"నువ్వు వచ్చావా నాయనా?' ఆనందంగా పలుకరించాడు. మాట్లాడుతూ సాయంత్రం వరకు కూర్చొని గదికి వచ్చాడు. రోజూ సగం కాలము రేఖ వద్దే గడుపుతున్నాడు. సాయంత్రాలు బీచ్ కెళ్ళటము , వీలున్ననాడు తండ్రి వస్తాడు లేనినాడు రేఖ వక్కర్తి వెడుతుంది. అతను కొనిచ్చే బహుమతులను అత్యంత ప్రీతిగా అందుకునేది రేఖ. సీతారామయ్య కు అనుచితమనిపించినా , యెన్నో సినిమాలలో చూసినట్లు, తన కూతురు స్వయంగా ప్రేమించి భర్తను యెన్ను కుంటే యింకేం కావాలి? చూడనట్లు ఊర్కునేవాడు. రెండవ విషయం కూతురి తెలివితేటల పై అపారమైన నమ్మక మాయనకు ఆనంద్ వెంట సినిమాకు పంపడానికి కూడా సందేహించ లేదతను. ఆశ చెడ్డదని ఊర్కేనే అంటారా?
"సినిమా నుండి నా గదికి వెళ్దాము."
"సిగ్గు లేకపోతె సరి, ఒంటరిగా ఉన్న మొగవాడి వెంబడి యెవరోస్తారు?"
"యెవరోస్టారో చూస్తావుగా?' బస్సు దిగి నడక సాగించాడు. తన యింటి మలుపు దగ్గర ఆగిపోవాలని ప్రయత్నించి విఫలురాలయింది . రేఖ. అతనిని అనుసరించింది. అతను వెనుతిరిగి చూచాడు. అతని కళ్ళు విజయ గర్వంతో మెరుస్తున్నాయి.
"యెవరోస్తున్నారో తెలుసుకోవచ్చా?"
"కళ్ళు కనిపించటము లేదూ?" వెక్కిరించింది. ఇరువురూ గది చేరినారు.
"రేఖా, నీ కళ్ళు ఇంత అందంగా ఉన్నా యెందుకు?"
"మీ కోసము" నవ్వింది.
"అలా నవ్వులు వెదజల్లుతూ రెచ్చగొట్టవద్దోయ్."
"పోనీ ఏడవమంటారా చెప్పండి." జేడ ముందుకు వేసుకుంది. ఆమె రెండు చేతులు పట్టుకొని కాంక్షగా కళ్ళల్లోకి చూచాడు.
"రేఖా! నిన్ను కాలేజీ ఫంక్షన్లో చూచిననాడే ప్రేమించాను."
"వ్సూ!........వ్సూ! చాలా పొరపాటు చేశారు. నేను మిమ్మల్ని ప్రేమించనిదే. అయినా ప్రేమంటే ఏమిటి బాబూ కాస్త చెప్తారు."
"ఓ తప్పకుండా ." ఆమెను రెండు చేతులలోకి తీసుకున్నాడు. కబుర్ల లో కాలము తెలియలేదు. అలా రోజులు కరిగిపోతూనే వున్నాయి.
"రేఖా"
'ఊ"
"కాలమిలాగే నిలిచిపోతే?"
"పోదు ఆనంద్. అతని మెడకు చేతులు పెనవేసింది.
"నేనన్న ప్రతిమాటకు వ్యతిరేకిస్తావు. మొండి పిల్లవు."
"మీరన్నీ అసమంజసమైన మాటలే మాట్లాడుతారు." ఇద్దరూ నవ్వుకునేవారు. చీకటి గదిలో వ్యాపించింది.
"ఆలస్యమవుతుంది. వంట చేయాలి. ఆత్రంగా లేచింది. "వంటా గింటా ఏం వద్దు. నా దగ్గరే ఉండి పో రేఖా." ఆమెను వదలలేక వదిలాడు. వారికి ఇతర ప్రపంచముతో పనిలేక పోయింది.
నెలరోజులు తరువాత స్నేహితులంతా వచ్చారు. గారాల పుత్రుడు ఆలస్యంగా వస్తాడనుకున్న ఆనంద్ తొందరగా రావటం చూచి అందరూ ఆశ్చర్య పోయారు. అతన్ని మద్రాసు అంత త్వరగా రప్పించిన విషయమేమిటో ఊహించలేనంత మూర్ఖులు కారు వారు. వారము రోజులలోనే తేలిపోయింది ఆనంద్, రేఖల ప్రణయము.
"ఒరేయ్ ఆనంద్ ఆలోచించే ఇలా ప్రవర్తిస్తున్నావా?' మందలింపుగా చూచాడు చక్రవర్తి.
"ఏ విషయమురా? యెరగనట్టే అడిగాడు ఆనంద్."
"వాడిని అడక్కురా. యెంత నటనో చూడు." గోవింద్ ఉడుక్కున్నాడు.
"నటనా! లేదురా మీతో చనువుగా ఉండని అమ్మాయి నాతొ చనువుగా ఉన్నంత మాత్రాన పెడర్ధాలు తీస్తారుట్రా."
"కట్టి పెట్టరా వేషాలు" అరిచాడు చక్రవర్తి.
"ప్రేమించేది వాడు. రేపు పెళ్లి అంటే ఇరుకున పడేది వాడు. మధ్య మీ గోల దేనికిరా?" విల్లియమ్స్ అడిగాడు.
"ఒరేయ్ విల్లియమ్స్ గా! మీ సంఘానికి , మా సంఘానికి చాలా తేడారా."
"లేదని నేను అనటము లేదు" అవన్నీ వాడు చూచుకుంటాడు, మధ్యన నీ సలహా అనవసరమంటాను." అన్నాడు.
"నీ అభిప్రాయము ఇదేనుట్రా?" ఆనంద్ వంకకు తిరిగాడు చక్రవర్తి.
"ఒరేయ్ చక్రీ! నీకు మతి లేదురా. మౌనము అర్ధాంగీకారమని తెలియడుట్రా. రెండు మూడు రోజులు నిష్టూరంగా , ముభావంగా తిరిగినా, అతని వ్యక్తిగత విషయాలతో అనవసరమని ఊర్కున్నారు. వారికది ఆఖరు సంవత్సరము. అందుకే తమ దృష్టి చదువు వైపు మళ్ళించారు. ఆనంద్ కు క్రొత్తగా చేరిన మరిద్దరి జూనియర్స్ తో పరిచయమయింది. పాఠాలు చెప్పే నెపంతో సురేఖ తో గంటలు గంటలు గడిపేవాడు. ఆరునెలలు గడిచిపోయాయి. పాఠాలు చదవాలని రేఖ చేచ్చరించే వరకు ఈ లోకము లోకి రాలేక పోయాడు.
"ఇక పాఠాలు అశ్రద్ధ చేస్తే ఊర్కోను." అన్నది. రాత్రి భోజనము కాగానే గదికి పంపించి వేసేది. రెండు నెలలు దీక్షగా అభిమానంగా చదివినాడు. సురేఖ విషయాలు పట్టింపు లేనట్టు తిరిగేవాడు. నీ వేషాలు నాకు తెలియవా, అన్నాట్టు నవ్వేది.
చదువుతుంటే కాలమే తెలియటము లేదు. ఆఖరి పరీక్ష రేపు పగలంతా పడుకోవచ్చుననే దీక్షతో కూర్చున్నాడు. కళ్ళు వాలిపోసాగాయి. కూజా లోని నీళ్ళు ఒంపుకుని ముఖము కడుగుకున్నాడు. ప్లాస్కు లోని టీ పోసుకుని త్రాగాడు. గదంతా ఉక్కగా ఉంది. వెనుక వైపు వరండాలోకి వచ్చి కూర్చుని చదువు ప్రారంభించాడు. అలా అరగంట గడిచిందో లేదో తలుపై తట్టిన శబ్దమయింది. ఆనంద్...ఆనంద్ ...అన్న మృదువైన కంఠము వినిపించింది. పుస్తకము క్రింద పెట్టి లేచి వెళ్ళాడు. తలుపు తీసి ఆశ్చర్యపోయాడు. వణుకుతూ రేఖ నిలబడింది.
"ఆనంద్ త్వరగా రండి, నాన్నగారు...." ఏడుపు వస్తుంది.
"ఏమయింది రేఖా- నన్నగారింటికి రాలేదా?"
"లేదు, యెందుకో గిల గిల తన్నుకుంటున్నారు." వెంటనే షర్టు వేసుకుని బయలుదేరాడు.
"అసలేమయింది?"
"నాల్గు రోజుల నుండి జ్వరము వస్తుంది. మందు పుచ్చుకోమంటే అదే పోతుంది లేమ్మన్నారు. ఈ పూట విపరీతంగా బాధపడుతున్నారు.
"నాకెందుకు చెప్పలేదు?"
"పరీక్షల సమయము చెప్పొద్దన్నారు."
'ఒంటరిగా వచ్చావా?"
"ఊ.....' త్వరగా నడిచింది.
` "ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటావు. ఇంత రాత్రి వేళ వంటరిగా రావటం యెంత ప్రమాదము.
"మరెలా?' చీకటి లో నుండి, లైటు వెలుతురూ లోకి వచ్చారు. ఆమె కళ్ళు వాచీ ఉన్నాయి. ఆగి ఆ వీధిలో ఉండే డాక్టరు ను లేపి తీసుకెళ్ళారు . అతను ఇంజక్షన్ ఇచ్చి మందులు రాసిచ్చి వెళ్ళిపోయాడు. సీతారామయ్య కు వంటి మీద స్పృహ లేదు.
"ఛ. ఇంత మాత్రానికే దుఃఖము దేనికి వయసు మీరింది. కాస్త బలహీనమైనా తట్టుకోలేరు." అన్నాడు.
"మీకు తెలియదు. అయన మంచంలో పడుకోగా యెప్పుడూ చూడలేదు."
"యెప్పుడూ ఒకే లాగుండరు. ఊర్కో...." ఆమె తల నిమిరాడు.
"మీరు వెళ్ళిపొండి. రేపు పరీక్షగా."
"నిన్ను వంటరిగా వదిలి యెలా వెళ్ళను? మళ్ళీ ఆయనకేదైనా అయితే భయపడుతావు."
"ఫరవాలేదు.' తండ్రి సరసన కూర్చుంది.
"పుస్తకం తీసికుని వస్తాను.' త్వరగా బయతకు వచ్చి , పుస్తకము తీసుకు రావడానికి వెళ్ళాడు.
మూడు రొజులకు సీతారామయ్య కోలుకున్నాడు. అతను ఆప్యాయంగా ఆనంద్ భుజాలు నిమిరాడు.'
యే....యేనాటి ఋణానుబంధము నాయనా ఇది. పరీక్ష రోజు ఇక్కడే ఉన్నావట. యెలా వ్రాశా....వో. అం,,యేమో."
"పరవాలేదండి. పరీక్ష బాగానే వ్రాశాను." చిరునవ్వుతో సమాధానము చెప్పాడు.
"మందులకు దానికి బాగానే ఖర్చయి ఉంటుంది."
"కాస్త తగ్గిన దగ్గర నుండి ఇదే సోది. మీరయినా చెప్పండి. మనసు క్షేమంగా ఉంటె డబ్బు సంపాదించవచ్చని." రేఖ తండ్రిని మందలించింది.
'అవునండి" ఆమె మాటలను బలపరించాడు. మిగలిన వారంతా తమ ఊళ్ళ కు వెళ్ళారు. ఆనంద్ ఒక్కడే మిగిలి పోయాడు. సీతారామయ్య పూర్తిగా తగ్గాక వెళ్ళాలని నిశ్చయించు కున్నాడు. పని ఉండి ఆగిపోయానని తండ్రికి ఉత్తరం వ్రాశాడు. రెండవ రోజు అతను రేఖను చూద్దామని వెళ్లేసరికి, ఇంటి ముందు ఓ అరవ స్త్రీ నిల్చుని పెద్దగా అరుస్తుంది. ఆనంద్ ను చూస్తూనే ముఖము త్రిప్పుకుని రేఖనేవో హెచ్చరించి వెళ్ళిపోయింది.
"ఏమిటిది రేఖా, ఏం జరిగింది?"
"మా ఇరుగు పొరుగులు వెళ్లి నా మీద యేవో నేరాలు చెప్పారుట. వండి పెట్టె పేరుతొ పురుషులను రప్పిస్తానుట, ఇల్లు ఖాళీ చేయమంది."
"మరి నువ్వేం అన్నావు?"
"అనడానికి అవకాశమేది! రేపు వెళ్ళి నచ్చ చెప్పాలి. ఇంత చవక లో ఇళ్ళు ఎక్కడ దొరుకుతాయి?"
"అంతంత నిందలు వేసిన మనిషి రేపు నీ మాట వింటుందని నమ్మకమేముంది."
"మరెలా?' దిగులుగా చూచింది.
"అవసరమైతే నేను వచ్చాక చూసుకుందురు గాని, ప్రస్తుతము అక్కడ ఉండండి."
"నిజము పాపా. ఆ మనిషి వింటుందన్న నమ్మకము నాకు లేదు. "సీతారామయ్య అనటముతో సురేఖ అభ్యంతర పెట్టలేకపోయింది. ఉన్న కొద్ది పాటి సామానుతో ఆనంద్ గది చేరినారు. తంబికి ఇల్లు చూపారు. తమ బంధువు తాను వచ్చే వరకుంటారని ఇంటి వారితో చెప్పాడు ఆనంద్.
"మీరు వెళ్లి పోతారంటే దిగులుగా ఉంది."
"మీరు వచ్చేయరాదండి. అక్కడ మీ బంధువులను చూచినట్టు ఉంటుంది."
"మాకు ఎక్కడి బంధువులండీ రాబందులు. మీరు తప్ప ఈ ప్రపంచము లో మాకెవ్వరూ లేరు. వెళ్ళి రండి" అన్నది.
"పది రోజులిక్కడే గడిచాయి. మరో నెల రోజులేగా?"
"మీకేం? అక్కడందరూ ఉంటారు" ముఖము త్రిప్పుకుంది.
"పోనీ మానేయ్యమంటావా?" ఆమె ముఖము తన వైపు త్రిప్పుకుని అడిగాడు.
"మానేసినట్టే అడుగుతారు. అమ్మగారు ఎదురు చూస్తారు గాని వెళ్ళి రండి" ఆనంద్ కాయేడు గడిచినట్టే అనిపించలేదు. రేఖ సమక్ష ములో రోజులలా దొర్లి పోయాయి. ఇంటికి వెళ్ళినా మనసంతా మద్రాస్ లోనే ఉంది. వారము రోజులు మేనమామ గారింటి వద్ద ఉండి వచ్చాడు. సీతారామయ్య ఆరోగ్యము బాగాలేదని ఉత్తరము వచ్చింది. మరో వారము రోజులు ముళ్ళ మీద గడిపి మద్రాసు వచ్చేశాడు. సీతారామయ్య దొరమాగిన పండులా ఉన్నాడు. అతని శరీరము లోకి నీరు వచ్చిందని తెలిసిపోయింది. అతను ఈ ప్రపంచము లో కొన్ని రోజుల అతిధి అని గ్రహించాడు.
"ఏమిటండి ఇంటి దగ్గర విశేషాలు" రేఖ అడిగింది.
"నీకు నచ్చవులే"
"ఎందుకేమిటి?"
"అమ్మ నన్ను వివాహము చేసుకుని కోడలిని తన దగ్గరుంచి వెళ్ళమంది."
"మరి ఎందుకుంచిరాలేదు."
"నువ్వు ఏడుస్తావని."
"అయ్యో పాపము. అపర మన్మధుడు ఇక దొరకడనా ,' వెక్కిరించింది.
'అయితే ఈసారి చేసుకుంటానులే."
.jpg)
"శుభ్రంగా వివాహము చేసుకోండి. ఇలాంటి మతిలేని వారిని కట్టుకుని ఎవరు సుఖ పడ్డారేమిటి?"
"అయితే నాకు మతి లేదా?' అలక సాగించాడు. రెండు సినిమా పాటలు పాడాక అలక తీరింది.
"నా ట్యూషన్లన్నీ పోయాయి నాయనా. మీకేం చాతనవుతుందండి. విశ్రాంతి తీసుకోండి." అనేవారే. దిగులుగా వచ్చాడు సీతారామయ్య.
