18. కాల్షియం లోపించితే వళ్ళంతాతిమ్మిరిగా వుంటుందా?
మృదులకు మూతి దగ్గర ఏదో విచిత్రమయిన అనుభూతి కలుగుతోంది. ఒక్కోసారిపెదాలు కాస్త అదురుతున్నట్లు మరికొన్ని సార్లు తిమ్మిరిగా వున్నట్లు అనిపిస్తోంది. పరిస్థితి ఇలా ఎందుకువుందో అర్ధంగాక ఆలోచనలో పడ్డా మృదుల గడ్డంకింద అరచెయ్యి పెట్టుకుని చేతి వేళ్ళతో బుగ్గని అదిమిపట్టింది. గడ్డం కింద నుంచి చేతిని తీసివేసి తల ఒక్కసారి ప్రక్కకి తిప్పేసరికల్లా బుగ్గలోని కండరాలన్నీనలిగినట్లయి బాధ కలిగించాయి. ఇది ఇలా వుండగా వున్నట్టుండి పడుకున్నప్పుడో, కూర్చున్నప్పుడో చేతివెళ్ళు ఒక్కసారిగా బిగదీసుకున్నట్లు అయిపోతున్నాయి. అలాగే కాలు బొటన వేలు ఇతరవెళ్ళు బలవంతంగా గుంజుకుపోయినట్లు అవుతున్నాయి. ఇలా కొద్దిక్షణాలసేపే జరిగినా ఆబాద భరించలేక పోతోందామె.
మృదులలో ఉన్న లక్షణాలన్నింటికి కారణం ఆమెలోని కాల్షియం లోపమే కాల్షియం లోపం ఏర్పడిన మొదటిదశలో చేతులు, కాళ్ళ వేళ్ళాలోనూ, మూతిచుట్టూ తిమ్మిరి తిమ్మిరిగాను, కాస్త మొద్దుబారినట్టుఅనిపించడం సహజం. తరువత కొద్దిరోజులకు అప్పుడప్పుడు చేతుల్లోనూ, కళ్ళలోనూ కండరాలు బిగదేసుకుపోయినట్టుఅవుతాయి దానివలన చేతివెళ్ళు ఒకదాని కొకటి దగ్గరకి గుంజివెయబడి ఒకదాని మీద ఒకటి ఎక్కినట్టుఅవుతాయి. బైటనవేలువెనకకు విరిచినట్టు, తక్కిన వెళ్ళు కింది భాగంలో ముడుచుకున్నట్లయిఅరచేయి దోసిలి పట్టినట్టు అవుతుంది.
ఇదే విధంగా పాదం వెనకకు గుంజివెయ బడినట్లు, కాలివెళ్ళు వెనకకు వంగిపోతున్నట్లుఅనిపిస్తుంది. ఇలా జరిగినప్పుడునొప్పి భరించలేక ఆ వెళ్ళని సరిచేయడానికి ఏంట ప్రయత్నించినా అవి తెలికిగా లోంగవు. చేతివెళ్ళేకాకుండా మరి కొందరికి మోచేతి దగ్గర, మణికట్టు దగ్గర కూడా కండరాలు బిగదీసుకుపోయి ఎంతో బాధ కలిగిస్థాయి. ఇటువంటి వారిలో బుగ్గమీద ముద్దుగాచితిక వేస్తె అది మనిషిని పరవశింపజేసేబదులుబాధ కలిగిస్తోంది.
కాల్షియం లోపం ఏర్పడడంతో కొందరికి గొంతుకతో శ్వాసనాళం మూసుకునిపోయి క్షణకాలం పరిస్థితి తారుమరు అవుతుంది. ఈ లక్షణాలు ఇలా వుండగా ఎక్కువ మందిలో ఊరికినేఅలసట, మానసికంగా చికాకు, కోపం కలుగుతూ వుంటాయి. మరికొందరిలో కడుపులో వికారం, మేలిపేట్టినట్లు నొప్పి ఉంటాయి. చాలాకాలం నుంచి కాల్షియం లోపం ఉండే వారిలో తలమీద అక్కడక్కడ నయాపైసా మేర వెంట్రుకలు ఊడిపోయి బోసిగా కనబడుతుంది. అలాగే చంకల్లోనూ యితర చోట్లవెంట్రుకలు ఊడిపోతాయి. చేతిగోళ్ళుపిచ్చిపోయినట్టుఅయిపోయిసహజ సౌందర్యాన్నికోల్పోతాయి. దంతాలు కూడా సరిగ్గా పెరగవు.
శరీర ఆరోగ్యానికి దంతాలు, ఎముకుల నిర్మణానికి కలిశ్యం అత్యంత అవస్దరం. దెబ్బతగిలినప్పుడు రక్తం కారకుండా వెంటనే ఆగడానికి రక్తంలోకల్శియం వుంది తీరాలి. నారలు_ కండరాలు పరస్పరం సహకరించి సరిగ్గా పని చేయడానికి, కండరాలుఅదుపు లేకుండా బిగదీసుకుని పోకుండా వుండడానికి కాల్షియం అవసరం. అలాగే మన శేరీరానికి కావలసిన అనేక ఎంజైముల ఉత్పత్తికి కాల్షియం క్వాలి. ఈ రకంగా కాల్షియం శరీరానికి సక్రమంగా, అందజేయదానికి విటమిన్"డి" పనిచేయగా, క్ల్శియం సమపాళ్ళలో అన్ని భాగాలకి అందేటట్లు పారాథైరాయిడ్ గ్రంధి కృషిచేస్తుంది.
అనేక అహారపదార్ధాల ద్వారా మన శరీరానికి క్ల్శియం అండజేయుబడుతుంది. పాలల్లో కాల్షియం ఎక్కువ వుంటుంది. చేపలను భుజించే వారికీ కూడా కాల్షియం తగినంత అందుతుంది. రాడిష్, బీట్ రూట్ సోయాబీన్స్లోనూ, చింతపండు, మూలక్కాడల్లోనూ కాల్షియం బాగా లభ్యం అవుతుంది. అందరికి అందుబాటులోవుండే సీతాఫలంలో అధిక శాతంలో కాల్షియం వుంటుంది. రాగుల్లో కూడ కాల్షియం ఎక్కువుగా వుంటుంది. అందుకాని ఆరోగ్యానికి రాగిజావా మంచిదని చెబుతారు తమలపాకులద్వారా కాల్షియం శరీరానికి అందుతుంది.
కాల్షియంలోపం ఎక్కువుగా చిన్న పిల్లలలో గర్భిణులలో బిడ్డకు పలు ఇస్తున్న తలుల్లో కణబడుతుంది. అంటే కాకుండా పోషకహారం లోపం వున్న వారిలోకూడా కాల్షియం లోపం ఉంటుంది. కాల్షియం లోపించినట్లు గ్రహించగానే తగిన చికిత్స పొందినట్లయితే వెంటనే ఉపశాంతి లభిస్తుంది.
****
