Previous Page Next Page 
మమత పేజి 19

 

    నూజివీడు చేరిం తర్వాత పోగొట్టుకున్న సౌభాగ్యం గురించి ఎన్నడూ కంట తడి పెట్టలేదు సీతమ్మగారు. బ్రాహ్మణ  భోజన హోటలుకు చెరువు నుంచి తెచ్చి మంచినీళ్ళు పోసి, పప్పులూ పచ్చళ్ళూ రుబ్బితనను చదివించింది కొన్నాళ్ళు. చౌదరయ్య హోటలోచ్చి - ఆ హోటలు మూతపడటంతో వడియాలూ అప్పడాలూ పెట్టి అమ్మి తనను బ్రతికించింది మరి కొన్నాళ్ళు.
    ఆ తర్వాత అవధాని గారి యింట్లో  వంటలుచేస్తూ  తన బ్రతుకును నిలబెట్టింది. ఆ నాలుగు సంవత్సరాల కాలంలో అమ్మలను చూశాడు . 'అమ్మ ' లో. ఆరోగ్యంగా దిగజారి , ముఖం ముడతలు పడి , నడుం వంగి ఆకాలంలో తల ముగ్గు బుట్టలా నెరిసి - ఆయాసపడుతూ సీతమ్మ గారికి చాకిరీ చేసే వోపిక తగ్గలేదు. ఆ వోపిక శరీరంలోంచి పుట్టింది కాదు మనస్సులోంచి , రెండు పళ్ళు ఊడాయి. అవధాని గారింటి బావి దగ్గర వోపిక లేక కాలు జారి పడితే. రక్తపు మరకల - తెల్లటి పమిట చెంగు కప్పుకున్న బోసి నోటితో అమ్మ 'వంటకు రెండు రోజులు శలవ ' పెట్టి యింటికి వచ్చినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాడు స్వామి. 'చదువు మాని ఉద్యోగం చేస్తానమ్మా అంటూ మొండి పట్టు పట్టాడు. తన ముక్కు పమిట చెంగుతో ఆపేక్షగా తుడిచింది అమ్మ. తన కన్నీళ్ళతో తడిసాయి చెంపలను తాకినా అమ్మ పెదవులు.
    'ఇంకా ఎన్నాళ్ళు బాబూ! మూడేళ్ళు నాకీ బాధలు. ఆ స్కూలు ఫైనలు అయిందనిపిస్తే నా కష్టాలు గట్టెక్కినట్లే రా తండ్రీ.' అంటూ వళ్ళో  కూర్చో పెట్టుకుని తలనిమిరింది 'అమ్మ'
    బోసినోటి అమ్మ - వంటలక్క అమ్మ - నీళ్ళు పోసిన అమ్మ - తనకోసం బ్రతుకుతున్న అమ్మ.
    అరూపం చూశాడు- తండ్రి బ్రతికి జీపు కారెక్కి తిరుగుతున్న రోజున - తన పుట్టిన రోజుకు- కంచి పట్టుచీర కట్టుకొని- వంటేడు నగలతో బాటు - మెరుస్తున్న వడ్డాణంతో - భర్త 'తోలుతున్న' కారులో నాలుగు వీధులూ తిరిగి ఊరందరిని ఘనంగా పేరంటం పిలుస్తున్న అమ్మ రూపం చూశాడు ఆనాడు. అ రెండు రూపాయలూ - రెంటి మధ్యనూ స్వర్గ నరకాల మధ్య మన్నంత దూరమున్నా - ఫ్రేము కట్టి పదిలంగా గుండెల్లో పదిలపరచుకున్నాడు స్వామి.
    'కానీ కాసంత ' కుంకుమ రవ్వంత చెమటలో తడిసి చెదిరి నుదిటి పై ప్రాకుతుండగా - నూరు రూపాయల పావలా కాసులతో కలబోసిత - రేగిపళ్ళు - తన నెత్తిన పోస్తూ - ఎగిరి ఘల్లుమంటూ క్రిందపడుతున్న కాసులను ఏరుకునే సంరంభంలో తోటి పిల్లలు కుస్తీలు పడుతున్నప్పుడు - ముఖమంతా నిండి హాలు నంతా వెలిగించిన తల్లి నవ్వు తనకు తెలుసు - ఆనాటిది.
    ఈనాటిది - పడి పళ్ళు పోగొట్టుకుని - వాచిన బోసి నోటికి వేడి నీటి కాపడం పెట్టుకుంటున్న తల్లి నిట్టుర్పుతనకు తెలుసు.
    కోసూరు అగ్రహారం లో వున్న రోజులలో తమ యింటి ప్రక్క నున్న గురు నాదంగా రమ్మాయి - రోహిణి - పెళ్ళి అయి నూజివీడు కాపురానికి వచ్చీ - సీతమ్మగారిని చూసి 'అలా బ్రతికావు అత్తయ్యా! చివరకు యిలా అయిపోయావా?' 'అంటూ పరామర్శించి నప్పుడు 'ఇంకా ఎన్నాళ్ళు లే తల్లీ -- స్వాములు ఈ ఇస్కూలు ఫైనలు అయిందని పిస్తే - నాకింక వ=బెంగ లేదు. నా తపస్సు ఫలించినట్లే - మొన్న మూన్నెల్ల పరీక్షలకు క్లాసు మొత్తం మీద ఫస్టు వచ్చాడట.' అంటూ గర్వంగా చెప్పుకుంది సీతమ్మగారు.
    ఆ మర్నాడు గురునాధం గారే స్వయంగా వచ్చి 'నీకు చాలా అన్యాయం చేసి పోయాడమ్మా బావ.' అంటూ వోదార్చటానికి ప్రయత్నించాడు.
    'ఇందులో అయన చెసిం దేముందన్నయ్య? వొడలు బళ్ళూ- బళ్ళు ఓడలు కావడం ఈ ప్రపంచంలో ఎన్నడూ ఉన్నదే గదా? ఎప్పుడూ లాభమే వస్తే ఈ ప్రపంచంలో వ్యాపారానికి దిగని పెద్ద మనిషేవడుంటాడు చెప్పు?' అంటూ ఎదురు ప్రశ్న చెప్పింది సీతమ్మగారు.
    'నీమాటల కేం లే సీతమ్మా -- చెడ తిరిగుళ్ళు తిరిగి - అడ్డమైన గాదిదలనూ నమ్మి, తాళం చెయ్యి అప్పజెప్పి- తగలేసి ఆస్తంతా వీధిపాలు చేశాడు మిమ్మల్ని చివరకు.'
    'అలా ఎందుకనుకోవాలన్నయ్యా? బ్రతికినన్నాళ్ళు మహారాజులా బ్రతికాడు. పదిమందికి పెట్టారు గానీ - ఒకరి సొమ్ము తిన్న పాపాన పోలేదు.పల్లం మీద ఊరేగుతున్నట్లే వెళ్ళి పోయారు కడిగిన ముత్యంలా.
    మూడవరోజు పరామర్శకు వచ్చిన గురునాధం గారిభార్య కోదండమ్మ గారు 'నా కళ్ళు కాలిపోనూ! చివరకు వంటలు చేసుకు బ్రతుకుతున్నావా వదినా?' అంటూ చీది తుడుచుకుంది ముక్కు.
    'తప్పేముంది వదినా? యిన్కాఆ ఏడు కొండలవాడు శక్తి యిచ్చాడు గనుక - యిబ్బంది లేకుండా బిడ్డ కింత అన్నం పెట్టుకొని నేను తినగాలుగుతున్నాను . ఇంకెన్నాళ్ళులే - ఆ యిస్కూలు ఫైనలు అయిందనిపిస్తే తండ్రిలా వాడు కూడా బ్రతుకుతాడు రాజాలా.
    'మహా మొండి మనిషి లెద్దూ సీతమ్మ తల్లి.' అంది కొదండమ్మ గారు యింటికి వచ్చి కుమార్తె రోహిణీ తో.
    'నాకే జాలేసిందమ్మా అత్తయ్యని చూస్తె.
    'వాడు - ఆ స్వాములు- ఆ ఇస్కూలు ఫైనలు పాసయ్యేదెప్పుడో ఈవిడ గారి తిండి పెట్టేదేప్పుడో. ఆ రాబోయే పెళ్ళాం అతగాడికి పంచదార పాకం కాకుండా ఉండాలి గదా?'
    ఎవరు ఎన్ని రకాలుగా వ్యాఖ్యానం చేసినా - 'సీతమ్మ గారు గుండె నిబ్బరం గల మనిషి.' అనే విషయంలో రెండు అభిప్రాయాలు వినిపించలేదు పరగణా మొత్తం మీద.
    అంత గుండె నిబ్బరం గల మనిషి కూడా అర్ధరాత్రి నీటి బుగ్గలై పొంగుతున్న కళ్ళను తుడుచుకుంటూ మౌనంగా రోదించడం - స్వామికి తెలుసు. కొడుకు నిద్ర పోయాదనుకుని - సెగలై పొగలై రగిలిన ఆ తల్లి గుండెల కుంపటి వెచ్చదనంలో కాలి కాలి ఎర్రబడిన తన మనస్సు -- ఆ దేవత విషయంలో తనను మోసం చేయదని తనకు తెలుసు.
    అవధాని గారింట్లో వంటలూ పిండి వంటలూ తడి బట్టతో చేసి వడ్డించి యింటికి శరీరాన్ని జేరవేసి, శొంటి , గంధం నుదుటికి పట్టించి అలాగే తనకు తిండి పెట్టి, తాను తిన్నట్లు తనకోసం నటించి - మంచం మీద వ్రాలిపోయి , నీరసమో నిద్రో తెలియక ఒత్తిగిలి, ఊపిరాడక కాసేపు కూర్చొని- కూర్చోలేక పడుకొని - ఆయాస పడుతున్న ఆవేదనా మూర్తి - కనుకొలకుల నుండి - కారుతున్న అమృతధార తనకు ఆయువు పోస్తున్నదని తెలిసినా - అర్ధం కాని బాధతో మూలిగిన తన మనస్సు - ఎందుకు మోసం చేస్తుంది ఆ దేదేవతకు?
    తన కీవితం తల్లిదయింది.
    తల్లి వేదన తరంగాలై తన గుండెలను తాకింది.
    ఒకటి ద్వని- మరొకటి ప్రతిధ్వని.
    ఒకటి బింబం - మరొకటి ప్రతిబింబం.
    ధ్వనికి ధ్వని మారు పలికినట్లు.
    కదిలిన బింబాన్ని అనుసరించి ప్రతిబింబం కంపించినట్లు -
    మెదిలింది స్వామి మనస్సు -
    నాడూ    - నేడూ-
    తాను ఆరిపోతూ లోకానికి వెలుగు నిచ్చే జ్యోతి లా - తన సుఖాన్ని ఆవిరి చేసుకుంటూ తాను కనబిడ్డలకు ఆయువు పోస్తోంది తల్లి - జ్యోతిర్మయి ! ఆ వెలుగు లోనే తన జీవితానికి అర్ధాన్ని వెతుక్కోవలసిన ప్రాణం అంది. వివాహ విషయం లోనే కాదు - విషాన్ని రక్షించమని తల్లి సలహా చెప్పినా - అది తనకు ఆదేశమే అవుతుంది. దైవ శాసనాన్ని తిరస్కరించ గల శక్తి అల్ప జీవులకుండదు - అనుకున్నాడు స్వామి.
    సీతమ్మ గారు వ్రాయించిన ఉత్తరం ఒకటికి పదిసార్లు చదివాడు. తల్లితో తాను గడిపిన జీవితం కళ్ళముందు మెదిలింది. అలా జరిగితే పావనితో తాను గడపబోతున్న జీవితం మనస్సులో తళుక్కుమంది మెరుపులా.
    'మాష్టారూ.'
    ఎవరో విసరగా పగిలిన అత్తరు బుడ్డిలా ఒక్క విసురున వచ్చింది పావని పుస్తకాలు చేత బుక్కుకొని స్వామి గదిలోకి
    'ఒక బ్రహ్మాండమైన నిర్ణయం మాష్టారూ'?
    ? ? ?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS