Previous Page Next Page 
కాంతి రేఖలు  పేజి 19

 
    "అదెవత్తో తెలుసా?"

    "మళ్ళీ అదేమాట! ఆమె అను......"
 
    "థాంక్స్ సర్! ఒక హత్య చేయకుండా కాపాడారు." ఆ అమ్మాయి రివాల్వర్ జాగ్రత్తగా పర్సులో దాచింది.

    ఆమె వెళ్తుంటే ముచ్చటపడి చూచాడు. ఎంత ఠీవి, ఎంత దర్పం ఎంత ఆత్మ విశ్వాసం!

    "ఇప్పుడు చెప్పరా! ఆమె యెవరు! ఆమెను బలవంతంగా బెదిరిస్తున్నావేం?" అని అడిగాడు సిద్దార్ధ.

    "శ్వేతట........ అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్ గా వచ్చింది." అన్నాడు కసిగా అటే చూస్తూ.

    "అయిపిటీ యు! ఆమెకు నువ్వు అడల్ట్ లా కనిపించలేదు" అన్నాడు సిద్దార్ధ అల్లరిగా.

    "చాల్లేరా పరిహాసం!"

    "పరిహాసం కాదురా! పాత చింతకాయ పచ్చడి భావానికి నవ్వు వస్తుంది. సినిమాలు తెగచూచి అమ్మాయిలు కనిపించగానే అందుకని రేప్ చేయటమా!" అన్నాడు.

    ఆ అమ్మాయి నీకు తెలుసా?"

    "నాకు తెల్సిన అమ్మాయి అయితే రేప్ చేయటానికి కన్సెషన్ ఇస్తావన్నమాట." అన్నాడు వెటకారంగా.

    "జీవితం అందినంతవరకు అందుకోవటం మన పాలసీ........"

    "పాలసీ పటిష్టంగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్. నీకు అనుకూలంగా ఉండి సహకరించే స్త్రీలతో కులుకు, ఉలకు, నిన్నేం అనం అంతేగాని కనిపించిన కాంతను అనుభవిస్తాననుకోవడం మూర్ఖత్వం"

    "ఈ సెంచరీలో కూడా నీలాంటి చాందసులున్నారంటే జాలిగా ఉంది" అన్నాడు.

    "ఏ కాలంలోనైనా కొంచెం క్రమశిక్షణ అవసరం. రామాయణం ఇంత పవిత్ర గంధం అంటూ మీరంతా గోల చేస్తారే. దాంట్లో ఏం చెప్పాడు? అంతటి తపఃశ్శాలి రావణ బ్రహ్మ కూడా స్త్రీ లోతత్వంతో ఎందుకు కొరగాని వాడుగా మిగిలిపోయాడు" అన్నాడు.

    అర్జున్ మాట్లాడలేదు.
 
    ఇద్దరూ మెల్లగా ఊర్లోకి వచ్చారు.

    "నీ మనసు అందాన్ని చూస్తే చలించదా!"

    "అందాన్ని ఆరాధించని వాడు గుడ్డివాడు."

    "అది మానసిక వ్యభిచారం కాదా!"

    "ఈ మధ్య చాలా చెత్త చదివినట్టున్నావు. మానసిక వ్యభిచారం చేస్తున్నాం కదా, అని కనిపించిన ఆడపిల్లనల్లా అనుభవిస్తావా!"
    అర్జున్ మాట్లాడలేదు. అతని ఆలోచనలుదిగి వస్తాడనుకుంటే ఎంతో దిగజారిపోయిన స్నేహితుడిని ఏం అనలేకపోయాడు.


                                        5


    బాలరాజుకు అసహ్యంగా ఉన్నా మంత్రగాడు చెప్పినవి చేయటానికి వెనుకాడటం లేదు. అందుకే క్షుద్ర విద్యలు అన్నారేమో.

    అతనికి శ్వేతపై విపరీతంగా కసి పెరిగి పోతోంది. రెండురోజుల క్రితం అర్జున్ చెప్పాడు ఆ అమ్మాయి రివాల్వర్ వెంట వేసుకుని తిరుగుతోందని. ఆమె అంతు చూడాలని ఉంది.
 
    ఆడదానికింత అహంకారమా!

    గొంతు వరకు నీళ్ళలో మునిగి. మంత్రగాడు చెప్పిన మంత్రాలు వల్లించాడు.

    వణుకుతూ బయటికి వచ్చాడు.

    "ఇరవై ఒక్కసారి మునిగిరా......" అన్నాడు అతను దర్పంగా చెట్టు మొదట్లో కూర్చుని, సారా కొడుతూ.

    బాలరాజు అతను చెప్పింది తు.చ...... తప్పకుండా చేసాడు. అతను వచ్చేసరికి బియ్యం పిండితో పసుపు కుంకంతో భేతాళుడి బొమ్మ గీసాడు. దాని చుట్టూ కోటలా నాల్గు గీతలు గీసాడు.

    "రా.......బొమ్మ కెదురుగా కూర్చో........"
 
    బాలరాజు వెళ్ళి కూర్చున్నాడు. మంత్రగాడు అతనికి ఎదురుగా కూర్చున్నాడు.

    "మంత్రించదలచిన స్త్రీ వెంట్రుకలు కావాలి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS