"సుమతి గురించి చెబుతూ మధ్యలో ఆగిపోయావ్. వూరొచ్చేలోపు పూర్తిచేసెయ్" రంగనాయకి మౌనంగా వుండడంతో లిఖిత తొందర చేసింది.
"అలానే" అని తిరిగి చెప్పడం ప్రారంభించింది రంగనాయకి.
"అలా భర్తను వదిలేసి పుట్టింటికి చేరింది సుమతి. వాళ్ళది కూడు గుడ్డకు ఇబ్బందిలేని కుటుంబం. అలాగని స్థితిమంతులూ కాదు. సుబ్బరామయ్యకు పేకాట పిచ్చి అందులో బాగానే డబ్బు తగలేసేవాడు. అందులోనూ రిటైరయ్యే వయసు. సుబ్బరామయ్య భార్య చలాకీ మనిషి ఏదో వున్నంతలోనే కుటుంబాన్ని గుట్టుగా లాక్కొచ్చే రకం.
వాళ్ళది మిద్దెఇల్లు. ఆ ఇంటి పక్కనే నాగభూషణం ఇల్లు. ఆడదిక్కు లేని కుటుంబం వాళ్ళది. నాగభూషణానికి ఒక్కడే కొడుకు పేరు నారాయణ. అతనికింకా పెళ్ళి కాలేదు. బట్టల మిల్లులో పనిచేసేవాడు. నెలకు ఎనిమిది వందల జీతం.
ఆ సంవత్సరం అక్టోబర్ మొదలైనా వర్షాలు మాత్రం ఆగలేదు. అది పంటనూర్పుళ్ళ కాలం. వర్షం వల్ల నూర్పుళ్ళు సైర్గా కావడం లేదు. రైతులంతా మహా ఇబ్బంది పడుతున్నారు.
నాగభూషణం తన మోటారు కింద రెండెకరాల వేరుశనగ పంట వేశాడు.
పగలు ఎండకాసినా రాత్రిళ్ళు వర్షం కురుస్తూ వుంది. కూలీలకు ఎక్కువ కూలీ ఇచ్చి ఎలాగో వేరుశనగ కాయల్ని ఇంటికి చేర్చారు. తండ్రీ కొడుకులు చేరి.
"కాయల్ని ఆరబెట్టాల్రా లేకుంటే మొలకలు వచ్చేస్తాయ్. ఎక్కడైనా చెమ్మగా వుంది. ఎవరి డాబా మీదైనా పోసి ఆరబెట్టాలి" అన్నాడు నాగభూషణం దిగులుగా.
"సుబ్బరామయ్యది డాబా ఇల్లే కదా అందులోనూ పక్కిల్లు. అడిగొస్తాను వుండు" అని నారాయణ సుబ్బరామయ్య ఇంటికి వెళ్ళాడు.
సుబ్బరామయ్య భార్య కాంతమ్మ "ఏం నాయనా? ఇటొచ్చావ్?" అని అడిగింది. విషయం చెప్పాడు.
"దానికి అడగడం ఎందుకు? ఆరబెట్టుకో" అంటూ పర్మిషన్ ఇచ్చింది.
తండ్రీ కొడుకులిద్దరూ శనక్కాయల బస్తాల్ని డాబా మీదకు చేర్చారు. బస్తాలను విప్పి ఆరబెట్టారు.
ఆరోజు నైట్ డ్యూటీ నారాయణకి.
"రేయ్ నువ్విక్కడే కాపలా వుండు. నేనెళ్ళి భోజనం చేస్తాను" అని నాగభూషణం ఇంటికి వచ్చేశాడు.
నారాయణ అలా పిట్టగోడ దగ్గర నిలబడి ఊరి అందాల్ని చూస్తున్నాడు.
ఆ సమయంలో సుమతి దొడ్లో వున్న బాత్రూమ్ లో స్నానం చేస్తోంది.
తమ డాబా మీద శనక్కాయల్ని ఆరబోశారని, కావలిగా నారాయణ అనే కుర్రాడు వున్నాడని తెలియని సుమతి స్నానం చేశాక చీరను వూరికే అలా ఒంటికి చుట్టుకుని ఇంట్లోకి నడిచింది.
కరెక్ట్ గా అదే సమయంలో అటు చూస్తున్న నారాయణ కళ్ళల్లో ఆమె పడింది.
అతను పైనుండడంతో ఆమె గుండెలు మరింత స్పష్టంగా కనిపించాయి. వయసును తాగి మంచి నిగారింపులో వున్న ఆమె ఎద గుండ్రంగా, ఎత్తుగా అద్భుతంగా వుంది. ఇక నడుం అయితే వెదురుబద్ద కన్నా సన్నగా వుంది. పాదాలు తెల్లటి తామరపూవుల్ని పొడిచేసి రాసుకున్నట్టు మెరుస్తున్నాయి.
పక్కిల్లే అయినా ఎప్పుడూ ఆమెను అంత అర్ధనగ్నంగా చూడలేదు. ఒళ్లంతా వెచ్చటి ఆవిర్లు ప్రవహించాయి. ఎక్కడో కోరిక పుట్టి గుండెలోకి చొరబడినట్టు గుండె వేగం హెచ్చింది.
అప్పుడప్పుడు కుక్కలు శనక్కాయల్ని తింటున్నా అతనికి పట్టలేదు. ఆమె కోసమే కళ్ళంతా వెదుకుతున్నాయి.
రాత్రి ఎనిమిదయ్యింది.
ఆకాశం నల్లగా బొగ్గు ముక్కలా వుంది.
"వర్షం వచ్చేట్టుందిరా శనక్కాయల్ని వుడ్డగా తోసి, కసువుతో కప్పరా నాకు నడుం పట్టేసి నడవలేకుండా వున్నాను" అన్నాడు నాగభూషణం కొడుకుతో.
"అలానే" అని అతను పక్కింటికి బయల్దేరాడు.
భోజనాలు ముగించి కాంతమ్మ సుమతి వరండా మెట్లమీద కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు.
"ఏం నారాయణా! భోజనం అయిందా?" పలకరించింది కాంతమ్మ.
"ఆ"
"వర్షం వచ్చేటట్టుందే తొందరగా వుడ్డతోసేయ్"
"అందుకే వెళుతున్నా"
"మీ నాన్న ఎక్కడ? ఒక్కడివల్ల ఏమౌతుంది? ఈలోగా వర్షం వస్తే తడిసిపోతాయ్" అంది కాంతమ్మ ఆందోళనతో.
"ఆయనకి ఒళ్ళు బాగాలేదు. నేనొక్కడ్నే"
అప్పుడామె కూతురి వేపు తిరిగి "సుమతీ! నువు తోడుగా వుండి వుడ్డబొయ్. లేదంటే తడిసిపోతాయ్" అంది.
ఆమె అయిష్టంగానే లేచి డాబా మీదకి వెళ్ళింది.
నారాయణ ఆమె అంత దగ్గర్లో వుండడం ఏదోలా వుంది. ఆమె ఎద తనను హత్తుకుపోతున్నట్లే అనిపిస్తోంది. కొత్త బోదతో అప్పుడే కప్పిన గుడిసెల్లా ఆమె గుండెలు ఎత్తుగా కనిపిస్తున్నాయి. ఆమె శరీరమే మత్తు కలిగిస్తోంది.
ఆమె శనక్కాయల్ని తోయడానికి చీర ఎత్తి కట్టింది. ఆ కట్టులో ఆమె మరింత సెక్సీగా వుంది. నారాయణ కళ్ళు ఆమె పాదాల్ని పట్టుకుని పైకెగబాకి చీర అడ్డు రావడంతో ఆగిపోతున్నాయి.
ఆమె వంగి, కాయల్ని పైకెగదోస్తోంది.
అలా వంగడంతో ఆమె పైట కిందకి జారింది. అతని చూపులు లోపలికి దిగబడి పోతున్నాయి.
అతనిలో కోరిక పత్తిపువ్వులా చిట్లింది.
నిజం చెప్పాలంటే శనక్కాయల్ని ఆమే పోసింది. ఆమె అందాల్ని గుండెల్లో అచ్చొత్తుకోవడానికే అతనికి సరిపోయింది.
చివరికి శనక్కాయల గుట్టమీద కసువుపోసల్ని కప్పాలి.
అతను పక్కనున్న కసువును కప్పుతున్నాడు.
ఓచోట ఆమె కసువుపై నిలబడి వుంది. అతని గుర్తించలేదు. కసువు పోసల్ని లాగాడు.
ఆ సమయంలో అలా లాగడం వల్ల బాలెన్స్ తప్పి పడిపోయింది. జరిగిన తప్పుని అతను వెంటనే గుర్తించాడు.
ఆమె కింద పడకుండా గట్టిగా పట్టుకున్నాడు.
ఆమె వాలుతున్నప్పుడు పట్టుకోవడం వల్ల ఆ పొజిషన్ కి ఆమె ఎద మీద అతని చేతులు పడ్డాయి.
ఒకే ఒక్కక్షణం ఆమె ఉలిక్కిపడింది. గత జన్మలోని మధురమయిన స్పర్స ఈ జన్మలో గుర్తొచ్చినట్టు ఆమె ఒళ్లంతా చిన్న జర్క్ ఇచ్చింది. పూలవాన తనొక్క దానిమీదే కురుస్తున్నట్లు ఒళ్ళంతా పులకరించింది. వర్షాలు పడ్డప్పుడు పూటలు సాగినట్టు ఎక్కడెక్కడో కోరిక మొదలైంది.
