19. మోచేతులు పనస కాయలైతే విటమిన్ 'ఎ' లోపించినట్లే!
కొట్టగా అత్తింటికి వచ్చిన కొత్త అల్లుడు కాస్తా చీకటి పడిన తరువాత బయటకు వెళ్ళివద్దామని బయలుదేరిప్రక్కనే వున్న చిన్న గోతిలో పడ్డారు. ఎవరికైనా చూస్తారేమోనని సిగ్గువేసి త్వరత్వరగా దుమ్ము దులుపు కొని లేచి నిలబడ్డాడు అయినా ప్రక్కవాళ్ళు చూడకుండా వుంటారా? చూసినా క్రొత్త అల్లుడు కానుక తొందరపడి నడిచి కాలుజారి గోతిలో పడ్డాడనిసరిపెట్టుకుని ఊరుకున్నారు. ఆ రోజుకు అలాగడచిపోయింది. మర్న్తి రాత్రి ఆ అల్లుడు మళ్ళీ తలదించుకుని వచ్చింది. భోజనం చేసిగదిలోకి నడచివెళ్తూఎదురుగా వున్న ముక్కాళ్ళ పీటని తన్ని బోర్లా పడబోయాడు. అయ్యో, అయ్యో అల్లుడుగారికి అడ్డంగా పీటవుందే" అని అత్తగారు బాధపడిపోయింది అంతేగాని అల్లుడుగారికి కళ్ళు సరిగ్గా కనబడక ఎవరైనా ఎలా భావిస్తారు? కాని విచిత్రం ఏమిటంటే, అల్లుడుగారికి పగటిపూట చూపు బాగానే వుంటుందికాని చీకటి పడిన దగ్గర నుంచీ కళ్ళు సరిగ్గా కనబడవు.
పగలు మామూలుగా కళ్ళు కనబడుతూ రాత్రి అయ్యేసరికి కనబడక పోవడాన్ని "రేచీకటి" వ్యాధి అంటారు. దీనినే 'నైట్ బ్లైండ్ నేస్" అని కూడా అంటారు. ఇలా జరగడానికి వారిలో విటమిన్స్ 'ఎ' లోపమే కరణం. కంటిలోపల పగటిపూట వెలుతురూ చూడదానికి ప్రత్యెక యంత్రాంగం. రాత్రిపూట చూడడానికి మరొక ప్రత్యెక యంత్రంగం వుంటుంది. రాత్రిపూట చూపు కనబడటానికి పనిచేసే యంత్రంగనికి విటమిన్ 'ఎ' చాల అవసరం విటమిన్ 'ఎ' లోపించినప్పుడు ఆ యమ్త్ర్మ్గం సరిగ్గా పనిచేయదు. అందుచేత వారు రాత్రిపూట వస్తువులను సరిగ్గా చూడలేకపోతూ వుంటారు.
ప్రపంచంలో ఎక్కువ మందికిఅంధత్వం ప్రాప్తించడానికి విటమిన్ 'ఎ' లోపమే ముఖ్య కారణం. ఇటువంటి అమ్ధత్వాలలో రేచేకటి ఒకటి. విటమిన్ 'ఎ' లోపం ఏర్పడుతున్న వారిలో కంటిలో తడి తగ్గిపాతుంటుంది. కంటిలోని గుడ్డుమ్మీదతెలుపు భాగం ఏమది నట్లు కనబడుతూ, త్రికోణం మాదిరిగా నల్లగుడ్డులోని నలుపు భాగం కూడా ఎండిపోయినట్లయి, దానిమీద పుండ్లు ఏర్పడి చివరకు అది పగిలిపోయి కంటిలోపల నుంచి "లెన్స్" బయటకు వచ్చేసి శాశ్వితంగా అంధత్వం వస్తుంది. అందుచేత రేచీకటి వచ్చినా, చూపులో తేడా వచ్చినా, కంటిగుడ్డలు ఎండినట్లు కనబడినా వెంటనే డాక్టర్ ని సంప్రదించలి.
విటమిన్ 'ఎ' లోపంవలన కేవలం రేచీకటి రావడం, ఇతరత్రా అంధత్వం, ప్రాప్తించడమే కాకుండా ఒంటిమీద చర్మం ఎండిపోవడం, మోచేతి దగ్గర, పిర్రల దగ్గర పనసకయ మాదిరిగా గరుకు గరుకుగా చర్మం ఎక్కువుగా కనబడతాయి. ఇలా లోపం ఏర్పడటానికి పోషకహర లోపమే ముఖ్య కారణం. విటమిన్ 'ఎ'పాలు, వెన్న, నెయ్యి, చేప, నూనె, లివర్, కోడిగుడ్డలు, కెరట దుంపలు, ఆకూకూరల్లో వుంటుంది. ఈ పదార్ధాలను స్వీకరిస్తూ విటమిన్ 'ఎ' లోపంవలన అందత్వం, రాకుండా ముందే జాగ్రత్త పాడడం మంచిది?
****
