Previous Page Next Page 
ప్రజ్ఞా ప్రభాకరము పేజి 23

    ఆ కాలముననే మా యన్నగారికి వివాహము జరిగినది. ఆ వివాహము జరపినవారు, నా పెద తండ్రిగారి బావమఱఁది, సంగీత సాహిత్య విద్యారసికులు , దివిసీమలోని చోడవర గ్రామమున నెలకొన్న వారు, శ్రీలంక నాగేశ్వర శాస్త్రిగారు. వారికి నా మిఁద చాల వాత్సల్యము. ఆయన విధురులు. సంతతి లేదు. విద్యావినోదులే కాక వేశ్యావినో దులును. మా యన్నగారి వివాహము తర్వాతఁ గోన్నాళ్ళ కొక పుత్రస్వీకారము కూడ వారు చేసికొనిరి. ఈ కుఱవాని కుపనయనము చేసిరి. ఆ వివాహమునకు నుపనయన మునకును గొప్పగా బోగపు మేళములుప్రాతస్సయంకాలము లందు, రాత్రులందుఁ గూడ జరుగసాగినవి. వానినిఁ జూచుట కుద్యోగులు పలువురు వచ్చుట జరగెను. ఉపనయనము జరిగిన తర్వాత కొన్నాళ్ళు నన్నక్కడ నిర్బంధించి వారు నిలుపు కొనిరి. సంస్కృత నాటక కధలు, కాదంబరీ కధ నన్ను మా మేనమామగారు వేశ్యాపరివారితు లయి చెప్పగోరు చుండిరి. నేనును చెప్పు చుంటిని.ఎన్నా ళ్ళక్క డుండుట? పదినాళ్ళయిన తర్వాత ఆ యూరనుండి మా యూరకి వచ్చి వేసితిని.

    ఆ వేశ్యల శృంగారములు, ఆటపాటలు, నేను కధలు చెప్పుచున్నప్పుడు వారు నెఱ పిన సౌర్ధము, వారిహాస్యగాడు, బ్రాహ్మణ వృద్ధుడు, మా మేనమామగారు  నన్ను ప్రతి వత్సరము వెసగి సెలవులలో- శ్రీ వెంకటశాస్త్రిగారు బందరు విడిచి వెళ్లుదురుగాన- తమ యూరికి వచ్చి యుండుమని కోరుట నన్ను ముగ్ధుని జేసి వైచినవి. మా యూర విడిచి బందరు కేగి వారపు మెదుకులు తినుచు చదువుకొనుట వెగటు గొల్పసాగినది. ఇల్లు విడిచి పదునాఱుమైళ్ళు బందరు నడచి వెళ్ళుట యెప్పుడును పరిపాటియే యైనను నాకప్పుడది చాల బాధ గొల్పినది. ఒకటి రెండు ఫర్లాంగులు వెళ్ళుటే నాకు చాల కష్టమయ్యేను. అక్కడ నొక బురద కాల్వడది దాటవలెను. వెనుకకు తిరిగి పోవుదునా యని తోఁ చెను. బట్టల సర్దు  కొనుచు  కొంచెము సేపు కూర్చుండియోచించితిని. ఎన్నో చీకాకులు రేగినవి.శ్రీ విరేశలింగము పంతులుగారి ప్రహసనములు, ఉపన్యాసములు నంతకుముందు చదివి యుంటిని. వేశ్యల గూర్చి వారి వ్రాసిన వెల్ల తలఁపునఁ బాఱినవి. ఇక నిట్టి గోష్టులకెన్నఁ డు గాని పోరాదనిశపధము చేసికొంటిని. క్రీ. 1904 ప్రాంతములో మాట యిది. అటు తర్వాత నే నెన్నఁ డను వేస్యాభినయ దర్శనమునకుఁ బోయి నట్టెఱుక లేదు.
 
    బందరులో చదువుకొనుచుండుకాలమున నేను శ్రీకొండవెంకటప్పాయ్యపంతులుగారి యింటను, శ్రీ వల్లూరి సూర్యనారాయణ రావుగారి యింటను వసించుచుండువాఁ డను. వారి కప్పుడు నాపైఁ జాలవాత్సల్యము.శ్రీ సూర్యనారాయణరావు గారు వారిజీవితా వసానముదాఁకనాయోగక్షేమములు కనిగొనుచుండువారు.వారి ప్రేరణమున నే నేను మద్రాసు చేరితిని. అప్పటికి నాకు పడునెనిమిదవ యేడు. వారు శ్రీ రెంటాల సుబ్బావారు గారికి నన్ను గూర్చి జాబు వ్రాసిరి.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS