Previous Page Next Page 
ఆరాధన పేజి 20

 

    "నాకేం తెలుస్తుంది?" ఖాన్ భ్రుకుటీకరించి విసుక్కున్నాడు ఆమె అందుకుంది" హాజ్" మాత్రలను నడిపించే సంస్థనించట" ఖాన్ ఆమెవైపు చురచుర చూచాడుగానీ ఆమె తెర అవతలికి వెళ్ళిపోయింది.    
    "ఏమిటి ఖాన్- నువ్వు వెళ్ళాలనుకున్నావా?"
    "ఔను"
    "చెప్పనే లేదేం?"
    "మిమ్మల్ని ఆశ్చర్య పరచాలని-"
    "ఐతే వెనక్కు తెచ్చాడు - దేనికని?"
    "వెళ్ళకూడదనుకున్నాను"
    "ఆశ్చర్యంగా ఉంది- పెళ్ళి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇన్ని నెలలు సెలవు పెట్టి...ఏదో వుంది....చెప్పలేకపోతే లాభంలేదు..." కుమార్ నిలదీశాడు. ఆ చూపులధాటికి తట్టుకోలేకపోయాడు.
    "సరేలే - కనుక్కున్నావ్- మా అమ్మా- నాన్న వెళ్ళాలనుకున్నారు. ఆరోగ్యం బాగులేదని మానేశారు."
    "మీ నాన్నగారి ఆరోగ్యం ఎప్పుడూ బావుండదుగా? డయాబిటెస్ ను అదుపులో వుంచినట్లు చెప్పావు.
    "ఇదిగో - ఏమిటీ క్రాస్ ఎగ్జామినేషన్? కోరుకుగాని లాగవుందా? ఖాన్ లేచి నుంచున్నాడు.
    "నిన్ను మేం కనిపెట్టలేదనుకున్నావా? ఏదైనా జవాబు చెప్పకుండా తప్పించుకోవాలన్నా. ఏదైనా రహస్యం బహిర్గత పర్చాలన్నా యిలాగే ప్రవర్తిస్తావు" మూర్తి కోపంగించుకున్నాడు.
    ఖాన్ బిగ్గరగా నవ్వేశాడు "సమయానికి ...... నందుకోలేకపోయారు కుమార్ స్నేహితుడి వైపు పరీక్షగా చూచాడు. ఏదో తెలియని సత్యాన్ని గ్రహిస్తోంది హృదయం.
    "పడవ ఎప్పుడెళ్ళింది."
    "పన్నెండు రోజుల క్రితం"
    "అప్పటికి అమ్మగారు ఇక్కడికి వచ్చారు- ఔనా?"
    "చిత్తం"
    "ఆ సమయానికి మంజుల ప్రసవించలేదు - కదా!"
    "ఆ -హా!"
    "మంజు ప్రసవించేవరకు వుండాలని- వుండి పోయి- యాత్ర మానుకున్నారు......అంతే కదూ?"
    "ఔను"
    గదిలో నిశ్శబ్దం గంభీరంగా వుంది.    
    మంజు కళ్ళు కన్నీటితో బరువెక్కాయి.
    "వారిని మంజు కోసమే పిలిపించావు కదూ! ....ఎంత త్యాగం- ఎంతటి నిస్వార్ధం.....అంటూ చేతులు తలపైగా జోడించి స్పష్టంగా అన్నాడు "ప్రభూ - నీ బిడ్డలకు ఏదీ కొదువ చేయవుకదా!"
    ఖాన్ కంఠం ఖంగుమంది. "స్వార్ధంతోనే వెళ్ళటం మానుకున్నారు.....దీనిలో అంతగా పొగడవలసిందేమీలేదు"
    "ఎందుకని? మూర్తి ఆశ్చర్యంతో ప్రశ్నించాడు.
    "మాకు కొన్ని నియమాలున్నాయి....రోజుకు ఐదుసార్లు నమాజు చేయమని. రంజాన్ అపుడు ఉపవాసాలుండమని, కొంతడబ్బు సాలీనా భగవంతుని పేర దానంచెయ్యమని. డబ్బుంటే పుణ్యక్షేత్రాలను దర్శించమని ఏవో ఉన్నాయి లెండి. కానీ హాజ్ కు వెళ్ళేది పుణ్యంకోసం. పాప పరిహారంకోసం. ఎవరైనా కష్టాలల్లో - ఇబ్బంది బాధలో వుంటే వాళ్ళకి విముక్తి కల్గించకుండా వారికి సహాయంచేసి ఆదుకోకుండా హాజ్ కు వెళ్తే ఏ మాత్రం పుణ్యం లభించదు. వీళ్ళను ఆదుకుని బాధా నివృత్తి కలిగిస్తే హాజ్ కు వెళ్ళి నంత పుణ్యం-"
    "నువ్వు రాస్తేనే కదా! మీ అమ్మగారు వచ్చిందీ. నువ్వు పిలపించకపోతే చక్కగా వెళ్ళేవారు...స్వార్ధంతో మానుకున్నా రనబోకు.... కుమార్ చటుక్కున ఖాన్ హస్తాలను పట్టుకున్నాడు. అతని హస్తాల్లోని కంపన ఖాన్ కు సోకింది... "నీ సమీక్షాకారిత్వానికి మా కృతజ్ఞతలు...." నీ హృదయం లోని భావాల్ని చెప్పేశక్తి లేదునాకు..." ఆనందంతో పరిపూర్ణత చెందిన హృదయంలోంచి మాటలు కరువయ్యాయి ఖాన్ చేతులు విడిపించుకుని లేచి నుంచున్నాడు." నా కిదంతా ఏమీ తెలియదు.....ఆనాడు ప్రమీల అంది "మంజును చెల్లిగా చూచుకో ఖాన్" అని.....పక్షంరోజుల కోమారు "మంజు కాన్పు సమయంలో ఒంటరిగా విడువకు" అని రాసేది.....ఆమెకు కృతజ్ఞత లు తెల్సుకోండి.....నా కెందుకు.....వస్తానమ్మా మంజులా" అంటూ జవాబు కోసం చూడకుండా గబగబ వెళ్ళిపోయాడు.
    తెలిసికొన్న విషయాల ధాటినించి తేరుకునే సరికి మూర్తికి కొన్ని నిముషాలు పట్టింది. అతని హృదయంలో అంకురించిన ప్రశ్నకు జవాబు చెప్పుకోలేక పోయాడతను..."ప్రమీల అదేమాట తనతో అని వుంటే అంత త్యాగం చేయగల్గేవారా?" ఏమో-!!
    మంజు గాద్గదికంతో అంది "అంతా రహస్యంగా వుంచాలని- ఆమెను కోరి మనకు తెలియకుండా పంపించివేశాడు. ఇది భరింపలేకుండా వున్నాను."
    కుమార్ తెరకు అవతలి వైపుకువెళ్ళి మంజు శిరస్సును అనునయంతో స్ప్రుశించాడు. కొన్ని నిముషాలు నిశ్శబ్దంగా దొర్లిపోయిన తరువాత గంభీరతతో అన్నాడు. "మన క్షేమాన్ని కాంక్షించేవారు ఇంతమంది వున్నారని కలలోనైనా అనుకోలేదు సుమా! మనం ఒంటరిగా లేము. మన సుహ్రుత్కోటి మనకు అండగా వున్నారు. మంజూ ఖాన్ సుకృతవంతుడు.....విధి నిర్వహణలో! కర్తవ్య పాలనలో అతనిని మించినవారు నా ఎరుకలో ఎవ్వరూ లేరు."
    మంజు కన్నీరు వత్తుకుని "ఔను" అంది.
    
                              *    *    *

    మరుసటిరోజు చాల హడావిడిగా గడిచిపోయింది. మంజుల ఇంటికెళ్ళి "గృహమే కదా స్వర్గసీమ" అనుకుంది. పాపను చూస్తూ వాళ్ళ జన్మ తరించిందని భావించి సంతృప్తి పడేవారు. తన కోరిక ఈడేరిందని కుమార్ కి ఇంకా ఎక్కువ సంతుష్టి.
    ఆరోజు బుధవారం ఆపరేషన్లు జరిగేరోజు. డాక్టర్లు అందరూ తెమలని పనిలో సతమతమయ్యేరోజు.
    భర్తకు కాఫీ పంపింది. గంగమ్మ పాపకు స్నానం చేయించి తెచ్చింది. పాపను మంజుల కిచ్చి నిప్పులు తేవటానికి వెళ్ళింది. ఆ ముద్దుల మూటను పొదివి పట్టుకుని కనుబొమలను తలను చేతితో రాస్తూ తన్మయత్వం చెందుతున్న సమయంలో కల్యాణి "అక్కయ్యా" అంటూ లోపలికొచ్చింది......
    మంజు శిసలైన బాలెంతరాలుగా మూర్తీభవించి వుంది. క్రొత్త సరిగంచు నీలం చీరకట్టుకుని నడికట్టుతో. తీర్చిదిద్దిన కాటుకతో తాంబూల రాగ రంజితమైన పెదిమలతో, జారుగా వ్రేలుముడి వేసిన జుట్టుతో వున్న మంజుని చూచి వెనకాతలగా వచ్చిన - మూర్తి వదిన - తనివితీరా మంజును చూస్తూ అంది-    
    "నిన్ను ఇలా మీ అమ్మగారు చూస్తే - ఎంత ఆనందిస్తారో మంజులా."
    "అంత భాగ్యమా-" అని - పాపను గంగమ్మ కందించి ఇద్దరివైపు ప్రశ్నార్ధకంగా చూచింది. ఇద్దరు లోపలికివచ్చి మంచంమీద కూచున్నారు.
    "అంతటి భాగ్యం కలుగబోతోందమ్మా - మీ అమ్మగారు రాత్రి బండికి వచ్చారు."
    మంజు వదనం ప్రఫుల్లమైంది.
    "ఎంతమంచి శుభవార్త తెచ్చావమ్మా - అక్కయ్యా - మరి...." మంజు మాట్లాడలేక తటపటాయించింది. ఆమె హృదయంలోని సంఘర్షణను గ్రహించి కళ్యాణి అక్కయ్య చేతిని పుచ్చుకుంది. "అమ్మ కాసేపటికి వస్తుంది. అంతా కలిసే బయలుదేరాము....అలా బజారులో ఆగిపోయారు. అమ్మ. అత్తయ్యగారు."
    "ఏమిటి అత్తయ్య గారుకూడా వస్తున్నారా?" చాలా సంతోషం.
    మంజు పాపను అందుకుని గౌను తొడిగి కాటుక దిద్ది-బుగ్గమీద చుక్కపెట్టి మెత్తని తుండుగుడ్డలో చుట్టి ఆమె కందించింది.
    "ఇంత చిన్న వయసులోనే కనుబొమలు. ఆ ముక్కు ఎంత దిద్దినట్లున్నాయో చూడు కళ్యాణీ ఇద్దరి తెలివితేటల్నీ పోతపోసుకుంది....పెద్ద డాక్టరమ్మవు కాతల్లీ" పాపను హృదయానికి హత్తుకుని-సాంబ్రాణి ధూపసుగంధయుక్త మైన శిరస్సును ప్రేమపూర్వకంగా చుంబించింది.
    "నాన్న" మంజు చెల్లివైపు ప్రశ్నార్ధకంగా చూచింది.
    "వచ్చారు...నాకు కులాసాగా లేదంటే తీసుకెళ్దామని వచ్చారు ... ఎలాగో అత్తయ్య చెబితే ఒప్పుకున్నారు."
    "అత్తయ్య నిజం చెప్పారా?"
    "అబద్ధం చెప్పవలసిన ఖర్మేం పట్టింది. నిజమే చెబుదాము. ఒద్దంటే ఒప్పించే పూచీ నాది...నాన్న పరాయివారని లెక్కచెయ్యకుండా చాలా చాలా అన్నారు....అన్నీ వింటూనే అత్తయ్య ఖండిస్తూ వచ్చారు. నాన్న "ఊ" అనక తప్పలేదు.
    "అమ్మ...?"
    "అమ్మకు నీపై కోపం తగ్గిపోయింది సగం నిన్ను చూడాలని బయలు దేరిందట నాన్న భయానికి పాపం ఇన్ని సంవత్సరాలు లోలోపల కుమిలిపోయేది.
    "అంటే నాన్న కోపం తగ్గలేదన్నమాట."
    కళ్యాణి జవాబు చెప్పలేదు. ఆ తెల్లవారి జరిగిన సంఘటననను మంజుకు తెల్పే ధైర్యం లేకపోయింది. అతని దృష్టిలో మంజు పాసి అపరాధి, ఎన్నో ఆశలు పెంచుకున్న తన హృదయాన్ని కర్కశంగా నరికి పారేసిన కఠిన హృదయ-క్రూరురాలు-కృతఘ్నురాలు!! అసలు మంజు పేరు వింటే అతని క్రోధాగ్నికి యావన్మంది దహించుకు పోగలరేమోంనలా నిప్పులు కురిపిస్తారు కల్యాణి అత్తగారు శాంతంగా వాదించి గెలవగల్గారు. ఇది ఎవ్వరికి సాధ్యమైన పనికాదు-కానీ ఆమె జయించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS