ప్రపంచాన్ని శాసిస్తున్నట్టు వుండాలి" అంటుంది ఆమె.
అందుకే గోపాల్ ఆమెతో ఎక్కువగా మాట్లాడడు. ఆమె ఏమిటో ఒకపట్టాన అర్ధంకాదు. ఆమె ఏదో సిద్ధాంతాలు తెలిసిన వ్యక్తికాదుగానీ, ఫీలింగ్స్ వున్న మనిషి. ఇలాంటివాళ్ళు భార్యగా మాత్రం పనికిరారు.
అదే ఇలాంటి వ్యక్తిత్వం ఎదుటి వ్యక్తి భార్యకీ వుంటే గొప్పగా ఆరాధిస్తాడు. మగాడి నేచర్ అది.
అటువైపు వెళుతున్న ఆలోచనల్ని కట్ చేశాడు. ఆమె కాళ్ళ నునుపుకి ఎంతగా ఫీలవుతూంటే అంతగా కోరిక రాజుకుంటోంది. అతను ఆమె నైటీని ఏదో తన ప్రమేయం లేకుండానే, కదుపుతున్నట్టు పైకి జరిపాడు.
ఇప్పుడు కుడికాలి మోచిప్ప దశమినాటి చందమామలా కన్పిస్తోంది.
అతను చేయి మరికాస్తంతగా నైటీని కదపబోయింది.
ఆమె ఠక్కున కళ్ళు తెరిచింది. అతను ఆగాడు. ఆమె ఫీలింగ్స్ ఏమిటో కనిపెట్టడానికి మరింత పరిశీలనగా చూశాడు. ఆ కళ్ళల్లో ఏదో చమత్కారం తప్ప, ఏం కనిపించలేదు.
మరి తనింతసేపు చేసిన చేష్టలు ఆమెను ఏమా చేయలేకపోయాయా? అతనిలో ఏదో బాధ కళ్ళల్లో తేలుతోంది. ఆమె ఇదేమీ పట్టించుకోలేదు.
"మీరు చిన్నప్పుడు మేధమేటిక్స్ లో క్లవరా?"
ఆ ప్రశ్నకు అతని తల తిరిగింది.
"అసందర్భ ప్రసంగానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదని అనుకుంటున్నారు కదా! మీ ముఖం చూస్తేనే తెలుస్తోంది" అని నవ్వి "ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి" అంది కాంచనమాల.
"ఎందుకది ఇప్పుడు?"
"సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను."
ఇక జవాబు చెప్పక తప్పదనిపించి, "ఫరవాలేదు-ఏదో యావరేజ్" అన్నాడు.
