"పిల్లల కోసం తల్లిదండ్రులు జీవితాన్ని త్యాగాలు ఎంత సులువుగా చేస్తారో కదా! ఎంత ఘర్షణను అవలీలనగా మోస్తారో కదా!" అంది చిన్నగా వెక్కిళ్లు పడి.
"దానికంత ఏడుపెందుకు? ఇంత బేలవయితే ఎలా!"
"మా డాడీ గుర్తొచ్చి! నువ్వు మీ మమ్మా గురించి ఆలోచించిన దాంట్లో వెయ్యోవంతు కూడా నేను మా డాడీ గురించి ఆలోచించలా! మా డాడీ కూడా ఇలానే నాకు తెలియకుండా ఎంత బాధపడ్డారో. ఎన్ని ఆశలు కత్తిరించుకున్నారో! ఎన్ని ప్రకృతిధర్మాలను నిలవరించుకున్నారో! పిల్లలమెంత స్వార్థపరులం- తల్లిదండ్రుల ఉన్నతత్వం ముందు!" మళ్లీ వెక్కిళ్లు వచ్చాయి.
"పిచ్చీ.... ఎంత పసిమనసు నీది!" తలను ఛాతీకి అదుముకున్నాడు.
"నిజం రేవంత్! మా డాడీ నాకోసం ఎన్నో చెయ్యాలి అనుకున్నా కానీ, మా డాడీ కోసం నేనేమయినా చేద్దాం- అనేప్పుడూ అనుకోలేదు. ఎంత స్వార్థం కదా నాది!" తనను తాను తెలుసుకున్న విశ్వారూప సందర్శనం!
రేవంత్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఇద్దరిదీ ఓకే స్పందన! ఓకే ఆరాటం!! అందుకేనేమో- ఇద్దరి హృదయాలు దగ్గరికి చేరి 'లాబ్ డబ్' లయలో ఏకమయ్యాయి. వెన్నెలలా కురుస్తూనే ఉంది. తడిచి వాళ్ళు చెమ్మగిల్లుతూనే ఉన్నారు...చలిగాలి వచ్చి సేదతీర్చి స్వేదాన్ని ఆర్పేదాకా! మెల్లగా కదిలారిద్దరూ గమ్యం వైపు.
* * *
జ్ఞాపిక ఆరాత్రి హాస్టల్ నుండి డాడీకీ ఫోన్ చేసింది.
ఒక్కతే కూర్చుని మాట్లాడింది- తలుపులన్నీ వేసుకుని. రేవతిని తోడు తీస్కేళ్లింది. బయట కూర్చున్న రేవతి చున్నీలోని పావుకిలో పల్లీలు తినడం అయిపోయినా జ్ఞాపిక బయటకు రాలా!
అద్దంలోంచి చూస్తున్న రేవతికి జ్ఞాపిక తండ్రితో కాసేపు బ్రతిమాలుతున్నట్టూ కాసేపు మారాం చేస్తున్నాట్టూ, కాసేపు ఆర్డర్లు జారీ చేస్తున్నట్లూ, కాసేపు ఏడ్చినట్టూ, కాసేపు మొండిపట్టు పట్టినట్టూ, కాసేపు బెదిరించినట్లూ అనిపించింది. చివరికి- మొహంలో అలసటతో కూడిన చిరునవ్వు, జయంతో నిలిచిన స్వేద బిందువులూ కనిపించాయి. బయటకు వచ్చిన జ్ఞాపికతో అంది రేవతి-
"వెధవ ఎక్స్ ప్రెషన్స్ తో ఫోన్ లో మాట్లాడే బదులు మీ డాడీ దగ్గరికెళ్లి మాట్లాడొచ్చుగా....ఎదురుగా కూర్చుని!" విసుక్కుంది.
"ఎదురుగా అన్ని విషయాలు మాట్లాడలేమే! కొన్ని పరోక్షంగానే మాట్లాడాలి!"
"ఏమ్మాట్లాడావే.... పాకెట్ మనీ ఎక్కువ పంపించమనా?" మిగిలిన రెండు పల్లీల్లో ఒకటి జ్ఞాపిక చేతిలో పెట్టి, ఒకటి తను తింటూ.
"ఇది కూడా నువ్వే తిని తగలడు!" విసురుగా ఆ ఒక్క గుడ్డిపల్లీ రేవతి చేతిలో పెట్టి నొక్కింది.
"థాంక్యూ..." అంటూ ఆ పల్లీ కూడా తింటూ- "ఇంతకీ ఏం విషయమే! నేను గెస్ చెయ్యనా?"
"ఛస్తే వద్దు! నేనే చెప్తా! నా బర్త్ డే గిప్టు విషయం!"
"ఆఁ.... ఏ బుక్కో, చెత్తా చెదారమో అడిగుంటావ్! పోయినసారి రేవంత్ చదవమన్నాడని 'స్పార్టకస్' బుక్కడిగి, నువ్వు చదివింది కాక- మమ్మల్నందర్నీ చదివించి చంపలేదూ! ఈసారి మహాభారథం పెద్దెనిమిది పరువాలూ అడిగావా?"
"పరువాలు కాదే వెర్రిమొహమాఁ...పర్వాలు!"
"దానికీ దీనికీ ఏమిటిట అంత తేడా?!"
చున్నీలోని తోక్కల్లో పల్లీలేవయినా ఉన్నాయేమోనని వెతుక్కుంటూ.
"బోల్డు తేడా! తెలుగు మాస్టర్లెవరయినా వింటే- తగిలేచోటు చూడకుండా కొట్టేంత తేడా!" పల్లీపొట్టుతో బాటూ చున్నీ కూడా ఎగరగొట్టింది.
"సర్లే.... ఇంతకీ ఏవడిగావే?" చున్నీ తిరిగి లాక్కుంది.
"సస్పెన్స్! తెచ్చాక అందరికీ చూపెడతా- అందరూ డంగయిపోతారు!"
"డంగయిపోవడం అంటే ఏవిటే?" అమాయకంగా అడిగింది.
"ఆశ్చర్యపోవడం!" హైపిచ్ లో చెప్పింది.
"ఓస్ఁ.... అంతేనా? డంగయిపోవడమంటే అదేదో కొత్తది కాబోలు.... ఎలా అయిపోవాలో నేర్చుకుందామానుకున్నా! డంగయిపోవడమంటే ఆశ్చర్యపడిపోవడమా? అయితే.... నేనూ, ఆనంద్ నిముషానీకోసారి ఒకరిలో గొప్ప గొప్పదనాలు చూసుకుని డంగ్ డంగ్ అయిపోతూనే ఉంటాం! నా బొంద డిక్షనరీ! పెళ్ళికి పిల్లికి చంకనెట్టుకెళ్లినట్టు నిన్ను తీసుకొచ్చాను చూడూ..."
"అబద్దం... నన్నేం చంకనెట్టుకు చాలా నువ్వు! నడిచొచ్చా!"
"ఇక మాట్లాడావంటే మర్డర్ చేస్తా!" తనూ సవాల్ చేసింది రేవతి.
మౌనంగా రూమ్ లో కొచ్చిన ఇద్దర్నీ చూసి కామినీ స్ఫూర్తి అడిగారు-
"ఏవిటలా సీరియస్ గా ఉన్నారు?" అని.
జ్ఞాపిక మాట్లాడలా! రేవతి డెఫ్ అండ్ డమ్ లాంగ్వేజ్ లో చెప్పింది- జ్ఞాపిక ఫోన్ చెయ్యడానికెళ్లిందనీ, తనను తోడు తీస్కెళ్లిందనీ, దారిలో పోట్లాడుకున్నామనీ!
"ఖర్మ! మనం పోట్లాడుకోకుండా ఉండే క్షణాలేవయినా ఉంటే వాటిని గిన్నెస్ బుక్ లో రాయొచ్చు" అనుకున్నారు.
అప్పటికే జ్ఞాపిక గోడవైపు తిరిగి పడుకుంది సీరియస్గా.
"ఎవయిందీ...?" రేవతిని సైగ చేశారు మిగిలిన ఇద్దరు.
'ఫోన్ సీరియస్ గా మాట్లాడిం' దని డెఫ్ అండ్ డమ్ లో చెప్పింది రేవతి. ఇంక ఎవరూ పలకరించలా! అందరూ లైటు తీసేసి పడుకున్నారు.
17
హాసినిగారికీ, జ్ఞాపికకూ మధ్య మంచి చనువు ఏర్పడింది.
రేవంత్ లానే తనూ 'మమ్మా....' అని పిలుస్తూంది. తను కూడా అచ్చం అమ్మలానే ప్రవర్తించేది. చాలా పుస్తకాలు కొద్దికాలంలోనే చదివించింది జ్ఞాపికతో. ఆ పుస్తకాలు మీద జ్ఞాపికకూ, రేవంత్ కూ సుహాసినికీ మధ్య డిస్కషన్ జరిగేది. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు ఢీకొనేవారు. ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. ముగ్గురూ కలిసి చివరకు ఒక జడ్జిమెంట్ కు వచ్చేవారు. ఆ జడ్జ్ మెంట్ కు రావడానికి ఒక్కోసారి కొన్ని గంటల సమయం పట్టేది. ముగ్గురి మధ్యా ఒక కుటుంబసభ్యుల మధ్య ఏర్పడే అనుబంధం ఏర్పడింది. ఏ అభిప్రాయమైన ముక్కుసూటిగా చెప్పుకునే చనువూ ఏర్పడింది.
"ఆరోజూ ఎప్పటిలానే కాలేజ్ అయ్యాక రేవంత్ తో కలిసి ఇంటికి వెళ్లింది జ్ఞాపిక.
వీళ్ళు వెళ్లేసరికి టీపాయ్ మీ లెటర్ ఉంది.... 'నాకు అనుకోకుండా స్పెషల్ క్లాస్ కొంచెం ఉంచండి. నేను గంటలో వచ్చేస్తాను' అని!
చలం గురించిన చర్చ ఆరోజు జరగబోయేది. ఎందుకో తెలీదు...'చలం' అనగానే రోమాటింక్ మూడ్ వచ్చేసింది జ్ఞాపికకూ, రేవంత్ కు!
ఇంట్లోకి వెళ్లగానే తనకూ, జ్ఞాపికకూ మమ్మాకూ ఆమ్లెట్లు రెడీ చెయ్యాడానికి కిచెన్ లోకి వెళ్లాడు రేవంత్.
జ్ఞాపిక ఆనియస్ కోసిస్తూ "మమ్మా రావడం లేటవుతుందా?" అంది.
"ఒక గంట లేటు కావచ్చు! స్పెషల్ క్లాసుందట కదా! తెలిసీ అడుగుతావేం? నువ్వూ చదివావుగా లెటరు!"
"ఏదో ఒకటి మాట్లాడాలిగా.... అందుకే అడిగా!"
"థాంక్స్! ఏదోటి మాట్లాడాలి కదా- అని ఉల్లిపాయను ఉల్లిపాయే ఎందుకనాలి- గిల్లిపాయని ఎందుకనకూడదూ? ఆమ్లెట్ ను అమ్లేటే ఎందుకనాలి- సోమ్లెట్ అనొచ్చు కదా! ఆమ్లెట్ తిన్నాక కోల్డ్ మిల్కెందుకు తాగాలి- కోల్డ్ మిల్క్ తాగాక ఆమ్లెట్ తినొచ్చు కదా!' అని తెలివితక్కువ ప్రశ్నలు అడగలేదు!!" ఎగ్జ్యూస్ పాన్ పై పోస్తూ ఎగతాళి చేశాడు.
చేతిలో ఉన్న ఆనియన్ కట్ చేస్తూ కళ్ళల్లోంచి ధారగా కారుతున్న నీళ్లు తుడుచుకుని ముక్కు ఎగబీలుస్తూ- "నేనన్నీ తెలివితక్కువ ప్రశ్నలేస్తానని నీ అభిప్రాయమా?" అడిగింది చాకు కొసతో వీపు మీద మెల్లగా గుచ్చి విడుస్తూ.
ఎగిరిపడి, "ఏయ్ఁ రాక్షసీ... చాకుతోనా నీ సరసాలు! ఒక్క ఆనియన్ కోసేసరికే అంకమ్మ సవాళ్ళు పెట్టినట్టు కళ్ళు ఎర్రబడి, ముక్కుఎర్రబడి వందమందికి వంటచేసినట్లో, మొగుడు చితకబాదితే ఏడ్చిఏడ్చి అలిసిపోయినట్టో తయారయ్యావు. ఇక చాలుగానీ, బాత్ రూమ్ లో కెళ్లి ఫ్రెష్ అయ్యి కోల్డ్ మిల్క్ తయారు చెయ్యి.... మమ్మా వచ్చేస్తుంది!" ఆర్డర్ వేశాడు.
"ఏంటీ.... ఆర్డర్లు వేస్తున్నావ్ పెళ్ళి కాకుండానే! నువ్వూ బోడి అమ్లెట్లు వెయ్యడానికి నలభీమపాకం తయారుచేసినట్టు చేతినిండా నూనె, స్టౌమీద ఉల్లిపాయలు, షర్టుకు కారం, మొహానికి ఉప్పు రాసుకుని అచ్చం పగటివేషగాడిలా తయారయ్యావు. నువ్వెళ్లి ఫ్రెష్ అవ్వు, నేను డైనింగ్ ఆరెంజ్ చేస్తా ఈలోపు!" తనూ ఆర్డర్ పాస్ చేసింది.
"నువ్వెళ్లమన్నానా హనీ!" దబాయించాడు.
"నువ్వెళ్లమన్నావా బిట్టూ! అదే స్టైల్ వెక్కిరరించింది.
"స్టౌ ఆఫ్ చేసి, "ఇట్రా... నీకో మాట చెబుతా!" మెలోడియాస్ గా పిలిచాడు.
ఆ మెలోడినెస్ కు జ్ఞాపిక గుండెల్లో గంటలు మోగాయి! దగ్గరికొచ్చి-
"ఏంటీ బిట్టూ!" అంది తను మెలోడియస్ గా.
"ఇంకా దగ్గరకు రా హనీ!" ఇంకా మెత్తగా పిలిచాడు.
తనకు అభిముఖంగా తిరిగి పెదాల దగ్గరకు వచ్చేసి కళ్ళలోకి చూస్తూ- "ఏంటీ బిట్టూ?" అంది.
తనూ మెత్తగా మొహాన్ని మెల్లగా పక్కకుతిప్పి చెవిలో ఏదో చెప్పబోయాడు. మీసాలు చెవికొసలకు తగిలి చక్కిలిగింత పుట్టి కిసుక్కున నవ్వింది. వంచబోతున్న జ్ఞాపిక తలను అదిమిపట్టి గుసగుసగా-
"నువ్వూ..." అన్నాడు.
ఆ ఊపిరి వేడి జ్ఞాపికలో అణువులు సంచలనం రేపింది.
"ఊఁ నేనూ..."గుసగుసగానే అడిగింది కళ్ళు మూసుకుని- ఏం చెప్తాడోనని ఆతృత!
"నువ్వూ..." మళ్లీ మెల్లగా అన్నాడు.
"ష్చ్- నేనూఁ.... ఏవిటీ చెప్పు....చెప్పు బిట్టూ!" మారాం చేసింది చెవికి పెదాలు తాకించి.
"నువ్వొక డెవిల్ వి! అవునంటే కాదంటావ్! కాదంటే అవునంటావ్! చండిక కారెక్టర్!" అని గట్టిగా అరిచాడు. చెవి దిమ్మెత్తిపోయింది ఆ అరుపుకు.
"నువ్వూ...నువ్వూ...' అంటే ఇంకేదో చెప్తావనుకున్నా! ఐదా వీరపురుషా.... నీ మెలోడియస్ కామెంట్! నిన్నూ..."
పరుగెత్తాడు. వెంటపడింది! బాత్ రూమ్ లో కెళ్లి తలుపేసుకోబోయాడు. కాలడ్డం పెట్టింది. తలుపేస్తే కాలు చితికిపోతుంది.
"ఏయ్ఁ... హనీ- కాలు తియ్యి... చితికిపోతుంది!"
"ఏయ్ఁ బిట్టూ.... తియ్యాను! సారీ చెప్పు! నా మెలోడియస్ ఫీలింగ్ ను డామేజ్ చేసినందుకు!"
"చెప్పను!"
"తియ్యను!"
"చూడు- నీ ముందే బట్టలిప్పేసి స్నానం చేస్తా!" బెదిరించాడు చూపుడువేలితో.
"చేసుకో! కళ్ళు మూసుకుంటా!"
షర్టు విప్పాడు, బనియన్ విప్పాడు.
జ్ఞాపిక చటుక్కున కళ్ళు మూసుకుంది. కాసేపటికి ఏ చప్పుడూ వినిపించక కళ్ళు తెరవాలో, లేదో అర్థంకాక- తెరిస్తే ఏం చూడాల్సోస్తుందోనని గుండె దడదడ మంటూంటే.... మెల్లగా ఒక కన్ను తెరిచి చూసింది.
రేవంత్ గోడనానుకుని చేతులు కట్టుకుని తనవైపే చూస్తున్నాడు. మెల్లగా చూపు కిందకు దించింది. ప్యాంటు ఉంది. 'అమ్మయ్య...!' అనుకుని రెండో కన్ను తెరిచింది. విప్పలేడనీ, సిగ్గేస్తోందనీ అర్థమైపోయింది. అందుకే కావాలనే-
"విప్పుకో! పెద్ద స్టైల్ కొట్టావ్...!" రెచ్చగొట్టింది.
మెల్లగా దగ్గరికొచ్చాడు రేవంత్. ఆ రావడంతో చెయ్యి షవర్ హ్యాండిల్ మీదపడి ఇద్దరి మీద నీళ్లు చిలికాయి.
"ఒఫ్ఫ్ఁ...." అని జ్ఞాపిక తప్పుకునేలోపు జ్ఞాపిక చెయ్యి పట్టుకుని లోపలికి లాగాడు.
"వద్దూ! వద్దూ! వద్దూ! ప్లీజ్..." దగ్గరికి జరుగుతూనే వారించింది.
రేవంత్ కు ఏవీ వినిపించలా! కలలోలా ఆ చెయ్యినలాగే వెనక్కి మెలితిప్పాడు మెత్తగా! జ్ఞాపిక వెనక్కి తిరిగింది.... ఆ చెయ్యికి లయగా! వెనకనుంచి జ్ఞాపిక మేడమీద మునివేళ్లతో నొక్కిపట్టి మొహాన్ని పైకి
లేపాడు. తన మొహాన్ని కిందకు వంచాడు.
పద్మం మీద తుమ్మెద వాలినట్టు మెత్తగా జ్ఞాపిక కింద పెదవి తగిలింది. రక్తంలోని అణువణువూ వేడెక్కింది. రేవంత్ మీసకట్టు జ్ఞాపిక గడ్డాన్ని నిమిరింది....తుమ్మెద రెక్కలు తడిమినట్టు కుచ్చుకుచ్చుగా!
"వద్దూ.... వద్దూ....వద్దూ..." జ్ఞాపిక గునుస్తూనే ఉంది.
రేవంత్ కేవీ వినిపించలా! మెత్తటి పెదవిని మెల్లగా సక్ చేశాడు. తన కింద పెదవి జ్ఞాపిక పెదవుల మధ్య చేరింది. జ్ఞాపికకు తెలీకుండానే రెండు, మూడుసార్లు తనూ సక్ చేసింది. ఆ సకింగ్ కు రేవంత్ తట్టుకోలేక జ్ఞాపికను విసురుగా వదిలేశాడు. ఆ విసురుకు ఎదురుగా ఉన్న గోడకు అతుక్కుపోయింది కళ్ళు మూసుకుని. రేవంత్ కూడా గోడను బలంగా ఆనుకున్నాడు కట్రోలింగ్ కు.
పది నిముషాలకుగానీ ఆ అన్ కాన్షస్ నుండి బయటకు రాలా ఇద్దరూ!
ఏం మాట్లాడకుండా రేవంత్ బయటకొచ్చేశాడు.
జ్ఞాపిక కూడా మౌనంగా ఫ్రెష్ అయ్యి వచ్చి ఫ్రిజ్ లో కోల్డ్ మిల్క్ ఆమ్లెట్స్ టేబుల్ పై ఆరెంజ్ చేసింది.
టిన్ లో బిస్కట్స్ టేబుల్ మీద పెట్టి ఏదో పుస్తకం పట్టుకుని తిరగేసి మరీ సీరియస్ గా చదువుకోసాగాడు రేవంత్. జ్ఞాపిక తన నైల్స్ ను దీక్షగా రబ్ చేసుకుంటూ ఉండిపోయింది. ఒకరివైపు ఒకరు కన్నెత్తి కూడా చూసుకోలా- కాలింగ్ బెల్ మోగేవరకూ!
పరుగెత్తుకెళ్లి తలుపు తీసింది జ్ఞాపిక.
"డియర్స్! ఏంటలా కామ్ గా ఉన్నారు? మళ్లీ పోట్లాడుకున్నారా?"
మాట్లాడలేదు రేవంత్. జ్ఞాపిక బలవంతంగా నవ్వింది... రేవంత్ వైపు చూస్తూ!
"బిట్టూ! తిరగేసి ఎంతసేపు చదివినా ఆ పుస్తకం అయిపోదు కానీ, మీరింకా టిఫిన్ చెయ్యలా?" అంది డైనింగ్ వైపు చూస్తూ!
అప్పుడు చూసుకున్నాడు రేవంత్- తను పుస్తకాన్ని తిరగేసి పట్టుకున్నానని! చటుక్కున పుస్తకం టేబుల్ మీద పెట్ట
"నీకోసం వెయిటింగ్ మమ్మా! కదా.....జ్ఞాపీ క్యాజువల్ గా అనాలని చూశాడు. కానీ వీలుకాలా!
