౭
శాస్త్రము -అనుభూతి
శ్రీసోమనాధశాస్త్రులుగారి తపస్వితపై నాకు మహాభక్తి! కాని వారి ననువర్తింప వలెనని కాని,అనువర్తించినచోఁ గడ తేరఁ గల్గుదు నని కాని నాకు తోఁచ లేదు. యోగ సూత్రములను బాఠము చెప్పునపుడువారు తాము యోగ చెడిన దనియు, ఆపద్ధతుల ననుభూతికిఁ దెచ్చుకొనఁ జాల మయితి మనియుఁ జెప్పిరి. వారి కే సాధ్యము కాని చో మమ్ముదీనిఁ జదివించు టేల యని నాకుఁ దోచెను. కాని కోపింతు రని వారి నడుగ నయితిని. మఱొక నాఁడు నా ప్రశ్నమును వారే వేసికొని " మిలో నెవరయిన వీనిని సాధింపఁ గల రేమో యత్నించి చూడండి. సరియయినగురువు దొరకు నేమో చూడండి. నా కనుభూతి కలుగనంత మాత్రాన శాస్త్ర మప్రమాణ మనుకోకండి. మిరుగా సాహిసించకండి" అనిరి. ఆ మాట నాలోఁ జొచ్చుకొని పోయినది. వారు మంత్రయోగమయులు. అనుష్టానమున గాఢతత్పరతయే కాని వారికి దాని ఫలిత మేమి అన్న యోచనమే యుండెడిది కాదు. చేయవలసినది గనుక చేయుచుండుటయే. ఇటీవల వారి తపఃప్రయత్నమును గూర్చి యోచించుటలో నేతదర్దకమగు నుపనిషద్వాక్యము సమాధాయక ముగాఁ దోఁ చినది.
నేను నా యిర్వది యెనిమిదవ వత్సరమున భ్రుక్త రహిత తారక రాజయోగమునఁ జేరి యబ్బురపు తనుభూతులను బడయుచుండఁ గా వారు సజీవులుగా తపోమయులుగా విరాజిల్లు చునే యుండిరి. తఱచుగా నేను స్వగ్రామమునకు వెళ్ళినపుడు చల్లపల్లి వెళ్ళియూ, వారు వారి యల్లుఁ గూతుళ్లు వర్ధిల్లుచున్న మా స్వగ్రామ మగు పెదకళ్ళేపల్లికి విచ్చేసినపుడు సందర్శించియు నా విషయముల వారికి నెఱింగించుచునే యుంటిని. వా రేంతో కుతూహలముతోఁ దాము గూడ నాతో నొకతూరి కుంభకోణము వచ్చి శ్రీ వారిని దర్శించి సంభాషించి యేమేమో పడయవలయు నని యుత్సాహ పడుచు వచ్చిరి. వారి కీయోగసంపర్కము కలుగఁ జేయవలె నని కోరిక నాకును నుండెడిది. కాని యదియు జరగలేదు.
వారు భౌతికశరీరము విడిచినపిదప నాముప్పది యెనిమిదవ నొకనాఁ డు నాధ్యాన సమయమున శ్రీ వారును, మా నాయనగారును, మామామగారును, నాతో పాటుధ్యానానుభూతిలో నుండుట కొన్ని నిమిషములపాటు గోచరించెను. ఈ మువ్వురకు నిట్టి యనుభూతి కలుగుఁ గా కానీ బహువారములు నా ప్రార్ధనమునఁ గోరుకొనుచుండెడివాఁ డను. కాన యా యనుభూతి నాకు ముదము గోల్పినది.
౫
వెంకటశాస్త్రిగారికడ విద్యావ్యాసంగము
శ్రీ సోమనాధ శాస్త్రులు గారిని వీడుట సమ్మతము గాకున్నము శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు క్రొత్తగా బందరు హైస్కూలులో నంద్రోపాద్యాయులుగా విచ్చేసి యుండుట చేతనే, శ్రీ సోమనాధశాస్త్రుగారి దగ్గఱ సహధ్యాయులగా చదువుచున్నవారము ముగ్గురము అవ్వారిసుబ్రహ్మాణ్య శాస్త్రి, పిసిపాటి వెంకటరామశాస్త్రి, నేను బందరులో శ్రీ వారి సన్నిధిని జసువుకొన నుత్సాహపడి తిమి. తొలియిద్దఱు ముందు బందరు చేరి సందర్భములు చూచుకొని నన్ను రమ్మందుమని వెడలిరి. వారి ప్రోత్సాహమున కొలఁ ది నళ్ళకు నేనును బందరు చేరితిని.అప్పటికి నా వయస్సు పదునాఱేం డ్లయి యుండును.
తెలుఁగున నా కేమేని యెఱుక యేర్పడెనన్నచో నది శ్రీ వెంకటశాస్త్రిగారి గురుతాను గ్రహప్రాప్తమే. వారి దగ్గఱ పుస్తకము పట్టి చదివినదానికంటె వారి ముఖతఃవినోదగిష్టిలో విని నేర్చినది చాలా. ఆధ్రాత్మిక విషయమున బందరు వాసంమునఁ గాని శ్రీ శాస్త్రిగారి సన్నిధిని గాని నాకు కలిగిన యుద్బోధ మేమియు లే దనియే యనవలెను. అంతే కాదు.శ్రీ శాస్త్రిగారి సన్నిధిని అవధానాధారణాలు, పద్యరచనలు, ఉపన్యాసవినోదములు,కవితాకల్పనములు,వాదప్రతివాదములు, అహంతలు, మమతలు బలసి ఆధ్యాత్మచింత యంతర్దాన మండిన దనవలెను. శ్రీ శాస్త్రిగారు మాయమర్మము నెఱుఁగని స్వచ్చ హృదయులు. బందరు రాక పూర్వము వారి తీరు' దేశాటనం పండితమిత్రతా చ' అన్న శ్లోకము చొప్పున చాతుర్యమూలములు గలదై వర్తిల్లినది. అప్పటి దేశాటన పండితమిత్రతా రాజసభా ప్రవేశాదులు వారు చెప్పును వచ్చును, మేము వినను వచ్చును, కాని పండిత మిత్రుతకుఁ దర్వాతిదయు, రాజసభాప్రదేశమునకుఁ బూర్వపు దియు నగు చాతుర్యమూలము వారు చాటు చేయక సవిస్తరముగాఁ జెప్పుచుండెడివారు. నేను సిగ్గునఁ జిదికి పోవుచుండెడి వాఁ డను.
