Previous Page Next Page 
హేల్త్ సైన్స్ పేజి 20

                        17.  విటమిన్ 'ఎ' లోపంవల్ల వచ్చే అంధత్వం
   
    పైకి బాగానే వున్నట్ట్లున్నా కమలకు కనురెప్పలను నులుముకోవాలలపిస్తోంది. అ బాధ ఎప్పుడూ వుండటంలేదు. అందుకే ఆ విషయం పట్టించుకోకుండా ఊరుకుందామే. కాని తరువాత కళ్ళు బరువుగా వున్నట్లు అనిపించసాగాయి. వెలుతురును చూడగానే కళ్ళలలోనీళ్ళు గిర్రున తిరుగుతున్నాయి. పైకి వ్యాధి కనబడలేదు. కానీమనస్థిమితం ఉండటం లేదామేకు. తీరా లక్షణాన్ని బయట పడుతున్నాయని తేలింది.

    ట్రకోమా కళ్ళకు వచ్చే వ్యాధి దీనినే "దుర్మాంసం పెరగటం" అంటారు. ట్రకోమావ్యాధి ఆసియ, ఆఫ్రికాదేశాలల్లోఎక్కువ. కొన్ని లెక్కలప్రకారం ప్రపంచ జనాభాలో ఐదవవంతుమంది ఈ కళ్ళవ్యాధిలో బాధపడుతుంటారు. కంటికి సంభందించిన ఇంకేదేనా చికిత్సకోసం వెళ్ళినప్పుడు డాక్టరు పరీక్షచేస్తూ, కనురెప్ప పైకిమడిచిచూస్తె ఈ వ్యాధివున్నట్లు బయటపడుతుంది. చంటిపిల్లలనుంచి వృద్దులవరకూ అన్ని వయసులవారికిఈ కంటివ్యాధి సంక్రమిస్తుంది. చ్గిన్నపిల్లలలో ఈ వ్యాధి వచ్చి ఎటువంటి చికిత్స లేకుండానే తగిపోవచ్చు. లేదా జీవితాతం ఎటువంటిబాధ లేకుండానేవ్యాధి మిగిలిపవచ్చు. కొందరికి తగ్గిపోయి మరలారావచ్చు కూడా.

    ట్రకోమావ్యాధి రావడానికి అతిసూక్ష్మంగావుందే ఒకరకమైన వైరస్ క్రిమి కారణం. ఇది ఒకరినుంచి మరొకరికి అతితెలికిగా సంక్రమిస్తుంది. ఈ కంటివ్యాధి వున్న వ్యక్తి ఉపయోగించిన వస్రాలను ఇతరదుస్తులను ఇతరులు వాడితే అతితొందరగా ఈ వ్యాధి రెండవ వారికీ సంక్రమిస్తుంది. క్రిములు కంటికి చేరిన రెండు మూడు రోజుల్లోనే వ్యాధి లక్షణాలు బయట పడతాయి.

    ఈ వ్యాధి వచ్చినవారి కంటిలో వుందే పల్చని పోర గట్టిపడుతుంది. ముఖ్యంగా పై కనురెప్ప లోపలి భాగంలో ఈ వ్యాధి క్రిములు చేరటంవలన చమటపొక్కులంత పరిమాణంలోఅనేకం పొక్కులు వస్తాయి. వీటిని 'పాలికిల్స్' అంటారు. ఒకే కంటిలో కాకుండా రెండు కళ్ళలోనూ ఈ వ్యాధివస్తుంది. ఈ వ్యాధి ముఖ్యంగా అపరిశుభ్రమైన పరిసరాలలోనూ, జనసాంద్రత ఎక్కువ వుండేచోటనివసించే వారిలో వస్తుంది. ఒక్కొక్కసారి ఈ వ్యాధి అంతు వ్యాధిలా విజ్రుంభీంచి అనేక మందికి సంక్రమిస్తుంది. అటువంతప్పుడు ముఖ్యంగా చంటి పిల్లలు ఈ కంటివ్యాధి గురి అవుతారు.

    చాలమందిలో కళ్ళకలక వ్యాధివచ్చి తగ్గినా తరువాత పరీక్షచేసి చూస్తె కళ్ళల్లో "పాలికిల్స్" స్పష్టంగా కనబడతాయి. అంతమాత్రాన కళ్ళకలకవలన ఈ వ్యాధి వచ్చినట్లుకాదు. అంతవరకు బయటపడకుండా ఉన్న ఈ వ్యాధి కళ్లకలక ర్క్యావడంతో వ్యాధి లక్షణాలని సంతరించుకుంటుంది. దాంతో కళ్ళు తరచూ ఎర్రబాడటం బరువుగా అనిపించడం, నొప్పిగా వున్నట్లు అనిపించటం సహజ లక్షణాలవుతాయి.

    'ట్రకోమా' వ్యాధి ఉందని గుర్తించిన వెంటనే పూర్తీ చికిత్స పొందకపోతేఅనేక దుష్పలితాలు కలుగుతాయి. రెప్పలు బరుకేక్కుతాయి. పైరెప్ప ముడుచుకోలేక కన్ను సగానికి పైగామూసే వుంటుంది. ఇంకొందరికి కంటిరెప్పలుకంటి లోపలి ముడుచుకునిపోతాయి.

     అందువలన కంటిరెప్పకి వుండేవెంట్రుకలు కంట్లో గ్గుచ్చుకుని బాధ కలిగిస్తాయి. అంతేకాదు_ కాంతిని కంటిలోకి ప్రసరింపచేసేనల్ల గుడ్లు కూడా దెబ్బ తింటుంది. అందుకునే అంధత్వాన్ని కలిగించడంలో "ట్రకోమా" ప్రముఖ పాత్రవహిస్తోంది. సల్ఫా బిళ్ళలు,టెట్రా సైకిలిన్స్, కంటి ఆయింట్ మెంట్లువాడితే ఈ వ్యాధి తెలికిగా తగ్గిపోతుంది.                    

                                                                              ****


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS