Previous Page Next Page 
పంచభూతాలు పేజి 19

    పవన్ దేవ్ ఇంతవరకు మౌనంగా మందహాసం చేస్తూ ఈ తర్కమును శ్రద్దగా వింటూ కూర్చున్నాను. ప్రకాశవతి నా వాదమును బలపర్చుతూంటే అతని మనసులో  ఒక ఆలోచన వచ్చింది అతను మట్లాడటం ప్రారంభించాడు. "కృత్రిమతలోనే మనుష్యులకు అన్నిటికంటె యెక్కువ ప్రశస్తి వుంది. మనుష్యులకు తక్క యింకెవరికీ కృత్రిమతకు తాహతు లేదు. భగవంతుడు ఇంకెవరికీ ఈ అధికారం ఇవ్వలేదు. చెట్టు తన పల్లవాలను తయారుచేసుకోలేదు. ఆకాశం తన నీలిమను కల్పించుకోలేదు.  నెమలి రెక్కలను ప్రకృతి సిద్దంగా స్వయంగా సృజించుకుంటుంది. మానవుని కొక్కనికే బ్రహ్మ సృజనకార్యంలో ఉమేజాగా వదిలాడు. అతని మీద చిన్నా పెద్ద సృష్టిభారం వుంచాడు. ఈ కార్య కలాపంలో నైపుణ్యం చూపినవారి ప్రభావం అధికమవుతుంది. పద్య గద్యాల స్థానంలో కృత్రిమం వుంది. కాని వాటిలో మనుష్యుల చమత్కృతి ఎక్కువగా వుంటుంది. ఆనందం ఎక్కువగా యిస్తుంది. సమ్మోహపరుస్తుంది. నా మనసులో ఆ  విశ్వకర్మ నివశిస్తున్నాడు. నా అంతఃకరణలో కూర్చుని రకరకాల రచనలు: రకరకాల విన్యాసాలు, రకరకాల ప్రయాసలు, రకరకాల ప్రకాశచేష్టలు జనింపజేస్తున్నాడు. పద్యంలో అతని సిద్దహస్తం ఎక్కువగా గోచరిస్తుంది. ఇందులో అన్నింటికంటే ఎక్కువ గౌరవం అనుభవం పొడగడుతుంది. సెలయేటి భాష కృత్రిమం కాదు. పల్లవ ముర్మరభాషగూడా కృత్రిమంగాదు. కాని, మనసు నివసించే చోటు ఎక్కువ పరిశ్రమ మూలంగా కృత్రిమభాష వాడకంలోనికి వస్తుంది" అని అన్నాడు.
      నిర్ఘరిణి ప్రశాంతంగా పవన్ దేవ్ మాటలన్నింటినీ వింటూంటే ఆమె సుందరలలాటం తళతళా మెరయసాగింది. మర్నాడు తన స్వతంత్ర భావాలను వ్యక్తీకరింపచేసే సమయంలో  సంకోచించకుండా ప్రకటించడంలో నేను యెంతవరకు కృతకృత్యురాలనవుతానో చెప్పలేను. సృష్టి అంశంతోపాటు మన హృదయ సంయోగం కూడా వుంది. ఆ అంశంలో ఎంత దక్షత గోచరిస్తుందో తెలియదు. ఎంత ఆడంబరం అవసరమో కూడా తెలియదు. పూవుయొక్క ఒక్కొక్క  రేకుకు ఎంత మనోహరతతో  పర్తులంగా స్నిగ్దంగా తయారవుతుందో తెలియదు. చెట్టు పై భాగానికి సుందరభావ భంగిమతో పాటు  అది ఎంత నిట్టనిలువునా నిలబడి వుందో తెలియదు. పర్వతం శిఖరం మీద మంచుకిరీటం  ధరించి అది నీలి ఆకాశంలో మహత్వంతోపాటు ఎంతగా ప్రతిష్టితమైందో, పశ్చిమ సముద్రతీరం మీద సూర్యాస్తమయ పీతపటం మీద ఎన్ని రంగులు మెరుస్తాయో తెలియదు. ఎంత నైపుణ్యం గనిపిస్తుందో తెలియదు. భూమినుంచి ఆకాశంవరకు ఎంత శృంగారం, ఎంత సౌందర్యం శోభితంగా వుంటుందో, ఆ తర్వాత వీటితో నా లాంటి క్షుద్రమానవుని మనసు నిండిపోతుంది. ఈశ్వరుడు తన సృష్టిలో ఎక్కడ ప్రేమ, సౌందర్యం, మహత్వం ప్రకటించాడో అక్కడ ఆయన కూడా నైపుణ్యంతో వుంటాడు. అడవిలో పూసిన పూలకు ఎన్ని రేకులతో అలంకృతమైనవో తెలియదు. నీలి ఆకాశదుకూలం మీది ఏకైకజ్యోతి శిఖను ద్యోతకం చేయడంలో అది ఎన్ని  సుసంయుత  అందచందాలు రచించుకుందో ఇంతవరకు తెలుసుకున్న వారెవరూ లేరు. భావ ప్రకటనా సమయంలో మానవులకు రకరకాల కౌశల్యాశ్రమం లబిస్తుంది - శబ్దంలో సంగీతం వుంటుంది, మనో విషయం మనసులోకి  వెళ్లి చోటుచేసుకుంటుంది.  కృత్రిమత అంటే ప్రపంచమంతా కృత్రిమమే' అని అన్నది.
     ఇలా చెప్పిన నిర్ఘరిణి నా కేసి చూసి నా సహాయం అర్దించింది. ఆమె నేత్రాల చాంచల్యంతో "ఇంతవరకు నోటికి వచ్చినట్టు ఎలా మాట్లాడానో నాకే తెలీదు. దానిని మీరు కొంచెం విశదీకరిస్తే బాగుంటుంది." అని చెపుతున్నట్లు అనిపించింది. ఇంతలో గగన్ దేవ్ హఠాత్తుగా మాట్లాడసాగాడు. "ప్రపంచమంతా కృత్రిమమయిందని అధిక సంఖ్యాకుల అభిప్రాయం. నిర్ఘరిణి వ్యక్తీకరించిన భావం వట్టి మాయ .అంటే నా మనోరచన కృత్రిమం. ఈ విషయం అంగీకరించడం, అబద్దమని రుజువుచేయడం రెండూ కష్టమే."
     పృద్వీరాజ్ కు కోపం వచ్చింది "మీరు అసలు విషయం వదలిపెట్టి సాగిపోతున్నాను. భావప్రకాసానికి పద్యం అవసరమా కాదా అనేదే మన ముందున్న ప్రశ్న. మీరు ఈవిషయం వదిలిపెట్టి  సముద్రం అవతలి మాయావాదంలో చిక్కుకున్నారు. భావ ప్రకాశానికి చంధోరచన పుట్టలేదని నా ధృఢవిశ్వాసం. చిన్నపిల్లల వివశత బహు పసందు గొలుపుతుంది.  వారి భావ మాధుర్యానికి కారణం కనిపించదు. వారి చందం నీరసంగా వుంటుంది. ఈ విధంగానే మనం అసభ్యస్థితిలో వున్నంతవరకు నిరర్దక వాక్యాల ఝాంకారంతో మాత్రంతోనే సమ్మోహితులను చేస్తాం. ఇందువల్ల  జనులు అన్నింటికంటే  ముందు కవిత  అయింది. మానవజాతి క్రమంగా వున్నతి చెందుతున్న కొద్దీ ఛందస్సుకు అర్దం జోడించ సాగింది. దాని సొగసు మారిన కారణంగా గత్యంతరం లేక అది చాలా కాలంవరకు తృప్తి చెందలేదు. కాని వార్దక్యం వచ్చినా అపుడపుడు మనుష్యునిలో గుప్తంగా జాతికొంత మిగిలి వుంటుంది. ఛందోప్రియత, ధ్వనిప్రియత గుప్తస్థానాలు. మనకు వార్దక్యాంశ అర్దం, భావం. మనకు అంశధ్వని, ఛందస్సు పసందుగా వుంటుంది" అని అన్నది.
    ప్రకాశవతి తల వంచుకుని, "మన సకల అంశాలకు వార్దక్యం రాలేదు. మానవుల బాల్యాంశాలకు నేను మనసారా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. దీనికి కారణం ప్రపంచంలో కొద్దో గొప్పో మాధుర్యం వుండడమే" అని అన్నది.
     అపుడు పవన్ దేవ్ , ఒక్కసారిగా పరిపక్వమైపోయిన మానవుడు యీ ప్రపంచానికి పెద్ద బిడ్డడు.  ఏ విధమయిన ఆటపాటలు, చిన్న తనపు చేష్టలు అతనికి సరిగా సరిపడవు.  మన ఆధునిక హిందూజాతి అన్నింటి కన్న పురాతన జాతి. అది తన నైపుణ్యాన్ని గొప్పగా  చెప్పుకుంటుంది. కాని నిజానికి అనేక విషయాలలో నేటికికూడా  యింకా పరిపక్వం  కాలేదు.  పెద్దపిల్లలు, వృద్దులు జాతి వున్నతిని సాధించడం కష్టం. వారిలో కొద్దిగా నయినా నమ్రత  వుండదు. ఇది రహస్య విషయం. ఇది యెక్కడా బయటపడదు. ఈ రోజులలో ప్రకృతిలో మార్పు వచ్చింది" అని అన్నాడు.
     దానిమీద నేను అన్నాను: "నగర వీధులను యంత్ర చక్రాలతో మరమ్మత్తు చేస్తూంటే ఎర్రదీపం వెలుగుతుంటుంది. హెచ్చరిక ఫలకం కడతారు. బండి నడుస్తుంది. నేను ప్రకాశవతిని  ముందుగానే హెచ్చరించాను. నీటి ఆవిరితో నడిచేవాటిని అన్నింటికంటే ఎక్కువ భయదృష్టితో చూస్తాం. కాని ఆ కల్పనా యంత్రాన్ని సరళమని భావిస్తాను. గద్యం -  పద్యం అనే ప్రసంగంలో ఉద్రేకాన్ని వదిలివేసి యిష్టమైతే విను. ఆచరణలో ప్రామాణిక నియమాలున్నాయి. నడిచే సమయంలో మనుష్యుని అంగాలకు అన్ని భాగాలు సమానబావంతో కదలి నడకను సామంజస్యం రక్షణ యిస్తాయి. ఈ భూమి ఒక మహా నియమానుసారం సూర్యుని చుట్టూ తిరుగుతూంటూంది."
      గగన్ దేవ్ నా మాటలు ఖండించడానికి ఇలా మొదలు పెట్టాడు:"స్థితియే వాస్తవానికి స్వాతంత్ర్యం . ఆ స్వాతంత్ర్యంలో ఆనందం వుంటుంది. కాని గతి పాదాలు ఒకానొక నియమానికి  ఆదీనమయి ముందుకు సాగుతాయి. ఆ నియమ ఆచరణలో కూడా సాధారణ జనులలో, చెడుమార్గాన పడినవారి బుద్ది జనించిరి. గతి స్వాతంత్ర్య నిజరూపం. ఇక స్థితి విశేషబంధనం, ఇచ్చ మనసుకు ఏకైక గతి  దాని అనుసారం  నడచుకోవడానికి మూర్ఖులు స్వతంత్రం అంటారు. కాని మన దేశ పండితులకు, ఇచ్చయే మన సర్వకార్యాలకు గతి విధికి పేరు అని తెలుసు.  అది సకల  బంధనాలకు పునాది. అంత ముక్తి పొందడానికి ఆ జనులు యిచ్చను  పునాదుల నుంచి పెకిలించవలసిందని సలహా యిస్తారు. మనోదేహాల రకరకాల గత నిరోధం యోగ సాధన  అని చెపుతూంటారు."
     పవన్ దేవ్ గగన్  వీపుమీద తట్టి, "ఎవరయినా ఇలా ప్రసంగిస్తే ఆ సమయంలోనో ఆ వెనుకనో మాట్లాడితే పోట్లాటకు దిగడంటారు" అని అన్నాడు.
     "విజ్ఞాని పృద్వీరాజ్ మాటలు స్పష్టం కాలేదు. గతితోపాటు, గది కంపనంతో కంపనకు అధిక సంబంధం వుంది. ఉదాహరణకు 'స' తో ప్రారంభమవుతుంది.స్వరం 'మ' స్వరాన్ని తారాస్థాయిలో కంపింప జేస్తుంది. మన మనోచేతన కంపితావస్థ. అందువల్ల ప్రపంచ విలక్షణ కంపనతో  పాటు దాని సంయోగం కూడా వుంది. ధ్వని రాగానే స్నాయూకంపన దానికి మద్దతు యిస్తుంది. దాని చిరకంపిత స్నాయూదజాలం దాని ప్రపంచానికి స్పందన బంధమంతటితో నానావిధ సూత్రాల ద్వారా బంధించి జాగ్రత్త పెడుతుంది.
     ఉద్వేగం (చిత్తవృత్తి) మన హృదయగతి దానితో కూడా వేరువేరు  విశ్వకంపనాలకు ఐక్యత ఒకగూడుతుంది. ఆలోచనతోపాటు, వరధ్వనులతోపాటు దాని ఒకానొక స్పందన సంబంధ సంయోగం వుంది. అందువల్ల సంగీతం సరళతతో మన హృదయాలకు తాకుతుంది. రెంటికీ సంయోగం కలగడంతో ఆలస్యం వుండదు. తుఫాను సముద్రం భయంకరంగా సమ్మిళితమయినట్టే నిబిడ సంఘర్షణంలో గానం, ప్రాణం కూడా  వుచ్చరిస్తాయి.
     "ఇందుకు ఒకే ఒక కారణం వుంది. సంగీతం తన కంపనా సంచారంలో నాలో సంచలనం కలిగిస్తుంది. మనసులో వుదాసీనం వ్యాపిస్తుంది. అనేకమంది కవులు ఈ భావాన్ని అనంత ఆకాంక్ష పేరుతో పిలిచారు. నేను కూడా అపుడపుడు అలాంటి భావాన్ని అనుభవించాను. ఈ విధమయిన భాషనే  ప్రయోగించాను. ఒక్క సంగీతమే కాదు, సూర్యాస్తమయం తరువాత ఆకాశశోభ అనేకసార్లు నాలో అనంత విశ్వస్పందనను సంచరింపజేసింది. ఒక్క సంగీతం, సూర్యాస్తమానం యేమిటి? ప్రేమ నన్ను చలింప జేసినపుడు అదికూడా మనలను ప్రపంచ క్షుద్రబంధనాల నుంచి విముక్తిచేసి అనంతంతో మిళితం చేస్తుంది. అది మహారూపాన్ని ఆవిర్భవింపజేస్తుంది. దేశకాల శిలాముకమును చీల్చివేసి సెలయేరులాగా అనంతం వేపుకు ప్రవహిస్తుంది. ఈ విధంగా ప్రజల స్పందనం మనలను విశ్వ స్పందనంతో మేళవింపజేస్తుంది.
     "సైనికులు ఒకరినొకరు ఉత్తేజపరచుకొనడం ద్వారా సేన ఆకర్షణీయంగా ఒకే ఒక ప్రాణంగా తయారయినట్టే విశ్వ కంపన సౌందర్య సంయోగంతో మన హృదయాలలో సంచరిస్తుంది. మనం ప్రపంచమంతటితో పాటు సమాన భావంతో కదం తొక్కుతూ సాగిపోతాము.
     "ఈ భావాన్ని కవులు భిన్న భిన్న శబ్దాలలో ప్రకటించడానికి యత్నిస్తారు. నేడు కూడా ఎంతోమంది జనులు జీనిని తెలుసుకోలేక పోతున్నారు. చాలామంది దీనిని కవుల పిచ్చివాగుడుగా భావిస్తారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS