Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 21


    బుగ్గలు గట్టిగా సాగదీసి ఆమెముఖంలోకి చూస్తూ నవ్వాడు. ఆమె అద్భుతమయిన నేత్రాలమీద తన పెదవులు ఆనించాడు. అదంతా ఆనంద ప్రకటన.
    చాల సహజమయిన రీతిలో ఆ ప్రకృతి పుత్రుడు తన ఆనందాన్ని బహిర్గతం చేయసాగాడు.
    సమాజమనే బురదగుంటలో దొర్లి ప్రకృతి యిచ్చిన స్వేచ్చని వొదులుకున్నవాడు కాకపోవటంమంచి కన్నెపిల్ల శరీరంలో కొన్ని భాగాలు మగపురుగులు చూడరాదు. తాకరాదు అన్న నిబంధనలు అతనికి లేవు.
    సమాజపు కట్టుబాటు అనబడే ఊబిలోకి దిగినవాడు కాకపోవటం నుండి ఆడదిఅనబడే ఒక ప్రాణి. ఎముకలమీద రక్తమాంసాలు పొదగి చర్మం కప్పిన ఒక పదార్ధం కనిపించగానే ఆకలిగా ఆశగా వంకర చూపులు చూడటం అతనికి తెలియదు.
    ఒకవేళ అతనిలో ప్రకృతి సహజమయిన కామవాంఛ కలిగి  మరొక స్త్రీ శరీరంతో తన శరీరాన్ని పంచుకోవాలని అనిపించిఉంటే అతడు నేరుగా అందుకు సంసిద్ధుడు అయ్యాడు. కావాలని కల్పించుకున్న కట్టుబాట్లు అభ్యంతరాలు అతనికి లేవు.
    కాని మాలతిలో అతడు ఒక మధురమయిన మైత్రి భావాన్ని మాత్రమే చూచాడు. సుదీర్ఘమయిన తన ఒంటరి తనాన్ని పార ద్రోలిన ఒక ప్రేమమూర్తిని చూచాడు ఆమెను గట్టిగా పట్టుకుని ప్రేమ ప్రదర్శించాడు. ఆ తాకిడికి ఉక్కిరి బిక్కిరి అయింది మాలతి.
    అతడిని ప్రక్కకి తోసివేసి కందిపోయిన తనచేతుల్ని యితర భాగాల్ని అతడికి చూపింది.
    అతడు ఆ చోటుల్లో తన మొంటు హస్తాలను  ఉంచి అద్దసాగాడు. అతడిస్పర్శ తగలగానే నొప్పి పెడుతున్నట్లు బాధ నటించింది మాలతి.
    తన స్పర్శవల్లా మొరటుతనంతో కూడిన ప్రవర్తన వల్లా ఆమెకు బాధకలుగుతోందని గుర్తించాడు అర్ధమానవుడు.
    తనకు అత్యంత ప్రేమా స్పదురాలయిన స్నేహమయి అలా నొచ్చుకోవటం అతనికి బాధ అన్పించింది. తనచేతుల్ని వెనుకకు తీసుకున్నాడు.
    అతడి ప్రతి కదలికను అత్యంత సునితమయిన దృష్టితో పరిశీలిస్తున్న మాలతి అతడిని అర్ధం చేసుకుంది. ఆ స్పర్శలో మైత్రీభావం తప్ప మరొక ఆలోచన లేదు.
    అతని చూపులలో ఆరాధనతప్ప ఆడదానికి అవమాన కర మయిన భావాలు ఏవీలేవు.
    అందునించి అర్ధమానవుడు ప్రకృతి పుత్రుడు సుగుణ పరిపత్తి లోమాత్రం పరిపూర్ణమానవుడు. అతడినించి తనకు జరిగే చెరుపు అంటూ ఏమీలేదు. ఆ పవిత్ర నిర్మలమూర్తిని అనుమానించటం మానవతని అనుమానించటమే అవుతుంది.
    మైత్రీ భావంతో కూడిన అతడి స్పర్శను అసహ్యించు కోవటం సృష్టిని అవహేళన చేయటమే! అందునించి తొలగిన వస్త్రాలను సవరించుకోవాలని ఆమె తొందరపడలేదు. చిరిగిన వస్త్రాలను సమీకరించుకోవాలని చిందులు వేయలేదు. అతని వంక చూచి మధురంగా నవ్వింది.
    ఆ నవ్వుతో అతడు మామూలుగా అయినాడు. తన అమృత ప్రేమస్వరూపిణి, తన స్నేహమయిచూపిన, ప్రదర్శించిన, అభ్యంతరాల వల్ల అతనిలో కలిగిన వ్యాకులత యావత్తూ క్షణాలమీద కరిగిపోయింది.
    అయితే !! ?
    అతని చూపులు అందమయిన ఆమెశరీరాన్ని పరిశీలిస్తున్నాయి. అందాన్ని ఆరాధించటమనేది మనిషిలో చాల సనాతనమయిన సహజత్వం. ఆ చూపులు ఆ వాస్తవాన్ని రుజువు పర్చుతున్నట్లుగా ఉన్నాయి.
    అతని దృష్టి మళ్ళించేందుకు ఏదైనా చేయాలనుకుంది కెప్టెన్ మాలతి. మాటలుచెప్తే అర్ధంకావు. సైగలుచేస్తే కొన్ని అర్ధం అవుతాయి. కొన్ని అర్ధంకావు.
    అందునించి ముందు అతనిదృష్టిఆకర్షించేందుకు ప్రయత్నించాలనుకుంది ఆమె.
    "ఆ ఆ ఆ" అంటూ నోరు తెరిచింది. అర్ధమానవుడు క్రీడాపాయంగా దాన్ని స్వీకరించాడు.
    "ఆ.....ఆ......ఆ..." అంటూ తానుకూడా నోరు తెరిచేసాడు.
    "ఈ.....ఈ......ఈ...." అంది. కెప్టెన్ మాలతి. అర్ధమానవుడు తన స్నేహితురాలు క్రీడను కొనసాగించినందుకు ఎంతగానో సంబరపడిపోయినాడు.
    తానుకూడా "ఈ....ఈ......ఈ...." అంటూ ఊదేశాడు. కొండలు ప్రతిధ్వనించాయి.
    "ఊ.....ఊ.....ఊ...." అంది మాలతి. అతడు ఆమెను అనుసరించి అలాగే అనసాగాడు.
    "ఏ.....ఏ.....ఏ" అందామె. ఆ క్రీడ అలా సుదీర్ఘంగా సాగిపోతున్నందుకు పొంగిపోయినాడు అర్ధమానవుడు.
    "ఏ ఏ హే హే" అంటూ ఆమెను చేతులతో ఎత్తి ప్రశంసాపూర్వకంగా గిరగిరా త్రిప్పసాగాడు.
    కెప్టెన్ మాలతి ఉక్కిరిబిక్కిరి అయిపోయింది ఈ మొద్దు అవతారానికి సంతోషంవచ్చినా ప్రాణాంతకమే అనుకుంది మనసులో. అలా త్రిప్పుతూనే ఆమె చెంపలమీద చెవుల దగ్గరగా పెదవులు ఆనించి "హే హే హే" అని అరిచాడతడు కొండలు దద్దరిల్లినాయి.
    మాలతికి చెవులు గడియలు పడ్డాయి. ఆ శబ్ద వికారానికి గుండెలు దడదడలాడినాయి. కళ్ళు తిరగసాగాయి. అతడి లాగే గిరగిరా తిప్పేస్తూ చెవుల్లో గీపెడుతూ ఉంటే తను ఉక్కిరి బిక్కిరి అయి చని పోతానేమో అనిపించిందామెకు.
    అతని పెదవులు తన చెంపలు అనుకుని చెవుల దగ్గరగా వున్నాయి. అతని చెంపలు తన పెదవుల దగ్గరగా ఉన్నాయి. అతడి పరవళ్ళు తగ్గించాలని అతని చెవి క్రిందిభాగాన్ని ముని పంటితో అందుకుని గట్టిగా నొక్కింది మాలతి.
    అతడికి చక్కిలిగింతతో పాటురవంత బాధ కూడా కలిగింది. తిరగటం, చెవిలో అరవటం ఆపేశాడు. ఆమె అలా తన చెవిని ముని పంటితో నొక్కటం కూడా ఇతఃపూర్వం లానే ఒక క్రీడ అనుకున్నాడు.
    తాను కూడా ఆమె చెవి అందుకోబోయి పొరపాటున చెంప అందుకుని కసుక్కున కొరికేశాడు. మృదులమయిన లేత చెంపలమీద ఎర్రగా కదుములు కట్టినాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS