Previous Page Next Page 
శరన్మేఘం పేజి 20

 

    జగపతి పేర ఉత్తరం రాసి ' ఆ కవరు లో పెట్టి ఆ కవరు మీది ఎడ్రసు రాసి చేత్తో పట్టుకుని ఆలోచిస్తూ కూచుంది సునంద. కాపీల కని ఒంటి గంటకి రీసెస్ ఇచ్చినపుడు కవరు అంటించి బిళ్ళలు అతికించి పోస్టు చెయ్యాలనే ఉద్దేశం తో. ఒంటి గంట అయింది. అంతా కాఫీల కని తెబిల్స్ దగ్గర్నుంచి లేచి బయటికి వెళ్ళారు. సునంద కూడా లేచింది పోస్టు ఆఫీసుకి వెళ్ళడం కోసం.
    ఇంతలో "రికార్డ్స్ సెక్షన్ హెడ్" కబురు చేశాడు సునంద ని ఓ మాటు రికార్డ్ రూమ్ కి రమ్మని. అంటించకుండా ఉంచిన కవరు ని టేబిల్ మీద పెట్టి దాని మీద పేపరు వెయిట్ పెట్టి రికార్డ్ రూమ్ లోకి వెళ్ళింది సునంద. సరిగ్గా అదే సమయానికి శాంత ఆఫీసు కి వచ్చింది. ఇంటి దగ్గర్నుంచి ఫోను చెయ్యాలని ప్రయత్నం చేసి, లైన్ రీపెరింగ్ వల్ల అది సాధ్యం కాక స్వయంగా వాళ్ళ నాన్నతో తనూ వాళ్ళ అమ్మా మేట్నినికి వెళుతున్నాం అనే సంగతి చెబుదాం అని. ఆఫీసు హల్లో ఎవరూ లేరు. సునంద కుర్చీ నే సీటు కూడా ఖాళీ గా ఉంది. అడుగు ముందుకు వెయ్యబోతూ ఆగింది శాంత.
    సునంద టేబిల్ మీద కవరు.
    జగపతి పేర అడ్రసు రాసి ఇంకా అంటించ కుండా ఉన్న కవరు.
    చట్టున ఇటూ అటూ చూసి కవరు తీసి వేనిటీ బేగ్ లో పెట్టేసుకుంది. శాంత హృదయం భగ్గున ఒక్కసారి మండింది. సునంద తన భర్తతో ఉత్తరాలు సాగిస్తోందన్నమాట! ఏమి ఎరగనట్టు ఎంత ముద్దరాలుగా ఉంటుంది? అసలీ వ్యవరం తను మొదటి నుంచీ అనుమానిస్తూనే ఉంది నాన్న నమ్మడం లేదు కాని అమ్మా, తనూ ఏనాడో కనిపెట్టారీ సంగతి .....నాన్నకీ సంగతి చెప్తే అప్పటి కెనా అర్ధం అవుతుంది. సునంద పట్ల అయన ఇన్నాళ్ళు ఎంత పొరపాటు పడుతూ వచ్చిందీను...
    "నేను నమ్మను" అన్నారు మేనేజరు.
    వేనిటీ బాగ్ లోంచి కవరు తీసి చూపిద్దామా అనుకుంది శాంత ఒక్క క్షణం కాని "ఇందులో జగపతి కి ఏం శృంగార వాక్యాలు రాసిందో ఆ మహాతల్లి. ఆ తర్వాత నాన్నా తనూ ఇద్దరం ఒకళ్ళ ముఖం ఒకళ్ళం చూసుకోలేక సిగ్గుతో తల వంచుకోవాలి " అనుకోని ఆ ప్రయత్నం మాని, పోనీ నా మాట అబద్దం అయితే, సునంద ని పిలిచి అడగండి జగపతి కి ఉత్తరం రాశావా అని అవును అంటే మీకు అనుమానమే తీరిపోతుంది. కాదంటుందా . ఆమె మాట అబద్దం అని నేను తర్వాత మీకు రుజువు చేస్తాను" అంది శాంత.
    "తర్వాత ఎప్పుడో ఎందుకు? నేను ఇప్పుడే నీ ఎదురు గుండానే, కబురు చేస్తాను కూచో" అని బజార్ మ్రోగించారు మేనజరు.
    "ఎదురుగుండా నేనుంటే నిజం చెప్పటానికి జన్కుతుంది. నేను వెళ్తాను. మీరు కనుక్కోండి." అంటూ స్ప్రింగ్  డోర్స్ తెరుచుకుని ఇవతలికి వచ్చేసింది శాంత    
    బజర్ మ్రోత విని లోపలికి వచ్చి శాల్యూట్ చేసి నిలబడ్డ బంట్రోతు తో :సునందమ్మ గారిని నేను రమ్మన్నానని అర్జంటు గా పిలు" అన్నారు మేనేజరు....
    "ఏం లేదమ్మా.... ఆఫీసు విషయం కాదు ...ఓ చిన్న సందర్భం లో అనుమానం వచ్చి కబురు చేశాను. అడిగానని మనస్సులో ఏం కష్ట పెట్టుకోకు.... కాదంటే కాదని చెప్పెసేయ్యి! నీకూ హాయిగా ఉంటుంది. నా మనస్సు తేలికవుతుంది" అన్నారు మేనేజరు.
    "ఏం అడగబోతున్నారో అర్ధం కాక తెల్లబోయాను "మీరంతా సంశయిస్తున్నారు ఎందుకో -- అర్ధం కావడం లేదు-- ఏమిటో అడగండి" అంది సునంద. కొంచెం సేపు గొంతు సవరించుకొని ఇటూ అటూ చూసి, మొహమాట పడి చివరికి ఎలా గైతేనేం అడిగారు మేనేజరు. నువ్వు మా అల్లుడు జగపతి కి కాని ఉత్తరం రాశావా?' అని.
    ఆ ప్రశ్న వినేసరికి సునందకి వెన్నులో ఝల్లుమన్నట్లయింది. ఏవిటి ఈయన ఇలా అడుగుతారు? నేను కవరు రాసిన సంగతి ఈయనకి తెలిసిందా? సునంద మౌనంగా ఆలోచిస్తూ కూర్చుంది.
    "ఏవమ్మా.... రాశావా....చెప్పు"
    "ఆ....రాశానండి"నెమ్మదిగా అంది సునంద
    "ఆ!... విని ఆశ్చర్యంగా అంటూనే "వెంటనే ఎందుకు రాయవలసి వచ్చింది?.... ఎప్పుడు రాశావు?' అని గద్దించి అడిగారు మేనేజరు.
    "ఇప్పుడే రాశాను... ఇంకా పోస్టు చెయ్యలేదు" తోణకుండా అతి సౌమ్యంగా జవాబు చెప్పింది సునంద.
    మేనేజరు ముఖం కోపంతో కందగడ్డ లా అయింది.
    పెదవులు వణికి పోతున్నాయి.
    తీక్షణంగా సునంద కేసి చూస్తున్నారు.
    ఆ ఉత్తరం లో తను జగపతి కి ఏవో రాయకూడనిది రాశానని ఈయన అనుకుంటున్నట్టున్నారు. అందుకే ఎప్పుడూ లెంది ఇంత క్రూరంగా తనని చూస్తూ కోపంగా అడుగుతున్నారు. ఆ కారణంగా ఈయనకి ఈ అనుమానాన్ని కలిగించడం ఎందుకు? అసలీ అనుమానాలన్నీ తోలగాలనే కదా తనీ ఉత్తరం రస్త! అ ఉత్తరం కాస్తా ఈయనకి చూపించేస్తే తన మీద ఈయనకి అకారణంగా ఏర్పడిన కోపమూ పోతుంది. తన మీద అందరికీ ఉన్న అనుమానమూ తొలగు'తుంది--
    ఆలా అనుకుని " అ ఉత్తరం ఇంకా నా టేబిల్ మీదే ఉంది. తెస్తాను. చదవండి. అంది.
    "అందులో , మేం చూడకూడని విషయాలేమైనా ఉంటాయేమో - వద్దులే" అన్నారు మేనజరు వ్యంగ్యంగా.
    "కాదు....మీరు చూడాలి.... ఇప్పుడే తెస్తాను ఉండండి." అంటూ తొందరగా వెళ్ళిన సునంద ఎంతో ఆలస్యంగా కాని తిరిగి రాలేక పోయింది. నుదుటి మీదపట్టిన చెమట తుడుచుకుంటూ నిస్పృహతో "సారీ... ఎక్కడ పెట్టానో కనిపించడం లేదు. సావకాశంగా వెతికి తీసుకు వచ్చి చూపిస్తాను" అంది. ఓడిపోయిన దానిలా సిగ్గుతో తల వంచుకుని.
    మేనేజరు తల పంకించి "ఇప్పుడు టేబిల్ మీద పెట్టి వచ్చింది ఇంతట్లో కనిపించడం మానేసిందా! హు! ఇదిగో అమ్మాయి ఒక్కటి చెప్తాను విను నేను సాధారణంగా మనిషి మంచితనం మీద విశ్వాసం ఉండే వ్యక్తిని. అటువంటి నాకే నీమీద మంచి అభిప్రాయం లేకుండా చేసుకుంటున్నావంటే...." అని ఆగారు.
    సునంద డగ్గు కత్తితో "నా మాట నమ్మండి... నేను ఎటు వంటి దాన్నో మీరు ఎరుగుదురు..." అంటుండగానే--
    "ఇంక నీ కల్లబొల్లి మాటలు నన్ను కరిగించాలేవు... ఇన్నాళ్ళూ, మా అమ్మాయీ అదీ చెప్తుంటే ఏవిటో అనుకున్నాను. ఇప్పుడు నాకు పూర్తిగా అర్ధం అయింది. నీ సంగతి. ఆదర్శ వంతమైన నడవడీ, ఉన్నతమైన శీల సంపదా ఉన్న దానివి అనుకుని  నీకు ఉద్యోగం ఇచ్చి ఇన్నాళ్ళు నిన్నొక కూతురుగా చూసుకున్నాను.
    అయన అన్న మాటలు పిడుగు లా వచ్చి గుండెలకి తగిలాయి. నిస్తేజురాలై ఉండి పోయింది. సముద్రం లా పొంగి వస్తున్న దుఃఖాన్ని కంఠం లో అదిమి పట్టి "మీరేవన్నా అనండి. తండ్రి లాంటి వారు. భరిస్తాను..... కాని నా నడవడి గురించి మాత్రం..."పంటితో అదిమి నొక్కుకుంటూ , పొర్లి వస్తున్న ఏడుపుని అపుకుంది.... మనస్సు కరిగి, మేనేజరు కొద్దిగా కళవళ పడి "ఏమైనా నీలాంటి వాళ్ళు ఆఫీసులో పని చెయ్యడం...." అంటూ ఆగిపోయాడు.
    వెంటనే సునంద పట్టలేని పౌరుషంతో కాగితం తీసుకుని, ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి, దారిలో మందుల షాపు లో నిద్ర మాత్రలు కొనుక్కొని ఇంటికి వచ్చేసింది. "పెందరాళే వచ్చే శావెం?' అని అడిగిన రత్నానికి "ఉద్యోగానికి రిజైన్ చేశాను" అని మాత్రం ముక్తసరిగా చెప్పి, నిద్ర మాత్రలు వేసుకుని, మంచం మీద ముసుగు పెట్టుకు పడుకుని, నిశ్శబ్దంగా ఏడ్చి ఏడ్చి ఎప్పుడో నిద్రలోకి జారుకుంది.....
    అంతా నిద్రపోయాక , తన గదిలోకి వెళ్ళి తలుపు గడియ వేసుకుని, గుండె మండిపోతుండగా వేనిటీ బేగ్ లో ఉత్తరం తీసి చదువుకోసాగింది శాంత-
    నాయనా జగపతీ!
    ఈ లోకంలో నువ్వొక పసివాడివి. లోక వ్యవహారం పూర్తిగా తెలుయదు నీకు. ఆ రోజున నువ్వు నాకు చీర పెట్టి నన్ను కార్లో హాస్పిటల్ కి తీసుకెళ్ళి అ తర్వాత బొంబాయి నుంచి నీ సమస్యలన్నీ ఏకరువు పెడుతూ నాకు ఉత్తరం రాయడం వల్ల, ఇక్కడ ఎన్నో గడ్డు సమస్యలు తలెత్తాయి. నన్ను బలి గొంటేనే కాని బహుశా ఆ సమస్యలు సమసిపోవు , నా గొడవ అలా వుంచు. నువ్వు చేసిన పనేవిటి? చిన్నపిల్లా. అమాయకురాలూ అయిన శాంత ఏదో తొందర పడిందని నువ్వూ అలాగే ప్రవర్తిస్తావా? కాపురానికి తీసుకు వెళ్ళలేదని ఆ అమ్మాయి ఎంతో కుమిలి పోతుంది. పైగా నువ్వూ చేసిన ఆ కుర్రతనం పనికి, పరోక్షంగా నేను ఫలితం అనుభవించవలసి వస్తోంది. ఈ పరిస్థితుల్లో నేను ఏ కాస్త ఊపిరి తీసుకోవాలన్నా నువ్వు వెంటనే శాంత ని కాపురానికి తీసుకు వెళ్ళాలి.... అలా శాసించడానికి నాకు ఏం హక్కు ఉందంటావా? ఈ చీర కట్టుకోవాలని నువ్వు ఏ హక్కుతోటి వచ్చి నన్నా రోజున అడిగావో , అదే హక్కు నిన్నివాళ శాసించడానికి ఉంది నాకు.
    అక్క, చెల్లెళ్ళు, లేని నీకూ, అన్నదమ్ములు లేని నాకూ ఈ హక్కులు కొత్తగా కనిపించవచ్చు. కాని ఈ హక్కులు మన్నిస్తేనే, నువ్వన్నట్లు నేను నీకు అక్కయ్య ను. నువ్వు నాకు తమ్ముడి వీను. ఇంక నువ్వెప్పుడూ నీకు ఉత్తరాలు రాయకు. నేనూ నీకు రాయను -- ఇదేనా ఎందుకు రాస్తున్నానంటే నా మాట మీద గౌరవం ఉంచి శాంత ని కాపురానికి తీసుకు వెళ్తావని.

                                                                        నీ అక్కయ్య

                                                                          సునంద.
    ఉత్తరం చదవడం పూర్తీ చేదేటప్పటికి శాంత కళ్ళు రెండూ నీళ్ళతో నిండిపోయాయి. "సునందా.... నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నాను క్షమించు...." అంటూ తనలో తను వాపోయింది. ఈ ఉత్తరం వెంటనే పోస్టు చెయ్యాలి. అయన మనస్సు ఈ జాబు వల్ల మారి నన్ను ఆదరిస్తే చాలు-- ఇక్కడికి వస్తే ఆయనా, నేనూ కలిసి సునంద దగ్గరికి వెళతాం-- నా కాపురాన్ని నిలబెట్టిన భాగ్య దేవతగా ఆమె కాళ్ళ కి మొక్కుతాను-- నా పొరపాటు క్షమించమని ప్రార్ధిస్తాను.-- ఈ ఉత్తరం చూసి అయినా అయన వస్తారా? ఏమో - అదీ ఆలోచించాల్సిందే -- అయినా పోస్టు చేస్తాను. అందాకా ఈ సంగతి ఎవరికీ చెప్పకుండా ఉంటాను-- మనస్సు మరల్చుకొని అయన వస్తే. అప్పుడే చెప్పవచ్చు అందరికీ -- ఇంతకీ ఎలా ఉందో నా అదృష్టం!
    ఇలా అనుకోని శాంత ఆ కవరు జిగురుతో అంటించి , కళ్ళకి అద్దుకొని లేచింది . పొద్దుటే పోస్టు చెయ్యాలి అనుకుంటూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS