Previous Page Next Page 
పిల్లలతో ప్రేమయాత్ర పేజి 19

 

    కాంతారావు నవ్వేడు. 'కొన్ని వస్తువులను వాటి సహజస్వరూపంలో, సహజమైన వాతావరణం లో చూస్తేనే బాగుంటుంది కళ్యాణీ! ఉదాహరణకి లేడి పిల్లలు అడవిలో గంతులు వేస్తుండగా చూస్తుంటే ఎంతో అందంగా కనపడతాయ్. పచ్చని చెట్ల మధ్య శ్రావణ మేఘాలను చూస్తూ నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది, పులులు, సింహాలు ఖడ్గ మృగాలు మొదలైన క్రూర జంతువులను అడవుల్లో వాటి వాటి స్థావరాలలో ఉన్నప్పుడు చూస్తుంటేనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. కాని ఆ జంతువూ లన్నిటిని తెచ్చి బోనులో బంధించి మనని వినోదంగా చూడమంటే ఆ జంతువులకూ, భాదే! మనకీ వినోదం కలగదు. 'జు' లో బోనులో బంధింప బదినపుడు నక్కకీ, నెమలి కీ, కాకికీ , కోకిలకీ ఏమీ తేడా కనపడదు మనకి. ఆ కృత్రిమ వాతావరణంలో వాటి సహజ ప్రకృతి మరుగున పడిపోవడం వల్ల అవన్నీ కూడా ఒకే రకమైన స్పెసిమెన్స్ లాగా కనపడతాయ్ మనకి.
    అలాగే మన ప్రాచీన దేవాలయాలను కూడా అవి కట్టించినపుడు ఎలాటి స్థితిలో ఉన్నాయో, ఆ స్థితిలో చూస్తేనే మనకు విచిత్రమైన , ఒక అలౌకికానందం కలుగుతుంది. ఈ దేవాలయాల గోపురాలు యివన్నీ మన ప్రాచీన భారతీయ సంస్కృతి కి , కళా ప్రభావానికి చిహ్నాలు. వీటిని కళ్ళతో చూసి, మనసారా - ఆనందించాలే తప్ప, వీటినేదో ఆధునికంగా చెయ్యాలని చూస్తె మనకి ఎలాటి ఆనందమూ కనబడదు. గోల్కొండ శిధిలాలను శిధిలాలు గానే చూడాలి. వాటి మీద వో పెద్ద మేడ కడ్తే దానిని చూట్టానికి యాత్రీకు లెవరూ రారు. తెలిసిందా?' అన్నాడు.
    కళ్యాణి చిత్రంగా చూసింది భర్త వంక. ఆ క్షణంలో అతని విగ్రహం ఎంతో గంభీరంగా, ఉదాత్తంగా కనపడింది ఆమెకు.
    'వెంకటసుబ్బలక్ష్మీ టూరిస్టు సర్వీసు వాళ్ళు, మరి కొందరు భక్త బృందం కూడా అక్కడకు బిలబిల మంటూ వచ్చేరు. ఆ విశాల దేవాలయం లో అంతమంది భక్తులున్నా యింకా, విశాలంగా, శూన్యంగా ఉన్నట్లుగానే అనిపించింది కళ్యాణి కి.

                           
    తరువాత కొంత దూరం నడిచి, మెట్లు ఎక్కి, చిన్న డాబా లాటి దాని మీదకు తీసుకు పోయేడు దేవాలయాన్ని చూపించే గైడు. అక్కడ 'తిన్న' ని విగ్రహం ఉంది. దానిని చూస్తుంటే కళ్యాణి లో అదో రకం 'థ్రిల్ ' కలిగింది. తిన్నని పాఠం కూడా తను క్లాసు పుస్తకాల్లో చదువుకుంది. చిన్నప్పుడు. అవన్నీ కట్టు కధలే నని తన అభిప్రాయం. కాని నిజంగా తిన్నని విగ్రహాన్ని చూస్తుంటే అందులో కొంత భాగమైనా నిజం కాకపోదని పించింది కళ్యాణి కి.
    ఒక అటవికుడు తను నమ్మిన దైవం కోసం కళ్ళను త్యాగం చేసేడంటే -- అందునా ఆ రోజుల్లో.... ఆశ్చర్యం ఏమీ లేదు. విశ్వాసం అన్నది, ముఖ్యంగా ఏమీ లేదు. విశ్వాసం అన్నది, ముఖ్యంగా ఆ విశ్వాసం- భగవంతుని మీదదైతే - మానవుడి చేత ఎలాటి సాహాసాలనైనా చేయించ గలదు అనుకుంది కళ్యాణి.
    మిగతా భక్తులందరూ యింకా క్రింద దేవాలయం లో ఉన్నా, కాంతారావు కుటుంబాన్ని మాత్రం ముందు అక్కడకు తీసుకు వచ్చేడు గైడు. వాళ్ళ వేష ధారణ అదీ చూస్తె కాస్తో కూస్తో డబ్బులు ముట్టక పోవు అన్న దైర్యం కలిగిందతనికి. అందుకే ధారాళంగా పాఠం బట్టీ పట్టీ అప్ప చెపుతున్నట్టు తిన్నడి కదా వగైరా విశేషాలన్నీ చెప్పసాగేడు.
    వాళ్ళు పైన నిల్చుని ఉండటం వల్ల ఊరులో చాలా భాగం కనిపిస్తుంది. కొంచెం దూరంలో ఉన్న జలాశయాన్ని చూసి ' అది సువర్ణముఖి' నది' అన్నాడు.
    'అబ్బ! సువర్ణముఖి నది అంటే యిదేనా?" అని ఆనంద పడిపోయింది కళ్యాణి.
    'ఇటు వైపున ఉన్న ఎత్తయిన గోపురం ఉంది చూసేరూ? అ గోపురాన్ని ఒక వేశ్య కట్టించింది. తను చేసిన పాపానికి పశ్చాత్తాప పడీ దానికి ప్రాయశ్చిత్తంగా ఆ గోపురాన్ని కట్టించింది తను సంపాదించిన డబ్బుతో ' అని చెప్పేడు.
    'ఇదంతా చూస్తుంటే పాపానికి దైవానికీ ఏదో దగ్గర సంబంధం ఉందని పిస్తుంది. నాకు గుళ్ళు, గోపురాలు కట్టించిన భక్తులలో చాలా మంది పూర్వాశ్రమం లో పతితులే! ఫరె గ్జాంపుల్ .....పండరీనాద భక్తుడైన పుండరీకుడు , చింతామణి, విప్రనారాయణ, వేమన యోగి.... వీరంతా పతనమైన తరువాతే పరమభక్తులయ్యేరు.' వ్యంగ్యంగా అంది కళ్యాణి.
    'రక్తి లేనిదే ముక్తి లేదు. కామి కాని వాడు మోక్ష కామి కాడు' నిర్లిప్తంగా అన్నాడు కాంతారావు.
    'అందుకే ప్రపంచం యిలా తగలబడి పోతోంది. ఎటుపడీ ఎప్పుడో ఒకప్పుడు మోక్షం వస్తుందన్న ధీమాతో చేయగల్గినన్ని పాపాలూ చేసేస్తున్నారు జనం' అంది కళ్యాణి వెక్కిరింతగా.
    షటప్!'
    'జీ ...హుజూర్!' అంటూ పమిట కొంగు నోటి కడ్డం పెట్టుకుని నవ్వాపుకుంది కళ్యాణి.
    'అంతా చూపించటం అయిపోయిందండీ! ఇంక మీ దయ!' అన్నాడు గైడు చేతులు కట్టుకుని నిలబడి. అతను కుర్రవాడు, వయసు పదిహేడు కి మించదు.
    అతని చేతిలో వో అర్ధ రూపాయి బిళ్ళ పెట్టేడు కాంతారావు.
    "అంతేనా సార్? చదువుకుంటున్న వాడిని. పేద వాడినవటం వల్ల యిలా వేసవి సెలవుల్లో గైడ్ పని చేస్తుంటాను." అన్నాడు అతను.
    "ఏం చదువు తున్నావేమిటి?' అన్నాడు కాంతారావు మళ్ళీ జేబులో చెయ్యి పెడుతూ.
    "పి యూసీ చదువుతున్నానండీ!"
    "పీ యూసీనా!' అంటూ ఆశ్చర్య పోయేడు కాంతారావు. అతను కాలేజీ విద్యార్ధి అని తెలియగానే ఉపాధ్యాయుడైన కాంతారావు లో అదో రకం జాలి, మెత్తదనం కలిగి , మరో రూపాయి నోటు తీసి అతని కిచ్చేడు.
    'అన్నట్టు కాళహస్తి లోది గవర్నమెంటు కాలేజీ యే కదూ? ఇంగ్లీషు దిపార్టు మెంటు లో ఎంత మందున్నారేమిటి? మీకు పాఠాలు చెప్పేది ఎవరు? అయన పేరేమిటి? ' అని వో దగ్గర బంధువుని గురించి దూరపు చుట్టాన్ని అడిగినట్లు అడిగేడు కాంతారావు.
    'మాకాండీ! మాకూ....కామేశ్వరరావు గారు వస్తారండీ ఇంగ్లీషుకి' అన్నాడా కుర్రవాడు-- యీ వివరాలన్నీ మీకెందు కన్నట్లు చూస్తూ 'కామేశ్వరరావు' అన్న పేరును తన మూడేళ్ళ ఉద్యోగ సర్వీసు లోనూ ఎన్నడూ వినందుకు 'అలాగా!' అని ఊరుకున్నాడు కాంతారావు.
    వెంటనే వాళ్ళు క్రిందికి దిగి వచ్చేరు. అప్పటికి పన్నెండు దాటింది. వో పక్క ఆకలితో కడుపులు కాలుతుంటే నిప్పులు చేరగుతున్న ఎండలో బండ రాళ్ళ మీద సర్కసు ఫీట్లు చేస్తున్నట్లు నడుస్తూ వెళ్ళి, అమాంతం దగ్గర్లో ఉన్న ఒక హోటల్లో కి వెళ్ళి కూలబడ్డాడు.
    హోటల్లో కూర్చును రెండు ప్లేట్ల భోజనానికి ఆర్డరిచ్చిన తరువాత హటాత్తుగా కాంతారావు మెదడులో ఒక ఆలోచన తట్టింది. తమకి దేవాలయాన్ని చూపిన గైడ్ అనబడే కుర్రవాడు పీయుసీ ధదవటం లేదేమోనన్న సందేహం ఎందుకో కలిగిందతనికి. అతని మాట తీరూ, అదీ చూస్తుంటే పీయూసీ చదువుతున్న కుర్రావాడిలా లేనేలేదు. హైస్కూల్లో ఏ యేడో, ఎనిమిదో చదువుతూనో, చదువో ఉంటాడు. తమకి దేవాలయాన్నీ చూపిస్తున్నప్పుడు తాము ఎక్కడ నుండి వస్తున్నదీ, తను ఏం ఉద్యోగం చేస్తున్నదీ వివరాలన్నీ అడిగేడు. తను కూడా యధాలాపంగా సమాధానలిచ్చెడు. తను కాలేజీ లెక్చరర్  అని తెలుసుకుని తన సానుభూతి ని పొందేందు కే తను కాలేజీ విద్యార్ధినని చెప్పుకున్నాడు . ఎంత మోసం జరిగింది! అనుకున్నాడు కాంతారావు.
    పేద కుర్రవాడు, కాలేజీ కుర్రవాడు కానీ, మరెవరైనా కానీ అడిగినప్పుడు డబ్బిస్తే, తప్పేం లేదు కాని, అబద్దమాడి డబ్బు గుంజుకోవలసిన అవసరం అతనికేం ఉంది? మానవ స్వభావమే అంత. అవసరమున్నా లేకపోయినా వంచనతో బ్రతకటం సహజంగానే అలవాటై పోతుంది కాబోలు కొందరికి.
    ఎందుకో తాను ఆ కుర్రవాడి మాటలు నమ్మి మోసపోయేనని అనుకోవటానికి కాంతారావు కించ పడ్డాడు.
    సర్వర్ ఎదురుగా టేబుల్ మీద పెట్టిన భోజనం పళ్ళేలు అతని ఆలోచనలకూ బ్రేక్ వేసినాయ్ ఆకలి విజ్రుంభించి అన్నం మీదకు దాడి చేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS