Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 20


    ఒక ఆలోచనని ఆశ్రయించాడు.
    ఎలుగులు బాగా దగ్గరగా వచ్చాక చేతిలోని రాతి ఆయుధాన్ని ఎదురుగా ఉన్న ఎలుగుతలమీద ప్రయోగించాడు.
    అది హటాత్తుగా జరిగిన పరిణామాన్ని అంతవేగంగా ఎదుర్కోలేక పోయింది. దాని ముక్కు పుటాలు బ్రద్దలు అయినాయి. రక్తం చారికలు కడుతోంది.
    గుర్రున శబ్దంచేస్తూ నేల మీదికి వాలిపోయింది ఎలుగు. తాను వెళ్లేందుకు తగినంత జాగా దొరకగా అర్ధమానవుడు మాలతితో సహా అవి ముట్టడించిన వలయంనించి బయటపడ్డాడు. అమిత వేగంగా అనూహ్యమయిన రీతిలో శతృవు చేసిన దాడి, పడిపోయిన ఎలుగు వలయాకృతిలో అంటే చక్రవ్యూహంలో దాడి చేస్తున్న ఎలుగులన్నింటినీ బాగా కలవరపరిచింది.
    అవి ప్రాణాలకు తెగించి మధ్యలో ఉన్న అర్ధమానవుడి మీదికి కళ్ళు మూసుకుని ఉరికినాయి. గాని అప్పటికే అతడు తప్పించుకు పోయినాడు.
    కావటంతో ఎలుగులన్నీ వలయాకృతిలో ఒక కేంద్రబిందువు దగ్గరకు వచ్చి ఒకదానినొకటి పరస్పరం డీ కొన్నాయి. కొన్ని క్రింద పడ్డాయి.
    వెంటనేలేచి దాడికి సిద్దమయినాయి. కాని అప్పటికే అర్ధమానవుడు బాగా ఎదిగిపోయి, వూడలు దిగిన ఒక వృక్షము మీదికి చేరాడు.
    ఎలుగులన్ని ఆవంకకు చూచి దండుగా బయలుదేరినాయి. ఒకదాని వెంట ఒకటి చీమల దండులా చెట్లు మీదికి ఎగబ్రాకటం ప్ర్రారంభించినాయి.
    ఒక సువిశాలమయిన వృక్షశాఖ మీదికి తుదికంటా చేరుకున్న అర్ధ మానవుడు అవన్నీ చెట్టు మీదికి చేరిందాకా చాల నిశ్చింతగా ఉండి పోయినాడు.
    అవన్నీ తనను చేరవస్తున్నాయని అనిపించినప్పుడు ఆ వృక్షశాఖనించి క్రిందికి దిగిపోయిన ఊడనందుకుని భూమి మీదికి క్షణంలో చేరిపోయినాడు. అయితే ఈ సారి రవంత అయిన జాప్యం చేయలేదు.
    కెప్టెన్ మాలతిని తనకు మైత్రి అనే అపురూపమయిన మాధుర్యాన్ని అందివ్వగల మాలతిని భుజాన అమరికగా ఉంచుకుని అమిత వేగంతో పరుగుతీయసాగాడు.
    తనను దీర్ఘ మయిన ఒంటరి జీవితంలోకి తోడుగా వచ్చిన మరొక మనిషి ఆమె. తన ప్రాణాలకన్నా ఆమెతో సాహచర్యం అతనికి అత్యంత ప్రధానం.
    అందు నుంచి యావత్తు శక్తినంతటిని ప్రయోగించి పరుగు తీయడం మొదలెట్టాడు.
    రెండవసారి కూడా మానవప్రాణి అనే మేధోపజీవి యిచ్చిన టోకరాతిని కంగారుపడి పోయినాయి ఎలుగులు. అవి చెట్టుకొమ్మల మీదినించి శాఖలన్ని చీలిన మాలోనికి వచ్చి చేరుకున్నాయి.
    ఎలుగుల అలవాట్లు విచిత్రమైనవి. అవి చెట్టు ఎక్కేటప్పుడు కాళ్ళు చేతుల గోళ్ళ సాయంతో కాండాన్ని అంటిపెట్టుకుని మనుషుల్లాగే పైకి ఎక్కుతాయి.
    కాని దిగేప్పుడు మాత్రంముఖాన్ని తలను గుండెల్లో దూర్చుకుని బంతుల్లాచుట్టుకుపోయి పైనించి క్రిందికి అలాగే దొర్లుతాయి.
    భూమిని చేరాక ఒకచోట ఆగిపోయినప్పుడు తలను గుండెల్లోంచి బయటికి లాగి నింపాదిగా రెండు కాళ్ళ మీద లేచి నిలబడిదుమ్మి దులుపుకుని ముందుకు బయలుదేరుతాయి. అది వాటికి ఒక విలక్షణమయిన అలవాటు.
    ఎలుగుల దండు అలానే ఒక దానివెనుక ఒకటి చెట్టు మొదలునుంచి నేల మీదికి దొర్లినాయి.
    నల్లని బంతులు చెట్టుమీది నించి నేల మీదికి దొర్లివచ్చాయి. అన్నీ దుమ్ముదులుపుకుని మళ్ళీ సైన్యంగా సమయుత్తమయి విరోధి కోసం చుట్టూ చూచినాయి.
    కాని వాటికన్నా ఉపాయశాలి, పరాయన శీలి అయిన అర్ధమానవుడు చాలదూరం పరుగుతీసి వాటికీకన్పించకుండా పోయినాడు. చెట్లమాటునకు మరుగుఅయాడు.
    అవి ఇంక కాస్సేపు గుర్రున శబ్దంచేస్తూ చెల్లాచెదురు అయి వెదికి నిరాశతో ఊరుకుండిపోయినాయి.
    అర్ధమానవుడు ఎటువెళ్ళాలన్న విషయాన్ని నిర్ణయించగల స్థితిలో కాని కనీసం గమనించగల స్థితిలో కాని లేదు కెప్టెన్ మాలతి అందునించి తనయిష్టం వచ్చినదారిన పలాయన పాటవాన్ని ప్రదర్శించినాడతడు.
    చాలత్వరగానే అడవిదాటి మైదానంమీదికి వచ్చాడు. ఆ తరువాత తన ప్రత్యర్ధుల దృష్టినించి తాను  దూరమయినాడన్న విషయాన్ని అర్ధంచేసుకుని నెమ్మదిగా నడవటం ప్ర్రారంభించాడు.
    లోయలోకి దిగి తన గుహాముఖం చేరుకున్న తరువాత స్థిమితపడి పోయి తన స్నేహ మూర్తిని ఒక ఎత్తయిన రాతిమీదకు దింపి ఆమె కళ్ళు తెరిచే మధురక్షణాలకోసం ఎదురు చూడసాగాడు. రవంత సేపయాక కళ్ళు విప్పింది మాలతి అందాకా ఆమెకు తెలివి తెప్పించడంకోసం చిత్రవిచిత్ర మయిన ప్రయత్నాలు చేశాడు, అర్ధమానవుడు.
    ఆమె శరీరం మీద ఆచ్చాదనగా ఉన్న వస్తాలన్నింటిని లాగి అవతల విసిరేశాడు అవి శరీరాన్ని బిగువుగా అంటి పెట్టుకుని ఉన్నచోటున చించి పారేశాడు. ఆమె యించుమించు అర్ధనట్గ్నంగా మిగిలిపోయింది.
    అలా ఎందుకు చేశాడో అతనికి తెలియదుకాని చేశాడు ఆమె అందచందాలు అతనికి ఎంతో తృప్తినిచ్చాయి. పైగా కనులు కూడా విప్పిందామె! ఆ ఆనందం భరించ లేక పెద్దగా అరుస్తూ ఆమె మీదికి పడిపోయినాడు. ఆ తాకిడి కెవ్వున అరచి అదిరి పడిపోయింది కెప్టెన్ మాలతి.
    
                           8
    
    అర్ధమనవుడు తన ఆనందాన్ని చాల విచిత్రమయిన ధోరణిలో ప్రదర్శించాడు. మొరటుగా ప్రవర్తించాడు అంత బరువు అంతవిసురుగా మీదపడటంతో మాలతి తట్టుకోలేక పెద్దగా అరిచింది.
    అయితే ఆమెకు అతనిమీద రవ్వంతయినా కోపంకలగలేదు. తనబలమంతటినీ ప్రదర్శించి అతడిని ప్రక్కకు తోసివేసింది. అతడు మెరుపులాలేచి ఆమెచేతులు పట్టుకున్నాడు. భుజాలుపట్టి ఊపాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS