Previous Page Next Page 
ఆరాధన పేజి 2


                                       2

           
    అనూరాధ మనస్సు ఎంతో సున్నితమైనది. బాధ్యతల బరువు తెలుసు ఆ మనస్సు కి. తల్లి ఆ వయస్సు లో పడుతున్న కష్టమూ తెలుసు. విస్తళ్ళు కుట్టి అమ్ముతున్నసంగతి తెలుసుకున్నదా రోజునే.
    ఎంతగానో విలవిలలాడి పోయిందా మృదుహృదయం.
    "అమ్మా! మాకోసం నీ రక్తాన్ని పిండి అమ్ముతున్నావు. నీ రుణం తీర్చుకోలేం! అందుకే దైవం కన్నా ముందుగా నీకే నమస్కరించుతానమ్మా! ' అంటూ అనురాధ హృదయం బాధతో, కృతజ్ఞతతో మెలి దిరిగి పోయింది.
    మరునాడే 'డాన్సు ప్రోగాం' వుంది . అందుకే ఉదయాన లేవగానే నృత్యానికి కావలసినవన్నీ సమకూర్చు కుంది. జయదేవుని అష్టపదులు రెండు అభినయించగలనని తెలియజేసింది.
వెళ్ళేది మగపిల్లల కాలేజీ కి. కొందరు అల్లరి వాళ్ళుండక మానరు. చిలిపిగా చిందులు వేయక మానరు. అందుకే సాయంగా తమ ప్రిన్సిపాల్ ని కూడా రమ్మని కోరిందామే.
    నృత్యం ఆరంభమైంది. ఎవరో తుమ్మారు పదిమార్లు. మద్దెల ఆగిపోయింది. అభినయం నిలిచి పోయింది . మైక్ ముందు నిల్చున్నదామె వెంటనే --
    'అభినయం ఆపినందుకు క్షమించండి . ఒక్క మనవి. చిలిపితనం మనలో చిందులు వేస్తుందిప్పుడు, నిజమే! కాదనను. అనలేను. కానీ సాటి వ్యక్తీ గా మాట్లాడుతున్నాను.
    సోదరి గా ఆదరించమని అడుగుతున్నాను. అంతరాయం కలిగించి రసాభాసా చెయడం మన యువతరం లో లేనివని అని పెద్దలు గుర్తించేట్లు ప్రవర్తించగలరని విశ్వసించుతున్నాను. సాటివాని కోరికను అణిచి వేయడానికి విద్యార్ధులు రాజకీయాలతో కుళ్ళిన మనుష్యులు కారు. ఎదుటి మానవుణ్ణి అపహాస్యం పాలు చేసి వినోదం చూడగల్గెంత మూర్కుత లేదు మనలో, అని నా నమ్మకం.
    మనిషిని మనిషిగా ప్రేమించుతాం--- గౌరవించుతాం-- అన్నదే మన ధ్యేయం. దీన్నెవరూ కాదనరని నమ్ముతూ -- మరోసారి ఆటంకం కలగ జేయవద్దని కోరుతూ అభినయం ఆరంభించుతున్నాను--' అన్నది అనూరాధ. ఆ మృదువైన వ్యంగ్యోక్టులకా ఆవరణ అంతా నిశ్శబ్దం లో వీలీనమై పోయింది.
    ఆకు రాలినా, చీమ చిటుక్కుమన్నా విన్పించెంత నిశ్శబ్దం నిలిచి పోయిందక్కడ. ఆ గొంతున మ్రోగింది అజ్ఞాపన గాదు. అభ్యర్ధన అంతకన్నా కాదు. మనిషి లో దాగి వున్న మానవత్వాన్ని మృదువుగా మెల్కొల్పింది. అందుకే ఒక్కరూ నోరు కదపలేకపోయారా పైన.
    నృత్యం పూర్తయింది. అభినందనలు అనంతంగా కురిశాయి. ప్రతివారి మనస్సు నుంచి ఆనందం వెల్లువలై దూకింది. వినమ్రంగా తల వంచి నమస్కరించి వేదిక పై నుంచి నిష్కరమించిందామే.
    మరునాటి 'పేపరు' లో అనూరాధ నృత్యాన్ని ప్రశంసించుతూ 'ఫోటో' కూడా ప్రచురించబడింది.
    రాజు ఆనందంతో వూగిపోతూ తల్లికి చూపించాడా ఫోటో ని. ఆ అనురాగమయి కనుల నిండుగా ఆనందం వెల్లి విరిసిందో క్షణం. అనూరాధానా రోజున కాలేజీ లో క్షణమైనా ఒంటరిగా నిలువనీయలేదు.
    'అందాలు చిందే బొమ్మ ' అని పరవశించుతుందో హృదయం.
    'వయారా లోలికించే మయూరి' అంతుంది కంఠం.
    'సరిగమలతో మధువులు కురిపించతుంది.'
    'విరిసిన పూవులా మైమరిపించు'తుంది.'
    'మెరిసే మెరుపు.'
    'విరిసిన వెన్నెల.'
    ప్రశంసల కెక్కడా అంతు దోరకడమే లేదు.
    అనూరాధ చుట్టూరా అభిమానులో అభినందనల సౌధాన్ని సృష్టించారు. వాటి ధాటికి తట్టుకోలేక అన్నదామె చిన్నగా నవ్వుతూ--
    'మరో ప్రశంస వినవచ్చిందో పరిపోతానని.'
    'అందాల హరివిల్లు' వెంటనే బాణం రానే వచ్చింది. ఆ క్షణం లోనే లేచి నిల్చున్నదామె కోపాన్నభినయించుతూ.
    'అనూరాధమ్మగోరూ! మీ కోసం ఎవరో వచ్చారమ్మా!' అంటూ వచ్చాడు 'ఫ్యూను'
    'అమ్మయ్య! బ్రతికి పోయాను! అంటూ అందర్నీ తప్పించుకుని బయట పడింది.
    ఆ ప్రశంసల జోరులో 'తన కోసం ఎవరో వచ్చారన్న మాటే విన్నది గాని ఎవరైనది ఆమె ఆలోచించనేలేదు. 'విజిటర్స్ రూమ్' దగ్గర కొచ్చేసరికా వూహ అలలా లేచింది లోలోన.
    లోపలికి అడుగు పెట్టింది సంశయంతో.
    'క్షమించాలి! వేళకాని వేళలో వచ్చి నందుకు కూర్చోండి!' అన్నాడో యువకుడు తాను కూడా సోఫాలో కూర్చుంటూ. ఎదురుగా వున్న మరో సోఫా లో కూర్చున్నదామె ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ.
    'మీకెంతో ఆశ్చర్యంగా వుందనుకుంటాను. నిన్న మీ 'డాన్సు' చూశాను. మళ్ళీ వోసారి మిమ్మల్ని చూడాలన్పించింది . జయదేవుని గీతాలెన్నోసార్లు విన్నాను. ఎందరో అభినయించుతుండగా చూశాను. కానీ మీ అభినయం మాత్రం మనస్సున మందారాల్ని పూయించింది. మీలో నిజంగా 'రాధ' దాగి వున్నదన్పించుతోంది , ఏవంటారు?'
    'ఇదెక్కడి ప్రశ్న?' నవ్వుకుందామే లోలోన.
    పరిచయమూ లేదు. నమస్కార భానమూ రాలేదు. తనను గురించీ ప్రశ్నించాలేదు. వింతైన మనస్తత్వం అనుకున్నదామే.
    'నాకు తెలుసు . మీరు సమాధానం చెప్పరని. ఎందుకో చెప్పమంటారా? మీలో నిజంగా ఆ గోపీ కృష్ణుని , అనురాగమయి రాదే! నిలిచి వుంది' వో క్షణం అగాడతను.

 

                             
    'కాదని తిరస్కరించరన్న నమ్మకంతో వచ్చాను' అంటూ చిన్న పెట్టె ఒకటి తెరిచాడు. కొంచెం ముందుకు వంగి అరచేతిలో వో కృష్ణ విగ్రహాన్ని వుంచుకుని అన్నాడు.
    'బొంబాయి లో తీసుకున్నాను ఎలా వుంది?'
    దంతంతో అతి సున్నితంగా , అందంగా వయారాల నొలికించుతూ , మందహాసాలు చిలికించుతూ , మురళి పెదవుల పై వుంచి మ్రోయించనా! అన్నట్లు నవ్వుతున్నాడు మందగిరిధారి ఆ విగ్రహంలో. అనురాధ కా విగ్రహం ఏంతో నచ్చింది. వెంటనే తీసికొని హృదయం లో పదిలంగా దాచుకో వాలన్నంతగా పరవశత ఆవహించిందామె నా క్షణం లో.
    కానీ అపరిచితుడన్న వూహ మదిలో మెదిలి నిగ్రహించుకున్నదా ప్రయత్నాన్ని.
    'ఎంతో అందంగా వుంది!' అంది గొంతు నిండుగా మధువు నిండి వున్నట్లు.    
    'అందుకే ఈ కృష్ణుణ్ణి మీకిస్తున్నాను!'
    'నాకా?' సమాధానంగా ఏమన్నదో ఆమెకే తెలియకుండా పోయింది. ఆమె చూపంతా ఆ విగ్రహం మీదే వుంది.
    'అవును మీకే! ప్లీజ్! ఇదిగో! తీసికొండి! జీవితం లో ఈ ఒక్కసారైనా నా కోర్కె మన్నించబడిందన్న , సంతోషాన్ని మిగల నియండి! ఉహూ! మీరిక మాట్లాడకండి. వో స్నేహితుడు మనస్సు పడి యిచ్చాడనుకో గూడదా?'
    ఆమె కేమనాలో తోచకుండా పోయింది. ఎదుటి వ్యక్తీ క్షణక్షణానికి చిత్రాతి చిత్రంగా మాట్లాడుతున్నాడు. 'తనని పెదవి విప్పనీయడం లేదు. విప్పినా విముఖత అన్నమాటే రాగూడదంటున్నాడు. ఎంతో విలువైన కానుక అది. అత్యంత అత్మీయులకి అందించవలసిన దాన్ని స్వీకరించమంటున్నాడు. పైగా 'జీవితంలో ఈ ఒక్కసారి నా కోరిక మన్నించ బడిందన్న సంతోషాన్నివ్వండి' అంటున్నాడు. ఎలాంటి మనిషి యితను? ఆశలన్నీ కూలిపోయాయేమో?' అనూరాధ ఆలోచనలతో మాట్లాడలేక పోయింది.
    'వస్తానిక అదిగో ఆ పెట్టె లోనే నా అడ్రసుంది. ఎప్పుడైనా వో రెండక్షరాలు వ్రాయాలన్పించితే వ్రాయండి. అంతకంటే యింకేమీ కోరను' అన్న వెంటనే వెళ్ళిపోయాడా విచిత్ర వ్యక్తీ.
    పెట్టెలోని కాగితం తీసి చూసింది ఆశ్చర్యం నుంచి తేరుకుని . అందులోని అక్షరాలూ చూడగానే కుతూహలం వెలికి వచ్చింది -
    '..........!'
    ఏమని సంభోదించను? 'రాధా'!' అనడానికి ఆత్మీయత లేదే! 'అనూరాధా'! అని వ్రాయడానికి అధికారమూ లేదుగా! అందుకే ఆగిపోయాను. అన్యదా భావించరని నమ్ముతున్నాను.
    నిన్న నా స్నేహితునితో కలిసి మీ నృత్యం చూశాను. మాటలతో కోటలు కట్టడం నాకు రాదు. కాని ఎక్కడో, ఎప్పుడో చదివిన వో గేయం మనస్సున బొంగరంలా తిరుగుతోందప్పటి నుంచి -- ఏమిటది?! అది....ఆ...జ్ఞాపకం వస్తోంది....  
    ........'మల్లియలా విరిసింది, మనస్సులో
    కలహంసలా నడిచింది సొగసుగా
    అందెలు --ఘల్లు మన్నాయి!
    డెందము-- ఝల్లుమన్నాది!
    మయూరమై-- ఆడే
    ఒయారమై -- పాడె'
    నిజం! అంతే! అచ్చు మల్లియలా, వెన్నెల వెల్లువలా , కన్నులు చెదిరే అందాల అపరంజి బొమ్మలా మెరిసి పోయారా వేషంలో మీరు.
    నవ్వుకుంటూన్నారనుకుంటాను. నా పిచ్చి ఊహల్ని విని. మీరు నవ్వుకున్నా బాధపడను లెండి.
    నా మనస్సు పోకడలు అందరికీ నచ్చవు. అందుకే ఆత్మీయులు అన్నవాళ్లు లేకుండా చేశాడు భగవంతుడు. కానీ...మీరు...మీరు. ఎందుకో మరి! ఈ డాక్టర్ వింత మనస్తత్వాన్ని అర్ధం చేసుకోగల రన్పించింది. మీరు వ్రాయమంటే నా గురించి వున్నదంతా మనస్సు విప్పి మరీ వ్రాస్తాను. ఎందరో గోపికల హృదయాల్లో రాగమయుడై నిలిచిన ఆ గోపీ కృష్ణుని కోసం అంతగా జీవితంతమూ ఆరాధించిన రాధ హృదయం లో దాగి వున్న రహస్యం తెలుసు మీకు. అందుకేనెమో! మీ పేరు 'అనూరాదే ' అయింది.
    జవాబుగా ఎంతో వ్రాయమని అడుగను. కొంతైనా వ్రాయగలరని మాత్రం నమ్ముతూ --
    మధురమైన మీ మనస్సున --
    స్నేహితుడిగా నిలిచి పోవాలని ----
            కోరుతూ -----
            'హరికృష్ణ '
    అడ్రసు వ్రాయడం మర్చిపోలేదు లెండి --
            డాక్టరు హరికృష్ణ
            త్యాగరాయ నగర్
               మద్రాసు    
    'చిత్రమైన మనిషి! ఏమని వ్రాయాలి?!' నవ్వుకుంటూ లేచి క్లాసు రూమ్ కేసి నడిచి వెళ్ళిందామె.
    మరునాడే , రసమయ చక్రవర్తీ , రాధా రామణునే, బహుకరించిన మీ సహృదయతకూ, కళాభిమానానికి కృతజ్ఞతలూ -- వందనాలూ--' అంటూ వో రెండు వాక్యాలు జవాబుగా వ్రాసింది.
    మళ్లీ తుఫానులా ఏమని వ్రాస్తాడో అన్న వూహ ఆమె మనస్సున కదులుతూనే వుంది. ఆ విగ్రహాన్ని చూసి తల్లి కూడా 'ఎంతో విలువైనదమ్మా!' అన్నది. 'అతని హృదయమూ అంత విలువైనదేమో!' అనుకున్నదామె లోలోన.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS