భూమిలోఁ బడ వేసిన విత్తనము కొంత దాఁక ఏమయి నదియుఁ దెలియరాక యుండి యుచిత కాలమున నంకురరూపముగా బహిర్వి కాసము చెందినట్లు మానవహృదయ ములలోఁ జొచ్చు కొనిపోయిన యనుభూతులు కూడ నుచిత కాలమున వానికిఁ దగినట్లు పాకముతో వెల్వడి విరివిసెందును. కాని యివి బీజరూపముగా నెన్నడో లోనికిఁ జొచ్చుకొని పోయిన యా యనుభుతులవల్ల నేర్పడిన వే యని గుర్తించుట మాత్రము సర్వత్ర జరుగదు. లోతయిన సంస్కరములు కొన్ని కాల మెంతో గడచి యనుకూల సందర్భము సమకూడి నప్పుడు గాని కార్య పరిణామము సెందఁజాలవు. ఆ చెందిన కార్యపరిణామమునాఁటికి కారణజ్ఞప్తి మఱుగుపడి పోవుట సంభవింపవచ్చును. ఈ బీజరూప సంస్కారములు లోపాచ్చుటయుఁ దర్వాత నవి బహిర్వికాసము సెందుటయు నొక్క జన్మములోనే జరగు ననఁ గాదు. పూర్వ క్షణపు బీజరూపసంస్కార ముత్త రక్షణ ముననే బహిర్వి కాసము చెందు నది గాఁ గొన్ని సందర్భములం దుండ వచ్చును, కొన్ని సందర్భములం దేడుజన్మముల దాఁ కఁ గూడఁ దేలనిది గావచ్చును. భగవత్ర్పాప్త్య ర్దమైన సంకల్ప బీజములు భగవత్తత్త్వమును గూర్చి స్పష్టపరిజ్ఞానము కుదురుదాఁ క విరివి సెందుచుఁ బెరిగి పెరిగి పరమ్యము పొందినపిదప నక్కడ నుండి బహిర్వి కాసమునకు వచ్చుచుఁ బరిపూర్ణ తన జెందుటకుఁ గూడ నట్లే యేడు జన్మముల దాఁ క సాగవచ్చును.
పరిపూర్ణత చెందు టనఁ గా మానవసామాన్యము కంటె నెంతో ఉన్నతోన్నతముగా ఎంతో లోతులోతుగా గోచరించిన తత్త్వమును మానవుఁ డు తన ప్రేమ ప్రసరించిన చోట్ల నెల్ల వ్యాప్తపఱుపఁ గల్గుట. ఉన్నతోన్నతము, లోతులోతు నయినభావ మదాటుగా ఆకారణముగా అసాధనముగా గోచరింపదు. తన హృదయ మెంతెంత ప్రేమమయమగునో, ఆ ప్రేమ మానవత మిఁ ద నెంతెంత యధికాధికముగాఁ బ్రసరించునో మానవుఁ డంతంత ఉన్నతముగా అంతంత లోతుగా పారమ్యమునకుఁ జేరిక చేరికగాఁ బోగల్గును. చెట్లవ్రేళ్ళు విరివి సెంది దూరదూరము వ్యాపింపను వ్యాపింపను చెట్లు మిఁదికి పెరుగగల్గును. కూకటి వేరు నెలలోఁ తుకును జొరగల్గును గాదా!
౬
కాకిపగా
పది పదుమూఁడేండ్ల వయసు వాఁ డను. అప్పటికి చల్లపల్లిలోఁ జదువుకొనుటకు వెళ్ళియందు ననుకొందును. నాకు చింతచిగురు పప్పుకూర యన్నఁ బ్రియము. మా యింటి దొడ్డిలో నున్న చింత చెట్టు గుబురుగాఁ జిగిర్చి యగ్ని జ్వాలలు రేగుచున్నట్లు మిలమిల చిగుళ్ళతో మెఱయూ చుండెను.' ఆ చిగురు కోసి తెత్తును, కూర వండి పెట్టు' మని మాయమ్మగారిని కోరితిని. గోడమిఁ ద నెక్కి చిగురు కోయుచు చేతి కందని కొమ్మ నొక కొంకికఱతో వంగ లాగఁ జొచ్చితిని. ఆ కొమ్మ ప్రక్కలఁ గాకిగూ డున్నది కాబోలును! నాకుఁ గానరాలేదు. ఒక కాకి యఱచుచు నినుపమేకుతోఁ గొట్టినట్టు కావు కావని యఱచుచు ఇంక నెన్నింటినో కాకుల రప్పించు కొనెను. ఒక టే గగ్లోలు! కంగారు పడి గోడ దిగి యింటిలోనికి వచ్చి వేసితిని. ఆ మర్నాడే నేను చల్లపల్లి వెళ్ళిపోయితిని.
తదాది నే నెప్పు డింటికి వచ్చినను నీకాకి పగ ప్రత్య క్షమయ్యెడిది. మఱచి దొడ్డిలోనికి వెళ్ళితినా కాకి ముక్కుతో నా తలమిఁ దఁ గొట్టిన దన్నమాటే! భోజనము చేసి చేయి కడుగు కొనుచో నా నెత్తిమిఁ ద నా కాకి రెట్ట వేయుటయు ముక్కుతో పోడుచుటయు జరిగెడివి. కొన్ని సమయములో తల మిఁ ద యా రోఁ తకు మరల స్నానము చేయ వలయుచుండును. ఈ కాకి పగ నన్నుఁ బది పండ్రెండేండ్లు బాధించినది. ఎఱిఁగి నే నేమియు న కాకికి అపకృతి చేయ లేదు. దాని గూటికిని గూడ నెట్టికీడును జరుగ లేదు. కాని దానిపగ మాత్రము నాపై ప్రబలముగా భువత్సర ములు సాగినది. మద్రాసు వచ్చిన తర్వాత నెలనెలకు నే నింటికిఁ బోవుటయుఁ దప్పెను. ఆ చింత చెట్టు నెండిపోయెను. ఆ కాకికూడ వేఱుచోటికిఁ జేరెనో! ఏమయ్యేనో! ఈ కధ నెందు కిక్కడ వ్రాసితి ననఁగా నిది నాకుఁ జాల వివేకము గఱపి బహుసమయములలో భావ విధిలో విహరించుచుండిన యధార్ధ గాధ!
ఇటీవల బసవపురాణాది గ్రంధముల ముద్రణ సందర్భములందు నాపై తీవ్రముగాఁ గోపము ప్రకటించి యిప్పటికిఁ బ్రకటించుచున్న వారియెడ నేను వర్తింపవలసిన తీరును కాకి పగ నాకు పాఠము చెప్పినది. ఎంత తీవ్రముగా విరోధించిన వారిపయిననను బ్రతివిరోధము పాటింపక, యంతరంగమున నాత్మీయత నే పాటించుచు నను రాగామునే సాగించుచుఁ దెలియఁ జెప్పఁ దగిన దానిని (కొందఱే అట్లు చెప్పఁ దగిన వారగుదురు) సమ్ముఖములో సుదృఢముగానే తెలియఁ జెప్పుచు నుండునో నావిద్వేషము, వారికిఁ దెలియ కుండనే యంతరంగ మునఁజొచ్చి నెలకొనుచున్న యీయనురాగముచే రేపఁబడి మఱింత రేగి ప్రతిఘటనము లేమిచే నిర్వీర్యమయి కాలక్రమమున నీరసించి యాఱిపోగలదు. ఇందు కానేకాను భవములు నా కీటివలివి కలవు. ఇట్లు ప్రవర్తింపఁ గల్గుటకు నాలో గురుదేవుల యనుగ్రహమును, శ్రీ గాంధిగారి దివ్య చారిత్రమును 'అంత ర్బహిశ్చ'నాకు జాగ్రత్తను గొల్పనవి.
