Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 22

    "హమ్మో.... హమ్మో.... నా పరువు తీసేస్తున్నావ్ కదే చిత్రాంగీ. హోల్ ఇండియాకి అందగాడిని, నాకు జంతువుల వెంటపడే ఖర్మేం పట్టిందే? ఆ అవును... ఎందుకు పట్టుకుని కట్టేయమన్నానంటే అది పొద్దస్తమానం మనపొలంలో పడిపోయి మేసేస్తుంది. అందుకని దాన్ని పట్టుకోమని అన్నాను"
    "నిజమే చెబుతున్నారా?" అనుమానంగా చూస్తూ అడిగింది చిత్రాంగి.
    "నిజం.... సత్తె ప్రమాణికం.... నీమీదొట్టు... పదరా సంతానం... మనం త్వరగా వెళ్ళాలి.." హడావుడిగా అన్నాడు రాయుడు.
    "పదండి...." అన్నాడు సంతానంకూడా కంగారుగా.
    "ఏంటో.... మీ కంగారూ, హడావుడీ చూస్తుంటే మీరు నిజం చెబుతున్నట్టు లేదు, ఏదో దాస్తున్నట్టు వుంది" అంది చిత్రాంగి.
    "హబ్బా... నువ్వు మనసులో అనవసరంగా డౌట్లు పెట్టుకోకు. నేను నిజమే చెప్తున్నాను కదా! నేను వస్తా."
    వీథిలోకి పరిగెత్తాడు రాయుడు. సంతానం అతన్ని అనుసరించాడు.
    ఇద్దరూ గబగబా పొలం చేరుకున్నారు.
    పొలం గట్టుమీద నడుస్తూ రాయుడు సంతానాన్ని అడిగాడు- "సరేగానీ ఇప్పుడు సీతాలు ఇక్కడికి వస్తుందంటావా?"
    "య్యోరాతా.... వస్తుందండీ బాబూ... తప్పకుండా వస్తుంది. రోజూ ఇదే టైంకి చేలగట్లమ్మట ఛెంగున గెంతుతూ, పాట పాడుకుంటూ వెళ్తుంది. ఈమారు తమరుభయపడకుండా అడుగు ముందుకువెయ్యండి. మీ నడ్డిమీద కొమ్ముల్తో గంగ పాడుస్తుందన్న భయం లేదు. అందుకే గదా దాన్ని కట్టిపారేశాం..." ధైర్యం చెప్పాడు సంతానం.
    ఇంతలో దూరంగా "ఓహోయ్..." అని దూరంగా కేక వినిపించింది.
    "అడిగోనండీ.... అది సీతాలుకేకే... రోజూ అలా అరుస్తూ.... గెంతులేస్తూ, పిచ్చికల్ని తోల్తూ, మేకపిల్లల్ని తరుముతూ వీలైతే ఓ పాటకూడా పాడుతూ వస్తుంది సీతాలు. రండి.... రండి.... మనం ఈ చెట్టుచాటున దాక్కుందాం" అన్నాడు సంతానం.
    రాయుడు, సంతానం చెట్టుచాటున నక్కారు. సీతాలు "హేయ్... హోయ్...." అని అరుస్తూ పిచ్చికల్ని తరుముతూ ఆ దారివెంట వచ్చింది.
    సీతాలు చెట్టు సమీపించి దాటుతుండగా రాయుడు చెట్టుచాటునుండి బయటకు వచ్చి చటుక్కున ఆమె చెయ్యి పట్టుకున్నాడు.
    "ఏయ్... ఏంటిది? నన్ను వదులు" ఆమె గింజుకుంది.
    "సెయ్యట్టుకుంది వదలడానికి కాదే..." అన్నాడు రాయుడు ఆమె నడుం చుట్టూ రెండో చేతిని బిగిస్తూ.
    "గంగా.... గంగా..." గోలగోలగా అరిచింది సీతాలు.
    అంతకంటే గోలగోలగా నవ్వాడు రాయుడు.
    "నువ్వెంత అరిచి గీ పెట్టినా లాభంలేదు - నీ గంగని మావాళ్ళు తాళ్ళతో కట్టిపారేసారు. హహహ"
    "ఆ. హయ్యో" బాధగా అంది సీతాలు.
    రాయుడు మరోసారి పకపకా నవ్వి సీతాలు పైటపట్టుకుని లాగేశాడు. సంతానం చెట్టుచాటునుండి ఈ తతంగం అంతాచూస్తూ ఆనందంతో గంతులేస్తున్నాడు.
    రాయుడు బలంఅంతా ఉపయోగించి చీర కొంగుపట్టి ఒక్క గుంజు గుంజాడు.
    అంతే... సీతాలు గిరగిరా బొంగరంలా తిరిగింది. చీరమొత్తం రాయుడి చేతిలోకి వచ్చింది. రాయుడు దాన్ని ఉండచుట్టి ప్రక్కకి విసిరేశాడు. ఆ చీరెలళ్ళి సంతానం మొహంమీద పడింది. సంతానం సీతాలు  చీరని అప్యాయంగా తడుముతూ ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు.
    సీతాలు గుండెలమీద చేతుల్ని కప్పుకుంటూ రాయుడికి అనుకూలంగా వెనక్కితిరిగి వీపును చూపించింది. అంతకంటే రాయుడికి కావల్సిందేమిటి?
    రాయుడు వెనకనుండి సీతాలు జాకెట్టు మెడఅంచుల్ని పట్టుకుని ఒక్క లాగులాగాడు.
    "పర్ ర్ ర్ -"
    జాకెట్టు మొత్తం చిరిగి రాయుడి చేతిలోకి వచ్చింది.
    "బాబుగారూ! దాన్నికూడా నా మొహంమీదికి విసరండి-" అన్నాడు సంతానం సంబరంగా. రాయుడు చిరిగిన జాకెట్టును కూడా సంతానం మొహంమీదికి విసిరేశాడు.
    సీతాలు మంచిరోడ్డునొదిలేసి తుప్పల్లోకి పరుగుతీసింది. రాయుడు ఆమె వెంబడించాడు.
    "గంగా - గంగా - రక్షించండి" అరుస్తూ పరుగులు పెడుతూంది ఆమె.
    రాయుడు పకపకా నవ్వుతూ సీతాలును వెంబడిస్తున్నాడు.
    ఆమె అరిచిన అరుపులు ఎక్కడో రెండు కిలోమీటర్ల అవతల తాళ్ళతో కట్టిపడేసిన గంగ చెవిలో పడనేపడ్డాయి.
    గంగ ఆమెకు వచ్చిన ఆపదను గ్రహించింది.
    అంతే... అది నేలకేసి కాలి గిట్టల్ని రాస్తూ బుసలు కొడుతూ తాళ్ళు తెంచుకోవాలని ప్రయత్నించడం మొదలుపెట్టింది.
    ఇక్కడ రాయుడు సీతాలుని అందుకుని క్రిందకు తోసాడు.
    ఆమె తుప్పల్లో పడింది. రాయుడు ఆమెమీదకి దూకాడు. చేతికి అందిన లంగాని పట్టుకుని లాగాడు. "పర్ పపర్ ర్" మని ఆరు అంగుళాల మేర చిరిగింది ఆమె లంగా.
    ఆమె ఓసారి కెవ్వున అరచి లంగా చిరగని వైపుకి తిరిగింది రాయుడికి అనుకూలంగా. రాయుడు ఆ ప్రక్కకూడా లంగాని చింపేసాడు.
    ఆమె కెవ్వు - కెవ్వుమని అరుస్తూనే వెల్లకితలా పడుకుంది.
    రాయుడు ఆమెమీద బోర్లాపడ్డాడు.
    కానీ అంతలోనే ఓ బలమైన పిడికిలి రాయుడి దవడమీద బలంగా ఓ దెబ్బ కొట్టింది.
    రాయుడు ఎగిరి ప్రక్కకు పడ్డాడు.
    ఆమె లేచి కూర్చుంది. ఎదురుగా గోపి!
    "ఆ - గోపీ! నువ్వొచ్చావా గోపీ-?" ఆనందంగా అంది ఆమె.
    "అవును సీతాలూ - నిన్ను రక్షించడానికి వచ్చాను" చిరుగులోంచి కనిపిస్తున్న  ఆమె అందాల్ని గుటకలు మింగుతూ చూస్తున్నాడు గోపి.
    "ముందు వాడి యిసయం సూడండి బాబూ" అంది ఆమె సిగ్గుపడుతూ.
    అప్పుడు పారిపోతున్న రాయుడ్ని పట్టుకుని మెత్తగా ఉలికి వదిలిపెట్టాడు గోపి.
    "హూ - ఇంక వెళ్ళు - ఇంకోసారి ఈ గూడెంలోని ఆడాళ్ళవంక కన్నెత్తి చూసావో నిన్ను ప్రాణాలతో వదలను...." అన్నాడు గోపి.
    రాయుడు అవమానంతో తల వంచుకుని రెండడుగులు ముందుకు వేశాడు. ఈలోగా తాళ్ళు తెంచుకుని అక్కడికి "గంగ" వచ్చింది. అది రాయుడ్ని కొమ్ముల్తో నడ్డిమీద ఒక్క కుమ్ము కుమ్మింది.
    రాయుడు వూడిపోతున్న పంచెను ఎగదోస్కుంటూ ఒక్కసారి పరుగు పెట్టాడు.

                                                                 19
    సీతాలు ఇంట్లో....
    "సమయానికి నువ్వొచ్చి రక్షించకపోతే ఆ రాయుడు నన్నేంచేసి వుండేవాడో గోపీ" అంది సీతాలు చిరిగిన లంగా పీలకల్ని అటూఇటూ చేస్తూ ఆటలాడుతూ.
    "ఇంకేం చేసేవాడు? అదే చేసి వుండేవాడు!" అన్నాడు గోపి.
    "ఛీ పాడు - నువ్వు భలే చిలిపి!" అంది సీతాలు సిగ్గుపడుతూ.
    "నువ్వు మాత్రం కాదా ఏమిటి?" ఎదురు ప్రశ్న వేశాడు గోపి.
    "నువ్వు నా మానప్రాణాలు కాపాడావ్ - నిజంగా నువ్వు దేవుడివి గోపీ" భారంగా పలికింది ఆమె.
    "అవును సీతాలూ..." పరధ్యానంగా అని మళ్లీ తన పొరపాటుకు నాలుక కొరుక్కున్నాడు గోపి.
    "కాదు... కాదుకాదు... కానేకాదు సీతాలూ.... నేనూ మామూలు మనిషినే - నీలాంటి మనిషినే. అది నా కర్తవ్యం సీతాలూ" అన్నాడు గోపి నిలువుగుడ్లేస్కుని ఆమె లంగా చిరుగులవంక చూస్తూ.
    గోపీ అలా చూస్తుంటేతప్ప ఆమెకు తెలీలేదు తను ఇంకా లంగా, బాడీతోనే ఉన్నదన్న విషయం.
    అతని చూపుల్ని గమనించిన ఆమె చచ్చేట్టు సిగ్గుపడుతూ  "ఫో గోపీ-" అంటూ అతని టెంకమీద ఒకటిచ్చి లోపలికి పరుగుతీసింది.
    రెండునిముషాల్లో చీర కట్టుకుని బయటకు వచ్చింది సీతాలు.
    "చెప్పు గోపీ.... ఏం తాగుతావ్? గంజా, అంబలా?" గోపీని అడిగింది.
    "ఇప్పుడేం వద్దు సీతాలూ... నేను ఇంటికి వెళ్ళాలి!" అన్నాడు గోపి నులకమంచం మీంచి లేచి నిలబడుతూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS