౫
అనుభూతి-తద్వికాసము
ఏదో సందర్భములో నా పసి (అయిదు ఎనిమిది సంవత్సరముల నడిమి) వయస్సుననే ఆంజనేయుని దేవళమున బ్రాహ్మణ సంతర్పణము జరుగుచున్నది. నేను నున్నాను. బిటాలి వాసి శిధిలముగా నున్న గుడి తలుపుసందున నుండి యెవరో తొంగిచూచిరి. ఆరగించుచున్న లోనివా రది గుర్తించి గద్దించిరి. బైటి మనిషి వైదొలగెను.మె మందఱ ము భుజించి వెలికి వచ్చితిమి.సాధు వొకఁ డాకొని యక్కడుండెను. ' నేవే కదా తొంగిచూచిన' దని భుక్తానులి ప్తులగు మావా రడిగిరి.' అగునండి! లోని సందడి విని గుడి కదా! లోని కళకళ మేమో అని చూచితిని. భుజించుట చూచితిని. మీరు గద్దించితిరి. మి భోజనానంతర మాకొన్న వానికి నా కింత యన్నము పెట్టుదు రేమో అని కూర్చుం ని' అనెను.' బ్రాహ్మణ సంతర్పణము చెడగొట్టితివిరా దుర్మార్గుఁ డా' యని మావారు చెడదిట్టిరి.' అయ్యా! మి రింత యన్నము పెట్టిన నా కడుపు నిండును గాని మి భోజనము చూచినంత మాత్రమున నాకేమి యొలుకు నండీ! లోన భుజింప వలసిన బ్రాహ్మణు లున్నారు. అంతా ముగిసేదాకా నీకు పెట్ట వీలు లేదు. పొ! తొలగిపొ' మ్మని ఒక మొనగాడు బ్రాహ్మణుఁ డుదరము నులుముకొనుచుఁ దిట్టేను. మిట్టమధ్యాహ్నము పన్నెండు గంటల వేళ! ఆ సాధువు కన్నీరు కార్చుచు ఆకసముకేసిచూచి తలవాల్చి కేలుదోయి సుర్యభాగవనునికి మోడ్చి 'తండ్రీ!నేనేపాపమునెఱుఁగను.అననువీరుట్టుచున్నారు. సర్వసాక్షివి! చూచుచున్నావు! కనికరించు మో దేవా! అని చేతి కుండిలోని నీటితో బిక్కమొగము కడుగుకొని యక్కడ నుండి వెడలిపోయెను. ఆ సాధు వట్లు సూర్యునికి మ్రొక్కుచు మండుటెండులో మాడుచు నాడినపలుకుకు నా గుండెలలో వేడిగా నాఁ టుకొనెను. ఒడలు జలదరించెను. ఇంటికి వెళ్లునప్పటికీ తివ్రజ్వరమువచ్చెను.మూఁడు నాళ్ళు చాల బాధపడితిని. ఆ బ్రాహ్మణుని ధౌర్త్యము, ఆ సాధువు జాలిమాటలు నాలో నా మూఁడు నాళ్లు నెంతో గందర గోళము గల్గించినవి. మా తల్లిదండ్రుల కీ గొడవనేనుతెలుపలేదు. క్రమక్రమముగా నా జ్వరము తగ్గినది. ఆ మూఁ డునాళ్ళ శరీరకంపములో నాలో నెంతో లోతున నేదో భావము పాతుకొని పోయినది. ఈ సంభవము మాత్రము నాకు పలుతూరులు స్మృతిపదమున మెలగుచునే యుండి నది. కానీ అది లోఁ బాదుకొనిపోయి నాలో నుండి వెడలించిన వివేకజ్వాలలను మాత్రము నే _ ఈ విషయము వ్రాయుచున్నప్పుడే- స్పష్టముగా నిరూఢముగా నెఱుఁగ గల్గితిని.
పండ్రెండ్లకు ముందు మా మాతృ శ్రీ దివ్యధామ మందగా ఔర్ధ్యదైహిక కర్మకలాపము మాయన్నగారుచేసిరి. నేనుతద్దినముపెట్టువానితమ్ముఁడనుగాదగ్గఱనుంటిని." జ్యేష్ఠనైవతుర్తవ్యం" అను శాస్త్ర నిర్ణయము చొప్పునే నేను పాటించితిని. వచ్చిన వైదిక బృందము నేను కర్మ కలాపములు చేయ కూరకుంటి నని గర్హింప సాగిరి. శాస్త్ర నిర్ణయమును మా యింటి ప్రక్కనే ఉన్న సాంబ శివ శాస్త్రిగా రాను విద్వాంసులు నిరూపించి యా వైదిక గోష్టిని నో రేత్తకుండఁ జేసిరి. అప్పుడు కర్మకలాప మంతయు ముగిసిన తర్వాత అన్నాతురులగు ప్రజలకు వర్ణవిభేదము లేకుండ ఒక నాఁ డెల్ల నేడెనిమివందలమందికి సంతర్పనము గావించితిమి. సంకల్పము నది గాని నిర్వాహ మెల్ల యా తమ్ములు చేసిరి. వీధి యెల్ల శుభ్రపఱ చి విస్తళ్లు వేసి భోజనములు పెట్టితిమి. కొందఱు వీధి యెల్ల చండాల భోజనముతో నంటైనదని గర్హించిరి. చుట్టుపట్టుల యుళ్ళ నలజడి రేగను. మా నిర్ణయము నిర్వక్రముగా సాగెను. ఇట్టి సంకల్పము నాలో పొడముట నా బాల్యమున నాలోఁ గుదుర్కొన్న యవయక్తభావ కారణమున నుండి వెడలిన కార్యవికాసమే యగిట నిటీవల గుర్తించితిని.
మరియు ముక్త్యాలలో జరిగిన నా కుమారుని వివాహామున గూడ నక్కడి సర్వజాతుల వారికిని, పాకీ వారికి గూడ ఒక్కొక్క నాఁ డొక్కొక్క జాతివారికిఁగామృష్టాన్నసంతర్ప్నము జరుపు టయ్యెను. ఈ సందర్భమునఁగూడ మా తమ్ములే నిర్వహకులు. ఆ వివాహ సందర్భములో మా కాప్త మిత్రులు, శ్రీ ముక్త్యాల ప్రభువులు తమ యింటి వివాహముగా వివాహసర్వవ్యయము ఎన్ని వేలయ్యెనో తామే భరించిరి. ఇట్లు జరగుటకు గూడ బాల్యమున నాలోఁ గుదుర్కొన్న యవ్యక్తభావమే కారణము.
