Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 21


    
    ఆమె అతన్ని వదల్లేదు.
    
    అతని పరిస్థిథీ అంతే అంతవరకు స్త్రీ స్పర్శ ఎరగని అతను ఆమెను ఇంకా పొదివి పట్టుకున్నాడు. తనను ఆమె స్పర్శ స్వర్గంలోకి గిరాటేసినట్టు ఫీలయ్యాడు.
    
    అతని చేతులు మరింత కిందకు దిగి నడుం చుట్టుకొలతను కొలుస్తున్నాయి. పిడికిట్లో పట్టే నడుం ఆ క్షణంలో మరింత సన్నగా కనిపిస్తోంది. బాదుషాలా వున్న బొడ్డులో అతని వేళ్ళు చిక్కుకుపోయాయి.
    
    ఎప్పుడో మరిచిపోయిన మధురానుభూతి అవయవాలను ఉబ్బిస్తోంది. అందుకే ఆమె బ్రా ఒక్కక్షణం సాగి ఆ తరువాత వీలుకాక ఎలాస్టిక్ తెగింది.
    
    అతని వేళ్ళకున్న నెక్స్ట్ టార్గెట్ ఏమిటో తెలియడంవల్ల, ఆ ప్రమాదం రాకుండా ఆమె మెల్లగా చేతిని ధించి, అతని రెండు చేతుల్ని పట్టుకుంది.
    
    సుఖాన్ని కలిపేసుకోవడం వల్ల రక్తం మరింత చిక్కనై స్రవిస్తోంది. గుండె మాత్రం అందుకు సరిపడా వేగంతో కొట్టుకోలేక తడబడుతూ వుంది.

 

    బరువంతా ఎదమీద కేంద్రీకృతమైనట్టు అనిపించి, దానిని తగ్గించు కోవడానికన్నట్టు చేతులు రెండూ పైకెత్తింది. ఇప్పుడు ఆమె గుప్పెడు పొడవైనట్టని పించి అతని మునికాళ్ళ మీద నిలబడి ఆమెను గాఢంగా హత్తుకున్నాడు.
    
    అప్పుడు గుర్తు వచ్చింది ఆమెకు తనేం చేస్తున్నదీ వెంటనే అతని నుంచి విడివడి కిందకి పరుగెత్తింది.
    
    చాక్లెట్ ని చేతుల్లోంచి లాక్కుంటే చిన్నపిల్లాడు ఎలా విలవిల్లాడి పోతాడో అలా అతను గిలగిల్లాడిపోయాడు. తిరిగి తన శరీరం స్వాధీనంలోకి రావడానికి ఐదు నిమిషాలు పట్టింది.
    
    కిందకి దిగి వచ్చాడు.
    
    మామూలుగా మట్టి మిద్దేలా కనిపించే సుమతి ఇల్లు అప్పుడు మళ్ళీ పూలతో అల్లిన పందిరిలా కనిపించింది. ఇంటిముందున్న పూలచెట్లు కూడా తనని చూసి సిగ్గుపడుతున్నట్లు తోచింది. కాంతమ్మను చూస్తూనే ఎక్కడ లేని గౌరవమూ, భక్తీ పుట్టుకొచ్చాయి.
    
    సుమతి కోసం కళ్ళు గాలించాయి కానీ ఆమె ఎక్కడా కనబడలేదు.
    
    అతను ఇంటికి తిరిగొచ్చాడు కానీ ఆకలంటూ తెలియడం లేదు. దాహం వేయడం లేదు. కళ్ళు నిద్రతో జోగడం లేదు. మొత్తం శరీరమే అతని స్వాధీనంలో లేదు.
    
    సుమతి పరిస్థితి కూడా డిటోనే. ఒక్కసారిగా శరీరం మేల్కొన్నట్టు ఒళ్ళంతా తుళ్ళిపడుతోంది. ఆరునెలలుగా దూరమైన అనుభవం కోసం అవయవాలన్నీ యాగీ చేస్తున్నాయి. ఆమె కళ్ళముందు నారాయణే కనిపిస్తున్నాడు.
    
    రెండోరోజు కూడా నారాయణ వచ్చాడు గానీ అతనికి ఎదురుపడాలంటే ఆమెకు ఏదోగా వుంది. సిగ్గుతో ఒళ్ళంతా బరువెక్కి పోయింది. పులకింతలతో వూగిపోతున్న శరీరాన్ని అతనికి చూపించడం ఇష్టం లేకపోయింది.
    
    "రేయ్ నారాయణా! కాయలు బాగా ఎండిపోయాయిగానీ- ఇంట్లోకి చేర్చుదాం పదా" అంటున్నాడు నాగభూషణం.
    
    "ఈరోజుకి వుండనీ నాన్నా ఇంకా పచ్చి వుంది" నారాయణ గొంతులోని అర్దింపు సుమతికి వినిపిస్తూనే వుంది. ఆమెకి నవ్వాగడం లేదు.
    
    "ఒద్దురా బాగా ఎండిపోయాయి"
    
    అలా కాయలన్నింటినీ నాగభూషణం తన ఇంటికి చేర్చాడు. దాంతో నారాయణని తన ఇంటి దగ్గరే చూసే అవకాశం లేకపోయింది సుమతికి.
    
    ఆ నెలే సుబ్బరామయ్య ఉద్యోగం నుంచి రిటైరయ్యాడు. తల్లి ఎప్పుడూ ఇంటిపట్టునే వుంటోంది. నారాయణను చూద్దామని సాయంకాలాలు ఆమె ఏదో ఒక సాకుతో వీధిలోకి వచ్చినా, అతను కనబడడం లేదు. బహుశ నైట్ డ్యూటీ లేమోనని సరిపెట్టుకుంది.
    
    అది నిజమే అతనికి వారంరోజులుగా నైట్ డ్యూటీ తెల్లవారి ఆరుగంటలకి మిల్లునుంచి వస్తే నిద్ర, మధ్య మధ్యలో లేచి టిఫిన్, భోజనం ముగించుకొని తిరిగి నిద్రకి ఉపక్రమిస్తాడు. సాయంకాలం ఐదు గంటలకల్లా డ్యూటీకి బయల్దేరతాడు.
    
    ఆరోజు ఒకటో తేదీ తెల్లవారి నుంచే కాంతమ్మకి వణుకు పుట్టింది. సాయంకాలం అయిదుగంటలకల్లా అయిదొందలు రూపాయలు చీటికి కట్టాలి. చీటీ డబ్బులు కట్టకపోతే- ఇక అంతే సంగతులు చీటీల సుభాషిణి ఎడా పెడా వాయించేస్తుంది.
    
    మన ఊర్లో సుభాషిణి గురించి తెలియని వారుండరు నీలాంటిది తప్ప. ప్రతినెలా చీటీలు తిప్పుతుంది. డబ్బు వసూలు చేయడంలో కాని, డబ్బు తిరిగి చెల్లించడంలోగాని మహా స్ట్రిక్ట్ ఎవరయినా నెలవంతు చెల్లించకపోతే నేరుగా వీధిలో నిలబడి ఆ కట్టని వ్యక్తిని వీధిలోకి లాగుతుంది. చెడమడా తిడుతుంది. ఆ తిట్లు కూడా ఎలా వుంటాయనుకున్నావ్! కాస్తంత పరువున్న వాడెవడయినా సరే ఉరేసుకు చావాల్సిందే.
    
    అందుకే కాంతమ్మ అలా వణికిపోయింది.
    
    ఆరునెలల క్రితం ప్రారంభమైంది ఆ చీటీ, మొత్తం ముఫ్ఫైమంది సభ్యులు. అందులోను కాంతమ్మ ఆ చీటీ మొదటి నెలే పాడేసుకుంది. ఈ ఆరునెలలూ మొగుడికి జీతం వుంది కాబట్టి కట్టగలిగింది. మరిప్పుడు ఆ ఆధారమూ పోయింది. వచ్చే కాసిన్ని డబ్బులు మొగుడు పేకాటకే సరిపోతున్నాయి. మరి గండం గడిచేదెలాగ?
    
    ఆమె అలా ఆలోచిస్తుంటే నారాయణ గుర్తుకొచ్చాడు. అతనొక్కడే చుట్టుపక్కలున్న వాళ్ళలో జీతం వస్తున్న మగాడు. అతన్ని అడిగితే తప్ప అయిదొందలు పుట్టే మార్గం లేదు. కానీ అతను ఇస్తాడా?
    
    అప్పుడే ఆమెకొక ఐడియా తట్టింది. పని జరగాలంటే తన కూతురు సుమతిని ప్రయోగించాలి.
    
    అతను అప్పుడప్పుడూ తన ఇంటి ముందు తచ్చాడుతుండడం, సుమతికి కనిపిస్తూనే కోరికనంతా కళ్ళతో చెప్పడం ఆమె కనిపెడుతూనే వుంది.
    
    అందుకే డబ్బు పుట్టాలంటే సుమతిని పంపాలి.
    
    "సుమతీ"
    
    అప్పుడే స్నానం చేసి అద్దం ముందు నిలబడి జడ వేసుకుంటున్న సుమతి ఆ పిలుపుకి హాల్లోకి వచ్చింది.
    
    "ఏమిటే?"
    
    "నీతో పని పడింది" కాంతమ్మ ఆమె దగ్గరికి వస్తూ మెల్లగా అంది.
    
    "పనా!"
    
    "ఆ-ఈరోజు చీటీ కదా అయిదొందలు కట్టాలి. ఇంట్లో చిల్లిగవ్వ లేదు'
    
    "దానికి నన్నేం చేయమంటావ్?"
    
    "నారాయణ- పక్కింటి కుర్రాడ్ని అడుగు"
    
    ఎప్పుడయితే నారాయణ పేరు వినపడిందో ఆమెలో ఏదో తెలియని సంచలనం బయలుదేరింది. పైట బరువెక్కిన ఫీలింగ్ ఎదంతా అలజడితో బిగుసుకు పోయింది. ఎక్కడెక్కడో ఏమిటేమిటో జరిగిపోతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS